మీ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కింది అంశాలు ప్రభావితం చేస్తాయి.
మోడల్, ఇంజిన్, వాహన తయారీదారు : మీ వాహనానికి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ప్రమాద స్థాయి అనేది మొదట ఉన్న వాహనం మీద ఆధారపడి ఉంటుంది.
సాధారణ క్యాబ్ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనేది గూడ్స్ తీసుకెళ్లే ట్రక్కుతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. సులభమైన మాటల్లో చెప్పాలంటే ఇది పరిమాణాన్ని, వాహన రకాన్ని బట్టి ఉంటుంది. అదనంగా ఏ సంవత్సరంలో వాహనం తయారు చేయబడింది, వాహన కండీషన్ వంటివి కూడా ప్రీమియం మీద ప్రభావం చూపుతాయి.
ప్రాంతం : మీ వాణిజ్య వాహనం ఎక్కడ నమోదు చేయబడింది, ఎక్కడ ఉపయోగించబడుతుందనేది కూడా ప్రీమియాన్ని ప్రభావితం చేస్తుంది.
ఎందుకంటే ఒక్కో నగరంలో సంభవించే రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు.. మెట్రో నగరాలైన ముంబై, బెంగుళూర్, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో మీ వాహనానికి నాన్–మెట్రో నగరాల కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఆ మేరకు ప్రీమియం విలువ కూడా పెరుగుతుంది.
నో క్లెయిమ్ బోనస్ : మీకు ఇంతకుముందు కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ఉండి.. ప్రస్తుతం దానిని పునరుద్ధరించడానికి లేదా బీమా కంపెనీని మార్చేందుకు చూస్తుంటే.. అటువంటి సందర్భంలో మీ ఎన్సీబీ (NCB–నో క్లెయిమ్ బోనస్) కూడా పరిగణించబడుతుంది. అప్పుడు మీ ప్రీమియం కూడా తగ్గింపు రేటులో వస్తుంది.
నో క్లెయిమ్ బోనస్ అనేది మీ వాణిజ్య వాహనం మీద క్రితం ఏడాది ఎటువంటి క్లెయిములు చేయకపోతే వర్తిస్తుంది.
బీమా ప్లాన్ రకం: కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ కింద ప్రధానంగా రెండు రకాల పాలసీలు ఉంటాయి. కాబట్టి మీరు ఎంచుకున్న పాలసీ వలన కూడా మీ ప్రీమియం ప్రభావితమవుతుంది.
లయబులిటీ ప్లాన్ తక్కువ ప్రీమియం కలిగి ఉంటుంది. ఇది కేవలం థర్డ్ పార్టీ డ్యామేజీలను మాత్రమే కవర్ చేస్తుంది. అదే స్టాండర్డ్ ప్యాకేజీ పాలసీ విషయానికి వస్తే.. దీనికి కాస్త ప్రీమియం ఎక్కువగా ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ వ్యక్తులతో పాటుగా సొంత వాహన నష్టాలను కూడా కవర్ చేస్తుంది. వాహన యజమాని లేదా డ్రైవర్‌కు జరిగే నష్టాలకు ఆర్థిక కవర్‌ను అందిస్తుంది.
వాణిజ్య వాహనం ఉద్దేశం: ప్రతీ వాణిజ్య వాహనం వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. కొన్ని ప్రయాణికులను చేరవేయడానికి, మరికొన్ని సరుకులను రవాణా చేసేందుకు, అలాగే భవన నిర్మాణ పనుల్లో కూడా ఉపయోగించబడతాయి. కాబట్టి.. మీ బీమా ప్రీమియం విలువ అనేది ఈ విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
మనం ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే.. సాధారణ ఆటో రిక్షా ఇన్సూరెన్స్ అనేది సరుకుల రవాణాకు వాడే ట్రక్ ఇన్సూరెన్స్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. కేవలం వాటి పరిమాణం వల్లే ఇలా జరుగుతుందని అనుకోవడం సరికాదు. ట్రక్ ఇన్సూరెన్స్‌లో ట్రక్‌తో పాటు అందులో రవాణా చేసే సరుకులకు కూడా బీమా వర్తిస్తుంది.