కమర్షియల్ వ్యాన్ ఇన్సూరెన్స్

కమర్షియల్/బిజినెస్ వ్యాన్లకు కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్

Third-party premium has changed from 1st June. Renew now

కమర్షియల్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​ అనేది ఒక విధమైన కమర్షియల్​ వెహికిల్​ ఇన్సరెన్స్​ వంటిదే. ఈ పాలసీ వ్యాపార అవసరాల కోసం వాడే వ్యాన్ల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ముఖ్యంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణికులను, వస్తువులను చేరవేసే స్కూల్​ వ్యాన్లు, ప్రైవేటు వ్యాన్ల వంటి వాటికోసం.

మీరు థర్డ్​ పార్టీ లయబిలిటీ పాలసీ తీసుకుంటే అది కేవలం మిమ్మల్ని థర్డ్​ పార్టీ నష్టాల నుంచి మాత్రమే కాపాడుతుంది. అలాగే, చట్ట ప్రకారం కనీసం థర్డ్​ పార్టీ పాలసీ అయినా ఉండటం తప్పనిసరి. అయితే, కాంప్రహెన్సివ్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని అన్ని రకాల డ్యామేజీల నుంచి కాపాడుతుంది.

కమర్షియల్​ వ్యాన్లలో వివిధ రకాలు:

  • స్కూల్​ వ్యాన్​: స్కూల్​ పిల్లలను తీసుకెళ్లడానికి ఉపయోగించే వ్యాన్లు ఇవి. డిజిట్​ అందించే వ్యాన్​ ఇన్సూరెన్స్​లో ఇవి కవర్​ అవుతాయి.
  • పబ్లిక్​ వ్యాన్: ప్రజా రవాణా కోసం వాడే వ్యాన్లు కూడా ఈ వ్యాన్​ ఇన్సూరెన్స్​లో కవర్​ అవుతాయి.
  • ప్రైవేట్ వ్యాన్: ప్యాసింజర్ల రవాణా, వ్యాపార పనులకు ఉపయోగించే వ్యాన్లు కూడా దీనిలో భాగంగా ఇన్సూర్​ చేయబడతాయి.
  • ఇతర రకాల కమర్షియల్​ వ్యాన్స్​: వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఇతర రకాల వ్యాన్లు కూడా ఈ ఇన్సూరెన్స్​లో కవర్​ అవుతాయి.

కమర్షియల్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు కొనాలి?

  • చట్ట ప్రకారం అవసరం: మోటార్​ వాహనాల చట్టం ప్రకారం ప్రతీ వాహనానికి ఇన్సూరెన్స్​ తప్పనిసరి. కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా సరే కలిగి ఉండాలి. ఏ ఇన్సూరెన్స్​ పాలసీ లేకుండా బండి నడిపితే అధిక జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు.
  • అనుకోని నష్టాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు: థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ కేవలం మిమ్మల్ని లయబిలిటీస్​ నుంచి మాత్రమే కాపాడుతుంది. కానీ మీరు కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ తీసుకుని ఉంటే అది చాలా రకాల నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
  • వ్యాన్​ యజమాని–డ్రైవర్​ కవర్​ అవుతుంది: అనుకోని ప్రమాదాలు సంభవించినపుడు థర్డ్​ పార్టీ వ్యాన్​ ఇన్సూరెన్స్​ అయినా లేదా కాంప్రహెన్సివ్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​ అయినా కానీ వ్యాన్​ డ్రైవర్​ లేదా యజమానిని కూడా కవర్​ చేస్తుంది.
  • ప్రయాణికుల భద్రత కోసం: కాంప్రహెన్సివ్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​ను ఉపయోగించి మీ వ్యానులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కూడా మీరు కవర్ (ఇన్సూర్​)​ చేసేందుకు వీలుంటుంది.

డిజిట్​ కమర్షియల్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​నే ఎందుకు ఎంచుకోవాలి?

కమర్షియల్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్​ అవుతాయి?

ఏమేం కవర్​ కావంటే?

కమర్షియల్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​లో ఏఏ విషయాలు కవర్​ అవుతాయో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కవర్​ కాని విషయాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఎందుకంటే మీరు క్లెయిమ్స్​ చేసే సమయంలో ఎటువంటి ఆశ్చర్యానికి గురి కాకుండా ఉండేందుకు కవర్​ కాని విషయాలను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

థర్డ్​ పార్టీ పాలసీదారుడికి సొంత డ్యామేజీలు​ అయితే

మీరు థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ను తీసుకుంటే ఓన్​ డ్యామేజీలు​ కవర్​ కావు.

మద్యం సేవించి వాహనం నడిపినా లేదా సరైన లైసెన్స్​ లేకుండా వాహనం నడిపినా

మీరు మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైనా లేదా సరైన డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా వాహనం నడిపినా మీ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ కాదు. అటువంటి సందర్భంలో మీ కమర్షియల్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​ పని చేయదని గుర్తుంచుకోండి.

స్వీయ నిర్లక్ష్యం

స్వీయ నిర్లక్ష్యం వలన మీ కమర్షియల్​ వాహనానికి ఏదైనా డ్యామేజ్​ జరిగినపుడు ఇన్సూరెన్స్​ కవర్​ కాదు.

పర్యావసాన డ్యామేజీలు

ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల వలన నేరుగా కాకుండా ఆ తర్వాత మీ వాహనానికి ఏదైనా డ్యామేజ్​ జరిగినపుడు.

డిజిట్​ కమర్షియల్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​ ముఖ్యమైన ఫీచర్లు​

ముఖ్యమైన ఫీచర్లు డిజిట్​ ప్రయోజనం
క్లెయిమ్​ ప్రాసెస్​ పేపర్​లెస్​ క్లెయిమ్​
కస్టమర్​ సపోర్ట్​ 24x7
అడిషనల్​ కవరేజ్​ పీఏ (PA) కవర్​, లీగల్​ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి మినహాయింపులు
థర్డ్​ పార్టీ డ్యామేజీలు పర్సనల్​ డ్యామేజీల​కు అపరిమిత​ లయబిలిటీ, ఆస్తి, వాహన డ్యామేజీలైతే రూ. 7.5 లక్షల వరకు కవర్ చేయబడతాయి.

కమర్షియల్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​ ప్లాన్స్​ రకాలు

మీ కమర్షియల్​ వ్యాన్​ రకాన్ని బట్టి మా వద్ద రెండు ఇన్సూరెన్స్​ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

లయబిలిటీ ఓన్లీ స్టాండర్డ్​ ప్యాకేజ్

మీ కమర్షియల్​ వ్యాన్​ వలన ఏదైనా థర్డ్​ పార్టీ వ్యక్తికి గానీ, ఆస్తికి గానీ డ్యామేజ్​ జరిగితే

×

మీ కమర్షియల్​ వ్యాన్​ వలన థర్డ్​ పార్టీ వాహనం డ్యామేజ్​ అయితే

×

ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల వలన సొంత​ కమర్షియల్​ వ్యాన్​ డ్యామేజ్​ అయితే

×

వ్యాన్​ డ్రైవర్​ లేదా యజమానికి గాయాలు/ మరణం సంభవిస్తే

If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before

×
Get Quote Get Quote

ఎలా క్లెయిమ్​ చేయాలి?

1800-258-5956 నెంబర్​కు కాల్​ చేయండి. లేదా hello@godigit.com కు మెయిల్​ చేస్తే సరిపోతుంది.

మీరు కాల్​ చేసేటపుడు మీ పాలసీ నెంబర్​, ప్రమాదం జరిగిన ప్రాంతం​, సమయం, తేదీ, ఇన్సూరెన్స్​ చేయించుకున్న వ్యక్తి ఫోన్​ నెంబర్​ తదితర వివరాలను దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన క్లెయిమ్​ ప్రక్రియ చాలా తొందరగా పూర్తవుతుంది.

డిజిట్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​లు ఎంత త్వరగా సెటిల్​ అవుతాయి? ఎవరైనా సరే ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చాలని చూసినపుడు తలెత్తే మొదటి ప్రశ్న ఆ కంపెనీలో క్లెయిమ్​లు ఎంత త్వరగా సెటిలవుతాయని. మంచి ప్రశ్నే! డిజిట్​ క్లెయిమ్​ల రిపోర్టు కార్డను చదవండి

భారతదేశంలో కమర్షియల్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​కు సంబంధించిన తరచూ అడిగే ప్రశ్నలు

ఒకే పాలసీలో నా వ్యాన్​తో సహా అన్ని కమర్షియల్​ వాహనాలకు ఇన్సూరెన్స్​ చేయించవచ్చా?

అలా చేసేందుకు కుదరదు. ప్రతీ వాహనానికి ఒక సొంత పాలసీ ఉన్నట్లే కమర్షియల్​ వాహనాలకు కూడా ఉంటాయి. ఒక వాహనం పాలసీ మరో వాహనానికి వర్తించదు. మీరు మీ అన్ని వాహనాలకు తక్కువ ధరలో ఇన్సూరెన్స్​ చేయించాలని చూస్తుంటే మీరు మమ్మల్ని వాట్సాప్​లో సంప్రదించండి.

డిజిట్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​ కింద ఎటువంటి రకాల వ్యాన్లు కవర్​ అవుతాయి?

వాణిజ్య అవసరాలకు వాడే అన్ని రకాల వ్యాన్లు ఈ పాలసీ కింద కవర్​ అవుతాయి. (ఉదా. స్కూల్​ వ్యాన్లు​, ప్రైవేట్​ టూర్లకు వెళ్లే వ్యాన్లు మొదలగునవి) మారుతి ఈకో, మారుతి సుజుకి ఓమిని వంటి వ్యాన్లు, మినీ బస్సుల వంటివి కవర్​ అవుతాయి.

వ్యాన్​ ఇన్సూరెన్స్​లో ప్రయాణికులు కూడా కవర్​ అవుతారా?

కవర్​ అవుతారు. మీరు కాంప్రహెన్సివ్​ కమర్షియల్​ వ్యాన్​ ఇన్సూరెన్స్​ తీసుకున్నట్లయితే మీరు ప్యాసింజర్​ కవర్​ యాడ్–ఆన్​ను ఎంచుకుంటే ప్రయాణికులు కూడా కవర్​ అవుతారు.

ఆన్​లైన్​లో వ్యాన్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయి?

మనం టెక్నాలజీకి ధన్యవాదాలు తెలపాలి. మీరు ప్రస్తుతం వ్యాన్​ ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధానం వలన మీకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి పేపర్​ వర్క్​ అవసరం ఉండదు. ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎవర్నీ కలవాల్సిన అవసరం లేకుండా పాలసీని పొందొచ్చు. పాలసీ కూడా తక్కువ ధరలో లభిస్తుంది.

కమర్షియల్​ వెహికిల్​ ఇన్సూరెన్స్​లో ఒక వ్యాన్‌కు ఇన్సూరెన్స్​ చేయించేందుకు ఎంత ఖర్చవుతుంది?

ఈ విషయం మీ వ్యాన్​ రకం, దాని వయస్సు, ఆ వ్యాన్​ను నడిపే నగరం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్​ ప్లాన్​ కూడా ఈ విషయాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యాన్​ ఇన్సూరెన్స్​ ప్రీమియాన్ని తెలుసుకునేందుకు మీ వివరాలను ఇక్కడ నమోదు చేయండి.