బై కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్
2000+
Cashless Garages
2400 Crore+
Paid-in Claims
80 Lacs+
Policies Sold
I agree to the Terms & Conditions
Buy Online for Huge Savings
Buy Commercial Vehicle Insurance Online
ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
నేను ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు కొనుగోలు చేయాలి?
- ఊహించని నష్టాల నుంచి రక్షణ: అది ప్రకృతి వైపరీత్యం, ప్రమాదం, ఢీకొనడం లేదా అగ్నిప్రమాదం వల్ల అయినా; అనుకోకుండా కలిగే నష్టాల వేళ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ అండగా ఉంటుంది. దీని వల్ల మీ వ్యాపారానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది.
- చట్టానికి లోబడి ఉండటానికి: మోటర్ వాహనాల చట్టం ప్రకారం, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వాహనాలు కనీసం బేసిక్ థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌ని అయినా కలిగి ఉండాలి. వ్యక్తి లేదా ఆస్తి లేదంటే వాహనం వంటి థర్డ్ పార్టీకి కలిగే నష్టాల నుంచి మిమ్మల్ని రక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- యజమాని-డ్రైవర్‌ను కవర్ చేస్తుంది: ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ కేవలం మీ వాహనాన్ని మాత్రమే కవర్ చేయడమే కాదు, ఇది యజమాని-డ్రైవర్‌ను కూడా కవర్ చేస్తుంది.
- ప్రయాణికుల సంరక్షణ: ప్యాసింజర్ వెహికల్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేేసేటప్పుడు ప్రయాణికులను కూడా కవర్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ గురించి మాత్రమే మీరు ఆలోచించిన వారిగా కాకుండా మీ వాహనంలోని ప్రయాణికుల గురించి ఆలోచించే వారిగా ఉంటారు.
డిజిట్ అందించే ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
ఎందుకంటే మేము మా కస్టమర్లను వీఐపీల్లా చూసుకుంటాం. ఎలాగంటే..
ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?
కవర్ కానివి ఏవి?
మీ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ కావో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైనా క్లెయిమ్ చేసేటపుడు ఇది కవర్ కాదా అని ఆశ్చర్యానికి గురికాకుండా ఉండాలంటే ఈ విషయాలను తెలుసుకోవాలి.
|
ముఖ్యమైన ఫీచర్లు |
డిజిట్ ప్రయోజనం |
|
క్లెయిమ్ ప్రక్రియ |
పేపర్‌లెస్ క్లెయిమ్స్ |
|
కస్టమర్ సపోర్ట్ |
24x7 సపోర్ట్ |
|
అదనపు కవరేజ్ |
పీఏ కవర్, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, కంపల్సరీ డిడక్టబుల్స్ మొదలగునవి |
|
థర్డ్ పార్టీకి జరిగే డ్యామేజీలు |
వ్యక్తిగత డ్యామేజీలకు అపరిమిత లయబిలిటీ. ప్రాపర్టీ/వాహనం డ్యామేజ్ అయితే రూ. 7.5 లక్షల వరకు కవర్ |
ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు
మీ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ రకాన్ని బట్టి మా వద్ద రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, బస్, రిక్షా, వ్యాన్ మొదలగునవి.
లయబిలిటీ ఓన్లీ
స్టాండర్డ్ ప్యాకేజ్
|
ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి మీ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ వలన కలిగిన డ్యామేజీలు |
✔
|
✔
|
|
మీ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ వలన థర్డ్ పార్టీ వెహికిల్‌కు డ్యామేజ్ జరిగినపుడు |
✔
|
✔
|
|
దొంగతనాలు, యాక్సిడెంట్లు, ప్రకృతి విపత్తుల వలన మీ వాహనంలోని ప్యాసింజర్లకు నష్టం జరిగినపుడు |
×
|
✔
|
|
ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఓనర్ లేదా డ్రైవర్‌కు గాయాలయినా లేదా మరణించినా.. యజమానికి అంతకు ముందే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లేకపోతే.. |
✔
|
✔
|
ఎలా క్లెయిమ్ చేయాలి?
1800-258-5956 నెంబర్‌కు కాల్ చేయండి లేదా hello@godigit.com కు మెయిల్ చేయండి.
కాల్ చేసే ముందు మీ పాలసీ నెంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ, సమయం, పాలసీదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మొదలయిన వివరాలను దగ్గర ఉంచుకోండి. ఇవి ఉంటే క్లెయిమ్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది.
డిజిట్ క్లెయిమ్స్ ఎంత త్వరగా సెటిల్ చేయబడతాయి?
మనలో ఎవరైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీని మార్చాలని చూసినప్పుడు తలెత్తే మొదటి ప్రశ్న. మీకు ఆ సందేహం రావడం మంచిదే.
డిజిట్ క్లెయిముల రిపోర్ట్ కార్డును చదవండిభారతదేశంలో ఆన్‌లైన్‌లో ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
థర్డ్-పార్టీ, కాంప్రహెన్సివ్ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ పాలసీకి మధ్య తేడా ఏమిటి?
థర్డ్ పార్టీ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ కేవలం థర్డ్-పార్టీ వ్యక్తికి, ఆస్తికి లేదా వాహనానికి కలిగే డ్యామేజీలు, నష్టాల నుంచి మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది.
మరోవైపు, కాంప్రహెన్సివ్ ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ పాలసీ అనేది మీ సొంత వాహనం, యజమాని-డ్రైవర్‌కు కలిగే డ్యామేజీలు, నష్టాలను కూడా కవర్ చేస్తుంది.