ఆరోగ్య సంజీవని హెల్త్​ ఇన్సూరెన్స్

Digit

High

Sum Insured

Affordable

Premium

24/7

Customer Support

Zero Paperwork. Quick Process.
Your Name
Mobile Number

High

Sum Insured

Affordable

Premium

24/7

Customer Support

ఆరోగ్య సంజీవని పాలసీ అంటే ఏమిటి?

ఆరోగ్య సంజీవని పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి?

health insurance costs
ఎందుకంటే భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయి.
savings
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పాలసీల్లో ఆరోగ్య సంజీవని పాలసీనే అందరికీ అందుబాటు ధరల్లో ఉంది.
no cost emi
కనీసం ఒక బేసిక్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ కలిగి ఉండటమనేది తెలివైన ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడికి ఒక మార్గం వంటిది.
pollution
కోవిడ్​ వలన ఎక్కువ నష్టపోయిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఈ క్రమంలో కోవిడ్​–19తో పాటు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకునేందుకు ఆరోగ్య సంజీవని హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ అనేది ఒక చౌకైన మార్గం.

డిజిట్​ అందించే ఆరోగ్య సంజీవని పాలసీ గొప్పతనం ఏమిటి?

 • సులభమైన ఆన్‌లైన్​ ప్రక్రియలు – మీరు పాలసీని కొనుగోలు చేసే సమయం నుంచి క్లెయిమ్​ చేసే దాకా ఇక్కడ ప్రతీదీ సులభంగా, త్వరితంగా, పేపర్​లెస్​గా, ఇబ్బంది లేకుండా ఉంటుంది! మరో విషయమేంటంటే ఇక్కడ ఎటువంటి హార్డ్​ కాపీలు కూడా అవసరం ఉండదు.
 • ఇన్సూరెన్స్​ చేయగల మొత్తం – మీ అవసరాన్ని బట్టి మీరు మీ ఇన్సూరెన్స్​ అమౌంట్​ను మార్చుకునే సదుపాయం ఉంటుంది.
 • కరోనా వైరస్​ లాంటి మహమ్మారుల నుంచి మిమ్మల్ని కవర్​ చేస్తుంది – కోవిడ్​-19 వలన ఎక్కువ బాధింపబడిన దేశాలలో మన భారతదేశం కూడా ఒకటి. కాబట్టి మేము ఈ ఆరోగ్య సంజీవని పాలసీలోనే కోవిడ్​ చికిత్సను కూడా కవర్​ చేస్తున్నాం. కాబట్టి కరోనా వైరస్ కొరకు మరలా మీరు ప్రత్యేకమైన పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
 • క్యుములేటివ్​ బోనస్​ – ఆరోగ్యంగా ఉంటూ రివార్డులను పొందండి. మీరు ఎలాంటి క్లెయిమ్​లు చేయకుండా ఉన్న ప్రతీ సంవత్సరానికి క్యుములేటివ్​ బోనస్​ను పొందండి.
 • ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు – మా నెట్​వర్క్​లో ఉన్న 6400+ ఆస్పత్రుల నుంచి ఏ ఆస్పత్రికైనా వెళ్లి రీయింబర్స్​మెంట్​ సదుపాయంతో చికిత్స చేసుకునే వెసులుబాటు ఉంది.
 • తక్కువ కో–పేమెంట్ – హెల్త్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసేటపుడు కేవలం 5 శాతం మీరు కో–పేమెంట్​గా చెల్లిస్తే సరిపోతుంది.
 • 24X7 కస్టమర్​ సపోర్ట్​ – జాతీయ సెలవు దినాల్లో కూడా మా కాల్​ సెంటర్​ 24x7 అందుబాటులో ఉంటుంది. కావున మీకు ఎటువంటి సాయం కావాలన్నా కేవలం ఒక ఫోన్​ కాల్​ చేస్తే సరిపోతుంది.
 • అత్యంత సులువైన క్లెయిములు – మా క్లెయిముల ప్రక్రియ పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది. కాబట్టి, క్లెయిములు చేయడమే కాకుండా వాటిని సెటిల్​ చేయడం కూడా సులభంగానే పూర్తవుతుంది.

ఆరోగ్య సంజీవని పాలసీ చార్ట్​, క్యాలుక్యులేటర్

డిజిట్​ అందిస్తున్న ఆరోగ్య సంజీవని పాలసీలో రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు మీరు ఇన్సూరెన్స్​ చేయించుకోవచ్చు. రూ. 50 వేల గుణకాల్లో ఈ విలువ ఉంటుంది. ఆరోగ్య సంజీవని ప్రీమియం ఏ విధంగా మారుతుందో కింద కొన్ని ఉదాహరణలతో చూపించాం.

ఏజ్​ గ్రూప్

ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం (ఇన్సూరెన్స్​ మొత్తం 3 లక్షలు)

ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం (ఇన్సూరెన్స్​ మొత్తం 2 కోట్లు)

18-25

₹2,414

₹9,642

26-30

₹2,503

₹9,999

31-35

₹2,803

₹11,197

36-40

₹3,702

₹13,333

41-45

₹4,698

₹18,764

46-50

₹6,208

₹24,799

51-55

₹8,420

₹33,633

56-60

₹11,569

₹46,211

*డిస్​క్లెయిమర్​  – ఈ విలువలు అనారోగ్య సమస్యలు లేని ఒక పురుషుడి కోసం లెక్కించబడ్డాయి. ప్రీమియం విలువల్లో జీఎస్టీ (GST) చేర్చబడలేదు. ఇవే కాకుండా మీకు ₹3 లక్షలు, ₹5 లక్షలు, ₹10 లక్షలు, ₹25 లక్షలు, ₹50 లక్షలు, ₹1 కోటి, ₹2 కోట్లకు ఇన్సూరెన్స్​ చేయించుకునే అవకాశం కూడా ఉంది.

ఆరోగ్య సంజీవని పాలసీలో ఏమేం కవర్​ అవుతాయి?

ఆస్పత్రి ఖర్చులు

ఆస్పత్రి ఖర్చులు

అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరడానికి 30 రోజుల ముందు నుంచి, చేరిన తర్వాత 60 రోజుల వరకు అయ్యే ఖర్చులు (డయాగ్నోస్టిక్స్​, డాక్టర్​ ఫీజులు, ఆపరేషన్​ ఖర్చులు, హాస్పిటల్​లో ఉన్నందుకు రెంట్​, మందుల ఖర్చులు తదితరాలు) దీనిలో కవర్​ అవుతాయి.

ఆయుష్

ఆయుష్

చాలా మంది వయోవృద్ధులు ప్రత్యామ్నాయ చికిత్సల కోసం చూస్తారు. ఈ పాలసీ వివిధ రకాల చికిత్సలకు అయ్యే ఖర్చులను భరిస్తుంది. సర్టిఫైడ్​ ఆస్పత్రులు అందజేసే ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి చికిత్సలను అందజేస్తుంది.

క్యుములేటివ్​ బోనస్

క్యుములేటివ్​ బోనస్

మీరు ఎటువంటి క్లెయిమ్​ చేయని ప్రతీ సంవత్సరానికి మీకు క్యుములేటివ్​ బోనస్​ లభిస్తుంది. మీ ఇన్సూరెన్స్​ మొత్తం విలువలో 5 శాతాన్ని క్యుములేటివ్​ బోనస్​గా పొందుతారు.

గది అద్దె

గది అద్దె

మీరు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే ఒక్కో ఆస్పత్రిలో గది అద్దె ఒక్కో రకంగా ఉంటుంది. ఈ పాలసీలో మీకు గది అద్దె కింద రోజుకు రూ. 5 వేల వరకు వస్తుంది. మీరు ఆ రేంజ్​ ఉన్న గదుల్లో దేన్నైనా ఎంచుకోవచ్చు.

ఐసీయూ/ఐసీసీయూ

ఐసీయూ/ఐసీసీయూ

ఐసీయూ (ICU), ఐసీసీయూ (ICCU) ఖర్చుల కోసం ఈ పాలసీ కింద మీరు చేసిన మొత్తం ఇన్సూరెన్స్​ విలువలో రోజుకు 5 శాతం లేదా రూ. 10 వేల వరకు మీరు రోజూ వాడుకునేందుకు అవకాశం ఉంటుంది.

అంబులెన్స్​ సేవలు

అంబులెన్స్​ సేవలు

అంబులెన్స్​ చార్జీలకు గరిష్టంగా రూ. 2 వేలు వరకు ఈ పాలసీలో కవర్​ అవుతాయి.

ప్లాస్టిక్​ సర్జరీ, దంత చికిత్సలు

ప్లాస్టిక్​ సర్జరీ, దంత చికిత్సలు

మీకు వ్యాధి లేదా ప్రమాదం వల్ల ప్లాస్టిక్​ సర్జరీ లేదా దంత చికిత్సలు తప్పనిసరి అయితే అది కూడా పాలసీలో కవర్​ చేయబడుతుంది.

క్యాటరాక్ట్​ సర్జరీ

క్యాటరాక్ట్​ సర్జరీ

క్యాటరాక్ట్​ సర్జరీలు కూడా ఈ పాలసీలో కవర్​ అవుతాయి. కానీ ఈ సర్జరీల ఖర్చులకు పరిమితి విధించారు. మీ పాలసీ మొత్తంలో 25 శాతం లేదా రూ. 40 వేల వరకు ఏ విలువ తక్కువగా ఉంటే అదే కవర్​ అవుతుంది.

అత్యాధునిక చికిత్సలు

అత్యాధునిక చికిత్సలు

బలూన్​ సినూప్లాస్టీ, ఇమ్యునోథెరపీ, స్టెమ్​ సెల్​ థెరపీ (మరిన్నింటి కోసం జాబితా చూడండి) వంటి అత్యాధునిక చికిత్సలకు మీ ఇన్సూరెన్స్​ విలువలో 50 శాతం వరకు ఈ పాలసీలో కవర్​ అవుతాయి.

ఏమేం కవర్​ కావంటే?

క్లెయిమ్​ ఎలా ఫైల్​ చేయాలి?

 • రీయింబర్స్​మెంట్​ క్లెయిమ్స్​ – మీరు ఏదైనా ప్రమాదంలో గాయపడి, లేదా అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చేరితే 1800-258-4242 అనే నెంబర్​కు కాల్​ చేసి రెండు రోజుల్లో మాకు తెలియజేయండి. లేదా healthclaims@godigit.com అనే మెయిల్​​ ఐడీకి ఈమెయిల్​ చేయండి. మీరు ఆస్పత్రి బిల్లులు​, ఇతర డాక్యుమెంట్లు అప్​లోడ్​ చేసేందుకు మేము మీకు ఒక లింక్​ను పంపుతాం. ఆ లింక్​ ద్వారా మీరు కావాల్సిన డాక్యుమెంట్లను అప్​లోడ్​ చేస్తే సరిపోతుంది. మీ రీయింబర్స్​మెంట్​ క్లెయిమ్​ ప్రాసెస్​ అవుతుంది.
 • క్యాష్​లెస్​ క్లెయిమ్స్​ – మీకు క్యాష్​లెస్​ క్లెయిమ్​ కావాలనుకుంటే మా నెట్​వర్క్​ హాస్పిటల్​కు వెళ్తే సరిపోతుంది. మా నెట్​వర్క్​ ఆస్పత్రుల జాబితాను ఇక్కడ చూడవచ్చు. అక్కడ మీరు మీ ఈ-హెల్త్​ కార్డును హెల్ప్​ డెస్క్​లో ఉండే వారికి చూపించి క్యాష్​లెస్​ రిక్వెస్ట్​ ఫామ్​ అడిగితే సరిపోతుంది. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే మీ క్లెయిమ్​ ప్రాసెస్​ చేయబడుతుంది.
 • మీరు కనుక కరోనా వైరస్​ గురించి క్లెయిమ్​ చేస్తే అప్పుడు మీరు ఐసీఎంఆర్​ (ICMR)– నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ, పుణే ద్వారా ఆమోదం పొందిన అధీకృత కేంద్రం నుంచి ఇచ్చిన పాజిటివ్​ రిపోర్టును సబ్మిట్​ చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్య సంజీవని పాలసీ ముఖ్యమైన ఫీచర్లు

ఇన్సూరెన్స్​ చేసిన మొత్తం

రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు

కో–పేమెంట్​

5% తప్పనిసరి కో–పేమెంట్

ప్రీమియం

సంవత్సరానికి రూ. 2414 నుంచి ప్రారంభం.

రూమ్​ రెంట్​ పరిమితి

మీరు ఇన్సూరెన్స్​ చేసిన మొత్తంలో 2 శాతం (రూ. 5,000 వరకు)

క్యుములేటివ్​ బోనస్

మీరు క్లెయిమ్​ చేయని ప్రతీ సంవత్సరానికి మీరు ఇన్సూరెన్స్​ చేసిన మొత్తంలో 5% అదనంగా పొందండి

క్లెయిమ్​ ప్రక్రియ

డిజిటల్​ ఫ్రెండ్లీ, ఎటువంటి హార్డ్​ కాపీలు అవసరం లేదు.

అందుబాటులో ఉన్న ఎంపికలు

ఫ్యామిలీ ఫ్లోటర్​, వ్యక్తిగత పాలసీ

ఆరోగ్య సంజీవని హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ సాధారణ ప్రయోజనాలు

జీవితాంతం పునరుద్ధరించుకోవచ్చు

ఈ పాలసీని మీరు జీవితాంతం పునరుద్ధరించుకోవచ్చు. 18 నుంచి 65 సంవత్సరాల లోపు వారెవరైనా సరే ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైన సరే మీరు సరైన సమయానికి పునరుద్ధరించుకుంటే సరిపోతుంది.

తక్కువ ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం

ఐఆర్​డీఏఐ (IRDAI) ద్వారా నిర్దేశించబడిన బేసిక్​ స్టాండర్డ్ పాలసీ ఇది. మీకు మార్కెట్​లో లభించే ఇతర ఇన్సూరెన్స్​ పాలసీలతో పోల్చి చూసుకుంటే ఆరోగ్య సంజీవని హెల్త్​ పాలసీ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.

తక్కువ కో–పేమెంట్

ప్రతీ హెల్త్​ పాలసీ ఎంతో కొంత కో–పేమెంట్​ నిబంధనను కలిగి ఉంటుంది. అది ఒక్కో ఇన్సూరెన్స్​ కంపెనీకి ఒక్కోలా ఉంటుంది. కొన్ని పాలసీలు 10, 20 శాతం కో–పేమెంట్​ను కలిగి ఉంటాయి. కొన్ని పాలసీలకు అసలు కో–పేమెంట్​ చేయాల్సి అవసరమే ఉండదు. కానీ ఈ ఆరోగ్య సంజీవని ప్లాన్​కు మీరు 5 శాతం కో–పేమెంట్​ చేయాల్సి ఉంటుంది. అంటే పాలసీని క్లెయిమ్​ చేసే సమయంలో మీరు మీ జేబు నుంచి 5 శాతం ఖర్చులను భరించాల్సి ఉంటుంది.

వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్​ ప్లాన్లు లభ్యం

గో డిజిట్​ (Go Digit) జనరల్​ ఇన్సూరెన్స్​ అందిస్తున్న ఆరోగ్య సంజీవని పాలసీలో రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అవి 1. వ్యక్తిగత పాలసీ (ఒక పాలసీ ఒక్కరికి మాత్రమే) 2. ఫ్యామిలీ ఫ్లోటర్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ (మొత్తం కుటుంబానికి కలిపి ఒకే హెల్త్​ పాలసీ).

పరిమిత ఇన్సూరెన్స్​ మొత్తం

ఆరోగ్య సంజీవని హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలో రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల మొత్తం వరకు మీరు ఇన్సూరెన్స్​ చేయించుకోవచ్చు.

ఆరోగ్య సంజీవని ప్లాన్​ను ఎవరు కొనుగోలు చేయాలి?

మొదటిసారి హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకుంటున్నవారు

ఆరోగ్య సంజీవని హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ అనేది ప్రస్తుతం ఉన్న అన్ని హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీల్లో కెల్లా మెరుగైనది. మీరు ప్రస్తుతం యుక్త వయస్సులో ఉండి, హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలు తీసుకోవడం ఇదే మొదటిసారి అయితే బేసిక్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ అయిన ఆరోగ్య సంజీవని ప్లాన్​ను తీసుకోవడం చాలా ఉత్తమం. రూ. 5 లక్షల కంటే ఎక్కువగా కూడా మీరు ఇక్కడ ఇన్సూరెన్స్​ చేసుకోవడానికి వీలుంటుంది. మీరు హెల్త్​ ఇన్సూరెన్స్​ కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం రాదు.

కోవిడ్​-19 నుంచి రక్షణ పొందాలనుకునేవారు

కోవిడ్​-19 భయం వలన ఎక్కువ మంది ప్రజలు హెల్త్​ ఇన్సూరెన్స్​ల వైపు చూస్తున్నారు. తమకు కావాల్సిన పాలసీలో కరోనా కూడా కవర్​ కావాలని వారు కోరుకుంటున్నారు. మీరు కూడా అటువంటి పాలసీ కోసమే వెతుకుతుంటే ఆరోగ్య సంజీవని పాలసీ ఉత్తమ ఎంపిక. ఈ పాలసీలో కోవిడ్​-19 వ్యాధి కూడా కవర్​ అవుతుంది. వివిధ రకాల జబ్బులు ఎలా కవర్​ అవుతాయో కోవిడ్​-19 కూడా అలాగే కవర్​ అవుతుంది. మీరు దాని కోసం అదనపు మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. ఈ పాలసీలో మరో విషయం ఏమిటంటే ఈ పాలసీని జీవితాంతం పునరుద్ధరించుకోవచ్చు. మిగతా కోవిడ్​-19 పాలసీలు కొన్ని నెలల వరకే పనిచేస్తాయి.

బేసిక్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ కోసం చూసేవారు

మీరు మీ కుటుంబాన్ని హెల్త్​ ఇన్సూరెన్స్​ సాయంతో సంరక్షించాలని భావిస్తుంటే, హెల్త్​ ఇన్సూరెన్స్​ కు అధికంగా ఖర్చు చేసేందుకు ఇష్టపడకపోతే మీకు ఈ పాలసీ సరిగ్గా నప్పుతుంది. ప్రస్తుతం మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఉత్తమ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ ఆరోగ్య సంజీవని హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ.

ఆన్​లైన్​లో ఆరోగ్య సంజీవని హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఎలా కొనుగోలు చేయాలి?

గో డిజిట్​ అందిస్తున్న ఆరోగ్య సంజీవని ప్లాన్​ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

ఆరోగ్య సంజీవని పాలసీ పదజాలాన్ని డౌన్​లోడ్​ చేసుకోండి