డెంటల్‌ కవర్‌తో కూడిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌

Happy Couple Standing Beside Car
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
Chat with an expert

I agree to the  Terms & Conditions

Port my existing Policy
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
{{healthCtrl.otpError}}
Didn't receive SMS? Resend OTP
Chat with an expert

I agree to the  Terms & Conditions

Port my existing Policy

YOU CAN SELECT MORE THAN ONE MEMBER

{{healthCtrl.patentSelectErrorStatus}}

  • -{{familyMember.multipleCount}}+ Max {{healthCtrl.maxChildCount}} kids
    (s)

DONE
Renew your Digit policy instantly right

డెంటల్‌ హెల్త్‌ ఇన్సురెన్స్‌ అంటే ఏంటి?

సింపుల్‌గా చెప్పాలంటే, డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అంటే మీకు అవసరమయ్యే డెంటల్‌ చికిత్సల ఖర్చులను కూడా కవర్ చేసే హెల్త్​ ఇన్సూరెన్స్​ అని అర్థం. సాధారణంగా అనేక స్టాండర్డ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్లు డెంటల్​ ట్రీట్​మెంట్​కు ఇన్సూరెన్స్​ను అందించవు. అయితే, డిజిట్‌లో మేము దీన్ని మా డిజిట్ హెల్త్ కేర్ ప్లస్ ప్లాన్‌లో భాగంగా ఉన్న మా ఓపీడీ (OPD) బెనిఫిట్​ కింద కవర్‌ చేస్తాం.

Read More

మీకు డెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమవుతుంది?

1
కొత్తకొత్త ఆవిష్కరణలు, ద్రవ్యోల్బణం, ఖరీదైన సెటప్, మెటీరియల్స్​, ల్యాబ్ పని ఉంటుంది కాబట్టి డెంటల్‌ చికిత్సలు సాధారణంగా ఖరీదైనవిగానే ఉంటాయి.   (1)
2
భారతదేశంలో మొత్తం హెల్త్‌ కేర్‌ ఖర్చులో ఓపీడీ (OPD) ఖర్చులు దాదాపు 62 శాతం వరకు ఉంటాయి!  (2)
3
ప్రపంచవ్యాప్తంగా 3.9 మిలియన్ల మందికిపైగా ప్రజలు నోటి సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని వరల్డ్​ డెంటల్ ఫెడరేషన్ చెబుతోంది (3)

డెంటల్ ట్రీట్‌మెంట్‌లను కవర్ చేసే డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ గొప్పతనం ఏంటి?

  • సింపుల్‌ ఆన్‌లైన్ ప్రాసెస్​: డెంటల్‌ ట్రీట్​మెంట్​ను అందించే హెల్త్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడం దగ్గరి నుంచి డెంటల్‌ హెల్త్‌ ఇన్సురెన్స్‌ క్లెయిమ్‌ చేయడం వరకు ప్రతిదీ సరళంగా, డిజిటల్​గా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతుంది. పైగా, మీరు క్లెయిమ్‌ చేసుకునేటప్పుడు ఎలాంటి హార్డ్ కాపీలు కూడా అవసరం ఉండదు!
  • విపత్కర పరిస్థితుల్లో కూడా కవర్ చేస్తుంది : ప్రతిదీ అనుకోకుండా వస్తుందని మనకు 2020లో తెలిసొచ్చింది! అది కోవిడ్​-19 అయినా లేదా మరే ఇతర వైరస్ అయినా.. ఎలాంటి మహమ్మారిని అయినా ఇది కవర్‌ చేస్తుంది!
  • వయసు ఆధారిత చెల్లింపు ఉండదు : ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన మా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో డెంటల్​ చికిత్సలు కవర్‌ అవుతాయి. పైగా వయసు ఆధారిత చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు; అంటే క్లెయిమ్‌ సమయంలో మీరు మీ జేబు నుంచి ఏమీ చెల్లించరన్న మాట!
  • క్యుములేటివ్ బోనస్: మీరు సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయనప్పటికీ మీరు ప్రయోజనం పొందవచ్చు. మీరు క్లెయిమ్‌ చేసుకోని ప్రతీ సంవత్సరానికి వార్షిక, క్యుములేటివ్‌ బోనస్‌లను పొందవచ్చు!
  • కాంప్లిమెంటరీ వార్షిక హెల్త్‌ చెకప్‌లు: రెగ్యులర్ చెకప్‌లతో డెంటల్‌ కేర్‌ సహా చాలా ఆరోగ్య సమస్యలు నివారించొచ్చని మీకు తెలుసా? ఈ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కాంప్లిమెంటరీ వార్షిక హెల్త్‌ చెకప్‌ల రెన్యువల్‌ బెనిఫిట్‌తో వస్తుంది. కాబట్టి మీరు మీ పూర్తి హెల్త్‌ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని సంతోషంగా ఉండొచ్చు!
  • మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స పొందండి : క్యాష్​లెస్​ క్లెయిమ్‌ల కోసం లేదా రీయింబర్స్‌మెంట్‌ కోసం దేశంలోని 6400+ మా నెట్‌వర్క్ ఆసుపత్రుల నుంచి ఎంచుకోండి.

OPD కవర్తో కూడిన డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో దంత చికిత్సలతో పాటు ఇంకేం కవర్ అవుతాయి

స్మార్ట్ + OPD

ప్రతి క్లెయిమ్ ఉచిత సంవత్సరానికి 10% CB (50% వరకు)

కవర్ కానివి ఏంటి?

క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?

  • రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు (Reimbursement Claims)- ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల్లోపు 1800-258-4242 ద్వారా మాకు తెలియజేయండి లేదా healthclaims@godigit.comకు ఈ-మెయిల్ చేయండి. మీ హాస్పిటల్ బిల్లులు, సంబంధిత పత్రాలు అప్‌లోడ్ చేసుందుకు వీలుగా లింక్‌ మీకు పంపుతాము.
  • నగదు రహిత క్లెయిమ్‌లు (Cashless Claims)- నెట్‌వర్క్ ఆసుపత్రిని ఎంచుకోండి. మీరు నెట్‌వర్క్ ఆసుపత్రుల పూర్తి జాబితాను ఇక్కడ తెలుసుకోవచ్చు. హాస్పిటల్ హెల్ప్‌డెస్క్‌లో ఈ-హెల్త్ కార్డును చూపించి, నగదు రహిత రిక్వెస్ట్‌ ఫారమ్‌ను తీసుకోండి. అన్నీ సవ్యంగా ఉంటే, మీ క్లెయిమ్ అప్పటికప్పుడు ప్రాసెస్ అవుతుంది.
  • మీరు కరోనా వైరస్ కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ICMR - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణే అధీకృత కేంద్రం నుంచి పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ ఉండాలి.

డెంటల్‌ చికిత్సలను కవర్ చేసే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వల్ల ప్రయోజనాలు

మీ డెంటల్‌ ఖర్చులను అదుపులో ఉంచుతుంది.

కొత్తకొత్త ఆవిష్కరణలు, ద్రవ్యోల్బణం, ఖరీదైన సెటప్, మెటీరియల్స్​ ఉంటాయి కాబట్టి డెంటల్‌ చికిత్సలు ఖరీదైనవిగానే ఉంటాయి. డెంటల్​ కవరేజ్​తో కూడిన హెల్త్​ ఇన్సూరెన్స్​ కలిగి ఉంటే మీరు మీ డెంటల్​ చికిత్సల ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు. మీ నోటి సంరక్షణ చూసుకుంటూనే మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు!

మీకు ఎంతో ముఖ్యమైన డెంటల్ హెల్త్ను కాపాడుకునేలా చేస్తుంది!

సాధారణంగా అందరూ తమ డెంటల్​ హెల్త్​ను సరిగా పట్టించుకోరు. దీంతో తీవ్రమైన నోటి సంబంధిత ఆరోగ్య సమస్యల బారిన పడతారు. సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా డెంటిస్టులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే, భారతదేశంలో 67 శాతం మంది ఏదైనా సమస్య వస్తే తప్ప డెంటిస్ట్​లను సంప్రదించడం లేదని వెల్లడైంది. అదే, డెంటల్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ ఉంటే అలా చివరి నిమిషంలో డెంటిస్ట్​ను సంప్రదించాల్సిన అవసరం రాదు. డబ్బు గురించి ఆందోళన చెందకుండా సరైన సమయంలో చికిత్స పొందొచ్చు!

స్టాండర్డ్కు మించిన కవరేజ్ ఉంటుంది.

సాధారణంగా, చాలా వరకు స్టాండర్డ్​ హెల్త్‌ ఇన్సురెన్స్‌ ప్లాన్లు డెంటల్‌ చికిత్సలను కవర్ చేయవు. అయితే డెంటల్​ చికిత్సలు సహా ఓపీడీ (OPD) కవర్‌తో కూడిన ఈ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా మీరు స్టాండర్డ్​కు మించి కవరేజీని పొందుతారు. ఇది దీని అతిపెద్ద ప్రయోజనం. మీరు స్టాండర్డ్​ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ యొక్క అన్ని ప్రయోజనాలను, డెంటల్‌ చికిత్సలు సహా ఓపీడీ (OPD) ఖర్చులను కవర్ చేసే ప్రయోజనాలు పొందుతారు!

డెంటల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో అదనపు ప్రయోజనాలు

పైన పేర్కొన్నట్లుగా, ఈ కేసులో, మీకు అవసరమైన డెంటల్‌ చికిత్సలకు కవరేజ్ ప్రయోజనాన్ని అందించడమే కాకుండా, డే కేర్ ప్రొసీజర్‌ కవరేజ్, కోవిడ్‌ సహా అన్ని ఇతర అనారోగ్యాల కోసం ఆసుపత్రిలో చేరడం వంటి ప్రయోజనాలను కూడా డెంటల్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తుంది. కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్‌లు, రూమ్​ రెంట్​ క్యాపింగ్​ విధించకపోవడం సహా అనేక ఇతర ప్రయోజనాలు పొందొచ్చు.

మీరు అన్ని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లలో లాగే పన్ను ఆదా పొందండి!

ఏదైనా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో ఉత్తమమైన అంశం ఏంటంటే, మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలను పొందడమే కాకుండా, మీరు చెల్లించే హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం ఆధారంగా రూ. 25,000 వరకు వార్షిక పన్ను పొదుపు (ట్యాక్స్​ సేవింగ్) వంటి ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు!

హెల్తీ డెంటల్‌ హైజీన్ ఎలా నిర్ధారించాలి?

  • మీరు బాల్యం నుంచి దీని గురించి విని ఉండవచ్చు. కానీ ఇప్పటికీ ఇది నిజమని, వింతగా అనిపిస్తోంది కదూ. ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది! నోటి పరిశుభ్రతకు రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం కీలకం. పళ్ల మధ్య దంత ఫలకం లేకుండా ఉండేందుకు అవసరమైనప్పుడు మీరు దారం ద్వారా శుభ్రం (ఫ్లాస్‌) చేసుకోవచ్చు.
  • ఆరోగ్య నిపుణులు ఇచ్చే అత్యంత సాధారణమైన సిఫార్సుల్లో ఒకటి ఏంటంటే.. మీకు దంత సమస్యలు లేవని మీరు అనుకు, కనీసం సంవత్సరానికి రెండు సార్లు కాకపోయినా ఒకసారైనా మీ డెంటిస్ట్​ను సందర్శించాలి. చాలాసార్లు ఆలస్యం అయ్యేవరకు లోపల ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. పళ్ల​ నొప్పులు చాలా దారుణంగా ఉంటాయి. తరచౌ డెంటల్ చెకప్‌లకు వెళ్లడం వల్ల మీ నోటి ఆరోగ్యం అదుపులో ఉంటుందని గుర్తించండి!
  • నీరు ఎక్కువగా తాగండి. అవును, ఈ పాతకాలపు అలవాటు మొత్తం మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, దంత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది!
  • మీకు మధుమేహం ఉన్నట్లయితే, మీ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం మొత్తం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ నోటి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మీరు చిగుళ్ల వ్యాధులకు దూరంగా ఉండేలా చేస్తుంది. ఒకవేళ మీకు చిగుళ్ల వ్యాధి వచ్చేటట్లు అనిపిస్తే వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోండి!
  • ధూమపానం సహా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి. అవి మీ ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, మీ నోటి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు!

డెంటల్‌ ట్రీట్మెంట్ను కవర్ చేసే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)