ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

డిజిట్ ఇన్సూరెన్స్​కు మారండి
Happy Couple Standing Beside Car
Chat with an expert

I agree to the  Terms & Conditions

Port my existing Policy
Renew your Digit policy

(Incl 18% GST)

భారతదేశంలో డిజిట్​ ఇన్సూరెన్స్​తో ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ కొనుగోలు చేయండి

"నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు"

మీరు దానిని విశ్వసిస్తే, చదవండి.

Pollution
వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధి మరణాలు చాలా ప్రాంతాలలో ఒక సమస్య. 2020లో ఆసియా పసిఫిక్ ప్రాంతం అంతటా మన దేశంలోనే అత్యధిక మలేరియా కేసులు నమోదయ్యాయి. [1]
Sedentary lifestyles
దాదాపు 61 శాతం మంది భారతీయ మహిళలు మరియు దాదాపు 47 శాతం మంది భారతీయ పురుషులు వారి ఆహారం మరియు నిశ్చల జీవనశైలి ఆధారంగా అనారోగ్యంతో ఉన్నారు. [2]
Cancer Patient
భారతదేశంలో, ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి అతని/ఆమె జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా, 2020తో పోలిస్తే 2025లో క్యాన్సర్ కేసులు 12.8 శాతం పెరుగుతాయని అంచనా.[3]
Medical Inflations
భారతదేశం యొక్క ప్రస్తుత వైద్య ద్రవ్యోల్బణం రేటు 14% - 2021లో ఆసియా దేశాలలో అత్యధికం. 2023లో, మరో 10% పెరుగుదల ఊహించబడింది. [4]
Mental Health
వాస్తవానికి, పెద్దవారిలో మొత్తం వ్యాధులలో మానసిక ఆరోగ్య రుగ్మతల వాటా దాదాపు 14.3 శాతంగా ఉంది. [5]
Heart Disease
భారతదేశంలో రెండు దశాబ్దాలుగా క్యాన్సర్ మరియు మధుమేహం కోసం పెరుగుతున్న ప్రవృత్తితో పాటుగా గుండె జబ్బులు మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి.

డిజిట్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్​లో ఉన్న గొప్పతనం ఏమిటి?

  • సులభమైన ఆన్​లైన్ ప్రక్రియలు  - మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పటి నుంచి క్లెయిమ్ చేసే వరకు మొత్తం పేపర్​లెస్, సులభంగా మరియు ఎటువంటి చింత లేకుండా ఉంటుంది. క్లెయిమ్స్ కోసం కూడా ఎటువంటి హార్డ్ కాపీస్ అవసరం లేదు.
  • ఏజ్ మీద ఆధారపడి కానీ జోన్ మీద ఆధారపడి ఎటువంటి కోపేమెంట్స్ లేవు - మా హెల్త్ ఇన్సూరెన్స్ ఎటువంటి కో పేమెంట్ లేకుండా ఉంటుంది. copayment. దీనర్థం మీరు క్లెయిమ్ చేసేటపుడు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
  • రూం రెంట్ కోసం ఎటువంటి పరిమితులు లేవు  - గదుల విషయంలో వేర్వేరు వ్యక్తుల ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉంటాయని మేము అర్థం చేసుకున్నాం. అందుకే మా పాలసీలలో గదుల విషయంలో అద్దె పరిమితులు లేవు. no room rent restrictions. మీరు ఇష్టపడే ఏ ఆసుపత్రి గదైనా ఎంచుకోండి.
  • SI(బీమా మొత్తం) వాలెట్ ప్రయోజనం  - బీమా గడువులో మీరు పాలసీ చేసిన బీమా మొత్తం కంప్లీట్​గా వాడుకుంటే మీ కోసం మేము దానిని మరలా అందజేస్తాం.
  • మీకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోండి  - దేశం మొత్తం మీద మాకు ఉన్న 10500 కంటే ఎక్కువ నెట్​వర్క్ ఆసుపత్రుల నుంచి ఎంచుకోండి. network hospitals వాటిల్లో క్యాష్​లెస్ చికిత్సలు లేదా రీయింబర్స్​మెంట్ ఎంచుకోండి.
  • వెల్​నెస్ బెనిఫిట్లు - అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల సహకారంతో యాప్​లో ప్రత్యేకమైన వెల్​నెస్ ప్రయోజనాలను పొందండి. wellness benefits

డిజిట్ ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్‌తో ఇన్‌ఫైనేటీ హెల్త్ ఇన్సూరెన్స్

digit-play video

అందరికీ సరిపోయే హెల్త్​ ఇన్సూరెన్స్​ ఎంపికలు​

Health insurance for the young & the restless

అవిశ్రాంతంగా పని చేసే వారికి, యుక్త వయస్కులకు హెల్త్​ ఇన్సూరెన్స్​

యుక్తవయస్సులో ఉన్న వారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని, హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకునేందుకు వెనుకడుగు వేస్తారని మేము అర్థం చేసుకోగలం. కానీ, యుక్త వయసు​లోనే పాలసీ తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ప్రీమియంలు ఉంటాయి, వెయిటింగ్​ పీరియడ్​​ త్వరగా పూర్తవుతుంది. అవసరమైన సమయంలో మెటర్నిటీ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఏదైనా చిన్న చికిత్సలు అవసరం అయితే మా ఓపీడీ (OPD) కవర్​ను ఉపయోగించి మీరు చికిత్స చేయించుకోవచ్చు.

Health insurance for the Great Indian Families

గొప్ప భారతీయ కుటుంబాలకు హెల్త్​ ఇన్సూరెన్స్​

మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా సంరక్షించాలని భావిస్తే హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకునే ముందు మీరు ఫ్యామిలీ ఫ్లోటర్​ ప్లాన్​ తీసుకుంటే సరిపోతుంది. లేదా ప్రతి సభ్యుడికి వ్యక్తిగత ప్లాన్​ తీసుకున్నా సరిపోతుంది. ఈ ప్లాన్​ మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. మేము అందించే ప్రయోజనాలతో మీకు మరింత లాభం చేకూరుతుంది. అదనపు ఇన్సూరెన్స్​ మొత్తం, మెటర్నిటీ ప్రయోజనం, నవజాత శిశువు సంరక్షణ వంటి ప్రయోజనాలు ఆనందించవచ్చు. మీ కుటుంబాలు పెద్దవైనా, చిన్నవైనా మా హెల్త్​ ఇన్సూరెన్స్​ సరిగ్గా సరిపోతుంది.

Health Insurance for the Old & the Wise

వృద్ధులకు ఆరోగ్య బీమా తెలివైన వారికి కూడా..

మీరు మిమ్మల్ని కానీ మీ అందమైన తల్లిదండ్రులను సెక్యూర్​గా ఉంచుకోవాలని చూస్తున్నారా? మా సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్(పెద్దవారి కోసం) జనాభా ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో AYUSH చికిత్సలు, హోమ్ హాస్పిటలైజేషన్, నో రూం రెంట్ క్యాపింగ్, కరోనా వైరస్ కొరకు హాస్పిటలైజేషన్ వంటి ప్రయోజనాలతో వస్తుంది. మీ తల్లిదండ్రులకు ఏం కావాలో ఇది సరిగ్గా అర్థం చేసుకుంటుంది.

Health Insurance for Fitness Enthusiasts

ఫిట్​నెస్​ కోసం పరితపించే వారికి హెల్త్​ ఇన్సూరెన్స్

ఫిట్​నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారని మేము అర్థం చేసుకుంటాం. అటువంటి ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వారు హెల్త్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంటుంది. పైగా, ఆదాయపు పన్ను నుంచి కూడా మినహాయింపు పొందొచ్చు. మా హెల్త్​ ఇన్సూరెన్స్​లో ఉన్న ఓపీడీ (OPD) ప్రయోజనం ద్వారా సాధారణ వర్కవుట్​ గాయాలకు కూడా చికిత్స చేయించుకోవచ్చు.

Health Insurance for Corporate Hotshots

కార్పొరేట్​ వ్యక్తులకు హెల్త్​ ఇన్సూరెన్స్​

మీకు ఇప్పటికే కార్పొరేట్​ మెడికల్​ ఇన్సూరెన్స్​ ఉన్నా కూడా అవి పరిమితం​గానే ఉంటాయి. కాబట్టి, మీరు ఆరోగ్య సంజీవని లేదా హెల్త్​ ఇన్సూరెన్స్​ టాప్​–అప్​లను ఎంచుకోవడం వలన ఇవి మీ కార్పొరేట్​ ప్లాన్​ కన్నా ఎక్కువ అమౌంట్​ను కవర్​ చేస్తాయి. ఇది నిజం.

Health Insurance for Employees

ఉద్యోగస్తులకు హెల్త్​ ఇన్సూరెన్స్

మీరు ఏదైనా పెద్ద లేదా మీడియం లేదా చిన్న కంపెనీ నడిపిస్తూ అందులో పనిచేసే మీ ఉద్యోగుల కోసం సరసమైన ధరకు హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకోవచ్చు. ఇందులో ప్రీమియంలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కల్పించడంతో పాటు వారిని సంతోషంగా కూడా ఉంచుతుంది.

Health Insurance for Value Seekers

విలువ కోరుకునే వారి కోసం హెల్త్​ ఇన్సూరెన్స్​

విలువను కోరుకునే వారికోసం పలు రకాల హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వారు తక్కువ ప్రీమియంలు ఉండే ఆరోగ్య సంజీవని వంటి ప్లాన్​ను ఎంచుకోవచ్చు. లేదా టాప్​–అప్​ ప్లాన్​ అయినా ఎంచుకోవచ్చు. వీటిల్లో తక్కువ ప్రీమియం రేటు ఉంటుంది.

మా హెల్త్​ ఇన్సూరెన్స్​లో ఏం కవర్ అవుతుంది?

కవరేజెస్

డబుల్ వాలెట్ ప్లాన్

ఇన్ఫినిటీ వాలెట్ ప్లాన్

వరల్డ్​వైడ్ ట్రీట్​మెంట్ ప్లాన్

ముఖ్యమైన ఫీచర్లు

అన్ని రకాల ఆసుపత్రి చికిత్సల కొరకు - యాక్సిడెంట్ల వలన లేదా అనారోగ్యం, లేదా తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్​ వలన ఆసుపత్రిలో చేరితే..

అనారోగ్యం, యాక్సిడెంట్, తీవ్ర అనారోగ్యం లేదా కోవిడ్ 19 వంటి మహమ్మారితో సహా అన్ని రకాల ఆసుపత్రి చికిత్సలకు ఇది వర్తిస్తుంది. మల్టీపుల్ హాస్పిటలైజేషన్స్ కొరకు దీనిని ఉపయోగించవచ్చు. మీ సమ్ ఇన్సూర్డ్ మొత్తం ఉన్నంతవరకు

ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్

ఏదైనా ప్రమాదవశాత్తు సంఘటన జరిగినా కానీ చికిత్స కోసం కానీ కవర్ పొందేందుకు మీరు నిర్దిష్ట సమయం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదే ఇన్షియల్ వెయిటింగ్ పీరియడ్.

వెల్​నెస్ ప్రోగ్రాం

హోమ్ హెల్త్ కేర్, టెలీ కన్సల్టేషన్​లు, యోగా, మైండ్​ఫుల్​నెస్ వంటి ఇంకా ఎన్నో రకాల ప్రత్యేకమైన వెల్​నెస్ ప్రయోజనాలు మరియు మా యాప్​లో మరెన్నో అందుబాటులో ఉంటాయి.

సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్

మేము మీ బీమా మొత్తంలో 100 శాతం బీమా మొత్తాన్ని బ్యాకప్​గా అందజేస్తాం. సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్ ఎలా పని చేస్తుంది? ఉదాహరణకు మీ పాలసీ మొత్తం రూ. 5 లక్షలు అనుకుందాం. మీరు కనుక రూ. 50 వేలకు క్లెయిమ్ చేస్తే.. డిజిట్ ఆటోమేటిగ్గా వాలెట్​ను ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు మీకు ఏడాది మొత్తానికి క్లెయిమ్ చేసుకునేందుకు రూ. 4.5 లక్షలు + 5 లక్షలు ఉంటాయి. పైన పేర్కొన్న సందర్భంలో ఒక సింగిల్ క్లెయిమ్ అనేది రూ. 5 లక్షలకు మించకూడదు.

పాలసీ సమయంలో రిలేటెడ్ మరియు అన్​రిలేటెడ్ జబ్బులు కూడా.. ఎటువంటి ఎగ్జాషన్ నిబంధనలు లేవు. (ఎగ్జాషన్ నిబంధన అనగా క్లెయిమ్ సమయంలో ఆస్తి యజమాని కూడా కొంత నష్టాన్ని భరించాలనే నిబంధన) అదే వ్యక్తి కూడా కవర్ అవుతాడు.
పాలసీ సమయంలో అపరిమిత పునరుద్ధరణ. సంబంధిత మరియు సంబంధం లేని వ్యాధులు కూడా కవర్ అవుతాయి. ఎగ్జాషన్ నిబంధన లేదు. అదే వ్యక్తి కూడా కవర్ అవుతాడు.
పాలసీ సమయంలో ఒక సారి రిలేటెడ్ మరియు అన్​రిలేటెడ్ వ్యాధులు. ఎటువంటి ఎగ్జాషన్ పరిమితులు లేవు. అదే వ్యక్తి కవర్ అవుతాడు.
క్యుములేటివ్ బోనస్
digit_special Digit Special

పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిమ్స్ లేవా? మీరు ఆరోగ్యంగా ఉండి క్లెయిమ్ చేయనందుకు మీ మొత్తం సమ్ ఇన్సూర్డ్​లో అదనపు మొత్తాన్ని బోనస్​గా పొందుతారు.

ప్రతి క్లెయిమ్ ఫ్రీ సంవత్సరానికి బేస్​మొత్తంలో 10శాతం గరిష్టంగా 100 శాతం వరకు
ప్రతి క్లెయిమ్ చేయని సంవత్సరానికి బీమా చేయబడిన బేస్ మొత్తంలో 50 శాతం. గరిష్టంగా 100 శాతం వరకు
క్లెయిమ్ చేయకుండా ఉన్న ప్రతి సంవత్సరానికి బేస్ సమ్ ఇన్సూర్డ్​లో 50శాతం. గరిష్టంగా 100 శాతం వరకు..
రూం రెంట్ క్యాపింగ్

వేర్వేరు వర్గాలకు చెందిన గదులు వేర్వేరు రకాల అద్దెలను కలిగి ఉంటాయి. హోటల్ గదులకు టారిఫ్​లు ఎలా ఉంటాయో అలాగే వీటికి కూడా ఉంటాయి. డిజిట్ ప్లాన్లు గది అద్దె మీ బీమా మొత్తం కంటే తక్కువగా ఉన్నంత వరకు ఎటువంటి పరిమితులు కలిగి ఉండవు.

డే కేర్ ప్రొసీజర్స్

24 గంటల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరిన వారి ఆరోగ్య ఖర్చులను మాత్రమే ఇది కవర్ చేస్తుంది. డే కేర్ ప్రొసీజర్స్ ఆసుపత్రిలో చేపట్టే వైద్య చికిత్సలను సూచిస్తాయి. క్యాటరాక్ట్ , డయాలసిస్ వంటి వాటికి కూడా సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ సమయం అవసరమవుతుంది.

వరల్డ్​వైడ్ కవరేజ్
digit_special Digit Special

వరల్డ్​వైడ్ కవరేజ్​తో ప్రపంచ స్థాయి చికిత్సను పొందండి. భారతదేశంలో మీ ఆరోగ్య పరీక్షల సమయంలో వైద్యుడు మీ అనారోగ్యం గుర్తించిన తర్వాత మీరు దేశాల్లో చికిత్సను పొందాలని అనుకుంటే మేము మీ కోసం సిద్ధంగా ఉన్నాం. అందుకు అయ్యే చికిత్స ఖర్చులకు కూడా మీరు కవర్ చేయబడతారు.

×
×
హెల్త్ చెకప్

మీ హెల్త్ చెకప్స్​​ కోసం పాలసీలో పేర్కొన్న విధంగా ఖర్చులను మేము చెల్లిస్తాం. అటువంటి పరీక్షల కొరకు ఎటువంటి పరిమితులు ఉండవు. అది ECG లేదా థైరాయిడ్ కోసం కూడా వర్తిస్తుంది. మీ క్లెయిమ్ లిమిట్​ను తనిఖీ చేసేందుకు మీ పాలసీ షెడ్యూల్​ను ఓ సారి పరిశీలించండి.

బేస్​మొత్తంలో 0.25శాతం, రెండు సంవత్సరాల తర్వాత గరిష్టంగా రూ. 1, 000
బేస్​మొత్తంలో 0.25శాతం, ప్రతి సంవత్సరం తర్వాత గరిష్టంగా రూ. 1, 500
బేస్​మొత్తంలో 0.25శాతం, ప్రతి సంవత్సరం తర్వాత రూ. 2, 000 వరకు
అత్యవసర ఎయిర్ అంబులెన్స్ ఖర్చులు

మీకు అత్యవసర ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. తక్షణమే ఆసుపత్రికి తరలించాల్సి రావొచ్చు. విమానంలో లేదా హెలికాప్టర్​లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చులను మీ కోసం మేము తిరిగి చెల్లిస్తాం.

×
ఏజ్ /జోన్ మీద ఆధారపడి కో పేమెంట్
digit_special Digit Special

కో పేమెంట్ అంటే ఆరోగ్య బీమా పాలసీ కింద వ్యయ భాగస్వామ్య ఆవశ్యకత. ఈ విధానంలో పాలసీదారుడు/బీమా చేయించుకున్న వ్యక్తి ఒక నిర్దిష్ట శాతాన్ని భరిస్తాడు. ఇది బీమా మొత్తం విలువను తగ్గించదు. ఈ శాతం వయసు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. లేదా కొన్ని సార్లు జోన్ ఆధారిత కోపేమెంట్ అని పిలువబడి మీరు చికిత్స చేయించుకునే నగరం ఉన్న జోన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మా ప్లాన్స్​లో ఎటువంటి జోన్ బేస్డ్ లేదా ఏజ్ బేస్డ్ కో పేమెంట్స్ లేవు.

ఎటువంటి కో పేమెంట్ లేదు
ఎటువంటి కో పేమెంట్ లేదు
ఎటువంటి కో పేమెంట్ లేదు
రోడ్ అంబులెన్స్ ఖర్చులు

మీరు ఆసుపత్రిలో చేరితే రోడ్ అంబులెన్స్ ఖర్చులు కూడా రీయింబర్స్ చేయబడతాయి.

బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 10,000 వరకు.
బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 15,000 వరకు.
బేస్ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్లో 1శాతం. గరిష్టంగా రూ. 10,000 వరకు.
ప్రీ/పోస్ట్ హాస్పిటలైజేషన్

ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే మొత్తం ఖర్చులకు ఈ కవర్ వర్తిస్తుంది. వివిధ రకాల నిర్దారణ పరీక్షలు, టెస్టులు, మరియు రికవరీల కోసం

30/60 రోజులు
60/180 రోజులు
60/180 రోజులు

ఇతర ప్రయోజనాలు

ముందే నిర్దారణ అయిన వ్యాధికి(PED) వెయిటింగ్ పీరియడ్

మీరు ఇప్పటికే బాధపడుతున్న వ్యాధి లేదా పరిస్థితికి మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

3 సంవత్సరాలు
3 సంవత్సరాలు
3 సంవత్సరాలు
నిర్దిష్ట అనారోగ్యం కొరకు వెయిటింగ్ పీరియడ్

నిర్దిష్ట అనారోగ్యాన్ని క్లెయిమ్ చేసుకోవడం కొరకు మీరు వేచి ఉండాల్సిన సమయం ఇది. డిజిట్ వద్ద ఇది రెండు సంవత్సరాలు ఉంటుంది. పాలసీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇది మొదలవుతుంది. మినహాయింపుల పూర్తి జాబితా కొరకు మీ పాలసీ వార్డింగ్స్​లోని స్టాండర్డ్ ఎక్స్​క్లూజన్స్ (Excl02) చూడండి.

2 సంవత్సరాలు
2 సంవత్సరాలు
2 సంవత్సరాలు
ఇన్​బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్

పాలసీ పీరియడ్​ వ్యవధిలో మీ శరీరానికి గాయం అయి 12 నెలల లోపు అదే మీ చావుకు గల కారణం అయితే మేము పాలసీ షెడ్యూల్​లో పేర్కొన్నట్లు బీమా మొత్తంలో 100 శాతం చెల్లిస్తాం. ఈ కవర్ ప్లాన్ ప్రకారం తీర్మానించబడుతుంది.

₹ 50,000
₹ 1,00,000
₹ 1,00,000
అవయవ దాత ఖర్చులు
digit_special Digit Special

మీకు అవయవాలను దానం చేసే వ్యక్తి మీ పాలసీలో కవర్ చేయబడతాడు. అతడు ఆసుపత్రిలో చేరే ముందు లేదా చేరిన తర్వాత అయ్యే ఖర్చులను మేము భరిస్తాం. అవయవ దానం అనేది గొప్ప దానాలలో ఒకటి. ఎందుకు అందులో భాగం కాకూడదని మేమూ అనుకున్నాం.

డొమిసిలియరీ హాస్పిటలైజేషన్

ఆసుపత్రలలో పడకలు అయిపోవచ్చు. లేదా ఆసుపత్రిలో చేరేందుకు రోగి పరిస్థితి సహకరించకపోవచ్చు. ఆందోళన పడకండి. మీరు ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకున్నా సరే వైద్య ఖర్చులను మేము భరిస్తాం.

బారియాట్రిక్ సర్జరీ

ఊబకాయం అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చు. మేము దీనిని అర్థం చేసుకున్నాం. మీకు బేరియాట్రిక్ సర్జరీ వైద్య పరంగా అవసరమైనపుడు లేదా మీ డాక్టర్ సిఫారసు చేసినపుడు దానిని కూడా కవర్ చేస్తాం. అయితే మీరు ఈ చికిత్సను చేయించుకునేది సౌందర్య కారణాల కోసం అయితే మేము కవర్ చేయం.

మానసిక అనారోగ్యం

గాయం కారణంగా, లేదా ఇతర కారణాల వల్ల ఒక సభ్యుడు ఆసుపత్రిలో చేరవలసి వస్తే ఈ ప్రయోజనం కింద రూ. 1,00,000 కవర్ చేయబడుతుంది. అయితే OPD కన్సల్టేషన్స్ దీని పరిధిలోనికి రావు. సైక్రియాట్రిక్ ఇల్​నెస్ కవర్ కోసం వెయిటింగ్ పీరియడ్ నిర్దిష్ట ఇల్​నెస్ వెయిటింగ్ పీరియడ్​తో సమానంగా ఉంటుంది.

కన్స్యూమబుల్స్ కవర్

ఆసుపత్రిలో చేరే ముందు కానీ తర్వాత కానీ నడక కోసం సహాయం చేసేవి, క్రేప్ బ్యాండేజెస్, పట్టీలు వంటి ఇతర అనేక రకాల వైద్య సహాయకాలు మరియు ఖర్చులు ఉన్నాయి. ఇవి మీ పాకెట్ అటెన్షన్​ను క్యాచ్ చేస్తాయి. ఈ కవర్ పాలసీ నుంచి మినహాయించబడిన ఈ ఖర్చుల గురించి మొత్తం చూసుకుంటుంది.

యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది
యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది
యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంటుంది

ఏమేం కవర్ కావు?

ప్రీ–నేటల్​, పోస్ట్​–నేటల్​ ఖర్చులు

ఆస్పత్రిలో చేరక ముందు అయ్యే ప్రీ–నేటల్​, పోస్ట్​–నేటల్​ మెడికల్​ ఖర్చులు కవర్​ కావు.

ముందునుంచే ఉన్న వ్యాధులు

ఒకవేళ మీకు ముందు నుంచే ఉన్న వ్యాధులు ఏవైనా ఉంటే వాటి వెయిటింగ్​ పీరియడ్​ ముగిసేవరకు మీరు క్లెయిమ్​ చేయలేరు.

డాక్టర్​ సిఫారసు లేకుండా ఆస్పత్రిలో చేరితే

మీరు ఆస్పత్రిలో చేరిన కారణానికి డాక్టర్​ సిఫారసుకు మ్యాచ్​ కాకపోతే అది పాలసీ క్లెయిమ్​లో కవర్​ కాదు.

డిజిట్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్​లో ఉండే ముఖ్య ప్రయోజనాలు

కో పేమెంట్

లేదు

రూం రెంట్ క్యాపింగ్

లేదు

క్యాష్​లెస్ హాస్పిటల్స్

ఇండియా వ్యాప్తంగా 10500 కంటే ఎక్కువ నెట్​వర్క్ హాస్పిటల్స్

ఇన్​బుల్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్

అవును

వెల్​నెస్ బెనిఫిట్స్

10 కంటే ఎక్కువ వెల్​నెస్ పార్ట్​నర్ల నుంచి లభ్యం

సిటీ ద్వారా వచ్చే డిస్కౌంట్

10 శాతం వరకు డిస్కౌంట్

వరల్డ్​వైడ్ కవరేజ్

అవును*

గుడ్ హెల్త్ డిస్కౌంట్

5% శాతం వరకు డిస్కౌంట్

కన్య్సూమబుల్ కవర్

యాడ్ ఆన్​గా అందుబాటులో ఉంది.

*కేవలం వరల్డ్​వైడ్ ట్రీట్​మెంట్​ ప్లాన్​లో మాత్రమే లభ్యమవుతాయి. 

ఆల్ ఈజ్ వెల్- ఆరోగ్య కస్టమర్లందరికీ వెల్నెస్ ప్రయోజనాలు

డిజిట్‌తో ఆరోగ్య ఇన్సూరెన్స్ ను ఎలా కొనుగోలు చేయాలి?

డిజిట్‌తో మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా రెన్యూవాల్ చేయాలి?

క్లెయిమ్​ ఎలా ఫైల్​ చేయాలి?

Digit Health Insurance Claims
  • రీయింబర్స్​మెంట్​ క్లెయిములు​  – మీరు ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల్లోపు 1800-258-4242 నెంబర్​పై మాకు ఫోన్​ చేయండి. లేదా healthclaims@godigit.com అనే మెయిల్​కు ఈమెయిల్​ చేయండి. మేము మీకు సంబంధించిన ఆస్పత్రి బిల్లుల​ను అప్​లోడ్​ చేసేందుకు ఒక లింకును పంపుతాం. ఈ డాక్యుమెంట్లతో మీ రీయింబర్స్​మెంట్​ క్లెయిమ్​ ప్రాసెస్​ అవుతుంది.
  • క్యాష్​లెస్​ క్లెయిములు  – మీకు క్యాష్​లెస్​ క్లెయిమ్​ కావాలంటే అందుకోసం మీరు మా నెట్​వర్క్​ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. నెట్​వర్క్​ ఆస్పత్రికి వెళ్లి అక్కడ మీ ఈ-హెల్త్​ కార్డును ఆస్పత్రి హెల్ప్​ డెస్క్​లో చూపిస్తే వారు మీకు క్యాష్​లెస్​ రిక్వెస్ట్​ ఫామ్​ను అందిస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ క్లెయిమ్​ పరిష్కరించబడుతుంది.
  • మీరు కనుక కరోనా వైరస్​కు సంబంధించిన చికిత్స గురించి క్లెయిమ్​ చేస్తే పాజిటివ్​ టెస్ట్​ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టును మీరు ఐసీఎంఆర్​ (ICMR) ద్వారా గుర్తించబడిన అధీకృత సెంటర్ల ద్వారా చేయించుకోవాల్సి ఉంటుంది.

Cashless Hospitals by Digit

డిజిట్​ క్యాష్​లెస్​ నెట్​వర్క్​ ఆస్పత్రుల జాబితా

భారతదేశ వ్యాప్తంగా మాకు  16400+ కంటే ఎక్కువ ఆస్పత్రులు ఉన్నాయి.

 

హెల్త్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ ఎలా పని చేస్తుంది?

భారతదేశంలోని వివిధ రకాల హెల్త్​ ఇన్సూరెన్స్​ ఆప్షన్లు

ఫ్యామిలీ ఫ్లోటర్​ హెల్త్​ ఇన్సూరెన్స్​

ఫ్యామిలీ ఫ్లోటర్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ అనేది మొత్తం ఫ్యామిలీకి సంబంధించినది. ఈ పాలసీలో టోటల్​ ఫ్యామిలీ కవర్​ అవుతుంది.

వ్యక్తిగత (ఇండివిడ్యువల్​) హెల్త్​ ఇన్సూరెన్స్​

వ్యక్తిగత (ఇండివిడ్యువల్​) హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ అనేది కేవలం ఒకే వ్యక్తి కోసం రూపొందించబడింది.

వయోవృద్ధులకు హెల్త్​ ఇన్సూరెన్స్​

సీనియర్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ అనేది ప్రధానంగా వృద్ధుల కోసం రూపొందించబడింది. 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న వారికి ఇది అనువైనది.

సూపర్​ టాప్–అప్​ హెల్త్​ ఇన్సూరెన్స్​

సూపర్​ టాప్​–అప్​ ప్లాన్​ మీ కార్పొరేట్​ ప్లాన్​ కోటా పూర్తయినపుడు మీ జేబు నుంచి డబ్బులు చెల్లించకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

గ్రూప్​ మెడికల్​ ఇన్సూరెన్స్​

మీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగస్తుల కోసం గ్రూప్​ మెడికల్​ ఇన్సూరెన్స్​ అవసరం.

మెటర్నిటీ హెల్త్​ ఇన్సూరెన్స్

మెటర్నిటీ హెల్త్​ ఇన్సూరెన్స్​ అనేది మెటర్నిటీ ఖర్చుల కోసం బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే మెటర్నిటీ ఖర్చులు ఉంటాయో వారు ఈ ప్లాన్​ తీసుకోవాలి.

పర్సనల్​ యాక్సిడెంట్​ ఇన్సూరెన్స్

అనుకోని సందర్భాల్లో అయ్యే ప్రమాదాల నుంచి పర్సనల్​ యాక్సిడెంట్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని కాపాడుతుంది.

ఆరోగ్య సంజీవని పాలసీ

డబ్బుకు విలువ ఇచ్చే వారి కోసం ఈ ఆరోగ్య సంజీవని పాలసీ రూపొందించబడింది

కరోనా కవచ్

కరోనాతో ఆస్పత్రిలో చేరినపుడు అయ్యే ఖర్చుల నుంచి ఈ ప్లాన్​ మిమ్మల్ని రక్షిస్తుంది.

కరోనా రక్షక్​

ఇది కూడా ఒక రకమైన కరోనా వైరస్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీయే. ఈ పాలసీలో కరోనా వైరస్​ చికిత్సకు అయిన ఖర్చులను మొత్తం చెల్లిస్తారు.

భారతదేశంలో పెరుగుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాప్యత మరియు అవగాహన

మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు పొందాలి?

మీ హెల్త్ కోసం పెట్టుబడి పెట్టండి: హెల్త్ కవరేజ్ యొక్క ప్రాముఖ్యతను చూపించే దృశ్యాలు

హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి సరైన వయస్సు

నేను ఆన్‌లైన్‌లోనే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?

ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం అనేది క్విక్ ప్రాసెసింగ్ మరియు కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు.
డిజిటల్ స్నేహపూర్వక ప్రక్రియలకు ధన్యవాదాలు, హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం అంటే భౌతికంగా ఫారమ్‌లను పూరించడం లేదా ఏజెంట్‌ని సందర్శించడం వంటి వాటితో పోల్చితే అది జీరో టచ్ మరియు కాంటాక్ట్‌లెస్.
మీ మునివేళ్లపై ఉన్న మొత్తం సమాచారంతో, మీరు మీ హోమ్ వద్దే సౌకర్యంతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లను సులభంగా విశ్లేషించవచ్చు మరియు సరైన నిర్ణయం తీసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వల్ల మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కొంత డబ్బు ఆదా అవుతుంది, ఎందుకంటే ఇందులో మధ్యవర్తులు ఎవరూ ఉండరు.
చాలా మంది ఇన్సూరెన్స్ సంస్థలు వారి మొబైల్ యాప్‌లో మీరు యాక్సెస్ చేయగల వెల్‌నెస్ సేవలను కూడా అందిస్తాయి. వీటిలో హోమ్ హెల్త్‌కేర్, టెలి కన్సల్టేషన్, యోగా మరియు మైండ్‌ఫుల్‌నెస్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు మరియు మరెన్నో తగ్గింపులు, సేవలు మరియు ఆఫర్‌లు ఉన్నాయి.

హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80D కింద ట్యాక్స్ ఆదా చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన పెరుగుతున్న వైద్య ఖర్చుల నుండి మీ జేబును ఆదా చేయడమే కాకుండా ట్యాక్స్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు ట్యాక్స్ ఆదా చేసుకునే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

స్వీయ, జీవిత భాగస్వామి మరియు పిల్లలకు చెల్లించే ప్రీమియం ద్వారా ట్యాక్స్ ఆదా చేయండి

ఇన్కమ్ టాక్స్ ఆక్ట్, 1961లోని సెక్షన్ 80D ప్రకారం, మీరు మీ తక్షణ ఆధారపడిన వ్యక్తులను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి చెల్లించిన ప్రీమియంపై ₹25,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ లను పొందవచ్చు. మీరు సీనియర్ సిటిజన్ అయితే, ఈ పరిమితి రూ. 50,000 వరకు ఉంటుంది. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ స్వంత పాలసీకి చెల్లించే ప్రీమియంపై ట్యాక్స్ డిడక్షన్ లను పొందవచ్చు.

తల్లిదండ్రులకు చెల్లించే ప్రీమియం ద్వారా ట్యాక్స్ ఆదా చేయండి

మీరు మీ తల్లిదండ్రుల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి చెల్లించిన ప్రీమియంపై కూడా ట్యాక్స్ డిడక్షన్ లను క్లయిమ్ చేయవచ్చు. మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే, మీరు ₹50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ లను క్లయిమ్ చేయవచ్చు మరియు వారు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, మీరు వారి పాలసీకి చెల్లించిన ప్రీమియంపై ₹25000/- వరకు డిడక్షన్ క్లయిమ్ చేయవచ్చు. ఇది ట్యాక్స్ డిడక్షన్ లలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది.

ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌లపై ట్యాక్స్ ఆదా చేయండి

సెక్షన్ 80D కింద, మీకు, మీ జీవిత భాగస్వామికి, పిల్లలు మరియు వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు నివారణ ఆరోగ్య పరీక్షల ఖర్చు కోసం మీరు రూ. 5,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ లను క్లయిమ్ చేయవచ్చు. అంటే మీరు రెగ్యులర్ చెక్-అప్‌లను పొందడం ద్వారా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అదే సమయంలో ట్యాక్స్ ను కూడా ఆదా చేసుకోవచ్చు.

సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు సరళీకృతం చేయబడ్డాయి

వెయిటింగ్​ పీరియడ్

మీరు హెల్త్​ పాలసీలోని ప్రయోజనాలను పొందేందుకు ఎదురు చూడాల్సిన సమయాన్ని వెయిటింగ్​ పీరియడ్​ అంటారు.

 

పేమెంట్​

మీ బిల్లుల్లో మీరు కొంత భాగం చెల్లించే విధానాన్ని కో-పేమెంట్​ అంటారు. కొన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు ఈ విధానాన్ని పాటిస్తాయి.

ప్రీ–ఎగ్జిస్టింగ్​ డిసీజెస్

మీరు హెల్త్​ పాలసీ తీసుకునే కంటే ముందే మీలో గుర్తించబడిన లేదా మీరు చికిత్స చేయించుకున్న వ్యాధులను ప్రీ ఎగ్జిస్టింగ్​ డిసీజెస్​ అంటారు.

డే కేర్​ ప్రొసీజర్స్​

24 గంటలకు తగ్గకుండా ఆసుపత్రిలో చేరి ఉంటేనే హెల్త్​ పాలసీలు వర్తిస్తాయి. ఈ విధానాలను డే కేర్​ ప్రొసీజర్స్​ అంటారు.

ప్రీ-హాస్పిటలైజేషన్​ ఖర్చులు

మెడికల్​ బిల్లులు​ అంటే మీరు ఆస్పత్రిలో ఉన్నందుకు చెల్లించాల్సిన మొత్తం. మీరు ఆస్పత్రిలో చేరక ముందు అయ్యే వైద్య ఖర్చులను ప్రీ–హాస్పిటలైజేషన్ ఖర్చులు అంటారు. ఉదా: వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం అయ్యే ఖర్చుల వంటివి...

క్యుములేటివ్​ బోనస్

మీరు ఏడాది పొడవునా ఎటువంటి క్లెయిములు​ చేయకుండా ఉంటే మీ ఇన్సూరెన్స్​ కంపెనీ మీకు క్యుములేటివ్​ బోనస్​ కింద మీ ఇన్సూరెన్స్​ మొత్తాన్ని పెంచుతుంది. ఇందుకు మీరు ఎటువంటి అదనపు ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు.

డిడక్టబుల్​

కొన్ని రకాల హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీల్లో మీకు క్లెయిమ్​ రావాలంటే కొంత మొత్తాన్ని మీరు జేబు నుంచి భరించాల్సి ఉంటుంది. దీనినే డిడక్టబుల్​ అంటారు. ఈ అమౌంట్​ అనేది మీరు పాలసీ తీసుకునే సమయంలోనే ఎంత ఉండాలనేది నిర్ధారించబడుతుంది.

ఇన్సూరెన్స్​ మొత్తం

ఒక సంవత్సరంలో మీ హెల్త్​ పాలసీ కవర్​ చేసే గరిష్ట మొత్తాన్నే ఇన్సూరెన్స్​ మొత్తం లేదా సమ్​ ఇన్సూర్డ్​ వాల్యూ అంటారు.

పోర్టబిలిటీ

హెల్త్​ ఇన్సూరెన్స్​లో పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మీరు మీ ప్రస్తుత హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీతో సంతృప్తిగా లేని సమయంలో మీకు పోర్టబిలిటీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎటువంటి ప్రయోజనాలను కోల్పోకుండా కంపెనీ మారే అవకాశం ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్లాన్లను పోల్చడానికి సలహాలు, సూచనలు

మీ హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు

సరైన ఇన్సూరెన్స్​ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?

హెల్త్​ ఇన్సూరెన్స్​ కొనుగోలు చేసేందుకు చిట్కాలు​

మీకు ఏ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ సరైనది

సరైనమెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎంచుకోవడం చాలా కష్టమైన పని. విభిన్న దృశ్యాలలో సరైన ప్లాన్‌ను ఎంచుకోవడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి:

హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రసిద్ధ అపోహలు

భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు