ఇండియా టుడే అనే మేగజైన్లో ప్రచురితమైన ఇటీవలి నివేదికల ప్రకారం, 2018-19లో భారతదేశంలో సగటు రిటైల్ హెల్త్‌కేర్ ద్రవ్యోల్బణం 7.14%. ఇది అంతకుముందు ఉన్న 4.39% కన్నా బాగా పెరిగింది, దీన్నిబట్టి హెల్త్‌కేర్ ప్రోడక్టుల ధరలలో పెరుగుదలగా వేగవంతంగా ఉందని అర్థం అవుతోంది. (1)
దీన్నిబట్టి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇకపై కేవలం ముందుజాగ్రత్తగా మిగిలిపోదు. కానీ, సమర్థ మెడికల్ కేర్ విషయంలో భారీ ఆర్థిక నష్టాలు జరగకుండా నివారించడానికి ఇది ఒక ఆవశ్యకమైనదిగా మారింది.
ఇప్పుడు, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందుతున్నారని అనుకోండి, దాని గురించి మీరు తెలుసుకోవలసిన మొదటి విషయం ఏంటి?
కచ్చితంగా ప్రీమియం చెల్లింపు గురించే కదా!
మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా లెక్కించవచ్చు, దాన్ని ప్రభావితం చేసే అంశాలు, మీరు దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దానిపై వివరణ!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ అంటే ఏమిటి?
సాంకేతికత అందుబాటులోకి రావడంతో చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆన్‌లైన్‌లోకి మార్చుకున్నాయి. వారు పాలసీదారులకు విషయాలను సులభం చేసే వివిధ ఉపయోగకరమైన ఆన్లైన్ టూల్స్‌ను ప్రవేశపెట్టాయి!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్ మీ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని ఒక్క క్షణంలో లెక్కించడానికి ఉపయోగపడే టూల్!
ప్రీమియం మొత్తాన్ని లెక్కించడం చాలా కష్టమైన పని కాబట్టి, చాలా మంది వ్యక్తులు తమ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు సూచించిన మొత్తంపై మాత్రమే ముందుక వెళ్తారు. కానీ, ఆన్లైన్ క్యాలుక్యులేటర్ సహాయంతో, కొన్ని అవసరమైన వివరాలను అందించడం ద్వారా ప్రీమియం మొత్తాన్ని నిమిషాల వ్యవధిలో లెక్కించవచ్చు.