హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా తగ్గించుకోవాలి

డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమాదానికి గురై, అనారోగ్యం బారినపడి, లేదా కోవిడ్​-19 వలన ఆసుపత్రిలో చేరితే కవర్ చేస్తుంది. మీ డిజిట్ పాలసీని రెన్యూవల్ చేయండి.

I agree to the  Terms & Conditions

Port my existing Policy

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గించుకోవడం గురించి క్లుప్తంగా..

మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకునే 9 మార్గాలు

కో పేమెంట్

డిడక్టబుల్

కో-ఇన్సూరెన్స్

మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్​ను క్లెయిమ్ చేసినపుడు ఆ ఖర్చులో కొంత భాగాన్ని మీరు భరించే విధంగా కో పేమెంట్ ఆప్షన్ ఉంటుంది.

మీ చికిత్స ఖర్చులకు ఇన్సూరెన్స్ పాలసీ కంట్రిబ్యూట్ చేసే ముందే డిడక్టబుల్స్ స్టార్ట్ అవుతాయి. ఇది ఫిక్డ్​గా ఉంటుంది.

కో ఇన్సూరెన్స్ అనేది కొన్ని సార్లు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల చేత కో పే అని కూడా యూజ్ చేయబడుతుంది.

కో పే అమౌంట్ అనేది ఫిక్డ్​గా ఉంటుంది. కానీ వివిధ సర్వీసులను బట్టి ఇది మారుతూ ఉంటుంది.

ఇన్సూరెన్స్ పాలసీ మీ బిల్లులో ఎక్కువ మొత్తాన్ని కవర్ చేస్తుంది.

కో ఇన్సూరెన్స్​లో మీరు చికిత్స ఖర్చులో కొంత మొత్తాన్ని మీరు భరించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మిగతా అమౌంట్​ను భరిస్తుంది. కో ఇన్సూరెన్స్ విషయంలో ఎటువంటి లిమిట్ నిర్ణయించబడలేదు.

మీకు ఇప్పుడు వీటి గురించి మొత్తం తెలుసు కాబట్టి మీ హెల్త్ ఇన్సూరెన్స్​లకు తక్కువ ప్రీమియం చెల్లించేందుకు వీటిని ఉపయోగించుకోండి.

మీరు ఈ విధానం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు ఈ ఖర్చు పంచుకునే ఆప్షన్లను అందించే ఆరోగ్య బీమా పాలసీలను మీరు పోల్చి చూడాల్సి ఉంటుంది.

మీరు సరైన విధంగా కో–పే, డిడక్టబుల్స్ ఎంచుకోకపోతే మీరు మీ చికిత్స ఖర్చుల కోసం మీ ప్రీమియంల మీద ఆదా చేసిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

 

కో–పే, కో–ఇన్సూరెన్స్, డిడక్టబుల్ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి.

జోన్ A

జోన్ B

జోన్ C

ఢిల్లీ/NCR, ముంబై (నేవీ ముంబై, థానే, కల్యాణ్ కూడా)

హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగుళూరు, కోల్​కతా, అహ్మదాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగుళూరు, కోల్​కతా, అహ్మదాబాద్, వడోదరా, చెన్నై, పూనే, మరియు సూరత్

జోన్​ A, B లలో లేని నగరాలన్ని జోన్​ C కి చెందుతాయి

ప్రీమియం విలువ అటూ ఇటుగా రూ. 6,448

ప్రీమియం విలువ అటూఇటుగా రూ. 5,882

దాదాపుగా ₹5,315 ప్రీమియం

 

అందువలన మీరు నివసించే జోన్​లోనే పాలసీని తీసుకోవడం మంచిది. ఉదాహరణకు: మీరు జోన్ B లేదా C నగరాల్లో నివసిస్తూ జోన్ A పాలసీని తీసుకోవడం వలన మీరు అధిక ప్రీమియాన్ని చెల్లించాల్సి వస్తుంది. కావున సరైన జోన్​ను ఎంచుకోవడం వలన మీరు మరింత ప్రభావవంతంగా పాలసీ ప్రీమియంలను చెల్లించేందుకు వీలుంటుంది.

పారామీటర్స్

ఇండివిజువల్ ప్లాన్స్

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్

అప్లికబులిటీ

ఈ ప్లాన్ కింద ఒకే ఇన్సూరెన్స్ కింద కుటుంబ సభ్యులందరికీ సమ్ ఇన్సూర్డ్ నిర్ణయించబడుతుంది.

ఈ ప్లాన్​లో ఒక వ్యక్తి టోటల్ చికిత్స ఖర్చును కవర్ చేయడం కోసం మొత్తం బీమా విలువను వాడేందుకు అవకాశం ఉంటుంది.

ప్రీమియం పేమెంట్

ఈ రకమైన పాలసీకి ప్రీమియం అనేది దాని కింద కవర్ చేయబడిన వ్యక్తులను బట్టి వారి వయసును బట్టి నిర్ణయించబడుతుంది.

ఇటువంటి సందర్భంలో చాలా హెల్త్ ఇన్సూరెన్స్​ల ప్రీమియం కవర్ చేయబడిన కుటుంబంలోని పెద్ద వ్యక్తి వయసు మీద ఆధారపడి ఉంటాయి.

ధరల్లో తేడా

ప్రతి పాలసీ ప్రీమియం పేమెంట్​ చాలా ఎక్కువగా ఉంటుంది.

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ తీసుకుంటే ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కంటే పాలసీ ధర దాదాపు 20 శాతం మేర తక్కువగా ఉంటుంది.

 

పైన ఉన్న పట్టికను మీరు కనుక గమనిస్తే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్​లు ఇండివిజువల్ ప్లాన్​ల కంటే చాలా చౌకగా ఉన్నాయని అర్థం అవుతోంది.

మీరు మీ కుటుంబం మొత్తానికి సరిపోయే ప్లాన్ల గురించి చూస్తుంటే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్​ ఎంచుకోవడం మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం వలన మీరు బీమా ప్రీమియాన్ని తగ్గించుకోవచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవడం గురించి తరచూ అడిగే ప్రశ్నలు