చాలా మంది తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా లెక్కిస్తారని సందేహపడుతుంటారు. వివిధ రకాల అంశాలు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. అవేంటంటే..
1. మీ వయసు: వయసులో ఉన్న వారికి వయసు మళ్లిన వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. యుక్త వయసులో ఉన్నవారు వృద్ధుల కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. చిన్నవారైతే మెటర్నిటీ ప్రయోజనాలు పొందడానికి, తీవ్రమైన అనారోగ్య సమస్యల వెయిటింగ్ పీరియడ్ పూర్తి చేయడానికి మీకు అంత ఎక్కువ సమయం ఉంటుంది. మీరు ఎంత చిన్నవారైతే మీ పాలసీ అంత తక్కువ ఉంటుంది. చాలా మంది యుక్త వయసులో ఉండగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవమని ఎందుకు సూచిస్తారో మీకు ఇప్పుడు అర్థం అయి ఉంటుంది.
2. లైఫ్ స్టైల్: ప్రస్తుత రోజుల్లో ప్రతీది మన లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మన ఆరోగ్యం కూడా మన జీవన విధానంతో ముడిపడి ఉంటుంది. మనకు మంచి, చెడు రెండు రకాల అలవాట్లు ఉంటాయి. అందుకే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మీ లైఫ్ స్టైల్ మీద ఆధారపడుతుంది.
కావున పాలసీ తీసుకునేటపుడు ప్రతి విషయాన్ని నిజాయతీగా ఒప్పుకోండి. మీరు జిమ్‌కు వెళ్తారా? లేదా? మీరు ధూమపానం చేస్తారా? లేదా? అనే విషయాలు కచ్చితంగా తెలియజేయండి. ఒకవేళ మీరు తప్పుడు వివరాలు సమర్పిస్తే భవిష్యత్‌లో క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.
3. దీర్ఘకాలిక వ్యాధులు లేదా పరిస్థితులు: మీకు 48 నెలల ముందు నుంచే ఉన్న వ్యాధుల గురించి పాలసీ పాలసీ కొనేముందే లేదా పునరుద్ధరించే ముందే తెలియజేయాలి. మీకు ఉన్న అనారోగ్యం, పరిస్థితి, లేదా గాయం స్థితిని బట్టే మీ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించబడుతుంది.
4. ప్రాంతం: మీరు జీవించే ప్రాంతాన్ని బట్టి కూడా మీ పాలసీ ప్రీమియం నిర్ణయించబడుతుంది. వివిధ రకాల నగరాల్లో కాలుష్య స్థాయులు వివిధ రకాలుగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం కూడా వేరుగా ఉంటుంది. ఆయా నగరాల్లో వైద్య ఖర్చులు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో జీవించే ఎక్కువ మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశ నగరాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది.
5. యాడ్-ఆన్స్, కవర్లు: మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు, మీ జీవన విధానానికి అనువైనదని నిర్ధారించుకునేందుకు, మీ వ్యక్తిగత ఆరోగ్య బీమా మీకు అదనపు రక్షణగా కొన్ని ప్రత్యేకమైన కవర్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
ఆ కవర్లలో క్రిటికల్ ఇల్నెస్ కవర్, మెటర్నిటీ, ఇన్ఫర్టిలిటీ ప్రయోజనం మొదలైనవి ఉంటాయి. మీరు ఎంచుకునే కవర్లను బట్టి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభావితం అవుతుంది.