మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్

మెటర్నిటీ కవరేజ్‌ & బెనిఫిట్లతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్
Happy Couple Standing Beside Car
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}

I agree to the  Terms & Conditions

Port my existing Policy
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
{{healthCtrl.otpError}}
Didn't receive SMS? Resend OTP

I agree to the  Terms & Conditions

Port my existing Policy

YOU CAN SELECT MORE THAN ONE MEMBER

{{healthCtrl.patentSelectErrorStatus}}

  • -{{familyMember.multipleCount}}+ Max {{healthCtrl.maxChildCount}} kids
    (s)

DONE
Renew your Digit policy instantly right
Loader

Analysing your health details

Please wait moment....

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక యాడ్‌-ఆన్‌ కవర్‌. ప్రసవానికి సంబంధించిన ఖర్చులన్నీ కవర్‌ చేసే దీనిని ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో భాగంగా ఎంచుకోవచ్చు.

ప్రస్తుత లేదా కొత్త హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్ కలిగిన ఎవరైనా ఈ ప్రయోజనాన్ని తమ కోసం లేదా తమ భాగస్వామి కోసం తీసుకోవచ్చు. తద్వారా సమయం వచ్చినప్పుడు శిశువు జననానికి సంబంధించి అయ్యే ఖర్చులన్నీ మరియు/లేదా గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యల చికిత్స లేదా వైద్యపరంగా గర్భాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే వాటిని కవర్‌ చేసే ఆ బాధ్యతను మేము తీసుకుంటాం.

అంతే కాదు, ఈ కవర్‌ ద్వారా ఫర్టిలిటీ సమస్యలకు అయ్యే ఖర్చులు, వైద్యపరమైన సంక్లిష్టతల కారణంగా నవజాత శిశువును ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ ఖర్చులు, ప్రసవం తర్వాత 90 రోజుల వరకు అయ్యే వ్యాక్సిన్‌ ఖర్చులన్నీ ఇది కవర్ చేస్తుంది.

ఎందుకంటే ఇలాంటి ఘట్టాలు జీవితంలో ప్రతీ రోజు జరగవు కదా!

మీరు మొదటి శిశువు లేదా రెండో వారి కోసం ప్రణాళికలు వేసుకోవడమన్నది జీవితంలో అతి పెద్ద విషయం. తల్లిదండ్రులు కాబోతుండటం, ఇంటికి కొత్త వ్యక్తి రాబోతుండటం అన్ని కూడా ఎంతో అందంగా ఉంటాయి. అదే సమయంలో అది జీవితంలో సవాళ్లతో కూడిన సమయం కూడా. ఆనందం, గాబరా, అనిశ్చితి, అశాంతి, ఆందోళన, సంతోషం అన్నీ కలగలిపి ఉంటాయి.

మీరు త్వరలో కుటుంబాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నా లేదా మీ ప్రస్తుత బిడ్డకు తోబుట్టువుల బంధాన్ని అందించినా, ప్రసూతి దశ, ప్రసవం, దానితో పాటు వచ్చే ప్రతిదీ తరచూ ఒత్తిడిని కలిగిస్తుంది. దానిలో మీకు సహాయం చేసేందుకే మేము ఇక్కడ ఉన్నాము. అన్నింటికంటే ప్రణాళిక లేని వాటి కోసం మాత్రమే కాకుండా, ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేయడమే ఎల్లప్పుడూ మంచిది.

Read More

భారతదేశంలో పెరుగుతున్న మెటర్నిటీ ఖర్చులు

Maternity Costs
చాలా నగరాల్లో బిడ్డను ప్రసవించడానికి అయ్యే సగటు ఖర్చు కనీసం రూ. 50,000 నుంచి రూ.70,000 వరకు ఉంటుంది.
C Section
భారతదేశంలో C-సెక్షన్ డెలివరీల ఖర్చు ఇటీవలి కాలంలో పెరుగుతోంది. అనేక పట్టణాలు, నగరాల్లో ఖర్చులు రూ. 2 లక్షల వరకు పెరుగుతున్నాయి!
Pregnancy Test
భారతదేశంలోని చాలా జంటలు దానితో వచ్చే ఆర్థిక బాధ్యతల కారణంగా తల్లిదండ్రులు కావాలంటే భయపడుతున్నారు.

డిజిట్ అందించే మెటర్నిటీ బెనిఫిట్ కవర్ లోని గొప్ప అంశాలు ఏమిటి?

  • పిల్లల డెలివరీ ఖర్చులను కవర్ చేస్తుంది: గర్భధారణ సంబంధిత సంక్లిష్టతలు, లేబర్, డెలివరీ, C-సెక్షన్ ఆపరేషన్ల కొరకు ఆసుపత్రిలో చేరితే అయ్యే ఛార్జీలను కవర్ చేస్తుంది.
  • నవజాత శిశువు కవర్ చేర్చబడింది: మా మెటర్నిటీ బెనిఫిట్ లో నవజాత శిశువు కూడా కవర్ అవుతుంది. అంటే మీ బిడ్డ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మొదటి 90 రోజులు కవర్ చేయబడుతుంది! దీనిలో మెడికల్ సమస్యలు, వ్యాక్సినేషన్లు కూడా ఉంటాయి.
  • వంధ్యత్వ ఖర్చులు కవర్ చేయబడుతుంది: మా మెటర్నిటీ బెనిఫిట్ పిల్లల డెలివరీ ఖర్చుల కొరకు కవర్ చేయడమే కాదు, వంధ్యత్వానికి సంబంధించిన చికిత్సలను కూడా కవర్ చేస్తుంది.
  • వైద్యపరంగా అవసరమైన ప్రెగ్నెన్సీ టర్మినేషన్లు కవర్ అవుతాయి: దురదృష్టవశాత్తు, ఒకవేళ మీరు వైద్యపరంగా అవసరమైన ప్రెగ్నెన్సీ టర్మినేషన్ (గర్భ విచ్ఛిత్తి) చేయాల్సి వస్తే, మీ మెటర్నిటీ బెనిఫిట్ కవర్ మీ వెన్నంటి ఉంటుంది!
  • రెండో బిడ్డ కొరకు 200% ఇన్సూరెన్స్ చేయబడే మొత్తం: కృతజ్ఞతా చిహ్నంగా, మీ రెండో బిడ్డ కొరకు మీ మెటర్నిటీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని 200% వరకు మేం మీకు పెంచుతాం. తమ మొదటి బిడ్డ కొరకు డిజిట్ అందించే మెటర్నిటీ బెనిఫిట్ ను ఇప్పటికే ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.

డిజిట్ మెటర్నిటీ కవర్ ద్వారా తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏమేం కవర్ అవుతాయి?

డెలివరీ, లేబర్ ఖర్చులు

డెలివరీ, లేబర్ ఖర్చులు

బిడ్డను ప్రసవించేటప్పుడు, రెండు డెలివరీల వరకు అయ్యే అన్ని వైద్య ఖర్చులు (ఇన్సూర్ చేయబడిన మొత్తం వరకు).

C-సెక్షన్

C-సెక్షన్

సిజేరియన్, సాధారణంగా C-సెక్షన్ అని కూడా అంటారు. శిశువుల డెలివరీకి సర్జరీ చేసినా కూడా మెటర్నిటి బెనిఫిట్ కవర్ కింద కవర్ చేయబడుతుంది. బిడ్డ లేదా తల్లి ఆరోగ్యం, స్వస్థత కొరకు సాధారణ డెలివరీ సిఫారసు చేయబడనప్పుడు దీనిని తరచుగా ఎంచుకుంటారు.

హాస్పిటల్, రూమ్ రెంట్

హాస్పిటల్, రూమ్ రెంట్

బిడ్డ డెలివరీ సమయంలో ఆసుపత్రిలో చేరడానికి, రూమ్ రెంట్ ఛార్జీలకు అయ్యే అన్ని ఖర్చులు.

వ్యంధత్వ చికిత్స

వ్యంధత్వ చికిత్స

మీరు లేదా మీ భాగస్వామి వ్యంధత్వ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటూ, మీరు గనక ఈ కవర్‌ ఎంచుకొని ఉంటే, ఆ వ్యంధత్వ చికిత్సకు అయ్యే ఖర్చులను మేము కవర్ చేస్తాం.

గర్భ సంబంధిత సమస్యలు

గర్భ సంబంధిత సమస్యలు

దురదృష్టవశాత్తు కొందరు మహిళలు గర్భం ధరించిన తర్వాత సమస్యలు ఎదుర్కొంటారు. వాటిని ఇది కవర్‌ చేస్తుంది. గర్భానికి సంబంధించి తలెత్తే సమస్యలకు సంబంధించిన ఖర్చులన్నీ ఈ మెటర్నిటీ బెనిఫిట్‌ కింద కవరవుతాయి.

వైద్యపరంగా తప్పనిసరి తొలగింపు

వైద్యపరంగా తప్పనిసరి తొలగింపు

వైద్యపరంగా, చట్టపరంగా అవసరమైన అన్ని తొలగింపులు ఇందులో కవరవుతాయి. ప్రసవం తరహాలో కాకుండా ఇలాంటి సందర్భాల్లో సంఖ్యాపరంగా ఎటువంటి ఆంక్షలు ఉండవు.

నవజాత శిశువును కవర్ చేస్తుంది

నవజాత శిశువును కవర్ చేస్తుంది

ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది శిశువు ప్రసవం వరకే పరిమితం కాదు. శిశువుకు పుట్టాక 90 రోజుల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం అందిస్తుంది. అంటే వారికి ఏమైనా వైద్యపరమైన సమస్యలు, వ్యాక్సినేషన్‌ ఖర్చులన్నీ అందులో కవరవుతాయి.

కవర్ కానివి ఏంటి?

భవిష్యత్తులో తలెత్తుతాయని భావించే అనారోగ్యాలను నివారించేందుకు స్టెమ్‌ సెల్స్‌ కోత, వాటి నిల్వకు సంబంధించిన ఖర్చులు.

ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ కారణంగా తలెత్తే వైద్యపరమైన ఖర్చులు ఈ మెటర్నిటీ బెనిఫిట్‌ కవర్‌ వెలుపలికి వస్తాయి. అంటే ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఆస్పత్రిలో చేరిక ఖర్చుల కిందకు వస్తాయి.

ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా తలెత్తే ప్రీ-నాటర్‌, పోస్ట్ నాటల్‌ వైద్య ఖర్చులు.

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

  • క్యాష్‌లెస్‌ క్లెయిమ్-  మీరు మా 10500+ క్యాష్‌లెస్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోదలిస్తే దీన్ని ఎంచుకోవచ్చు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల పూర్తి జాబితాను ఇక్కడ మీరు చూడవచ్చు. మీ ఈ-హెల్త్ కార్డును హాస్పిటల్‌ హెల్ప్‌ డెస్క్‌లో చూపించి క్యాష్‌లెస్‌ రిక్వెస్ట్ ఫామ్‌ కోసం అడగండి. అన్ని సవ్యంగా ఉంటే ఆ క్లెయిమ్ అప్పటికప్పుడు ప్రాసెస్‌ అవుతుంది.
  • రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్: మీకు నచ్చిన ఆస్పత్రికి సంబంధించి మీరు రీయింబర్స్‌మెంట్‌ ఎంచుకోవచ్చు. ఆస్పత్రిలో చేరినట్టు అయితే చేరిన రెండు రోజుల్లోపు మాకు 1800-258-4242కు కాల్‌ చేసి లేదా  health claims@godigit.com ఈమెయిల్‌  చేసి తెలియజేయవచ్చు. మీకు మేము లింకు పంపిస్తాము. మీ రీయింబర్స్‌మెంట్‌ ప్రాసెస్‌ చేసేందుకు మీ ఆస్పత్రి బిల్లులు, సంబంధిత పత్రాలన్నీ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

మెటర్నిటీ కవర్ ద్వారా ఎవరికి బెనిఫిట్ ఉంటుంది?

దిగువ తెలిపిన ప్రమాణాలు కలిగి ఉంటే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లో మెటర్నిటీ యాడ్‌-ఆన్ కవర్‌ ద్వారా వారు లబ్ది పొందవచ్చు.

మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు సమయంలో ఆ కవరేజీని ఎంచుకున్నా లేదా తర్వాత దశలో దాన్ని చేర్చుకున్నా.

మీరు 24 నెలల వెయిటింగ్‌ సమయం పూర్తి చేసిన తర్వాతే మీరు ఈ మెటర్నిటీ కవర్‌ క్లెయిమ్ చేసి ప్రయోజనం పొందగలుగుతారు.

మీకు వివాహమై మీరు < 40 సంవత్సరాల్లోపు ఉంటే

మీరు ఇంతకు ముందే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల కోసం దీన్ని ఉపయోగించనట్టయితే.

వీరికి మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్రయోజనకరం

1
వచ్చే రెండు లేదా మూడేళ్లలో కుటుంబాన్ని మొదలుపెడతామని భావించే కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు
2
త్వరలో వివాహం చేసుకొని వచ్చే రెండు లేదా మూడేళ్లలో శిశువును కనాలని భావిస్తున్నవారు
3
ఇప్పటికే ఒక సంతానం ఉండి వచ్చే రెండేళ్లలో మరో శిశువు కనాలని భావిస్తున్నవారు
4
ఇప్పట్లో పిల్లల గురించి ఆలోచన చేయకపోయినా, భవిష్యత్‌ కోసం సురక్షితంగా ఉండదలిచిన వారు

యువ దంపతులకు మెటర్నిటీ బెనిఫిట్ ఎందుకు అంత ముఖ్యం?

ఆర్థిక భద్రత

ఆర్థిక భద్రత

మీ జీవితంలోని అత్యంత మధురమైన క్షణాల్లో ఆర్థికంగా సురక్షితంగా ఉండండి. మీ హెల్త్ ఇన్సూరెన్స్ లో మెటర్నిటీ బెనిఫిట్ కవర్ అయి ఉంటే తల్లిదండ్రులుగా మారబోతున్నన వేళ ఒత్తిడి లేని ప్రసవాన్ని అందుకోవడంతో పాటు మీ పొదుపు నుంచి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.

తల్లిదండ్రులు కాబోతున్న వేళ ప్రశాంతత

తల్లిదండ్రులు కాబోతున్న వేళ ప్రశాంతత

మెటర్నిటీ బెనిఫిట్ కవర్‌ కేవలం ప్రసవ ఖర్చులను మాత్రమే కవర్‌ చేయదు, వాటితో పాటు నవజాత శిశువుకు మొదటి 90 రోజుల (వైద్యపరంగా ఏమైనా సమస్యలు లేదా అవసరమైన వ్యాక్సినేషన్లు) వరకు కవర్ చేస్తుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటూ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

విలువైన దీర్ఘకాలపు బెనిఫిట్లు

విలువైన దీర్ఘకాలపు బెనిఫిట్లు

మీ రెండో సంతానం కోసం 200% వరకు పెంపుదల ఉంచుకోండి. మా ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, మెటర్నిటీ బెనిఫిట్‌ కవర్‌ కింద మీరు ఇదే మెటర్నిటీ ప్రయోజనాన్ని మొదటి దాని కోసం ఉపయోగించినట్టు అయితే రెండో సంతానం కోసం ఆ ఇన్సూరెన్స్ మొత్తాన్ని 200% వరకు మీరు అందుకోవచ్చు.

వైద్యపరంగా తప్పనిసరైన తొలగింపులకు కవరేజ్

వైద్యపరంగా తప్పనిసరైన తొలగింపులకు కవరేజ్

అవసరమైన సందర్భాల్లో గర్భాన్ని వైద్యపరంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే దాన్ని కవర్‌ చేసే ఆప్షన్ ఉంది. మేము అందించే మెటర్నిటీ బెనిఫిట్ కవరేజ్ లో వైద్యపరంగా తప్పనిసరి గర్భం తొలగింపు, చట్టపరంగా తప్పనిసరి గర్భ తొలగింపు కూడా ఉన్నాయి.

మనశ్శాంతి

మనశ్శాంతి

మనశ్శాంతి. మన పిల్లలే మనకు అంతులేని సంతోషం. ఆ సంతోషాన్ని ఖర్చుల చికాకు దూరం చేయకుండా మేము చూస్తాం. మేము మిమ్మల్ని కవర్‌ చేస్తాం.

మెటర్నిటీకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి

మెటర్నిటీ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)