హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో అనేక సార్లు కాపాడుతుంది. ఎటువంటి మెడికల్ ఖర్చులయినా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతాయి. ప్రస్తుత రోజుల్లో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నాయి. వెరిఫికేషన్, ప్రీమియం పేమెంట్లు మొత్తం ఆన్లైన్లోనే పూర్తవుతున్నాయి.
కింద పేర్కొన్న విధంగా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. మొదట మీరు ఏ కంపెనీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు డిజిట్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకుంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందేందుకు కింది స్టెప్స్‌ను ఫాలో కావాలి.
- స్టెప్ 1– అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ ప్రాంతం పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయాలి. మీరు ఎంతమందికి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని భావిస్తున్నారో ఎంటర్ చేయండి. మీ పేరెంట్స్‌కు కావాల్సిన ఆప్షన్లను ఎంచుకోవాలి.
- స్టెప్ 2 – మీ తల్లిదండ్రుల పుట్టినరోజు వివరాలను ఎంటర్ చేయాలి.
- స్టెప్ 3 – కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయండి.
- స్టెప్ 4 – ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.
- స్టెప్ 5 – అక్కడ అడిగిన విధంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి.
- స్టెప్ 6 – మరోసారి మీ పాలసీ వివరాలను సరిచూసుకోవాలి.
- స్టెప్ 7 – ఆన్లైన్లో ప్రీమియం అమౌంట్‌ను చెల్లించాలి.
మీరు పైన ఉన్న స్టెప్స్‌ను పూర్తి చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మీ ఇన్సూరెన్స్ పాలసీ యాక్టివేట్ చేయబడుతుంది. దానికన్నా ముందు మీరు సమర్పించిన అన్ని వివరాలను తనిఖీ చేస్తారు.
దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న మెడికల్ చార్జీలు, మందుల ఖర్చులతో సతమతం కాకుండా ఉండేందుకు మీరు మీ పేరెంట్స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. మీరు ఇతర యాడ్–ఆన్‌లను ఎంచుకొని మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని సురక్షితంగా చూసుకోవచ్చు. వైద్య ఖర్చుల నుంచి ఉపశమనం పొందొచ్చు.