hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ఆన్​లైన్​లో హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీ

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

0% GST on Health Premiums
false

I agree to the Terms & Conditions

Get Exclusive Porting Benefits

0% GST on Health Premiums

I agree to the Terms & Conditions

true

Get exclusive Benefits

health

Check Prices

arrow
×
car

Buy Health Insurance, Up to 20% Discount

Port Existing Policy

Buy a New Health Policy

usp icon

9000+

Cashless Hospitals

usp icon

2.5 Crore+

Lives Insured

usp icon

4.5 Lacs+

Claims Settled

ఫ్యామిలీ ఫ్లోటర్ vs వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్

వ్యక్తిగత మరియు కుటుంబ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్

  • పేరు సూచించినట్లుగా, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక వ్యక్తికి అందించే ఆరోగ్య కవరేజీ; అంటే ఇది మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను ఒక ప్లాన్‌లో కవర్ చేయదు కానీ అన్ని ఆరోగ్య ప్రయోజనాలను కవర్ చేస్తూ మీకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ప్లాన్‌ను అందిస్తుంది. 

  • మీరు వృద్ధులైన మీ తల్లిదండ్రులను రక్షించాలనుకుంటే (ఆరోగ్య పరిస్థితులు మరియు పర్యవసానంగా ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఆరోగ్య ఖర్చులు రెండింతలు పెరుగుతాయి కాబట్టి) లేదా మీ వ్యక్తిగత ఆరోగ్య అవసరాలకు రక్షణ కల్పించడానికి ప్లాన్ కోసం మాత్రమే చూస్తున్నట్లయితే ఈ రకమైన ప్లాన్ ఉత్తమంగా పని చేస్తుంది. 

  • మీ వార్షిక పన్ను ప్రయోజనాల కోసం వెదుకుతుంటే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ (మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు లేదా మీ సీనియర్ తల్లిదండ్రులకు అయినా) అది మీ ఆర్థిక ప్రణాళికలను బలోపేతం చేయడంలో మాత్రమే కాకుండా, మీ అతి గొప్ప ఆస్థి అయిన ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుందని మీరు తెలుసుకుంటారు! 

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్

ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్

ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్

  • ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను ఒక ప్లాన్ కింద రక్షించే హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్; ఇందులో వార్షిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు సం ఇన్స్యూర్డ్ కుటుంబ సభ్యులందరికీ పంచబడుతుంది. 

  • నేటి ఆరోగ్య ఖర్చులతో వచ్చే ఆర్థిక భారం కారణంగా భారతదేశంలోని కుటుంబాలు తరచుగా ఒత్తిడికి గురవుతున్నాయి. అటువంటి సందర్భాలలో, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆర్థికంగా మరియు మొత్తం ఆరోగ్యం రెండింటికీ ఒక స్మార్ట్ ఎంపికగా ఉంటుంది.

  • ఉదాహరణకి; మీ ఫ్యామిలీ ఫ్లోటర్ కవర్ రూ. 4 లక్షలు మరియు మీరు నలుగురు సభ్యుల కుటుంబం అనుకోండి. ఇప్పుడు అవసరమైతే, ఎవరైనా ఒక సభ్యుడు వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఈ మొత్తం 4 లక్షలను ఉపయోగించవచ్చు లేదా నలుగురు సభ్యులు అవసరమైనప్పుడు సం ఇన్స్యూర్డ్ అనగా. రూ.4 లక్షలు పరిధిలో ఉండి, తమకు అవసరమైన మొత్తాలను ఉపయోగించవచ్చు. 

  •  ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి మొత్తం ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఉపయోగిస్తే, ఇతరులు ఏమీ ఉపయోగించకుండా మిగిలిపోతారు. ఒక సమూహం కోసం ఇన్సూరెన్స్ కవరేజీని ఉపయోగించుకునే విషయానికి వస్తే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అనువైనది. ఇది ముఖ్యంగా జంటలు మరియు చిన్న కుటుంబాలకు ప్రయోజనకరమైనది మరియు సరిపోతుంది.

ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్

వ్యక్తిగత మరియు కుటుంబ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం

పోలిక

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్

కుటుంబ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్

నిర్వచనం

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక వ్యక్తి కి మాత్రమే కవర్ అవ్వగల ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పథకం. దీనర్థం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు సం ఇన్స్యూర్డ్ రెండూ ఒక వ్యక్తి కోసం మాత్రమే తయారు చెయ్యబడ్డాయి మరియు దాన్ని ఎవరితోనూ పంచుకోలేడు.

ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఒక ప్లాన్‌ను పంచుకునే ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు సం ఇన్స్యూర్డ్ రెండూ సభ్యులందరికీ పంచబడతాయి.

కవరేజ్

ఈ ప్లాన్‌లో ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తికి మాత్రమే ఈ ప్లాన్ కవరేజీని అందిస్తుంది. ఉదాహరణకి; మీరు SI రూ. 10 లక్షల ప్లాన్‌ని తీసుకున్నట్లయితే, మీరు మాత్రమే మొత్తం పాలసీ వ్యవధిలో 10 లక్షల వరకు ప్రయోజనం పొందుతారు.

ప్లాన్‌లో ఇన్సూరెన్స్ చేయబడిన కుటుంబ సభ్యులందరికీ ఈ ప్లాన్ కవరేజీని అందిస్తుంది. ఉదాహరణకి; మీ ప్లాన్ SI రూ. 10 లక్షలు అయితే, పాలసీ వ్యవధి కోసం మొత్తం కుటుంబం ఈ మొత్తాన్ని పంచుకోవాలి.

ప్రయోజనాలు

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పథకం యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, సం ఇన్స్యూర్డ్ ప్లాన్‌లో ఇన్సూరెన్స్ చేయబడిన వారందరికీ పంచబడే ఫామిలీ ఫ్లోటర్ లో లా కాకుండా, ప్రతి వ్యక్తికి వారి స్వంత ఇన్సూరెన్స్ మొత్తాన్ని కలిగి ఉండటం వలన కవరేజీ మరింత విస్తృతంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా సీనియర్ తల్లిదండ్రులకు బాగా పని చేస్తుంది.

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఎందుకంటే కుటుంబ సభ్యులందరికీ ఒకేసారి ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.

ప్రతికూలతలు

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఏకైక ప్రతికూలత ఏమిటంటే, ఒక పాలసీ సంవత్సరంలో భీమా మొత్తం వారిని కవర్ చేయడానికి తగినంతగా ఉంటుంది. అంతే కాకుండా, వారు సంవత్సరంలో క్లెయిమ్ చేయకపోతే, వారు నో క్లెయిమ్ బోనస్ నుండి ప్రయోజనం పొందవచ్చు 😊

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ యొక్క ప్రధాన ప్రతికూలతలలో ఒకటి, సం ఇన్స్యూర్డ్ కుటుంబ సభ్యులందరికీ సరిపోకపోవచ్చు.

ఉదాహరణ

ఒక 30 ఏళ్ళ పని చేసే మహిళ తనకు మరియు తన సీనియర్ తండ్రి కోసం వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవాలని ఎంచుకుంటుంది. ఆమె SI 5 లక్షల వరకు వ్యక్తిగత ప్లాన్‌ను ఎంచుకుంటుంది. అంటే, ఆమెకు మరియు ఆమె తండ్రి ఇద్దరికీ ఏడాది పొడవునా వారి ఆరోగ్య అవసరాల కోసం ఒక్కొక్కరికి 5 లక్షలు ఉంటుంది.

ఇద్దరు పిల్లలతో ఉన్న జంట ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకుంటారు; దీని కింద నలుగురు సభ్యులు మొత్తం ఇన్సూరెన్స్ మొత్తాన్ని తమలో తాము పంచుకోవాలి. ఉదాహరణకి; వారు SI 5 లక్షల ప్లాన్‌ని తీసుకున్నట్లయితే, వారు సంవత్సరంలో వారందరి ఆరోగ్య క్లెయిమ్‌ల కోసం 5 లక్షల వరకు మాత్రమే ఉపయోగించగలరు.

ఐచ్చిక ఎంపిక

పెద్ద కుటుంబాలకు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ బాగా సిఫార్సు చేయబడింది. అలాగే సీనియర్ తల్లిదండ్రులు ఉన్నవారికి ఫ్యామిలీ ఫ్లోటర్‌ సరిపోకపోవచ్చు.

ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక యువ జంట లేదా చిన్న మరియు న్యూక్లియర్ కుటుంబాలకు బాగా పని చేస్తుంది.

చిట్కాలు & సిఫార్సులు

మీరు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం వెళుతున్నట్లయితే, ప్రతి సభ్యునికి కూడా సంబంధిత యాడ్-ఆన్‌లను ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఉదాహరణకి; మీరు మీ తల్లిదండ్రుల కోసం వ్యక్తిగత ప్లాన్‌ని తీసుకుంటే, మీ ప్లాన్‌లో చేర్చడానికి ఆయుష్ యాడ్-ఆన్ సిఫార్సు చేయబడిన యాడ్-ఆన్ అవుతుంది.

మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ని ఎంచుకోబోతున్నట్లయితే, ఎక్కువ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంపిక చేసుకోండి, ఎందుకంటే ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం కుటుంబ సభ్యులందరికీ సరిపోతుందని మీరు నిర్ధారించుకోవాలి.

 

ముగింపు

రెండింటిలో ఒకదానిని ఎంచుకున్నప్పుడు, ప్రీమియం ఒక్కదాన్ని మాత్రమే పరిగణించకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే, ఫ్యామిలీ ఫ్లోటర్ సం ఇన్స్యూర్డ్ కుటుంబాన్ని ఒకే పాలసీలో కవర్ చేస్తుంది మరియు వ్యక్తిగత ఇన్సూరెన్స్ ఆయా వ్యక్తులకు మాత్రమే కవరేజీని అందిస్తుంది. కుటుంబ సభ్యులందరినీ కవర్ చేయడం మరియు రెండు పాలసీల గరిష్ట ప్రయోజనాలను పొందడం సరైన విధానం. రెండింటిపై మీ పరిశోధన చేయండి మరియు మీకు మరియు మీ కుటుంబానికి ఏది ఉత్తమమైనదో దాని ఎంపిక చేయండి.