ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ, మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కలిసి మెలిసి ఉంటాయి. అంటే, మీ ఐడివి ఎంత ఎక్కువగా ఉంటే, మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది - అలాగే, మీ వాహనం వయస్సు, ఐడివి తగ్గుతున్న కొద్దీ, మీ ప్రీమియం కూడా తగ్గుతుంది.
అలాగే, మీరు మీ కారును అమ్మాలని నిర్ణయించుకున్నప్పుడు, ఎక్కువ ఐడివి ఉంటే దానికి మీరు ఎక్కువ ధరను పొందుతారు. కారును ఉపయోగించిన విధానం, కారుకు సంబంధించిన గతంలోని ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల ఎక్స్‌పీరియెన్స్ మొదలైన ఇతర అంశాల వల్ల కూడా ధర ప్రభావితం కావచ్చు.
కాబట్టి, మీరు మీ కారు కోసం సరైన కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకుంటున్నప్పుడు, ప్రీమియంను మాత్రమే కాకుండా అందించబడుతున్న ఐడివి ని కూడా సరి చూసుకోండి.
తక్కువ ప్రీమియం అందించే కంపెనీ మిమ్మల్ని ఆకర్షించవచ్చు. కానీ దానికి కారణం ఆ ఆఫర్లో ఐడివి తక్కువగా ఉండటమే. ఐడివి ఎక్కువగా ఉంటే మీ కారును మొత్తంగా నష్టపోయిన సందర్భంలో అధిక కంపెన్సేషన్ పొందవచ్చు.
ఐడివి ని తగ్గించడం/పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు?
ఎక్కువ ఐడివి: ఎక్కువ ఐడివి అంటే ఎక్కువ ప్రీమియం. అయితే, మీరు ఇన్సూర్ చేసుకున్న కారును పోగొట్టుకున్నప్పుడు లేదా కారు దొంగిలించబడినప్పుడు మీరు పరిహారం కూడా ఎక్కువగానే పొందుతారు.
తక్కువ ఐడివి: తక్కువ ఐడివి అంటే తక్కువ ప్రీమియం. అయితే, ప్రీమియంపై మీరు చేసే ఈ కొద్దిపాటి సేవింగ్, మీరు ఇన్సూర్ చేసుకున్న కారును పోగొట్టుకున్నప్పుడో లేదా కారు దొంగిలించబడినప్పుడో మీకు పెద్ద నష్టంగా మారవచ్చు.