8 Crore+ Customers
Affordable Premium
24X7 రోడ్సైడ్ అసిస్టెన్స్ అంటే ఏమిటి?
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ లేదా టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో మీరు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లేదా బ్రేక్ డౌన్ కవర్ అనే యాడ్-ఆన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇది మీరు రోడ్డు మీద ఇరుక్కుపోయినప్పుడు, మీకు ఎప్పుడు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కావాలన్నా అప్పుడు మీకు సహాయపడుతుంది.
ఇది చిన్న ప్రమాదం జరిగినా లేదా టైర్ ఫ్లాట్ అయినా, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ మీకు సాయం చేస్తుంది. ఇలాంటి ఇబ్బందికర సమయంలో మీరు క్లెయిమ్ చేయడానికి వీలుకాకపోయినా మీకు సహాయం మాత్రం అందుతుంది.
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ ధర ఎంత?
కాంప్రహెన్సివ్ కార్ లేదా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో స్టాండర్డ్ మినిమమ్ అడిషన్ని మీ ప్రీమియంకు జోడించడం ద్వారా మీరు రోడ్‌సైడ్ లేదా బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ కవర్‌ని తీసుకోవచ్చు. డిజిట్‌తో కార్కు మీరు రూ. 102 అదనంగా, టూ-వీలర్‌కి రూ. 40 అదనంగా చెల్లించడం ద్వారా దీనిని పొందవచ్చు.
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ ఎలా పని చేస్తుంది?
మీరు ఇప్పటికే మీ డిజిట్ కార్ లేదా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో రోడ్‌సైడ్/బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ కవర్‌ని ఎంచుకున్న తర్వాత, అవసరమైన సమయాల్లో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ను ఉపయోగించడం సులభం!
ఇబ్బందికర సమయాల్లో (మీకు సేవ అవసరమైనప్పుడు) మీరు చేయాల్సిందల్లా 1800-103-4448 నంబర్‌పై మాకు రింగ్ ఇడమే. అయితే, అప్పుడు మీ పాలసీ వివరాలను అందుబాటులో ఉంచుకోవడం మర్చిపోకండి. ఏ సమయంలోనైనా మేము మీకు అండగా ఉంటాము.
డిజిట్‌తో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ 24x7 సపోర్ట్‌తో వస్తుంది. సౌలభ్యం (కన్వీనియెన్స్), లేబర్ ఖర్చులను కూడా ఇది చూసుకుంటుంది. మేము మీ నగరం నుంచి 500 కిలోమీటర్ల వరకు మీకు సేవలను అందిస్తాము (ఇతర కంపెనీలు కేవలం 100 కిలోమీటర్లు మాత్రమే)
కవర్‌లో ఏమేం కవర్ అవుతాయి - RSA వివరాల్లోకి వెళదాం పదండి
RSA కింద మీ కార్ ఇన్సూరెన్స్ లేదా బైక్ ఇన్సూరెన్స్‌కి అదనంగా ఏమేం కవర్ అవుతాయనే విషయాలను మేము కింద మీకు అందించాం. మొత్తానికి మీరు మీ కవరేజీలలోని వివరాలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం, కాబట్టి మీరు రోడ్‌సైడ్ లేదా బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ కవర్ యొక్క ప్రయోజనాలను స్పష్టంగా అర్థం చేసుకుంటారు.
రోడ్సైడ్ అసిస్టెన్స్కు సంబంధించి గుర్తుంచుకోవాల్సిన మినహాయింపులు, ఇతర విషయాలు
మేము మా నిబంధనలు, షరతుల విషయంలో చాలా ముందంజలో ఉన్నాము. తద్వారా క్లెయిమ్‌ల విషయానికి వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. డిజిట్ అందించే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌కు సంబంధించి, మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:
- మా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ క్లెయిమ్‌గా పరిగణించబడనప్పటికీ, మీరు ఒక పాలసీ సంవత్సరంలో గరిష్టంగా 4 సార్లు ఈ కవర్‌ను ఉపయోగించవచ్చు.
- మీరు మీ పాలసీ కాలంలో 2 సార్ల వరకు ఫ్యూయల్ అసిస్టెన్స్ పొందవచ్చు.
- మీకు వేరే ఏ ఇతర అవకాశం లేనప్పుడు మాత్రమే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ ఉపయోగించాలి. ఉదాహరణకు; మీ వాహనాన్ని సమీపంలోని వర్క్‌షాప్ లేదా డీలర్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా బదిలీ చేయగలిగితే, అటువంటి సందర్భంలో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వర్తించదు.
- మీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ రిపేర్, లేబర్ ఖర్చులకు కూడా వర్తిస్తుంది. అయితే, ప్రమాదం జరిగిన ప్రదేశంలో కేవలం 45 నిమిషాల వరకు మాత్రమే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వర్తిస్తుంది.
- అన్ని కార్, బైక్ క్లెయిమ్‌ల మాదిరిగానే, మీరు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా సరైన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే మీరు కవర్ చేయబడలేరు.
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ని ఎవరు తీసుకోవాలి?
మోటార్ ఇన్సూరెన్స్‌లో 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ విలువైనదేనా?
నా కారుకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ పొందడానికి నాకు ఎంత ఖర్చవుతుంది?
నా టూ-వీలర్ కోసం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ పొందడానికి నాకు ఎంత ఖర్చవుతుంది?
రోడ్సైడ్ అసిస్టెన్స్ కోసం క్లెయిమ్ చేయడం నా నో క్లెయిమ్ బోనస్‌పై ప్రభావం చూపుతుందా?
రోడ్సైడ్ అసిస్టెన్స్ కార్లను అన్‌లాక్ చేయడంలో సహాయపడుతుందా?
నేను రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నాను. RSA కవర్‌లో నేను ఏమి చూడాలి?
- సులభంగా కాంటాక్ట్ అవడం: మీరు మీ కారుతో ఇబ్బందిలో ఉన్నప్పుడు, మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీని సులభంగా సంప్రదించగలరని నిర్ధారించుకోవాలి. అందుకే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌లో చూడవలసిన వాటిలో ఒకటి మీరు మీ ఇన్సూరెన్స్ సంస్థను ఎంత సులభంగా చేరుకోగలరు అనేది.
- టైమింగ్స్: సమస్యలు అనేవి చెప్పకుండానే వస్తాయి! అందుకే మీ ఇన్సూరెన్స్ కంపెనీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 24x7 సపోర్ట్‌తో అందించబడుతుందా లేదా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి!
- కవరేజ్మొ: త్తానికి, మీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ మీకు ప్రయోజనాలు, కవరేజీలను అందించాలి. అందువల్ల అందించే కవరేజ్ ప్రయోజనాలు ఏమిటో, అవి మీకు ఉపయోగపడుతాయో లేదో చెక్ చేసుకోవాలి.
- సర్వీస్ ప్రయోజనాలు: బేసిక్ కవరేజ్ కన్నా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయో చూడండి. దీని సాయంతో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోండి.