కాంప్రహెన్సివ్ vs థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్

ఆన్​లైన్​లో బైక్​ ఇన్సూరెన్స్​ కోట్​ పొందండి.
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

కాంప్రహెన్సివ్​, థర్డ్​ పార్టీ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ మధ్య తేడా ఏమిటి?

Difference between Comprehensive and Third-Party Bike Insurance

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​

అసలేంటి?

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీలో మీకు థర్డ్​ పార్టీ లయబిలిటీ ప్లాన్,​ ఓన్​ డ్యామేజ్​ కవర్​ లభిస్తాయి. దీంతో మీ బండి చాలా సురక్షితంగా ఉంటుంది.

మోటార్​ వాహనాల చట్టం–1988 ప్రకారం ప్రతీ వాహనానికి థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ తప్పనిసరి. ఇది థర్డ్​ పార్టీకి జరిగిన డ్యామేజీలను కవర్​ చేస్తుంది.

కవరేజీ​ వివరాలు​

ఈ పాలసీలో మీకు ఎక్కువ కవరేజీ​ లభిస్తుంది. దొంగతనాలు, డ్యామేజీల నుంచి మీ బండి రక్షించబడుతుంది. ఈ పాలసీ మీ బండికి జరిగిన అన్ని రకాల డ్యామేజీల నుంచి కాపాడుతుంది. వ్యక్తిగత, బండి, లేదా ప్రాపర్టీకి నష్టం జరిగినా కానీ కవర్​ అవుతుంది.

ఈ పాలసీ పరిమిత కవరేజిని అందిస్తుంది. థర్డ్​ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ థర్డ్​ పార్టీ వ్యక్తులు, ప్రాపర్టీలకు జరిగిన డ్యామేజీలను మాత్రమే కవర్​ చేస్తుంది.

యాడ్​–ఆన్స్​

ఈ పాలసీలో మీరు ఎన్నో ప్రయోజనాలున్న యాడ్​–ఆన్​ కవర్స్​ను ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. ఉదా. జీరో డిప్రిషియేషన్​ కవర్​, రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్​, రోడ్​ సైడ్​ అసిస్టెన్స్​, కంజూమబుల్​ కవర్​ మొదలగునవి

ఈ పాలసీ కేవలం పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​ను మాత్రమే అందిస్తుంది.

దేన్ని కొనుగోలు చేయాలి?

మీ బండికి యాడ్​–ఆన్స్​తో కూడిన పూర్తి కవరేజీ కావాలనుకుంటే మీరు ఈ పాలసీని కొనుగోలు చేయండి.

మీరు చాలా తక్కువ సందర్భాల్లో బండి నడిపేవారైతే, లేదా మీ బండి చాలా పాతదైతే మాత్రమే ఈ పాలసీని తీసుకోవాలి.

ప్రీమియం ధర

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం కన్నా ఎక్కువగా ఉంటుంది.

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

 

కాంప్రహెన్సివ్​, థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం:

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రయోజనాలు

మీ బైక్​ డ్యామేజీలను కవర్​ చేస్తుంది

ఎక్కువ మంది ప్రజలు కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఇది వారి సొంత వాహనం డ్యామేజీలు,​ నష్టాల​ను కూడా కవర్​ చేయడమే. దీంతో మీకు డబ్బు ఆదా కావడంతో పాటు నిశ్చింతగా ఉండొచ్చు.

థర్డ్​ పార్టీ లయబిలిటీల నుంచి కాపాడుతుంది

అచ్చంగా థర్డ్​ పార్టీ పాలసీ మాదిరే కాంప్రహెన్సివ్​ పాలసీలో కూడా మీ బైక్​ థర్డ్​ పార్టీ లయబిలిటీల నుంచి కవర్​ అవుతుంది. ఉదాహరణకు, మీ బండి ఎవరి కారుకైనా ఢీకొంటే ఆ సమయంలో కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ మీకు తోడుగా ఉంటుంది.

మీ ఐడీవీ (IDV)ని మీరే కస్టమైజ్​ చేసుకునే అవకాశం

డిజిట్​ అందించే కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ను మీరు ఎంచుకుంటే మీకు బైక్​ ఐడీవీ (IDV)ని మీరే ఎన్నుకునే అవకాశం ఉంటుంది.​ ఐడీవీ (IDV) అనేది మీ బైక్​ మార్కెట్​ విలువను సూచిస్తుంది. డిజిట్​ మీ బండి ఎప్పటికీ ఉత్తమమైనదనే నమ్ముతుంది.

ప్రకృతి విపత్తుల సమయంలో రక్షణ

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ మీ బండిని కేవలం ప్రమాదాల వలన కలిగే డ్యామేజీల​ నుంచి మాత్రమే కాకుండా ప్రకృతి విపత్తుల వలన కలిగే డ్యామేజెల​ నుంచి కూడా కాపాడుతుంది. ఉదా. వరదలు, తుఫానులు వంటి వాటి వలన కలిగే డ్యామేజీలు.

మీ బండి దొంగతనానికి గురయితే నష్టపరిహారం

దురదృష్టవశాత్తు మీ బండి దొంగతనానికి గురైనా కూడా కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని కవర్​ చేస్తుంది. మీకు రిటర్న్​ టు ఇన్​వాయిస్ కవర్​ ఉంటే మీ బండికి చివరి​ ఇన్​వాయిస్​ విలువను మొత్తం పరిహారంగా అందజేయబడుతుంది.

సరసమైన ధరల్లో లభ్యం

చాలా మంది కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​కు థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ కన్నా ఎక్కువ ఖర్చవుతుందని అనుకుంటారు. కానీ, కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​తో పోల్చినపుడు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. మనం మన బైకును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు దానికి ఉత్తమమైన కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడమే మంచిది.

వ్యక్తిగత డ్యామేజీలను కూడా కవర్​ చేస్తుంది!

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్,​ కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​లలో పర్సనల్​ యాక్సిడెంట్​ కవర్​ కూడా అందించబడుతుంది. మీకు టూ వీలర్​ ఉంది కనుక ఇది తీసుకోవడం చాలా అవసరం. (చట్ట ప్రకారం తప్పనిసరి కూడా). ఇది మీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​లో అతి ముఖ్యమైనది. 

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రయోజనాలు

థర్డ్​ పార్టీ లయబిలిటీలను కవర్​ చేస్తుంది

థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ వలన థర్డ్​ పార్టీ వ్యక్తులకు జరిగిన నష్టాలు, డ్యామేజీల​ నుంచి మీరు కాపాడబడతారు. ఇది కేవలం అంతే అందజేస్తుంది.

చట్టం దృష్టి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది

మోటార్​ వాహనాల చట్టం ప్రకారం ప్రతీ వాహనానికి ఇన్సూరెన్స్​ తప్పనిసరి. ప్రతీ వాహనం కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా కలిగి ఉండాలి. ఇలా అయితేనే ఎటువంటి జరిమానాలు లేకుండా మీరు రోడ్​ మీద ప్రయాణించగల్గుతారు.

జరిమానాల బారి నుంచి కాపాడుతుంది

థర్డ్​ పార్టీ బైక్​ ఇన్సూరెన్స్​ ఉంటే మీరు ట్రాఫిక్​ జరిమానాల నుంచి కాపాడబడతారు. ఈ పాలసీ ప్రీమియం ట్రాఫిక్​ జరిమానాల కంటే చాలా తక్కువగానే ఉంటుంది. మీ జేబు​ను సురక్షితంగా ఉంచుకోవడం కోసం ఈ పాలసీ తప్పనిసరి.

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​కు ఎందుకు అప్​గ్రేడ్​ చేసుకోవాలి?

కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్​ కొనుగోలు చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు