థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ధర

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కోట్​ను పొందండి.
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ధరలు

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది బైక్ యొక్క ఇంజిన్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. 2019-20కి, 2022కి ఉన్న ప్రీమియం ధరల్లో వ్యత్యాసాలను గమనించండి

 

ఇంజిన్ కెపాసిటీ

2019-20కి గాను ప్రీమియం, భారతీయ రూపాయల్లో

కొత్త టూవీలర్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్ (జూన్ 1, 2022 నుండి అమలు)

75 ccని మించనివి

₹482

₹538

75 ccని మించినవి కానీ 150 cc కన్నా తక్కువ ఉన్నవి

₹752

₹714

150 ccని మించినవి కానీ 350 cc కన్నా తక్కువ ఉన్నవి

₹1193

₹1366

350 ccని మించినవి

₹2323

₹2804

కొత్త టూవీలర్లకు థర్డ్ పార్టీ ప్రీమియం (5 సంవత్సరాల సింగిల్ ప్రీమియం పాలసీ)

ఇంజిన్ కెపాసిటీ

2019-20కి గాను ప్రీమియం, భారతీయ రూపాయల్లో

కొత్త టూవీలర్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్ (జూన్ 1, 2022 నుండి అమలు)

75 ccని మించనివి

₹1,045

₹2,901

75 ccని మించినవి కానీ 150 cc కన్నా తక్కువ ఉన్న

₹3,285

₹3,851

150 ccని మించినవి కానీ 350 cc కన్నా తక్కువ ఉన్నవి

₹5,453

₹7,365

350 ccని మించినవి

₹13,034

₹15,117

కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) టూవీలర్ కి ప్రీమియంలు (1 సంవత్సరం సింగిల్ ప్రీమియం పాలసీ)

వాహనం కిలోవాట్ కెపాసిటీ (KW)

2019-20కి గాను ప్రీమియం, భారతీయ రూపాయల్లో

కొత్త టూవీలర్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్ (జూన్ 1, 2022 నుండి అమలు)

3KWకి మించనివి

₹410

₹457

3KWకి మించినవి కానీ 7KWకి మించనివి

₹639

₹609

7KWకి మించివని కానీ 16KWకి మించనివి

₹1,014

₹1,161

16KW ని మించినవి

₹1,975

₹2,383

కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) టూవీలర్ కి ప్రీమియంలు (5 సంవత్సరాల సింగిల్ ప్రీమియం పాలసీ)

వాహనం కిలోవాట్ కెపాసిటీ (KW)

2019-20కి గాను ప్రీమియం, భారతీయ రూపాయల్లో

కొత్త టూవీలర్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్ (జూన్ 1, 2022 నుండి అమలు)

3KWకి మించనివి

₹888

₹2,466

3KWకి మించినవి కానీ 7KWకి మించనివి

₹2,792

₹3,273

7KWకి మించివని కానీ 16KWకి మించనివి

₹4,653

₹6,260

16KW ని మించినవి

₹11,079

₹12,849

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

థర్డ్ పార్టీకి వ్యక్తిగత డ్యామేజ్ అయితే

థర్డ్ పార్టీకి వ్యక్తిగత డ్యామేజ్ అయితే

ఒక వ్యక్తి ప్రమాదంలో గాయపడితే అతడు లేదా ఆమె పూర్తిగా కోలుకునే వరకు అయ్యే వైద్య ఖర్చులను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అనుకోని సందర్భంలో ఆ వ్యక్తి మరణిస్తే పరిహారం కూడా అందించబడుతుంది.

ప్రాపర్టీ డ్యామేజ్ పరిహారం

ప్రాపర్టీ డ్యామేజ్ పరిహారం

ఒకవేళ డ్యామేజీ వలన ఒకరి వాహనం లేదా ఇల్లు లేదా ఏదైనా ఆస్తికి నష్టం జరిగితే వారు రూ. 7,50,000 పరిమితి వరకు కవర్ చేయబడతారు.

యజమాని/డ్రైవర్​కు జరిగిన పర్సనల్ డ్యామేజ్

యజమాని/డ్రైవర్​కు జరిగిన పర్సనల్ డ్యామేజ్

ఒక వేళ కారు డ్రైవర్/యజమానికి భౌతిక గాయాలు లేదా మరణం లేదా శాశ్వత అంగవైకల్యం ఎదుర్కొంటే..

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ కావు?

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్​లో ఏం కవర్ అవుతాయో తెలుసుకోవడంతో పాటుగా కవర్ కాని విషయాలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైనా క్లెయిమ్స్ చేసేటపుడు ఎటువంటి గందరగోళం లేకుండా ఉంటుంది.

 

సొంత డ్యామేజీలు

మీరు ఒకవేళ థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న సందర్భంలో సొంత డ్యామేజీలు కవర్ కావు.

 

మద్యం సేవించి వాహనం నడిపినా లేదా లైసెన్స్ లేకుండా నడిపినా

మీరు మద్యం సేవించి వాహనం నడిపినా లేదా సరైన లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా ప్రమాదం అయితే బీమా వర్తించదు.

 

సరైన లైసెన్స్ హోల్డర్ లేకుండా వాహనం నడిపితే

మీరు లెర్నర్ లైసెన్స్ కలిగి ఉండి వెనకాల సీటులో సరైన లైసెన్స్ హోల్డర్ లేకుండా మీరు వాహనం నడిపినప్పుడు ప్రమాదం జరిగితే బీమా వర్తించదు.

 

యాడ్–ఆన్స్ కొనుగోలు చేయకపోతే

కొన్ని రకాల సందర్భాలు యాడ్-ఆన్స్​లోనే కవర్ అవుతాయి. మీరు అటువంటి విధమైన టూ వీలర్ యాడ్ ఆన్స్ కొనుగోలు చేయకపోతే ఆ పరిస్థితులు కవర్ కావు.

 

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యం?