మిగిలిన ఇండస్ట్రీల మాదిరిగానే ఇన్సూరెన్ప్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫాం, మీడియాల్లో బాగా రాణిస్తోంది. మీరు ఈసారి రెన్యువల్ చేయించేటప్పుడు ఆన్లైన్లో చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే:
# సమాయాన్ని ఆదా చేయవచ్చు : రెన్యూకి సంబంధించిన ప్లాన్లను బ్రౌజ్ చేయడానికి, పోల్చడానికి ఆన్లైన్ మంచి వేదిక. ఇక్కడ మీకు నచ్చిన దాని గురించి తెలుసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మీ సమయాన్ని ఆదా చేస్తుంది.
# ప్రీమియంలు తక్కువగా ఉంటాయి : ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఇక్కడ ఇన్సూరర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మీద, ఇతర వాటి మీద ఖర్చు చేయాల్సిన డబ్బు ఆదా అవుతుంది.
# క్విక్, ఈజీ : ఆన్లైన్లో పాలసీని కొనుగోలు చేయడం ఎంతో ఈజీగా ఉంటుంది, త్వరగా జరిగిపోతుంది. మీరు ఎలాంటి సమయాభావం లేకుండా పాలసీలను చెక్ చేయవచ్చు.
# రివ్యూలు : ఇన్సూరెన్స్ కంపెనీ, వారి ప్రొడక్టులపై రివ్యూలు, క్విక్ బైట్లను చూడవచ్చు. ప్రొడక్టుకు సంబంధించి రకరకాల ప్రజల ఉద్దేశాలు, సలహాలను పొందవచ్చు.
# ఇబ్బంది లేని సర్వీస్ : ఆన్లైన్లో ఏజెంట్లు, బ్రోకర్ల బెడద ఉండదు. ఇన్సూరర్ తో మీరు నేరుగా కాంటాక్ట్ కావచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో పాలసీలు తీసుకోవచ్చు.