టూ వీలర్ ఇన్సూరెన్స్

డిజిట్ ఇన్సూరెన్స్‌కి మారండి. 3 కోట్ల మంది భారతీయులు విశ్వసించినది
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

భారతదేశంలో ఆన్‎లైన్‎లో బైక్/టూ వీలర్ ఇన్సూరెన్స్‎ని కొనుగోలు/రెన్యువల్ చేయండి

డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ చేయబడతాయి?

ప్రమాదాలు

ప్రమాదాలు

ప్రమాదం లేదంటే ఢీకొన్నట్లయితే కలిగే డ్యామేజీలు, నష్టాలు

దొంగతనం

దొంగతనం

మీ టూ-వీలర్ అనుకోకుండా దొంగతనానికి గురైతే కవర్ చేస్తుంది!

అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదం

అనుకోకుండా జరిగే అగ్నిప్రమాదం వల్ల మీ టూ-వీలర్​కు సంభవించే డ్యామేజీలు, నష్టాలు

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు

వరదలు, తుఫానులు మొదలైన ప్రకృతి విపత్తుల కారణంగా మీ టూ వీలర్​కు కలిగే నష్టాలు.

పర్సనల్ యాక్సిడెంట్

పర్సనల్ యాక్సిడెంట్

మిమ్మల్ని మీరు తీవ్రంగా గాయపరచుకున్న సందర్భాల్లో మీ ఖర్చులను కవర్ చేస్తుంది!

థర్డ్ పార్టీ నష్టాలు

థర్డ్ పార్టీ నష్టాలు

మీ బైక్ వల్ల ఒక వ్యక్తి, వాహనం లేదా ఆస్తి దెబ్బతిన్నప్పుడు లేదా గాయపడినప్పుడు.

డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌తో ఉన్న యాడ్-ఆన్ కవర్లు

టూ వీలర్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లను మీరు మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో కొనుగోలు చేయవచ్చు

జీరో డిప్రిషియేషన్ కవర్‌

మీ బైక్, దాని భాగాలకు సమర్థవంతమైన యాంటీ ఏజింగ్ క్రీమ్​లాగా భావించండి. సాధారణంగా క్లెయిమ్‌ల సమయంలో అవసరమైన డిప్రిషియేషన్​ (తరుగుదల) మొత్తం ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకోబడుతుంది. అయినప్పటికీ జీరో డిప్రిషియేషన్​ కవర్ ఎటువంటి తరుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా చేస్తుంది. కాబట్టి మీరు క్లెయిమ్‌ల సమయంలో రిపేర్/భర్తీ ఖర్చు యొక్క పూర్తి విలువను పొందుతారు.

రిటర్న్ టు ఇన్​వాయిస్ కవర్

మీ బైక్ దొంగిలించబడినప్పుడు లేదా రిపేర్ చేయలేనంత నష్టానికి గురైతే, ఈ యాడ్-ఆన్ మీకు ఉపయోగపడుతుంది. రిటర్న్ టు ఇన్‌వాయిస్ యాడ్-ఆన్‌తో మేము మీకు అదే బైక్ లేదా అదే మాదిరి బైక్‌ను పొందడానికి అయ్యే ఖర్చులను భర్తీ చేస్తాము- రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులతో సహా.

ఇంజన్ & గేర్-బాక్స్ ప్రొటెక్షన్ కవర్

మీ ఇంజన్‌ను మార్చడానికి అయ్యే ఖర్చు దాని ధరలో దాదాపు 40% అని మీకు తెలుసా? స్టాండర్డ్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో ప్రమాదం వల్ల కలిగే డ్యామేజీలు మాత్రమే కవర్ అవుతాయి. అయితే, ఈ యాడ్-ఆన్‌తో ప్రమాదం తర్వాత సంభవించే ఏవైనా పర్యవసాన నష్టాల కోసం మీరు ప్రత్యేకంగా మీ వాహనాన్ని (ఇంజన్, గేర్‌బాక్స్!) కూడా కవర్ చేయవచ్చు. అది వాటర్ రిగ్రెషన్ కావచ్చు లేదంటే లూబ్రికేటింగ్ ఆయిల్ లీక్ అవడం కావచ్చు లేదా అండర్ క్యారేజ్ డ్యామేజ్ కూడా కావచ్చు.

కంజూమబుల్ కవర్

కంజూమబుల్ కవర్ మీ టూ వీలర్‎కి అదనపు రక్షణను జోడిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు ఇంజన్ ఆయిల్‌, స్క్రూలు, నట్లు, బోల్టులు, గ్రీజు మొదలైనవి వంటి మీ బైక్‌కు సంబంధించిన అన్ని వస్తువుల ఖర్చులను కూడా ఇది కవర్ చేస్తుంది.

బ్రేక్​డౌన్ అసిస్టెన్స్

ఒకవేళ మీ టూ-వీలర్ బ్రేక్​డౌన్ అయితే, మేము ఎల్లప్పుడూ మీతో ఉన్నామని

రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ భరోసా ఇస్తుంది. దీనిలో మంచి విషయమేంటంటే.. మీరు మా సహాయం కోరినా దానిని మేము క్లెయిమ్ కింద పరిగణించము.

టైర్ ప్రొడెక్ట్

రన్ ఫ్లాట్ టెక్నాలజీతో ఫిట్ చేసిన వాహనాలకు మాత్రమే ఈ యాడ్-ఆన్ కవర్ అందించబడుతుంది. దీనిలో భాగంగా, పాడైపోయిన టైర్లను వాహనంలో ఉపయోగించే టైర్లకు సమానమైన లేదా దాదాపు సమానమైన వాటితో మార్చడానికి అయ్యే ఖర్చు, లేబర్ మరియు వీల్ బ్యాలెన్సింగ్ ఛార్జీలను తిరిగి చెల్లించవచ్చు. అయితే యాడ్-ఆన్ కవర్ కింద చేసే క్లైయిమ్ లు వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద పేర్కొన్న షరతులకు లోబడి ఉంటాయి.

డైలీ కన్వేయన్స్ బెనిఫిట్

ఈ యాడ్-ఆన్ కవర్, వర్తించే సమయ పరిమితికి లోబడి టూ వీలర్ రిపేర్ అయ్యే టైంలో మీ రవాణా ఖర్చుకు మీకు పరిహారం చెల్లించబడుతుంది. అయితే ఇన్సూరెన్స్ పాలసీలోని 'ఓన్ డ్యామేజ్' సెక్షన్ కింద యాక్సిడెంటల్ డ్యామేజీ క్లెయిమ్ ను అంగీకరించినట్లయితే మాత్రమే ఇది వర్తిస్తుంది. పాలసీదారునికి రోజుకు ఫిక్స్డ్ అలవెన్స్ లేదా ట్యాక్సీ ఆపరేటర్ల కూపన్ల రూపంలో రోజుకు ఫిక్స్డ్ అలవెన్స్ కు సమానమైన మొత్తాన్ని చెల్లించవచ్చు.

ఏమేం కవర్ కావు?

టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్ కావనే విషయాన్ని కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. దాని వల్ల క్లెయిమ్ సమయంలో మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి కొన్ని సందర్భాలు ఇక్కడ వివరించడం జరిగింది:

థర్డ్-పార్టీ పాలసీదారుడికి సోంత డ్యామేజీలు

థర్డ్-పార్టీ లేదా లయబిలిటీ ఓన్లీ బైక్ పాలసీ విషయంలో, సొంత వాహనానికి జరిగే నష్టాలు కవర్ చేయబడవు.

తాగి నడపడం లేదా లైసెన్స్ లేకుండా నడపడం

మీరు తాగి బండి నడుపుతున్నప్పుడు లేదా సరైన టూ వీలర్ లైసెన్స్ లేకుండా బండి నడిపినప్పుడు, మీ బైక్ ఇన్సూరెన్స్ కవర్ కాదు.

సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి పక్కన లేకుండా బండి నడపడం

మీరు లెర్నర్ లైసెన్స్ కలిగి ఉండి, వెనుక సీటుపై సరైన లైసెన్స్ ఉన్న వ్యక్తి లేకుండా టూ-వీలర్​ను నడిపిన పరిస్థితుల్లో కూడా మీ క్లెయిమ్ కవర్ చేయబడదు.

పర్యవసానంగా జరిగే నష్టాలు

ప్రమాదం యొక్క ప్రత్యక్ష ఫలితం కాని ఏదైనా నష్టం (ఉదాహరణకు, ప్రమాదం జరిగిన తర్వాత, పాడైపోయిన టూ వీలర్​ను తప్పుగా ఉపయోగించినప్పుడు ఇంజన్ పాడైపోయినట్లయితే అది పర్యవసాన నష్టంగా పరిగణించబడుతుంది. అది కవర్ చేయబడదు)

స్వీయ నిర్లక్ష్యం

స్వీయ నిర్లక్ష్యం కారణంగా ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు (ముందే వరద ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం వంటివి)

యాడ్-ఆన్‎లు కొనుగోలు చేకపోతే

కొన్ని పరిస్థితులు యాడ్-ఆన్‌లలో కవర్ చేయబడతాయి. మీరు ఆ యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయకుంటే, సంబంధిత పరిస్థితులు కవర్ చేయబడవు.

డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్‎నే ఎందుకు ఎంచుకోవాలి?

మీ బైక్ ఇన్సూరెన్స్ కేవలం సులభమైన క్లెయిమ్ ప్రాసెస్‎తో మాత్రమే రాలేదు, క్యాష్​లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్​తో కూడా వస్తుంది.

క్యాష్​లెస్ రిపేర్లు

క్యాష్​లెస్ రిపేర్లు

భారతదేశ వ్యాప్తంగా ఉన్న 4400+ క్యాష్​లెస్ నెట్​వర్క్ గ్యారేజీల నుండి మీరు ఎంచుకోవచ్చు

స్మార్ట్​ఫోన్‌ ఆధారిత స్వీయ తనిఖీ

స్మార్ట్​ఫోన్‌ ఆధారిత స్వీయ తనిఖీ

స్మార్ట్​ఫోన్‌ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియ‎తో కూడిన త్వరిత, పేపర్ లెస్ క్లెయిమ్ ప్రక్రియ

వేగవంతమైన క్లెయిమ్​లు

వేగవంతమైన క్లెయిమ్​లు

సగటున టూ-వీలర్ క్లెయిముల కోసం పట్టే సమయం కేవలం 11 రోజులు మాత్రమే.

మీ వాహనం ఐడీవీని కస్టమైజ్ చేసుకోవచ్చు

మీ వాహనం ఐడీవీని కస్టమైజ్ చేసుకోవచ్చు

మాతో మీరు మీ వాహన ఐడీవీని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు!

24*7 సపోర్టు

24*7 సపోర్టు

జాతీయ సెలవు దినాలతో సహా అన్ని రోజుల్లో 24*7 కాల్‌ సదుపాయం

2014 నుండి 2024 వరకు ప్రాంతాల వారీగా, విలువ ప్రకారంటూ వీలర్ ఇన్సూరెన్స్ మార్కెట్ పరిమాణం

డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కీలక ఫీచర్లు

ముఖ్య ఫీచర్లు

డిజిట్ ప్రయోజనం

ప్రీమియం

₹752 నుండి ప్రారంభం

నో క్లెయిమ్ బోనస్

50% వరకు డిస్కౌంట్

కస్టమైజ్ చేసుకోగల యాడ్-ఆన్‎లు

5 యాడ్-ఆన్‎లు అందుబాటులో ఉన్నాయి

క్యాష్ లెస్ రిపేర్లు

4400+ గ్యారేజీల్లో అందుబాటులో ఉంది

క్లెయిమ్ ప్రక్రియ

స్మార్ట్ ఫోన్ ఆధారిత క్లెయిమ్​ ప్రక్రియ. ఆన్‎లైన్‎లో 7 నిమిషాల్లోపే పూర్తవుతుంది.

క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి

97% క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి - కాల వ్యవధి: అక్టోబర్ 2019 నుండి మార్చి 2020 వరకు

ఓన్ డ్యామేజ్ కవర్

అందుబాటులో ఉంది

థర్డ్ పార్టీ డ్యామేజీలు

వ్యక్తిగత డ్యామేజీలకు అపరిమిత లయబిలిటీ, ఆస్తి/వాహన నష్టానికి రూ. 7.5 లక్షల వరకు

మీ అవసరాలకు సరిపోయే టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‎లు

థర్డ్ పార్టీ

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది బైక్ ఇన్సూరెన్స్‌లో అత్యంత సాధారణ రకాల్లో ఒకటి; ఇందులో థర్డ్-పార్టీ వ్యక్తి, వాహనం లేదా ఆస్తికి కలిగే డ్యామేజీలు & నష్టాలు మాత్రమే కవర్ చేయబడతాయి.

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్​ కవర్లు థర్డ్ పార్టీ లయబిలిటీలు, డ్యామేజీలతో పాటు మీ సొంత బైకుకు కలిగే డ్యామేజీలను కూడా కవర్ చేస్తుంది. ఇది విలువైన బైక్ ఇన్సూరెన్స్‎లలో ఒకటి.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసం గురించి మరింత తెలుసుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​ను ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యువల్ చేసిన తర్వాత, మేము 3-స్టెప్పుల, పూర్తిగా డిజిటల్ క్లెయిమ్‌ల ప్రక్రియను కలిగి ఉన్నందున మీరు టెన్షన్ లేకుండా ఉంటారు!

స్టెప్ 1

1800-258-5956కి కాల్ చేయండి. ఎలాంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదు.

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌పై స్వీయ తనిఖీ కోసం లింక్‌ను పొందండి. సూచించిన విధంగా దశలవారీ ప్రక్రియ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుంచే మీ వాహన డ్యామేజీలను ఫొటో చేయండి.

స్టెప్ 3

మీకు నచ్చిన రిపేర్ విధానాన్ని అంటే, రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్‌లెస్‌ని మా నెట్​వర్క్ గ్యారేజీల్లో ఎంచుకోవచ్చు

టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‎లను డిజిట్​ సులభతరం చేసింది

Cashless Garages by Digit

డిజిట్ వారి క్యాష్​లెస్ గ్యారేజీలు

భారతదేశ వ్యాప్తంగా 4400+ గ్యారేజీలలో క్యాష్ లెస్ రిపేర్లు పొందండి

రిపోర్ట్ కర్డ్‌ను

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిములు ఎంత త్వరగా పరిష్కరించబడతాయి?

మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా చేయడం బాగుంది!

డిజిట్ క్లెయిముల రిపోర్ట్ కార్డ్‌ను చదవండి

మా గురించి మా కస్టమర్లు ఏం చెబుతున్నారు

రాజకుమార్

అద్భుతమైన సర్వీస్. అంతా డిజిటలైజ్ చేయబడింది. ఇటీవల నేను ఆర్​సీ మార్చడం ద్వారా మునుపటి విక్రేత నుండి ఇన్సూరెన్స్​ను మార్చవలసి వచ్చింది. నేను వారి కార్యాలయానికి వెళ్లకుండా మొత్తం ప్రక్రియ సజావుగా నిర్వహించబడింది. టూ వీలర్ ఇన్సూరెన్స్ కోసం వెళ్లే ఎవరికైనా నేను దీనిని సిఫార్సు చేస్తాను.

గౌరవ్ యాదవ్

డిజిట్ నుండి టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. పూనమ్ దేవి చాలా మర్యాదపూర్వకమైన, సత్వర సేవను అందించింది. వీలైనంత త్వరగా పాలసీని జారీ చేయడంలో ఆమె అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు.

సందీప్ చౌదరి

డిజిట్ ఇన్సూరెన్స్‌తో అద్భుతమైన అనుభవం కలిగింది. అవసరమైన అన్ని ఫోటోలు, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసిన తర్వాత 5 నిమిషాల్లో సెటిల్‌మెంట్ ఏజెంట్ నుండి కాల్ వచ్చింది. క్లెయిమ్ కాల్‌లోనే సెటిల్ చేయబడింది. ఫైనల్ ఇన్‌వాయిస్‌ను అందించిన మరుసటి పని రోజున క్లెయిమ్ మొత్తాన్ని అందుకున్నాను.

Show more

టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం వల్ల లాభాలు

చిక్కుల నుండి మీ జేబును కాపాడుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో మీ బైక్‌కు ఇన్సూరెన్స్ చేయడం వలన అగ్ని ప్రమాదం వంటి ప్రకృతి వైపరీత్యం, దొంగతనం వంటి దురదృష్టవశాత్తు కలిగే డ్యామేజీలు, నష్టాల కారణంగా మీ జేబుకు చిల్లుపడకుండా చూస్తుంది.

చట్టబద్ధంగా కవర్ చేయబడి ఉండండి!

మోటారు వాహన చట్టం ప్రకారం, కనీసం థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. అది లేకుండా, మీరు భారతీయ రోడ్లపై చట్టబద్ధంగా ప్రయాణించలేరు! అందువల్ల, బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్లో చట్టబద్ధంగా కవర్ చేయబడటం కూడా ఒకటి.

ట్రాఫిక్ జరిమానాల విషయంలో స్పష్టంగా ఉండండి

కనీసం థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ లేకుండా భారతదేశంలో బండి నడపడం ప్రాథమికంగా చట్టవిరుద్ధం; ఒకవేళ ఇన్సూరెన్స్​ లేకపోతే భారీ ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. నమ్మినా నమ్మకపోయినా, మీరు మీ బైక్‌కు ఇన్సూరెన్స్ లేనందు వల్ల కలిగే ఇబ్బంది కన్నా కూడా ఇన్సూరెన్స్‎ని కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువ ఆదా చేస్తారు!

యాడ్-ఆన్‌లతో విస్తృతమైన కవరేజీని పొందండి

మీరు కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకున్నప్పుడు, ఇన్‌వాయిస్ కవర్, జీరో డిప్రిషియేషన్ కవర్, బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, కంజూమబుల్స్ కవర్, టైర్ ప్రొటెక్షన్ వంటి ఉపయోగకరమైన యాడ్-ఆన్‌లతో దాన్ని కస్టమైజ్ చేయడం ద్వారా మీకు ప్రయోజనం ఉంటుంది. ఇది మీ బైక్‌కు అన్ని ఇబ్బందుల నుండి పూర్తి రక్షణ ఇస్తుంది!

థర్డ్-పార్టీ సమస్యలను నివారించండి

ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ప్రజలు భయపడే సమస్యల్లో ఇది ఒకటి. డ్యామేజీలు లేదా నష్టాల కారణంగా థర్డ్-పార్టీలతో లెక్కలేనన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉంటే బాధిత పక్షం కవర్ చేయబడుతుంది. తద్వారా అలాంటి సమస్యలు తగ్గుతాయి!

టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు

థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం బైక్ ఇంజన్ సామర్థ్యం ఆధారంగా ఛార్జ్ చేయబడుతుంది. 2019-20 వర్సెస్ 2022 సంవత్సరానికి ధరలను చూద్దాం

ఇంజన్ సామర్థ్యం

2019-20 ప్రీమియం రూపాయలలో

కొత్త 2వీలర్ టీపీ (TP) రేట్ (1 జూన్ 2022 నుండి అమలులోకి వస్తుంది)

75 cc మించకూడదు

₹482

₹538

75cc దాటితే కానీ 150 cc కి మించకూడదు

₹752

₹714

150cc దాటినా 350cc కి మించకూడదు

₹1193

₹1366

350 cc మించిపోయింది

₹2323

₹2804

కొత్త ద్విచక్ర వాహనాల కోసం థర్డ్ పార్టీ ప్రీమియం (5 సంవత్సరాల సింగిల్ ప్రీమియం పాలసీ)

ఇంజన్ సామర్థ్యం

ప్రీమియం రూపాయలలో

కొత్త 2వీలర్ టీపీ (TP) రేట్ (1 జూన్ 2022 నుండి అమలులోకి వస్తుంది)

75 cc మించకూడదు

₹1,045

₹2,901

75cc దాటితే కానీ 150 cc కి మించకూడదు

₹3,285

₹3,851

150cc దాటినా 350cc కి మించకూడదు

₹5,453

₹7,365

350 cc మించిపోయింది

₹13,034

₹15,117

కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (ఇవి) (EV) ద్విచక్ర వాహనం కోసం ప్రీమియంలు (1 -ఇయర్ సింగిల్ ప్రీమియం పాలసీ)

వాహనం కిలోవాట్ సామర్థ్యం (కేడబ్ల్యు) (KW)

ప్రీమియం రూపాయలలో

కొత్త 2వీలర్ టీపీ (TP) రేట్ (1 జూన్ 2022 నుండి అమలులోకి వస్తుంది)

3 కేడబ్ల్యు (KW) మించకూడదు

₹410

₹457

3 కేడబ్ల్యు (KW) మించి కానీ 7 కేడబ్ల్యు (KW) మించకూడదు

₹639

₹609

7 కేడబ్ల్యు (KW) మించి కానీ 16 కేడబ్ల్యు (KW) మించకూడదు

₹1,014

₹1,161

16 కేడబ్ల్యు (KW) మించిపోయింది

₹1,975

₹2,383

కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (ఇవి) (EV) ద్విచక్ర వాహనం కోసం ప్రీమియంలు (5 -ఇయర్ సింగిల్ ప్రీమియం పాలసీ)

వాహనం కిలోవాట్ సామర్థ్యం (కేడబ్ల్యు) (KW)

2019-20 ప్రీమియం రూపాయలలో

కొత్త 2వీలర్ టీపీ (TP) రేట్ (1 జూన్ 2022 నుండి అమలులోకి వస్తుంది)

3 కేడబ్ల్యు (KW) మించకూడదు

₹888

₹2,466

3 కేడబ్ల్యు (KW) మించి కానీ 7 కేడబ్ల్యు (KW) మించకూడదు

₹2,792

₹3,273

7 కేడబ్ల్యు (KW) మించి కానీ 16 కేడబ్ల్యు (KW) మించకూడదు

₹4,653

₹6,260

16 కేడబ్ల్యు (KW) మించిపోయింది

₹11,079

₹12,849

ఏ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఉత్తమమైనది?

సరైన టూ వీలర్ ఇన్సూరెన్స్ ను ఎలా ఎంచుకోవాలి?

మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేయండి

ఐడీవీ అనేది మీ బైక్ యొక్క తరుగుదలతో కూడిన మార్కెట్ విలువ. అది మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, ఇది క్లెయిమ్‌ల సమయంలో మీరు పొందే పరిహారం విలువను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ ఐడీవీ సరిగ్గా పేర్కొనబడిందో లేదో మీరు ఎల్లప్పుడూ తనిఖీ చేస్తున్నారని నిర్ధారించుకోండి. డిజిట్‌లో మేము పారదర్శకతను విశ్వసిస్తాము. మీ ఐడీవీని కస్టమైజ్ చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తాము.

బైక్ ఇన్సూరెన్స్ కోట్స్‎ని పోల్చండి

ఇన్సూరెన్స్‎ని మీరు ఆన్‎లైన్‎లో కొనుగోలు చేయడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే మీరు రకరకాల బైక్ ఇన్సూరెన్స్ కోట్స్‎ని పోల్చవచ్చు. మీరు ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్లలో లేదా వివిధ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వెబ్‌సైట్‌లను సందర్శించడం ద్వారా దీన్ని చేయవచ్చు. మీరు మీ ఐడీవీ, అందుబాటులో ఉన్న యాడ్-ఆన్‌లు, సర్వీస్ ప్రయోజనాలు, విశ్వసనీయత, క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి, ప్రక్రియల వంటి ముఖ్యమైన అంశాలను సరిపోల్చుకోండి!

సర్వీస్ ప్రయోజనాలు

మంచి బైక్ ఇన్సూరెన్స్ అనేది కవరేజీలు, క్లెయిమ్‌ల గురించి మాత్రమే కాదు (అయితే, అది చాలా ఎక్కువ భాగం!) ఇది మీ సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మీరు పొందగల సర్వీస్ ప్రయోజనాల గురించి అని కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు; డిజిట్‌లో మేము రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (క్లెయిమ్‌గా పరిగణించబడదు) వంటి సేవలను అందిస్తాము, దీని ద్వారా మీకు చిన్న చిన్న విషయాల కోసం అవసరమైనప్పుడు కూడా మేము అండగా ఉంటాము.

మీ కవరేజీని తెలుసుకోండి

ఒక మంచి బైక్ ఇన్సూరెన్స్ మీకు అవసరమైన వివిధ అంశాల కోసం మిమ్మల్ని కవర్ చేయగలదు. దానికోసమే కదా ప్రీమియం! కాబట్టి, సరైన బైక్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునే సమయంలో, మీరు పొందే కవరేజీని చూసి, మీరు చెల్లిస్తున్నది విలువైనదేనా కాదా అని నిర్ణయించుకోండి.

మీరు తెలుసుకోవలసిన టూ వీలర్ ఇన్సూరెన్స్ టర్మినాలజీలు

సరైన టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా ఎంచుకోవాలి?

డిజిట్‎తో టూ వీలర్ ఇన్సూరెన్స్‎ని ఎలా కొనుగోలు/రిన్యు చేయాలి?

టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు

టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సంబంధించిన తరచుగా అడుగు ప్రశ్నలు