డిజిట్ అందించే టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో కింద పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్లు కవర్ అవుతాయి.
సహజ ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే డ్యామేజీలు లేదా నష్టాలు- సహజ ప్రకృతి విపత్తులుగా పిలవబడే భూకంపాలు, తుఫానులు, వరదలు మొదలయిన వాటి వలన సంభవించే నష్టాలు కవర్ అవుతాయి. ఈ సహజ విపత్తులు ఏ సమయంలోనైనా రావొచ్చు. అంతేకాకుండా ఇవి మన ప్రాణాలకు, ఆస్తులకు భారీ నష్టం కలిగించొచ్చు. ఇలా సహజ ప్రకృతి విపత్తుల వలన కలిగే నష్టాల నుంచి టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు మిమ్మల్ని సంరక్షిస్తాయి.
మానవ కారక ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే డ్యామేజీలు లేదా నష్టాలు - సహజ ప్రకృతి వైపరీత్యాలే కాకుండా దోపిడీలు, దొంగతనాలు, అల్లర్ల వంటి మానవ కారక వైపరీత్యాల వలన కూడా మీ బైక్ భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.
డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు అటువంటి డ్యామేజీల నుంచి మీకు పూర్తి ఆర్థిక రక్షణను అందజేస్తాయి.
ప్రమాదంలో శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే- ప్రమాదాలనేవి జీవితంలోని అతిపెద్ద దురదృష్టాలు. ఎటువంటి ముందుస్తు సమాచారం లేకుండానే ప్రమాదాలు సంభవిస్తాయి. ఒక బైక్ రైడర్‌కు ప్రమాదం జరిగినప్పుడు అతడు పాక్షిక లేదా శాశ్వత అంగవైకల్యాన్ని పొందుతాడు.
పాక్షిక అంగవైకల్యానికి ఉదాహరణలు.. నడవడంలో ఇబ్బంది, శరీరంలోని ఏదైనా అవయవం పనిచేయకపోవడం వంటివి. అదే శాశ్వత అంగవైకల్యం అంటే పూర్తిగా నడవలేకపోవడం, దృష్టిని కోల్పోవడం మొదలయినవి. టూ వీలర్ ఇన్సూరెన్స్ పైన పేర్కొన్న అన్ని రకాల చికిత్సా ఖర్చుల నుంచి మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేస్తుంది.
పాలసీదారుడు చనిపోయినపుడు – బైక్ నడుపుతున్న ఏదైనా సందర్భంలో జరిగిన ప్రమాదంలో పాలసీదారుడు లేదా బండి నడిపే థర్డ్ పార్టీ వ్యక్తి చనిపోవచ్చు. ఆ పాలసీ దారుడు కనుక పీఏ (PA) కవర్‌ను ఎంచుకుంటే బీమా సంస్థ అతడు ఎవరైతే నామినీలుగా ఎంచుకున్నాడో వారికి పరిహారం అందజేస్తుంది.
డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేసే విషయాలలో కొన్ని ముఖ్యమైన విషయాలు. భారతీయ రోడ్ల మీద ట్రాఫిక్ నిబంధనలను ఎవరూ ఖచ్చితంగా పాటించరనేది అందరూ ఒప్పుకొని తీరాల్సిన సత్యం. టూ వీలర్ నడిపేటపుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సీట్లో కూర్చుని కారు నడిపిన దాని కంటే బైక్ నడిపిన వారే ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. డిజిట్ అందించే కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఎక్కువ రేంజ్ కవరేజిని అందిస్తుంది. ఇది స్వీయ భౌతిక గాయాలు, వాహనం సంపూర్ణ లేదా పాక్షిక డ్యామేజీ అయినా, రైడర్‌కు శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యం సంభవించినా కూడా ఇది కవర్ చేస్తుంది. అంతేకాకుండా థర్డ్ పార్టీ లయబులిటీలను కూడా తీరుస్తుంది.
చట్టం నుంచి ఎదురయ్యే చిక్కుల నుంచి తప్పించుకునేందుకు, ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు తప్పనిసరిగా బీమా తీసుకోవాలి. మీరు ఇప్పటికే బైక్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఉంటే ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు? మీరు ఇప్పటికీ మీ టూ వీలర్ వాహనానికి బీమా కవర్ పొందకపోతే వెంటనే బీమా చేయించండి.