మీ బైక్ ఇన్సూరెన్స్‌లోని అతి ముఖ్యమైన అంశాల్లో IDV ఒకటి. ఇది కేవలం మీ బైక్ వాస్తవ విలువను నిర్ధారించడమే కాదు, మీరు బైక్ ఇన్సూరెన్స్‌కు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా నిర్ధారిస్తుంది.
అది మీ బైక్ యొక్క వాస్తవ విలువ - బైక్ ఇన్సూరెన్స్‌లో మీ బైక్ IDV అన్నది మీ బైక్ వాస్తవ విలువను తెలియజేస్తుంది. మీ బైక్ మోడల్, ఎన్నాళ్లుగా ఉపయోగిస్తున్నారు, దాని క్యూబిక్ కెపాసిటీ, ఏ సిటీలో దాన్ని ఉపయోగిస్తున్నారనే ఎన్నో అంశాలను అది పరిగణనలోకి తీసుకుంటుంది. కాబట్టి, IDVని సరిగ్గా ప్రకటించడం చాలా ముఖ్యం. దాని విలువ ఎంతో దాన్ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కవరేజ్ అందిస్తాయి.
మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం దీనిపైనే ఆధారపడి ఉంటుంది - పాలసీ రకం, మీరు వాహనం నడిపే ప్రదేశం, మీ బైక్ సీసీ కెపాసిటీ, తయారీ, బైక్ మోడల్, మరీ ముఖ్యంగా IDV వంటి అనేక అంశాల ఆధారంగా ప్రీమియం ఉంటుంది.
మీ క్లెయిమ్ అమౌంట్ కూడా దీనిమీదే ఆధారపడి ఉంటుంది - డ్యామేజీ లేదా నష్టాలు ఏర్పడినప్పుడు మీరు అందుకునే గరిష్ట మొత్తమే మీ IDV. కొంత మంది ప్రీమియం భారాన్ని తగ్గించుకునేందుకు తమ IDVని తక్కువ చేసి చెప్తారు. అలా చేసినట్లైతే క్లెయిమ్ సమయంలో నష్టపోతారు. మీరు తక్కువ మొత్తాన్ని అందుకుంటారు. అది మీ బైక్‌కు చాలా తక్కువ మొత్తం కూడా కావచ్చు.