7 Crore+ Customers
Affordable Premium
7 Crore+ Customers
Affordable Premium
ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని, మీ వాహనాన్ని (వెహికిల్‌ను) సంరక్షిస్తుంది. (కార్/బైక్/కమర్షియల్ వాహనం) మీరు కనుక వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రకృతి విపత్తులు, దొంగతనాలు, అనుకోని సందర్భాల నుంచి మీ కారును కాపాడుతుంది. భారతదేశంలో ప్రస్తుతం 3 రకాల మోటార్ ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి.
మోటార్ వెహికిల్ చట్టం 1988 ప్రకారం వాహనాలకు ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. భారతదేశంలో ఒక వాహనం రోడ్డు మీద తిరగాలంటే కనీసం థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ అయినా ఉండాలి. అలా కాకుండా మీరు మీ వాహనాన్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటే కాంప్రహెన్సివ్ పాలసీ ని తీసుకోవాలి. ఈ పాలసీ మీకు చాలా ఉపయోగపడుతుంది.
నోట్: మీరు ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి బెనిఫిట్లు మారుతుంటాయి. మీకు ఎక్కువ బెనిఫిట్స్ కావాలంటే కాంప్రహెన్సివ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం చాలా ఉత్తమం.
మేము మా కస్టమర్లను VIPల్లాగా చూసుకుంటాం. ఎలాగో తెలుసుకోండి...
ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకునే ముందు ఇదే మీ మనస్సులో తట్టాలి. మీరు బాగా ఆలోచిస్తున్నారు!
Read Digit’s Claims Report Card
ప్రస్తుత రోజుల్లో వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఈజీ. మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సెటిల్మెంట్ విషయంలో త్వరగా పూర్తయ్యే పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనం ఎన్ని విషయాలు తనిఖీ చేసినా కానీ ఫాస్ట్‌గా క్లెయిమ్స్ పూర్తి కావడం అనేది ఇన్సూరెన్స్‌లో ముఖ్యమైన భాగం.
మీ వాహనానికి సరైన మోటార్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం కోసం కింద కొన్ని టిప్స్ ఉన్నాయి.
మీరు మీ మోటార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడం కానీ, కొత్తది తీసుకోవడం కానీ చేసినపుడు తప్పకుండా ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌ను ఉపయోగించాలి. దీని వలన మీరు ఎంచుకునే డిఫరెంట్ ప్లాన్ వలన ప్రీమియం ఎలా మారుతుందో ఈజీగా తెలిసిపోతుంది.
మీ వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇక్కడ క్యాలుక్యులేట్ చేసుకోండి. car insurance premium calculator , bike insurance premium calculator.
మీ ఇన్సూరెన్స్ పాలసీని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మీరు ఎంచుకునే పాలసీని బట్టి మీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది నిర్ణయించబడుతుంది. (థర్డ్ పార్టీ vs స్టాండర్ట్ /కాంప్రహెన్సివ్), అంతేకాకుండా మీ వాహనం మోడల్‌ను బట్టి కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం మారుతూ ఉంటుంది. మీ వాహనం మార్కెట్ విలువ, మీరు నివసించే నగరం తదితర విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి. మీ వాహనంలో వాడే ఇంధనం కూడా పరిగణనలోకి వస్తుంది.
చాలా మంది యూజర్లు ప్రీమియం తక్కువగా ఉందని టెంప్ట్ అవుతారు. కానీ మీరు పాలసీని తీసుకునే సమయంలో మీ ఐడీవీ (IDV)ని సరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
మీకు, మీ వాహనానికి ఎలాంటి రిస్క్ ఉండకుండా ప్రీమియంను తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్:
తక్కువ ప్రీమియం ఉంది కదా అని ఇన్సూరెన్స్ పాలసీని గుడ్డిగా తీసుకోకండి. మీరు ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్ గురించి వెతికేటప్పుడు కింది విషయాలను గుర్తు పెట్టుకోండి.
ఐడీవీ (IDV) అనేది మోటార్ ఇన్సూరెన్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. IDV అనేది ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ఆఫ్ వెహికిల్. (ఎంతమొత్తానికి మీరు మీ వాహనానికి ఇన్సూరెన్స్ చేశారనేదాన్ని ఐడీవీ వివరిస్తుంది.) దీనిని బట్టే మీకు క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది.
ఐడీవీ మీ వాహనం మార్కెట్ విలువ (డిప్రిషియేషన్తో కలిపి) మీద ఆధరపడి ఉండటంతో పాటు మీ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ మీ వాహనం డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి మీ ఐడీవీ ప్రభావితం అవుతుంది, తద్వారా మీ ప్రీమియం తగ్గుతుంది
ఎన్సీబీ (NCB) అంటే నో క్లెయిమ్డ్ బోనస్ అని అర్థం. ఇది మీరు మీ పాలసీని రెన్యూ చేసేటపుడు మీ ప్రీమియం అమౌంట్‌ను చాలా వరకు తగ్గిస్తుంది. మీరు పాలసీ తీసుకుని ఎటువంటి క్లెయిమ్స్ చేయకుండా ఉండటమే ఎన్సీబీ (NCB). దీని గురించి మరింత తెలుసుకోండి. NCB in Bike Insurance & NCB in Car Insurance.
ముందుగా పేర్కొన్న విధంగా మీ వాహనానికి ఎటువంటి ఇంధనాన్ని వాడుతున్నారనే విషయం కూడా ఇక్కడ పరిగణనలోనికి వస్తుంది. ఉదాహరణకు: CNG, LPG లేదా డీజిల్‌తో నడిచే కార్లకు పెట్రోల్ కార్ల కన్నా ఎక్కువ ప్రీమియం ఉంటుంది.