ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్

2 నిమిషాల్లో థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను రిన్యూ చేసుకోండి
Happy Couple Standing Beside Car
Chat with an expert

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

Continue with

-

(Incl 18% GST)

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ధర

కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌ లా కాకుండా, థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌ మీ ఇంజన్ సీసీపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీమియంలను ఐఆర్​డీఏఐ (IRDAI) ముందే నిర్ణయిస్తుంది.

ప్రైవేట్ కార్ల ఇంజన్ కెపాసిటీ

ప్రీమియం రేటు

1000ccని మించకపోతే

₹2,072

1000ccని మించినవి కానీ 1500cc కన్నా తక్కువ

₹3,221

1500cc కన్నా మించినవి

₹7,890

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?

థర్డ్ పార్టీకి పర్సనల్‌ డ్యామేజ్

థర్డ్ పార్టీకి పర్సనల్‌ డ్యామేజ్

దురదృష్టవశాత్తు, మీ కారు ఎవరైనా థర్డ్‌ పార్టీ వ్యక్తికి గాయాలు కలిగించినట్లైతే, లేదా మరణానికి కారణమైతే, అటువంటి సందర్భాల్లో ఈ ఘటనల వల్ల కలిగే నష్టాలు, ఎదురయ్యే ఖర్చులకు మీ థర్డ్‌-పార్టీ కార్‌ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ కల్పిస్తుంది.

థర్డ్ పార్టీ ప్రాపర్టీ/వాహనానికి కలిగే డ్యామేజ్

థర్డ్ పార్టీ ప్రాపర్టీ/వాహనానికి కలిగే డ్యామేజ్

ప్రతి ఒక్కరు తప్పులు చేస్తుంటారు. మీ కారు ఎవరిదైనా ప్రాపర్టీ లేదంటే వాహనానికి డ్యామేజ్‌ కలిగిస్తే ఇది 7.5 లక్షల వరకు కవరేజ్‌ ఇస్తుంది.

ఓనర్-డ్రైవర్‌కు పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ఓనర్-డ్రైవర్‌కు పర్సనల్ యాక్సిడెంట్ కవర్

మీకు ఇప్పటికే పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ లేకపోతే, మీకు కలిగే నష్టాన్ని థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ కవర్ చేస్తుంది. ప్రమాదంలో మీకు కలిగే గాయాలు ఇందులో కవర్ అవుతాయి.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ లో ఏవి కవర్ కావు?

మీ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్ కావనే విషయం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఏమేం కవర్ కావో ముందే తెలిస్తే క్లెయిమ్‌ చేసుకునే సమయంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. అలాంటి కొన్ని పరిస్థితులు:

సొంత డ్యామేజ్‌లు

మీ సొంత కార్ డ్యామేజ్ అయితే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ దానిని కవర్ చేయదు.

తాగి నడపడం లేదా లైసెన్స్ లేకుండా నడపడం

మీరు మద్యం తాగి వాహనం నడిపినా, లేదంటే వ్యాలిడ్‌ ఫోర్​–వీలర్​ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపినా థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ కాదు.

సరైన డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేయడం

ఒకవేళ మీరు లెర్నర్ లైసెన్స్ కలిగి ఉండి, ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో సరైన డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లయితే- అప్పుడు ఆ పరిస్థితుల్లో మీ క్లెయిమ్‌ కవర్ చేయబడదు.

డిజిట్​ అందించే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన ఫీచర్లు

ప్రధాన ఫీచర్లు

డిజిట్​ ప్రయోజనం

ప్రీమియం

₹2072/- నుంచి ప్రారంభం

కొనుగోలు విధానం

స్మార్ట్ ఫోన్ ఆధారిత ప్రక్రియ. కేవలం 5 నిమిషాల్లో పూర్తవుతుంది.

క్లెయిమ్‌ సెటిల్మెంట్లు

ప్రైవేట్ కార్లకు 96% క్లెయిమ్‌లు సెటిల్ చేయబడ్డాయి.

థర్డ్ పార్టీకి పర్సనల్ డ్యామేజ్‌లు

అన్‌లిమిటెడ్ లయబిలిటీ

థర్డ్ పార్టీకి ప్రాపర్టీ డ్యామేజ్‌లు

7.5 లక్షల వరకు

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

15 లక్షల వరకు

పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ప్రీమియం

₹220/-

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలి?

Report Card

డిజిట్​ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ సెటిల్మెంట్ ఎంత త్వరగా జరుగుతుంది?

మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మనస్సులో రావాల్సిన మొదటి ప్రశ్న ఇది. గుడ్, బాగా ఆలోచిస్తున్నారు!

డిజిట్​ క్లెయిమ్‌ రిపోర్ట్ కార్డ్‌ను చదవండి

మా గురించి మా కస్టమర్లు ఏం చెబుతున్నారు

రవి మిశ్రా

టీమ్ గో డిజిట్​, మీ మద్దతు, వేగంగా స్పందించే విధానం నిజంగా ప్రశంసనీయం. వాస్తవానికి నా కారును ఓ మోటార్‌ సైకిల్‌ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. బంపర్, ట్రంక్, టెయిల్ లైట్ విరిగిపోయాయి. మీరు త్వరగా స్పందించడమే గాక సులభంగా క్యాష్‌లెస్‌, పేపర్‌లెస్‌గా పూర్తి చేశారు. బాగా పనిచేశారు. థ్యాంక్స్‌.

దీపక్ కోటియన్

అద్భుతమైన సర్వీస్. పేపర్ లెస్ క్లెయిమ్‌ రిజిస్టర్, సెటిల్మెంట్లు. మీ సపోర్ట్, వెంటనే స్పందించినందుకు శ్రీ అరవింద్ రెడ్డి & టీమ్‌కు ధన్యవాదాలు. వారి ప్రొఫెషనలిజం, నిబద్ధత దృష్ట్యా గో డిజిట్​ కార్ ఇన్సూరెన్స్‌ను బాగా సిఫారసు చేస్తాను.

త్రిశాంత్ వర్మ

డిజిట్​ ద్వారా నా కారు పాలసీని రెన్యువల్ చేయడం ఇది రెండోసారి. డిజిట్​ ఎగ్జిక్యూటివ్ గోకుల్ అయ్యంగార్ నాకు నచ్చే, ఉత్తమమైన ఆఫర్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. సంవత్సరం పొడవునా నాకు అదే మద్దతు, సర్వీస్ లభిస్తుందని ఆశిస్తున్నాను.

Show more

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

సమయాన్ని & శ్రమని ఆదా చేస్తుంది

టెక్నాలజీకి ధన్యవాదాలు, ఆన్​లైన్​లో థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి మీకు కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. మీకు ప్రాథమికంగా కావాల్సిందల్లా మీ కారు వివరాలు (కారు రిజిస్ట్రేషన్ నెంబరు/కారు మేక్, మోడల్), ఐడీ ప్రూఫ్ (ఆధార్/పాన్) అంతే. మీ పాలసీ మీకు ఈమెయిల్ చేయబడుతుంది!

పర్సనల్ డ్యామేజ్​లు జరిగినట్లయితే థర్డ్–పార్టీ వ్యక్తిని కవర్ చేస్తుంది

మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు దురదృష్టశాత్తు యాక్సిడెంట్ చేస్తే అవతలి వ్యక్తికి గాయాలు కావచ్చు. దురదృష్టం మరీ ఎక్కువైతే మరణం కూడా సంభవించవచ్చు. ఈ సందర్భంలో థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పూర్తిగా కవర్ చేస్తుంది.

థర్డ్-పార్టీ ప్రాపర్టీ లేదా వాహనం డ్యామేజ్​లను కవర్ చేస్తుంది

మీరు ఒకరి ప్రాపర్టీ లేదా వాహనానికి డ్యామేజ్​ కలిగించినట్లయితే, మీ థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ వారి నష్టాలను 7.5 లక్షల వరకు కవర్ చేస్తుంది!

ఏవైనా శారీరక గాయాలైతే మిమ్మల్ని సంరక్షిస్తుంది

ఒకవేళ మీకు ఇప్పటికే ఏదైనా ఇతర పాలసీ నుంచి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లేనట్లయితే (మీ హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి), థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని అది ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. తద్వారా శాశ్వత వైకల్యం లేదా మరణానికి దారితీసే ప్రమాదంలో మిమ్మల్ని మీరు సంరక్షించుకోవచ్చు.

అనుకోకుండా వచ్చే నష్టాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది

రోడ్డు మీదున్న అనేక కార్ల వల్ల, ట్రాఫిక్ తప్పుల వల్ల కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. మీ కార్ వేరే వ్యక్తులను లేదా వారి వాహనం​/ప్రాపర్టీకి నష్టం కలిగించినప్పుడు, ఆ నష్టాలను థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. మీరు వాటిని భరించాల్సిన అవసరం లేదు.

చట్టబద్ధంగా డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది

మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం, ప్రతీ కారు యజమానికి కనీసం థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఒకవేళ మీరు మీ కారును మరింతగా సంరక్షించాలని అనుకుంటే, మీరు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ (Comprehensive Car Insurance Policy) కూడా ఎంచుకోవచ్చు. దీనిలో థర్డ్–పార్టీ అవసరాల కొరకు కవరేజ్, మీ స్వంత కారుకు సంరక్షణ ఉంటుంది.

ట్రాఫిక్ పెనాల్టీలు, ఫైన్​ల నుంచి రక్షిస్తుంది

ఒకవేళ మీరు కనీసం థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డుపై కనిపించినట్లయితే, మీరు రూ. 2,000 మరియు/లేదా 3 నెలల వరకు జైలు శిక్షకు అర్హులు అవుతారు.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ యొక్క ప్రతికూలతలు

సొంత డ్యామేజ్​లను కవర్ చేయదు

దురదృష్టవశాత్తు, థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ సొంత డ్యామేజ్​లు లేదా నష్టాలను కవర్ చేయదు.

ప్రకృతి వైపరీత్యాలను కవర్ చేయదు

ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినట్లయితే, మీ ఫోర్ వీలర్​కు కలిగే డ్యామేజ్​లను థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు.

కస్టమైజ్​ చేసిన ప్లాన్లు ఉండవు

థర్డ్–పార్టీ కార్​ ఇన్సూరెన్స్ అనేది మీ ఫోర్ వీలర్ కొరకు లభ్యమయ్యే అత్యంత ప్రాథమిక ప్లాన్. దీన్ని అదనపు ప్రయోజనాలు, కవర్​లతో మరింత కస్టమైజ్ చేయలేం. అయితే కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తో మీరు అలా చేయవచ్చు.

భారతదేశంలోని కార్ ఇన్సూరెన్స్ ప్లాన్​ల రకాలు

car-quarter-circle-chart

థర్డ్ పార్టీ

కార్ ఇన్సూరెన్స్ రకాల్లో సాధారణమైనది థర్డ్–పార్టీ కార్ ఇన్సూరెన్స్. థర్డ్–పార్టీ పర్సన్​కు కలిగే డ్యామేజ్​లు, నష్టాలు మొదలైనవి దీనిలో కవర్ అవుతాయి.

car-full-circle-chart

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ఎంతో విశ్వసనీయమైన కార్​ ఇన్సూరెన్స్​ రకం. ఇది థర్డ్ పార్టీ లయబిలిటీలతో పాటు మీ స్వంత కారుకు అయ్యే డ్యామేజ్​లను కూడా కవర్​ చేస్తుంది.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×
×

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQ's)