క్యాష్‌లెస్ క్లెయిమ్‌లు వాస్తవానికి 100% క్యాష్‌లెస్ కాదని గమనించడం ముఖ్యం. ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కవర్ చేయబడని మినహాయింపులు, తరుగుదల రూపంలో మీరు క్లెయిమ్ మొత్తంలో ఒక చిన్న భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
తరుగుదల
తరుగుదల (డిప్రిషియేషన్) అనేది మీ వాడకాన్ని బట్టి జరిగే అరుగుదల. మీరు ఎంత వాడితే అంత అరుగుదల ఉంటుంది.
నిజానికి, ఒక షోరూమ్ నుంచి సరికొత్త కారు బయటకు వచ్చిన క్షణం, దాని విలువ 5% క్షీణించిందని భావించబడుతుంది!
మీరు క్లెయిమ్ ఫైల్ చేసినప్పుడు, పేమెంట్ చేయడానికి ముందు ఇన్సూరెన్స్ కంపెనీ సాధారణంగా ఈ తరుగుదల ఖర్చును మినహాయిస్తుంది.
కారు ఇన్సూరెన్స్‌లో రెండు రకాల తరుగుదలలు ఉన్నాయి - కారు యొక్క తరుగుదల, వివిధ కారు భాగాలు, కారు యాక్సెసరీల తరుగుదల. ఈ తరుగుదలను లెక్కించడానికి ఐఆర్డీఏఐ (IRDAI) కొన్ని నియమాలను రూపొందించింది.
చిన్న వాహనాల నష్టం వంటి పాక్షిక నష్టం జరిగినప్పుడు క్లెయిమ్ సమయంలో కారు భాగాలపై తరుగుదల పరిగణించబడుతుంది. కారు యొక్క భాగాలు దిగువ పేర్కొన్న విధంగా విభిన్న రేట్ల వద్ద క్షీణిస్తాయి:
- అధిక అరుగుదల ఉన్న భాగాలు - రబ్బరు భాగాలు, ప్లాస్టిక్ భాగాలు, బ్యాటరీ, ట్యూబ్‌లు, టైర్లు మొదలైనవి - 50%
- ఫైబర్ గ్లాస్ భాగాలు - 30%
- లోహపు భాగాలు - వాహనం యొక్క వయస్సు ఆధారంగా 0% నుంచి 50%
- కారు దొంగతనం వంటి మొత్తం నష్టం క్లెయిమ్ సందర్భంలో వాహనం తరుగుదల అమలులోకి వస్తుంది. ఇది మీ వాహనం యొక్క వయస్సు ఆధారంగా రూపొందించబడింది.
మినహాయింపులు
ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన వారికి చెల్లించడానికి ముందు మీ సొంత జేబు నుంచి మీరు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ ఖర్చులో కొంత భాగమే మినహాయింపు(డిడక్టబుల్) భాగం.
కారు ఇన్సూరెన్స్‌లో, ఈ మినహాయింపులు సాధారణంగా ప్రతి క్లెయిమ్ ప్రాతిపదికన వర్తింపజేయబడతాయి. కాబట్టి మీరు ₹15,000 విలువైన నష్టాల కోసం క్లెయిమ్ దాఖలు చేస్తే అందులో మినహాయింపు ₹1,000 - తప్పితే మిగిలిన మీ కారు రిపేర్ విలువ ₹14,000ను ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.
మినహాయింపులు రెండు రకాలు అవి – డిడక్టబుల్స్, వాలంటరీ
మీరు మీ కారు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారో ముందే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి క్లెయిమ్‌కు వర్తిస్తుంది.
మొత్తం వాలంటరీ మరియు తప్పనిసరి మినహాయింపు(డిడక్టబుల్) కంటే ఎక్కువ ఉన్న క్లెయిమ్ మొత్తంలో కొంత భాగాన్ని మాత్రమే మీ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.
తప్పనిసరి మినహాయింపు - ఈ రకమైన మినహాయింపులో పాలసీదారుడు మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో కొంత భాగాన్ని చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు.
ఐఆర్డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం కార్ ఇన్సూరెన్స్‌లో ఈ తప్పనిసరి మినహాయింపు విలువ కారు ఇంజన్ యొక్క క్యూబిక్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇది కింద పేర్కొన్న విధంగా సెట్ చేయబడింది.
- 1,500 cc వరకు – రూ.1,000
- 1,500cc పైన – రూ.2,000
స్వచ్ఛంద మినహాయింపు - స్వచ్ఛంద మినహాయింపు అనేది సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లించబడే మొత్తం. అయితే మీరు దానిని మీ జేబులో నుంచి చెల్లించడానికి ఎంచుకుంటారు.
మీ ఇన్సూరెన్స్ కవర్‌కు ఈ స్వచ్ఛంద మినహాయింపును జత చేయాలనుకున్నప్పుడు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ రిస్క్ తగ్గుతుంది కాబట్టి.
కానీ, మీ కారుకు ఏదైనా నష్టం సంభవించినట్లయితే మీరు మరింత చెల్లించాల్సి ఉంటుందని కూడా అర్థం (ఇది మీ ఇతర ఖర్చులపై ప్రభావం చూపుతుంది) కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకోండి.