కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్

ఆన్‌లైన్‌లో కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనండి/పునరుద్ధరించండి

I agree to the Terms & Conditions

Don’t have Reg num?
It’s a brand new vehicle

కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?

కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

డిజిట్ అందించే కమర్షియల్ ట్రక్ ఇన్సూరెన్స్నే ఎందుకు ఎంచుకోవాలి?

ఎందుకంటే మేము మా కస్టమర్లను వీఐపీలలాగా చూసుకుంటాం. అదెలాగో తెలుసుకోండి.

High IDV per rupee

మీ వాహన ఐడీవీని కస్టమైజ్ చేసుకోండి

మాతో మీరు మీకు నచ్చినట్టు మీ వాహన ఐడీవీని కస్టమైజ్ చేసుకోండి!

24*7 Support

24*7 సపోర్టు

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్ సౌకర్యం ఉంటుంది.

సూపర్-ఫాస్ట్ క్లెయిమ్‌లు

స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లోనే స్వీయ తనిఖీ ప్రక్రియ పూర్తవుతుంది!

కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్‌లో ఏమేం కవర్ అవుతాయి?

Accidents

ప్రమాదాలు

ప్రమాదాల కారణంగా కమర్షియల్ వాహనానికి డ్యామేజీ జరిగితే..

Theft

దొంగతనం

దొంగతనం జరిగి కమర్షియల్ వాహనానికి డ్యామేజీ లేదా నష్టం వాటిల్లితే

Fire

అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదం కారణంగా మీ కమర్షియల్ వాహనానికి జరిగే నష్టాన్ని భర్తీ చేస్తుంది.

Natural Disasters

ప్రకృతి వైపరీత్యాలు

ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల మీ కమర్షియల్ వాహనానికి కలిగే నష్టాలను పూడుస్తుంది.

Personal Accident

వ్యక్తిగత ప్రమాదం

మీ కమర్షియల్ వాహనానికి ప్రమాదం జరిగి డ్రైవర్‌కు గాయం/ మరణం సంభవిస్తే..

Third Party Losses

థర్డ్ పార్టీ నష్టాలు

థర్డ్ పార్టీ వ్యక్తి, వాహనం లేదా ఆస్తికి మీ కమర్షియల్ వాహనం వల్ల ఏదైనా నష్టం జరిగితే..

Towing Disabled Vehicles

టోయింగ్ డిసేబుల్ చేసిన వాహనాలు

ఏదైనా వాహనాన్ని టోయింగ్ చేసేటప్పుడు జరిగే నష్టం..

కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్తో వచ్చే యాడ్–ఆన్స్

కంజూమబుల్ కవర్

కంజూమబుల్ కవర్ మీ కమర్షియల్ వాహనానికి రక్షణను అనుకున్న దాని కన్నా మించి అందిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు నట్లు, బోల్ట్‌లు, స్క్రూలు, ఇంజన్ ఆయిల్, గ్రీజు వంటి మీ వాహన విడిభాగాలను కూడా ఇది కవర్ చేస్తుంది.

విడి భాగాల తరుగుదలకు రక్షణ

మీ వాహనం, దాని విడి భాగాలు అరిగిపోవడంతో కాలక్రమేణా విలువ తగ్గిపోతుంది. ఈ మొత్తం సాధారణంగా ఏదైనా క్లెయిమ్ నుంచి తీసేస్తారు. అయితే ఈ యాడ్-ఆన్ మాత్రం ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా రీప్లేస్ చేసిన విడిభాగాలపై (రబ్బరు లేదా ఫైబర్‌గ్లాస్ వంటివి) ఈ కవర్ అవుతుంది.

ఇంజన్, గేర్ బాక్స్ రక్షణ

వాటర్ రిగ్రెషన్ లేదా లూబ్రికేటింగ్ ఆయిల్ లీకేజీ వంటి కారణాల వల్ల ప్రమాదంలో మీ వాహనం ఇంజన్ లేదా గేర్‌బాక్స్ పాడైపోతాయి. ప్రమాదం తర్వాత సంభవించే ఏవైనా పర్యవసాన నష్టాలను ఈ యాడ్-ఆన్ కవర్ చేస్తుంది. (కానీ ప్రమాదం కారణంగా జరిగి ఉండాలి), ఉదాహరణకు హైడ్రోస్టాటిక్ నష్టం కారణంగా ఇంజన్​కు నష్టం జరిగిందనుకోండి. ఇది ప్రామాణిక పాలసీలో కవర్ అవ్వదు.

బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ - సాధారణంగా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అంటారు

మనందరికీ కొన్నిసార్లు కొంత సహాయం కావాలి! రోడ్డుపై మీ వాహనం బ్రేక్‌డౌన్‌ అయినప్పుడు, ప్రమాదం కారణంగా, టైర్లు ఫ్లాట్ అవడం, బ్యాటరీ పనిచేయకపోవడం లేదా మరికొన్నింటి కారణంగా, మా బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ యాడ్-ఆన్‌తో, మీరు 24x7 సహాయం పొంది ప్రయోజనం పొందొచ్చు.

రెవెన్యూ నష్టం

పని చేసేందుకు వాహనాలు చాలా అవసరం. ఈ యాడ్-ఆన్ మీ కమర్షియల్ వాహనం డ్యామేజీ అయి అందుబాటులో లేనప్పుడు వచ్చే ఏదైనా ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడంలో మీకు తోడ్పడుతుంది.

అడిషనల్ టోయింగ్ ఖర్చులు

మీ వాహనం ప్రమాదానికి గురైనప్పుడు, దాన్ని రిపేర్ చేయించేందుకు గ్యారేజీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ యాడ్-ఆన్ కింద మీ వాహనాన్ని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి సమీపంలోని గ్యారేజీకి లేదా సురక్షిత ప్రాంతానికి తరలించేటప్పుడు అయ్యే అదనపు ఖర్చులను మేం కవర్ చేస్తాం.

ఈఎంఐ ప్రొటెక్షన్ కవర్

మీ వాహనాన్ని లోన్‌పై తీసుకుని, ప్రమాదంలో పాడైపోయి, రిపేర్ కోసం గ్యారేజీలోనే ఉంటే అది మీ వ్యాపారానికి నష్టం కలిగించవచ్చు. ఈ యాడ్-ఆన్ ద్వారా మా రికార్డుల్లో ఉన్న వాహనం యొక్క ఫైనాన్షియర్‌కు చెల్లించాల్సిన ఈఎంఐలు మేం చెల్లిస్తాం.

అదనపు కవరేజీలు లేదా ఎండార్స్‌మెంట్స్ అందుబాటులో ఉన్నాయి

కొన్నిసార్లు అన్ని స్థితిగతులను కవర్ చేయడానికి కేవలం స్టాండర్డ్​ కవరేజీ సరిపోదు. అందుకే మేము మీ కమర్షియల్ వాహనాల కవరేజీని పొడిగించుకోవడానికి మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు ఎంపిక చేసుకోగలిగే ఆప్షనల్ కవర్లను అందిస్తున్నాం.

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

మీకు ఇప్పటికే పీఏ (PA) కవర్ లేకుంటే చట్టాల ప్రకారం పర్సనల్ యాక్సిడెంట్ కవర్ తప్పనిసరి. కాబట్టి మీరు దాన్ని మీ కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్‌లో చేర్చవచ్చు. ఇది దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు యజమాని-డ్రైవర్‌కు గాయాలు లేదా మరణం సంభవిస్తే కవరేజీ అందిస్తుంది.

అన్నేమ్డ్ పీఏ కవర్

ఇది ఎప్పటికీ జరగకూడదని ఆశిస్తున్నాం. అయితే, వాహనంలో మీతో పాటు కూర్చున్న వ్యక్తికి అనుకోని ప్రమాదంలో ఏదైనా జరిగితే ఇది వర్తిస్తుంది.

లీగల్ లయబిలిటీ

మీ ఉద్యోగులు లేదా మీ కోసం పని చేసే వ్యక్తులకు ఏదైనా గాయం తగిలినా, ఏమైనా జరిగినా మీ మీద తలెత్తే లీగల్ లయబిలిటీల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

ఐఎంటీ 23

వాహనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, లైట్లు, టైర్లు, ట్యూబులు, మడ్‌గార్డ్‌, బానెట్, సైడ్ పార్ట్ బంపర్లు, హెడ్‌లైట్లు, పెయింట్‌వర్క్‌లు డ్యామేజీ లేదా నష్టాలను కవర్ చేయడానికి ఇది సహాయపడుతుంది.

ఎలక్ట్రికల్ ఉపకరణాలు

వాహనం తయారైనప్పుడు రాని ఎలక్ట్రికల్ ఉపకరణాలు అమర్చిన వారి కోసం ఈ యాడ్–ఆన్ ఉంటుంది. ఆ ఉపకరణాలను ఇది కవర్ చేస్తుంది.

నాన్-ఎలక్ట్రికల్ ఉపకరణాలు

మీరు మీ వాహనం తయారైనప్పుడు లేని ఏదైనా నాన్-ఎలక్ట్రికల్ ఉపకరణాన్ని  అమర్చినట్లయితే, డ్యామేజీ, నష్టాల సమయంలో ఆ ఉపకరణాలను కవర్ చేయడానికి ఇది సహాయపడుతుంది.

ప్రత్యేక మినహాయింపులు & తప్పనిసరి డిడక్షన్స్

ప్రతి నష్టంపై తప్పనిసరి మినహాయింపు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ ప్రీమియంను తగ్గించుకోవడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీ వాహనం పూర్తిగా పాడైపోయినట్లయితే, ల్యాంపులు, టైర్లు, ట్యూబులు, మడ్‌గార్డ్‌లు, బానెట్, సైడ్ పార్ట్ బంపర్లు, హెడ్‌లైట్లు, పెయింట్‌ వర్క్‌లకు డ్యామేజీ లేదా నష్టాన్ని కవర్ చేస్తుంది.

ఏది కవర్ కాదు?

మీ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏది కవర్ కాదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. తద్వారా మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాంటివి కొన్ని తెలుసుకుందాం:

థర్డ్ పార్టీ పాలసీదారుడి సొంత డ్యామేజీలు

థర్డ్-పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీలో సొంత వాహనానికి జరిగే నష్టాలు కవర్ కావు.

మద్యం సేవించి లేదా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం

క్లెయిమ్ చేసిన వాహన యజమాని లేదా డ్రైవర్ మద్యం తాగి ఉన్నా లేదంటే చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కవర్ కాదు.

స్వీయ నిర్లక్ష్యం

యజమాని-డ్రైవర్ వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా సంభవించే ఏదైనా డ్యామేజీ (ఉదాహరణకు, అప్పటికే వరదలు ఉన్నా కూడా డ్రైవింగ్ చేయడం వంటివి..)

 

పర్యావసాన డ్యామేజీలు

ప్రమాదంతో సంబంధం లేకుండా జరిగిన ఏదైనా డ్యామేజీకి కవర్ కాదు. ఉదాహరణకు  రాబడిలో నష్టం, మార్కెట్ నష్టాలు వంటి తదనంతర నష్టాలు.

డిజిట్ అందించే కమర్షియల్ కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ ముఖ్య ఫీచర్లు

ముఖ్యమైన ఫీచర్లు

డిజిట్ ప్రయోజనం

క్లెయిమ్ ప్రాసెస్

పేపర్ లెస్ క్లెయిమ్స్

కస్టమర్ సపోర్టు

24x7 సపోర్టు

కవర్ అయ్యే కమర్షియల్ వాహనాల రకాలు

క్యాబులు, ట్యాక్సీలు, ట్రక్కులు, లారీలు, బస్సులు, ఆటో రిక్షాలు, స్కూల్ వ్యాన్లు మొదలైనవి

ప్రీమియం

కమర్షియల్ వాహన రకం & ఇన్సూరెన్స్ చేయాల్సిన వాహనాల సంఖ్య ప్రకారం కస్టమైజ్ చేయబడుతుంది.

అదనపు కవరేజీలు

పీఏ (PA) కవర్లు, లీగల్ లయబిలిటీ కవర్, ప్రత్యేక మినహాయింపులు, తప్పనిసరి తగ్గింపులు మొదలైనవి.

థర్డ్ పార్టీ డ్యామేజీలు

వ్యక్తిగత నష్టాలకు అపరిమిత లయబిలిటీ, ఆస్తి/ వాహన డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవర్ అవుతుంది.

కవర్ అయ్యే కమర్షియల్ వాహనాల రకాలు

ప్యాసింజర్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్

  • టాక్సీలు, క్యాబులు, ఆటో రిక్షా, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకువెళ్లే వాహనాలకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్.
  • ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలు.. ప్రత్యేకించి స్కూల్ బస్సులు, సాధారణ క్యాబులకు చాలా మంది ప్రయాణికులను తీసుకువెళ్లే భారీ బాధ్యత కలిగి ఉంటుంది. 
  • భారతదేశంలోని చాలా మంది జీవితాలు, ఆదాయం ఈ వాహనాలను నడపడంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా దురదృష్టకర పరిస్థితుల్లో వారు ఎప్పటికీ నష్టాల నుంచి రక్షణ పొందేందుకు కమర్షియల్ వెహికిల్ ఇన్పూరెన్స్ దోహదపడుతుంది.

గూడ్స్ క్యారీయింగ్ వెహికిల్ ఇన్సూరెన్స్

  • సాధారణంగా వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లే వాహనాలు. వీటిలో ప్రధానంగా ట్రక్కులు, టెంపోలు, లారీలు ఉన్నాయి.
  • వస్తువులను మోసుకెళ్లే వాహనాలు సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉంటాయి. దీంతో అవి తరచుగా ప్రమాదానికి గురవుతుంటాయి. కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీలకు జరిగే డ్యామేజీలు, నష్టాల నుంచి రక్షించడమే కాకుండా, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర దురదృష్టకర పరిస్థితుల నుంచి వచ్చే నష్టాల నుంచి కూడా యజమాని-డ్రైవర్ అలాగే వాహనానికి కూడా రక్షణ కల్పిస్తుంది.
  • మీ వ్యాపారంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తువులను రవాణా చేయడానికి ట్రక్కులను తరచుగా ఉపయోగిస్తుంటే.. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు మొదలైన పరిస్థితుల కారణంగా సంభవించే ఏదైనా డ్యామేజీ లేదా వస్తువుల నష్టం నుంచి కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ రక్షిస్తుంది.

ఇతర, ప్రత్యేక వాహనాల ఇన్సూరెన్స్

  • క్యాబులు, టాక్సీలు, ట్రక్కులు, బస్సులు కాకుండా, వ్యాపారాల కోసం తరచుగా ఉపయోగించేందుకు అనేక వాహనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని వ్యవసాయం, మైనింగ్, నిర్మాణ రంగాల్లో వినియోగించే ప్రత్యేక వాహనాలు ఉండొచ్చు.
  • కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్  అనేది ఇన్సూరెన్స్​ చేసిన వాహానానికి జరిగే డ్యామేజీలు, నష్టాల నుంచి రక్షిస్తుంది.
  • పెట్టుబడి, వాహనాల పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని, కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ చేయడం అనేది ఎల్లప్పుడూ మంచి ఎంపిక. దీంతో అనుకోని సంఘటనల వల్ల కలిగే ఆర్థిక పరమైన నష్టాల నుంచి వ్యాపారం లేదా యజమానిని గట్టెక్కిస్తుంది.

కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీల రకాలు

మీ కమర్షియల్ వాహనం యొక్క అవసరాలకు తగ్గట్టు, మేము ప్రధానంగా రెండు పాలసీలను అందిస్తాం. అయితే కమర్షియల్ వాహనం ప్రమాదం, వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని, మీ సొంత కమర్షియల్ వాహనంతో పాటు దాన్ని వినియోగించే యజమాని లేదా డ్రైవర్కు కూడా ఆర్థికంగా రక్షణ కల్పించే ప్రామాణిక ప్యాకేజీ పాలసీని తీసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తున్నాం.

లయబిలిటీ

స్టాండర్డ్ ప్యాకేజీ

×

క్లెయిమ్ ఫైల్ చేయడం ఎలా?

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఎంత త్వరగా పరిష్కారం అవుతాయి?

మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీకు వచ్చే మొదటి అనుమానం ఇదే. ఇలా ఆలోచించడం మంచిదే!

డిజిట్ క్లెయిమ్ల రిపోర్టు కార్డును చదవండి

మా గురించి మా కస్టమర్లు ఏమి చెబుతున్నారంటే..

అమన్ జస్వాల్

చాలా సులభమైన క్లెయిమ్ ప్రక్రియ. మీ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి నంబర్‌ను డయల్ చేస్తే డిజిట్ ఇన్సూరెన్స్ టీమ్​కు కలిసింది. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే క్లెయిమ్‌ను నమోదు జరిగింది. వెంటనే రిపేర్ కోసం వాహనాన్ని వర్క్‌షాప్‌కు తీసుకెళ్లాను. అదే రోజు సర్వే చేశారు. అభిషేక్ సర్ నాకు అన్ని ప్రాసెస్​లను వివరించారు. క్లెయిమ్ పొందడంలో చాలా సహాయపడ్డారు.

రోహిత్ ఖోట్

శ్రీ సిద్ధేశ్ మఖ్దూం అందించిన సేవలకు నేను చాలా ముగ్ధుడిని అయ్యాను. చాలా సంతృప్తి చెందాను. ఆయనతో డీల్ చేయడం చాాలా గొప్ప అనుభవం. ఆయనకు ఆటో రంగంపై అపారమైన పరిజ్ఞానం ఉంది. అతను మర్యాదగా ప్రవర్తించారు. ఆయన పని కూడా చక్కగా ఉంది. నా సమస్యను పరిష్కరించుకునేందుకు ఆయన చాలా సహాయం చేశారు. నా సమస్యను పరిష్కరించడానికి అలాంటి పరిజ్ఞానం, అనుభవం కలిగి ఉన్న వ్యక్తిని అందించినందుకు డిజిట్​కు ధన్యవాదాలు. సిద్ధేశ్ సార్ మీరు గొప్ప పని చేస్తున్నారు. దాన్ని అలాగే కొనసాగించండి. మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు.

జయంత్ త్రిపాఠి

నా సమస్యను డిజిట్ ఇన్సూరెన్స్ హ్యాండిల్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. గో డిజిట్‌కు చెందిన రత్నకుమార్ గారు నా కేసును హ్యాండిల్ చేసిన విధానాన్ని పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. గ్యారేజ్ వ్యక్తులతో నా వాహన పరిస్థితిపై ఎప్పటికప్పుడూ ఫాలో-అప్ అయ్యేవారు. రత్నకుమార్ వంటి వారి చేతుల్లో డిజిట్ సురక్షితంగా ఉందని నేను భావిస్తున్నాను. కచ్చితంగా నా ఇన్సూరెన్స్​ను రెన్యువల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా మరో వాహనం క్రెటా కోసం కూడా డిజిట్​ వద్దే ఇన్సూరెన్స్​ తీసుకుంటాను. అందరికీ డిజిట్​ను సిఫారసు చేస్తాను. డిజిట్‌కు ఆల్ ది వెరీ బెస్ట్.

Show more

కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి

భారతదేశంలో కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు