జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్

జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ కోట్​ పొందండి. పోల్చుకోండి.

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

అసలు జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

అసలు డిప్రిషియేషన్ అంటే ఏమిటి?

డిప్రిషియేషన్​ చార్జీలు ఏ వాహనాలకు ఎంత శాతం ఉంటాయంటే..

వాహనం​ వయసు

డిప్రిషియేషన్​ శాతం

6 నెలలకు మించని వాహనాలకు

5%

6–12 నెలల మధ్యలోని వాహనాలకు

15%

1–2 సంవత్సరాల మధ్య వాహనాలకు

20%

2–3 సంవత్సరాల మధ్య వాహనాలకు

30%

3–4 సంవత్సరాలకు మధ్య వాహనాలకు

40%

4–5 సంవత్సరాల మధ్య వాహనాలకు

50%

డిప్రిషియేషన్​ చార్జ్​ శాతం (లోహపు భాగాలకు)

వాహనం వయస్సు

డిప్రిషియేషన్​ చార్జ్

6 నెలల కంటే తక్కువ వయసున్న వాహనాలు

Nil

6–12 నెలల మధ్య ఉన్న వాహనాలు

5%

1–2 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు

10%

2–3 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు

15%

3–4 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు

25%

4–5 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు

35%

5–10 సంవత్సరాల మధ్య ఉన్న వాహనాలు

40%

10 సంవత్సరాలకు పైబడిన వాహనాలకు

50%

జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ యాడ్​–ఆన్​తో లాభాలు

డబ్బు ఆదా

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​తో మొదటి ప్రయోజనం డబ్బును ఆదా చేసుకోగలగడం​. జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కనుక మీరు కలిగి ఉంటే, మీ క్లెయిమ్​ సెటిల్​ చేసుకునే సమయంలో మీరు అదనంగా మీ జేబు నుంచి డబ్బులను ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ లేకపోతే మీరు క్లెయిమ్​ సమయంలో అదనంగా డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​​ వలన మీరు అదనపు ఖర్చుల నుంచి రక్షించబడతారు.

ఎక్కువ క్లెయిమ్​ అమౌంట్​ పొందండి

మీరు మీ కారును జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​​తో కవర్​ చేసుకుంటే క్లెయిమ్​ సమయంలో కార్​ పార్ట్స్​కు ఏ విధమైన తరుగుదల ఉండదు. కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో క్లెయిమ్​ అమౌంట్​ పొందే అవకాశం​ ఉంటుంది.

ప్రశాంతత

మీరు జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ను ఎంచుకుంటే క్లెయిమ్​ సమయంలో మీరు అదనంగా డబ్బులను ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అనుకోని సందర్భాల్లో ఈ క్లెయిమ్​ మీకు చాలా మనశ్శాంతిని అందిస్తుంది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్​ తీసుకోవడం ఉత్తమం.

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​లో కవర్​ కానివి ఏంటి?

సరైన డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా డ్రైవ్​ చేసినపుడు

మీరు వ్యాలిడ్​ డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా డ్రైవింగ్​ చేసినపుడు జీరో డిప్రిషియేషన్​ యాడ్–ఆన్​ బెనిఫిట్స్​ పొందలేరు.

ఐదేళ్ల కన్నా పాతవైన కార్లకు

మీ కారు ఐదేళ్ల కంటే పాతదైతే జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ మీకు వర్తించదు.

మద్యం సేవించి వాహనం నడిపినపుడు

డ్రగ్స్,​ మద్యం లాంటివి సేవించి వాహనం నడిపినపుడు జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ నుంచి కవర్​ పొందలేరు.

కంపల్సరీ డిడక్టిబుల్స్​ను కవర్​ చేయదు

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కంపల్సరీ డిడక్టబుల్స్​ను కవర్​ చేయదు. కాబట్టి దీన్ని తీసుకునే సమయంలో ఈ విషయం గుర్తించాలి.

మెకానికల్​ బ్రేక్​ డౌన్లను కవర్​ చేయదు

జీరో డిప్రిషియేషన్​ కవర్​ మీ కారు మెకానికల్​ బ్రేక్​ డౌన్స్​ను కవర్​ చేయదు.

ఇంజన్​ ఆయిల్​ ధర

ఇంజన్​ ఆయిల్​, క్లచ్​ ఆయిల్​ ధరలను ఈ యాడ్​–ఆన్​ కవర్​ చేయదు.

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కవర్​ ధర ఎంత ఉంటుంది? దీనికి ఆ ధర పెట్టవచ్చా?

మీ జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలేంటి?

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కవర్​ ప్రీమియంను కింద పేర్కొనబడిన అంశాలు ప్రభావితం చేస్తాయి.

మీ కారు వయస్సు

జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ మీ కారు వయస్సు, దాని పార్ట్స్​ వయస్సు​తో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. జీరో డిప్రిషియేషన్​ యాడ్– ఆన్​ ప్రీమియంను నిర్ధారించడంలో మీ కారు వయసు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

మీ కారు మోడల్

కార్​ ఇన్సూరెన్స్​ తీసుకునే సమయంలో కార్​ మోడల్​ అనేది ముఖ్య భూమిక వహిస్తుంది. జీరో యాడ్​–ఆన్​ కవర్​ కారు పార్ట్స్​ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కారు మోడల్​ కూడా దీనిలో కీలక పాత్ర పోషిస్తుంది.

మీ కారు లొకేషన్

ఒక్కో సిటీలో రిస్క్​ ఫ్యాక్టర్​ ఒక్కోలా ఉంటుంది. కాబట్టి జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కానీ, కార్​ ఇన్సూరెన్స్​ కానీ, మీరు ఏ సిటీలో కారు​ నడుపుతున్నారనే విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది.

స్టాండలోన్​ కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్ పాలసీ​తో పోలిస్తే జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్​ ఎందుకు మంచిది​?

జీరో డిప్రిషియేషన్​, కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ మధ్య తేడా

జీరో డిప్రిషియేషన్​ కార్​ ఇన్సూరెన్స్

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​

అసలు ఏంటిది?

జీరో డిప్రిషియేషన్​ కవర్​ అనేది మీ పాలసీకి యాడ్​–ఆన్​ వంటిది. ఇది కావాలంటేనే మీరు ఎంచుకోవచ్చు. ఈ యాడ్​–ఆన్​ను కలిగి ఉండటం వలన మీ పాలసీ క్లెయిమ్​ సమయంలో మీ ఇన్సూరర్​ మీ నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడు. డిప్రిషియేషన్​ పేరుతో మీరు ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ అనేది ఒక రకమైన కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ. ఇది మీ కారును సొంత​ డ్యామేజ్​లు, థర్డ్​ పార్టీ డ్యామేజ్​ల​ నుంచి కాపాడుతుంది. అదనపు రక్షణ కోసం ఈ కార్​ పాలసీని కస్టమైజ్​ కూడా చేసుకోవచ్చు.

ప్రీమియం

మీరు ఈ యాడ్​–ఆన్​ను ఎంచుకుంటే, మీ కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం దాదాపు 15 శాతం మేర పెరుగుతుంది.

స్టాండలోన్​ కాంప్రహెన్సివ్​ పాలసీ ప్రీమియం జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ కలిపిన దానికంటే తక్కువగా ఉంటుంది.

డిప్రిషియేషన్​ కాస్ట్​

మీరు జీరో డిప్రిషియేషన్ యాడ్​–ఆన్​​ను గనుక తీసుకుంటే, మీ క్లెయిమ్​ సమయంలో ఎటువంటి డిప్రిషియేషన్​ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకున్నపుడు మీరు క్లెయిమ్​ చేసుకునే సమయంలో మీ కార్​ పార్ట్స్​ యొక్క డిప్రిషియేషన్​ చార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

కారు వయసు

5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల అన్ని కార్లకు జీరో డిప్రిషియేషన్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవచ్చు.

15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అన్ని కార్లకు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవచ్చు.

మీరు ఎంత సేవ్​ చేస్తారంటే?

మీరు జీరో డిప్రిషియేషన్​ యాడ్​–ఆన్​ను గనుక ఎంచుకుంటే కాస్త ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. కానీ, లాంగ్​ టర్మ్​లో మీరు అదనంగా కట్టిన ప్రీమియం కంటే అధిక లాభాన్నే పొందుతారు.

ఈ ఇన్సూరెన్స్​లో అదనంగా కట్టే యాడ్–ఆన్స్​ చార్జీలను మాత్రమే మిగుల్చుకోగలుగుతారు.

క్లెయిమ్​ సెటిల్​మెంట్​లో జీరో డిప్రిషియేషన్​ కవర్​ పాత్ర ఏంటి?

జీరో డిప్రిషియేషన్​ గురించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు

జీరో డిప్రిషియేషన్​ కవర్​ను ఎవరు ఎంచుకోవాలి?

కార్​ ఇన్సూరెన్స్​లో జీరో డిప్రిషియేషన్​ కవర్​ గురించి తరచూ అడిగే ప్రశ్నలు