బంపర్ టు బంపర్ కవర్ సాధారణంగా కొంత అదనపు ప్రీమియంతో కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో యాడ్-ఆన్గా వస్తుంది. బంపర్ టు బంపర్ కవర్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం.
సామాన్యుల భాషలో చెప్పాలంటే, ఇది ఇంజన్ డ్యామేజీ, టైర్లు, బ్యాటరీలు, గ్లాస్ను తప్పించి కారులోని ప్రతి అంగుళాన్ని కవర్ చేసే యాడ్-ఆన్ ఇన్సూరెన్స్. ఇది సాధారణ కారు ఇన్సూరెన్స్ పాలసీలాగా కాకుండా, మీ కారు డ్యామేజీ అయితే 100 శాతం కవరేజీని అందిస్తూ మీ కారును పూర్తిగా చూసుకునే మీ సూపర్ హీరో.
దీన్ని జీరో డిప్రిషియేషన్ లేదా తరుగుదల లేని కారు ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ కవర్ నుంచి డిప్రిషియేషన్ను (తరుగుదలను) మినహాయించి, పూర్తి కవరేజీని అందజేస్తుంది.
ఈ కవర్ను భారతదేశంలో 2009లో ప్రవేశపెట్టారు. ఈ ప్లాన్ చాలామంది కార్ల యజమానులకు ముఖ్యంగా కింద పేర్కొన్న వారికి ఒక వరం లాంటిది:
- కొత్తగా కారు కొన్నవారికి లేదా కారు కొని 5 సంవత్సరాల కంటే తక్కువ కాలం అవుతున్నవారికి
- కొత్త లేదా అనుభవం లేని డ్రైవర్లు
- ఖరీదైన స్పేర్ పార్ట్స్ కలిగి ఉండే హై-ఎండ్ లగ్జరీ సూపర్ కార్ల యజమానులు
- చాలా తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు/వాటి సమీపంలో నివసిస్తున్న యజమానులు
- చిన్న చిన్న డెంట్లు, బంప్ల గురించి కూడా మీరు ఆందోళన చెందేవారైతే
బ్రాండ్-న్యూ కారుపై చిన్న డెంట్ లేదా గీత పడినా బాధపడే కొత్త కారు యజమానులు, అరుదైన, ఖరీదైన విడిభాగాలతో అత్యాధునిక ఖరీదైన కార్లను సొంతం చేసుకోవాలనుకునే వారికి దీని గురించి బాగా తెలుసు. ఈ వాహనాల యజమానులను 100 శాతం కవరేజ్ కోసం అదనపు ప్రీమియం చెల్లించాలని అడిగితే, తమ కారు రక్షణ కోసం అది చిన్న ధర మాత్రమే అని వారు భావిస్తారు.
ఉపయోగించండి: బంపర్ టు బంపర్ కవరేజీతో కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించేందుకు కార్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్