మనం ఎక్కడికి బయలుదేరాలని అనుకున్నా కానీ ప్రయాణం గురించి ఆలోచిస్తాం. ఇసుకతో నిండిన బీచ్‌లు, మరియు మంచుతో నిండిన పర్వతాలు, పచ్చగా ఉన్న ఎత్తైన కొండలు, అంతే కాకుండా అందమైన నగరాల వరకు మనం ఏమి చూడాలని అనుకున్నా కానీ ప్రయాణం చేయాల్సిందే. ప్రపంచం అనేది చాలా చిన్నది అందులో ప్రయాణాలు తప్పకుండా చేయాలి. మనం అందులో ఒక భాగాన్నయినా తప్పకుండా చూసి రావాలి.
ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఖర్చు, నష్టాలు, మరియు ప్రయాణానికి సంబంధించిన ఇతర ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. పాలసీ తీసుకున్న వ్యక్తికి ప్రయాణంలో ఎదురయ్యే ఖర్చులు, నష్టాల నుంచి ఇది కవర్ చేస్తుంది.
బ్యాగేజ్/పాస్‌పోర్ట్ కోల్పోవడం, విమానాల ఆలస్యం, విమానాల రద్దు, వైద్య ఖర్చులు మొదలయిన అనేక రకాల సేవలను ఇది కవర్ చేస్తుంది. మీరు ప్రయాణం చేసిన ప్రతిసారి మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచే ఒక పత్రం.
డిజిట్ అందజేసే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ అన్ని ప్రయాణాలలో మీకు తోడుగా ఉండేలా రూపొందించబడింది. మీరు తెలివిగా మరియు స్మార్ట్‌గా ప్రయాణించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఊహించని విధంగా ఏర్పడే విమాన ఆలస్యాల నుంచి మిస్స్డ్ కనెక్షన్స్ నుంచి బ్యాగేజీ కోల్పోవడం వరకు అంతే కాకుండా వైద్య అత్యవసర పరిస్థితుల నుంచి సాహసక్రీడల వరకు మేము అన్నీ కవర్ చేస్తాం. తద్వారా మీరు మనశ్శాంతిగా వెళ్లొచ్చు.
అన్నింటి కంటే ముఖ్యంగా ప్రయాణం అనేది మీకు పునరుజ్జీవం మరియు విశ్రాంతిని అందించేందుకు ఉపయోగపడుతుంది. ఆన్లైన్లో ఉండే మా ట్రావెల్ ఇన్సూరెన్స్ కస్టమైజ్ చేసుకునే విధంగా ఉంటుంది. దీని వలన మీరు మంచి అనుభూతిని పొందుతారు.
కావున మీరు బంగీ జంపింగ్ చేస్తూ అనుకోకుండా గాయపడినా లేదా మీరు కేవలం మీ వాలెట్ లేదా పాస్‌పోర్ట్ కోల్పోయినందుకు మాత్రమే మోసపోతారు. లేదా విదేశాల్లో కారును అద్దెకు తీసుకుని దానిని పాడు చేసినపుడు చట్టపరమైన సమస్యల్లో మాత్రమే చిక్కుకుంటారు. విదేశీ ప్రయాణ బీమాతో మీ ప్రయాణాన్ని సురక్షితం చేయడం ద్వారా మీరు అన్నిటి నుంచి కవర్ అవుతారు.
ఇందులో ఉన్న గుడ్ న్యూస్ ఏమిటంటే.. మీరు పరిహారం కోసం లేదా క్లెయిమ్ అమౌంట్ కోసం ఎటువంటి గాబరా పడక్కర్లేదు. ఆన్లైన్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం నుంచి క్లెయిమ్ చేసే వరకు ఇలా ప్రతీది సులభంగా అయిపోతుంది. నిమిషాల వ్యవధిలో డిజిటల్‌గా పూర్తవుతుంది.
ఈ ప్రశ్న మీ మనసును తొలిచేస్తుంటే.. పూర్తిగా చదవండి
మెడికల్ కవర్ |
||
అత్యవసర పరిస్థితులలో యాక్సిడెంటల్ ట్రీట్మెంట్, తరలింపు ప్రమాదాలు అనుకోని సమయాల్లో జరుగుతాయి. దురదృష్టవశాత్తు మేము అక్కడ మిమ్మల్ని ఆ సమయంలో రక్షించలేం. మీకు ఉత్తమమైన చికిత్సను అందించడంలో మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తాం. వెంటనే అందించాల్సిన వైద్య చికిత్సకు కావాల్సిన వాటిని మేము కవర్ చేస్తాం. |
✔
|
✔
|
ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ & తరలింపు ఎక్కడో తెలియని దేశంలో మీరు పర్యటనలో ఉండగా.. అనారోగ్యానికి గురైతే దేవుడు కూడా పట్టించుకోడు. కానీ మీరు ఏం చింతించకండి. మేము మీ చికిత్స ఖర్చుల గురించి మొత్తం చూసుకుంటాం. ఆసుపత్రి గది అద్దె, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు మొదలైన అన్ని ఖర్చులను మేము కవర్ చేస్తాం. |
✔
|
✔
|
పర్సనల్ యాక్సిడెంట్ ఈ కవర్ ఎప్పటికీ అవసరం కాకూడదని మేము ఆశిస్తున్నాం. కానీ మీరు పర్యటనలో ఉన్నపుడు యాక్సిడెంట్ జరిగి మరణం లేదా వైకల్యం సంభవించినపుడు ఈ కవర్ మీకు మద్దతును అందిస్తుంది. |
✔
|
✔
|
డెయిలీ క్యాష్ అలొవెన్స్ (రోజు చొప్పున గరిష్టంగా 5 రోజుల వరకు) మీరు పర్యటనలో ఉన్నపుడు క్యాష్‌ను చాలా సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. మీకు అత్యవసర పరిస్థితులు వచ్చి అదనంగా చెల్లించాలని మేము కోరుకోవడం లేదు. కావున మీరు ఆసుపత్రిలో ఉన్నపుడు మీ రోజువారీ ఖర్చులను మేనేజ్ చేసేందుకు మేము మీకు స్థిరమైన నగదును అందిస్తాం. |
×
|
✔
|
యాక్సిడెంటల్ డెత్ మరియు అంగవైకల్యం ఈ కవర్లో ఎమర్జెన్సీ యాక్సిడెంటల్ ట్రీట్మెంట్ కవర్ వంటి ప్రతీదీ ఉన్నప్పటికీ అంతే కాకుండా ఈ కవర్‌కు ఒక అదనపు రక్షణ పొర ఉంది. ఇది విమానంలో ఎక్కేటపుడు, డీ బోర్డింగ్ (విమానం దిగేటపుడు), లేదా విమానంలో ఉన్నపుడు మరణం లేదా వైకల్యం సంభవించినపుడు ఇది కవర్ చేస్తుంది. |
✔
|
✔
|
ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్మెంట్ మీరు పర్యటనలో ఉన్నపుడు ఏదైనా భరించలేని నొప్పిని ఎదుర్కొంటే లేదా ప్రమాదవశాత్తు మీ దంతాలకు గాయం అయితే వైద్యుడు అందించే అత్యవసర దంత చికిత్సకు అయ్యే ఖర్చులను మేము మీకు అందజేస్తాం. |
×
|
✔
|
స్మూత్ ట్రాన్సిట్ కవర్స్ |
||
ట్రిప్ క్యాన్సలేషన్ దురదృష్టవశాత్తు మీ ట్రిప్ రద్దు చేయబడితే మీరు ముందస్తుగా ట్రిప్ బుకింగ్ కొరకు ఖర్చు చేసిన తిరిగి చెల్లించలేని ఖర్చులను కూడా మేము కవర్ చేస్తాం. |
×
|
✔
|
కామన్ క్యారియర్ డిలే మీ విమానం ఒక నిర్దిష్ట సమయం కంటే ఎక్కువ సేపు ఆలస్యం అయితే మీకు బెనిఫిట్ అమౌంట్ మొత్తం అందుతుంది. ఇందుకోసం ఎటువంటి ప్రశ్నలు అడగబడవు. |
×
|
✔
|
బ్యాగేజ్ చెకింగ్‌లో ఆలస్యం కన్వేయర్ బెల్డ్ వద్ద వెయిట్ చేయడం చాలా బాధిస్తుంది. కావున మీ చెక్ ఇన్ బ్యాగేజీకి ఆరు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే మీరు మొత్తం ప్రయోజనాన్ని పొందుతారు. ఎటువంటి ప్రశ్నలు అడగబడవు. |
✔
|
✔
|
చెక్ చేసిన బ్యాగేజీకి నష్టం ట్రిప్‌లో సంభవించే చివరి విషయం ఏమిటంటే.. మీ సామగ్రిని పోగొట్టుకోవడం. కానీ ఇటువంటి విషయం జరిగితే మీరు మొత్తం బ్యాగేజీ శాశ్వతంగా పోయిందని ప్రయోజనాన్ని పొందుతారు. రెండు మూడు బ్యాగులు పోగొట్టుకుంటే మీరు వాటి ప్రకారంగా ప్రయోజనం పొందుతారు. అంటే ప్రయోజనం మొత్తంలో 2/3వ వంతు అన్నమాట. |
✔
|
✔
|
మిస్స్డ్ కనెక్షన్ మీరు ఫ్లైట్ మిస్సయ్యారా? ఎటువంటి చింత అక్కర్లేదు. మేము మీకు వసతి కల్పించి మీరు టికెట్లో లేదా మీ ప్రయాణ ప్రణాళికలో ఉన్న తదుపరి స్థానం చేరుకునేందుకు అదనంగా చెల్లిస్తాం. ఒక వేళ ఫ్లైట్ ఆలస్యం కావడం వల్ల మీరు ముందుగా బుక్ చేసుకున్న ఫ్లైట్ మిస్సయితే.. |
×
|
✔
|
ఫ్లెక్సిబుల్ ట్రిప్ |
||
లాస్ ఆఫ్ పాస్‌పోర్ట్ మీకు తెలియని దేశంలో పాస్‌పోర్ట్ లేదా వీసా కోల్పోవడం వంటి చెత్త విషయం మరొకటి ఉండదు. ఇలాంటివి ఏవైనా జరిగి విదేశాల్లో మీ వస్తువులు దొంగిలించబడినా లేదా పాడయిపోయినా మేము మీకు ఖర్చులను తిరిగి చెల్లిస్తాం. |
✔
|
✔
|
ఎమర్జెన్సీ క్యాష్ ఏదైనా చెడ్డరోజున అనుకోకుండా మీ నగదు అంతా దొంగిలించబడి మీకు అత్యవసరంగా నగదు అవసరం అయితే ఈ కవర్ మిమ్మల్ని కాపాడుతుంది. |
×
|
✔
|
ఎమర్జెన్సీ ట్రిప్ ఎక్స్టెన్షన్ (అత్యవసరంగా ట్రిప్‌ను పొడగించడం) సెలవులు అప్పుడే పూర్తి కావడం మాకు ఇష్టం లేదు. అలాగని ఆసుపత్రిలో ఉండడం కూడా ఇష్టం లేనపుడు.. మీ పర్యటనలో అత్యవసర పరిస్థితి కారణంగా..మీరు ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే.. మేము హోటల్ ఖర్చలు, మరియు మరలా విమానం బుక్ చేసేందుకు అయ్యే ఖర్చులను మేము మీకు అందజేస్తాం. అత్యవసర పరిస్థితి అంటే మీరు పర్యటించే ప్రాంతంలో సహజవిపత్తు లేదా ఆసుపత్రిలో చేరడం. |
×
|
✔
|
ట్రిప్ రద్దవడం ఏదైనా అత్యవసర పరిస్థితి కారణంగా మీరు పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావడం బాధాకరం. మేము దానిని పరిష్కరించలేం కానీ ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు, తిరిగి చెల్లించని ప్రయాణ ఖర్చులైన వసతి, ముందుగా ప్లాన్ చేసిన ఈవెంట్స్ మరియు విహారయాత్ర ఖర్చులను మేము కవర్ చేస్తాం. |
×
|
✔
|
పర్సనల్ లయబులిటీ బెయిల్ బాండ్ అనుకోని సంఘటన కారణంగా మీరు ప్రయాణం చేస్తున్నపుడు మీ మీద ఏవైనా చట్టపరమైన ఆరోపణలు ఉంటే అందుకు మేము చెల్లిస్తాం. |
×
|
✔
|
పైన సూచించబడిన కవరేజ్ ఆప్షన్ కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే. ఇది మార్కెట్ అధ్యనం మరియు అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. మీరు అవసరానికి అనుగుణంగా ఏదైనా అదనపు కవరేజీలను ఎంచుకోవచ్చు. మీరు ఏవైనా ఇతర కవరేజీలను ఎంచుకోవాలని అనుకున్నా లేక ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే దయచేసి 1800-258-5956 నెంబర్‌పై కాల్ చేయండి.
పాలసీ వివరాలను చదవాలని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నొక్కండి..
డిజిట్ యాప్ లేదా వెబ్సైట్లో, భౌగోళికం/దేశం, ప్రయాణికుల సంఖ్య మరియు పుట్టిన తేదీని ఎంచుకుని, ‘ధరలను వీక్షించండి.’ క్లిక్ చేయండి.
ప్లాన్‌ని ఎంచుకుని, బీమా మొత్తాన్ని ఎంచుకుని, 'కొనసాగించు' క్లిక్ చేయండి.
తర్వాత, మీ వ్యక్తిగత మరియు నామినీ వివరాలను పూరించండి, పూర్తి ఆరోగ్య ప్రకటన, 'ఇప్పుడే చెల్లించండి' క్లిక్ చేసి, చెల్లింపును పూర్తి చేయండి.
మీరు పూర్తి చేసారు! పాలసీ డాక్యుమెంట్ మీకు ఇమెయిల్, SMS మరియు WhatsApp ద్వారా పంపబడుతుంది. మీరు దీన్ని డిజిట్ యాప్‌లో 24/7 కూడా యాక్సెస్ చేయవచ్చు.
కీ ఫీచర్స్ |
డిజిట్ ద్వారా కలిగే ప్రయోజనం |
ప్రీమియం |
₹395 నుంచి ప్రారంభం |
క్లెయిమ్ ప్రాసెస్ |
ఎటువంటి పేపర్ వర్క్ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ద్వారా పూర్తవుతుంది. |
క్లెయిమ్ సెటిల్మెంట్ |
24x7 మిస్స్డ్ కాల్ ఫెసిలిటీ (సౌకర్యం) అందుబాటులో ఉంది |
ఏయే దేశాలు కవర్ అవుతాయి |
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కంటే ఎక్కువదేశాలు & దీవులు |
ఫ్లైట్ ఆలస్యం అయితే కలిగే ప్రయోజనం |
6 లేదా అంతకంటే ఎక్కువ గంటలు విమానం ఆలస్యం అయితే రూ. 500 నుంచి రూ.1000 వరకు ఆటోమేటిగ్గా మీకు ట్రాన్స్ఫర్ చేయబడతాయి. |
అందుబాటులో ఉన్న కవర్స్ |
ట్రిప్ క్యాన్సలేషన్, మెడికల్ కవర్, ఫ్లైట్ ఆలస్యం కావడం, బ్యాగేజీ చెకింగ్‌లో ఆలస్యం కావడం, పాస్‌పోర్ట్ కోల్పోవడం, డైలీ ఎమర్జెన్సీ క్యాష్ మొదలయినవి. |
మీరు మా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసిన తరువాత, 3 స్టెప్‌లలో పూర్తి డిజిటల్ విధానంలో క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉన్నందున మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు!
1800-258-5956 పై మాకు కాల్ చేయండి (ఒకవేళ భారతదేశంలో ఉన్నట్లయితే) లేదా +91-7303470000పై మిస్డ్ కాల్ ఇవ్వండి. మేం 10 నిమిషాల్లో మీకు తిరిగి కాల్ చేస్తాం.
పంపిన లింక్‌పై అవసరమైన డాక్యుమెంట్లు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్లోడ్ చేయండి.
మిగతాదంతా మేము చూసుకుంటాం!
మేము ఇన్సూరెన్స్‌ను సరళతరం చేస్తున్నాము అని చెప్పడమే కాదు, దాన్ని నిజంగా చేసి చూపాం! ట్రావెల్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, మీ ప్రయాణంలో మీరు ఇప్పటికే ఖర్చు చేసిన సమయం, డబ్బును మేం అర్థం చేసుకున్నాం. అందుకే మేము మా ప్రక్రియలన్నింటినీ సూపర్ సింపుల్‌గా, పేపర్‌లెస్‌గా, వేగవంతంగా చేశాం!
మీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోవడం కోసం మీ పాలసీ డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. అన్నింటికంటే, అనిశ్చిత సమయాల్లో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు ఈ పాలసీని కొనుగోలు చేసారు. డిజిట్ అనేది ఇన్సూరెన్స్‌ని ఎంతగానో సులభతరం చేయడం అంటే 5 ఏళ్ల పిల్లవాడు కూడా సంక్లిష్టమైన నిబంధనలను అర్థం చేసుకోగలడు!
మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కాంప్రహెన్సివ్ కాబట్టి, దిగువ మీ పాలసీ డాక్యుమెంట్లో పేర్కొన్న కొన్ని క్లిష్ట నిబంధనలను మేము సరళీకృతం చేసాము:
మా పాలసీ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, అందుకే మేము మా కవరేజీలను మరింత బాగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి కొన్నింటిని కూడా సరళీకృతం చేసాము. మీరు మా కవరేజీల గురించి ఇక్కడ చదువుకోవచ్చు.
ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు
మీరు వారిలో ఒకరా?
ఆన్లైన్లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు వెతకాల్సిన, సరిపోల్చవలసిన మొదటి మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి
ప్రయాణాలు చేసేటపుడు మీరు తప్పకుండా బీమాను కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. ఇప్పుడు ఏ ప్లాన్‌ను ఎంచుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా? మీ ట్రిప్ స్వభావం, మీరు వెళ్లే సమయం, పర్పస్ను బట్టి మీకు అనేక రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లాన్ ఎంచుకునే ముందు కవరేజ్ మరియు ప్రీమియం గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
కొన్ని రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు:
ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మీ ఇన్సూరెన్స్ పాలసీకి అయ్యే ఖర్చు. పాలసీ హోల్డర్‌గా మీరు ఈ ఖర్చును భరించాల్సి ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత తప్పనిసరిగా చెల్లించాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మీ వయస్సు, ట్రిప్ డ్యురేషన్, స్థానం, ఎంత మంది ప్రయాణికులు, మీరు ఏం ఏం యాడ్ ఆన్స్ తీసుకుంటున్నారనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని ఎక్కువ కవర్స్ తీసుకుంటారో మీ ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది. డిజిట్లో కేవలం రూ. 225 నుంచే ప్రీమియం స్టార్ట్ అవుతుంది. మీరు మీ ప్రీమియం అమౌంట్‌ను తగ్గించుకోవాలని చూస్తే ఈ కింది విషయాలను పరిగణలోకి తీసుకోండి.
లేదు, ప్రపంచంలోని అన్ని దేశాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు. అయితే, విదేశంలో దురదృష్టకర పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా, అనేక సందర్భాల్లో మీ వీసా దరఖాస్తు ఆమోదం పొందేలా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.
స్కెంజెన్ ప్రాంతంలోని దేశాలతో సహా అనేక దేశాలకు వెళ్లాలంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది లేకుండా, మీరు ఆ దేశాల వీసాలు పొందలేరు.
వీసా దరఖాస్తులు, ప్రక్రియలు ఎంత అలస్యం అవుతాయో మనందరికీ తెలుసు. అదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకు భారతీయులు వీసా దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
భారతీయ పౌరులకు వీసా అవసరం లేని, లేదా ఆ దేశానికి చేరుకున్నాక వీసా ఇచ్చే దేశాల జాబితాను చెక్ చేయండి.
ప్రతి ట్రావెలర్ స్కెంజెన్ దేశాలలో ఒకదానిని కనీసం ఒక్కసారైనా సందర్శించాలని కోరుకుంటాడు. కాబట్టి మీరు పూర్తి యూరో రైల్ టూర్ కోసం వెళుతున్నా లేదా ఎస్టోనియా, ఫిన్లాండ్ లేదా పోర్చుగల్ వంటి దేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నా, మీ స్కెంజెన్ టూరిస్ట్ వీసా ఆమోదం పొందడానికి మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం.
అయితే, స్కెంజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మీ వీసా ఆమోదం పొందడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఫ్లైట్ డిలే, బ్యాగేజ్ కోల్పోవడం లేదా ఆలస్యం, పాస్‌పోర్ట్ కోల్పోవడం, మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్, ట్రిప్ క్యాన్సెలేషన్, మెడికల్ ఎమర్జెన్సీలు, ఆర్థిక అత్యవసర పరిస్థితులు మొదలైన అనేక దురదృష్టకర పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.
ఒక్కో ప్రయాణికుడి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. అయితే, మీరు ఎలాంటి ప్రయాణికుడైనప్పటికీ, ప్రతి ప్రయాణానికి అవసరమైన కొన్ని ప్రయాణ అవసరాలు ఉన్నాయి.
విదేశాలకు వెళ్లేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన వివిధ వస్తువులకు సంబంధించిన జాబితా ఇక్కడ ఉంది.
భారతదేశం నుంచి పలు ప్రముఖమైన ప్రాంతాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్
భారతదేశం నుంచి పలు ప్రముఖమైన ప్రాంతాలకు వీసా గైడ్స్
నిరాకరణ -
మీ పాలసీ మీ పాలసీ షెడ్యూల్ మరియు పాలసీ పదాలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. దయచేసి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి.
దేశాలు, వీసా ఫీజులు మరియు ఇతర వాటి గురించి ఇక్కడ పేర్కొన్న సమాచారం వివిధ మూలాల నుండి తీసుకోబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి మీరు మీ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు, వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ట్రావెల్ పాలసీని కొనుగోలు చేసే ముందు లేదా మరేదైనా నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు