భారతదేశంలో ఆన్‌లైన్​లో క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్

మీ నగదు రహిత (క్యాష్​లెస్​) చికిత్స కోసం డిజిట్ యొక్క 6400కు పైగా ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి ఎంచుకోండి.
Happy Couple Standing Beside Car
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}

I agree to the  Terms & Conditions

Port my existing Policy
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
{{healthCtrl.otpError}}
Didn't receive SMS? Resend OTP

I agree to the  Terms & Conditions

Port my existing Policy

YOU CAN SELECT MORE THAN ONE MEMBER

{{healthCtrl.patentSelectErrorStatus}}

  • -{{familyMember.multipleCount}}+ Max {{healthCtrl.maxChildCount}} kids
    (s)

DONE
Renew your Digit policy instantly right
Loader

Analysing your health details

Please wait moment....

క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?

క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?

Cashless Hospitals by Digit

డిజిట్ క్యాష్‌లెస్ నెట్‌వర్క్ ఆస్పత్రులు

డిజిట్ క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ గొప్పదనం ఏంటి?

  • సులభమైన ఆన్‌లైన్ ప్రక్రియలు - క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి క్లెయిమ్‌లు చేయడం వరకు చాలా సులభమే కాకుండా త్వరితంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతుంది.

  • అదనపు బీమా మొత్తం - ప్రధానంగా, ప్రమాదవశాత్తు ఆస్పత్రిలో చేరినా, తీవ్రమైన అనారోగ్యాల కోసం సున్నా ఖర్చుతో చికిత్స!

  • మహమ్మారులను కవర్ చేస్తుంది - దేశంలో కోవిడ్​-19 ఎన్నో రెట్లు పెరుగుతోంది. ఇది మీకు, మీ కుటుంబానికి కలిగించే రిస్కులను అర్థం చేసుకున్నాం. అందుకే మహమ్మారి అయినప్పటికీ కరోనా వైరస్​ను మా క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
  • వయస్సు ఆధారిత కో–పేమెంట్​ ఉండదు - మా క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్​లో వయస్సు ఆధారిత కో–పేమెంట్​ ఉండదు. దీని అర్థం ఏంటంటే మీ క్యాష్​లెస్ క్లెయిమ్‌ల సమయంలో - మీ జేబు నుంచి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

  • రూమ్​ రెంట్ పరిమితి లేదు - ప్రతి ఒక్కరికి వేర్వేరు ప్రాధాన్యాలు ఉంటాయి. దాన్ని మేము అర్థం చేసుకున్నాం. అందుకే రూమ్​ రెంట్ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. మీరు ఇష్టపడే ఏదైనా ఆస్పత్రిలో మీకు నచ్చిన గదిని ఎంచుకోవచ్చు.

  • 2 రెట్ల బీమా మొత్తం - మీ బీమా మొత్తం పూర్తయిందనుకోండి..  దురదృష్టవశాత్తూ సంవత్సరంలో రెండో సారి అవసరమైతే మేము దాన్ని మీకోసం రీఫిల్ చేస్తాం.

  • క్యుములేటివ్ బోనస్  - ఆరోగ్యంగా ఉన్నందుకు ఇది ఒక రివార్డు. క్లెయిమ్ చేయని సంవత్సరాల కోసం వార్షిక క్యుములేటివ్ బోనస్‌ను పొందండి!

డిజిట్ అందించే క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతుంది?

క్యాష్​లెస్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఏమిటి?

No upfront cash payments!

ముందస్తు నగదు చెల్లింపులు లేవు!

క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క అతిపెద్ద, అతి ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ఆరోగ్య బీమాను క్లెయిమ్‌ చేసే సమయంలో మీరు సొంతంగా చెల్లించాల్సిన అవసరం పడదు. లేదంటే మీరు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకుని, ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ కోసం వేచి చూడాల్సి ఉంటుంది! మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆ సమయంలో బాధ పడాల్సింది డబ్బు గురించి.. ఆ విషయంలో క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు సహాయం చేస్తుంది.

No uncertainty

ఎలాంటి అనిశ్చితి ఉండదు

క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు ముందుగా ఆమోదం పొందాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్య బీమా సంస్థ మీ క్లెయిమ్​ను ఆమోదించేలా చూసుకోండి. అయితే, రీయింబర్స్‌మెంట్ విషయంలో చికిత్స తర్వాత మాత్రమే డాక్యుమెంట్లు ఇస్తారు. అప్పుడే బిల్లులు ప్రాసెస్ అవుతాయి. అలాగే క్లెయిమ్ పూర్తిగా ఆమోదం పొందకపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల రీయింబర్స్​మెంట్​లో పూర్తి రీయింబర్స్‌మెంట్‌ అందుతుందా లేదా అనే అనిశ్చితి ఎల్లప్పుడూ ఉంటుంది. అదే క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​లో అలాంటి అనిశ్చితి ఉండదు.

Quick and hassle-free process!

త్వరిత, అవాంతరాలు లేని ప్రక్రియ!

క్యాష్​లెస్ క్లెయిమ్‌లు, రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు రెండూ కూడా బీమా సంస్థ, ప్రక్రియలను బట్టి అవాంతరాలు లేకుండా జరుగుతాయి. అయితే రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు పొందడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే క్యాష్‌లెస్ క్లెయిమ్‌ల మాదిరిగా కాకుండా రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు చికిత్స తర్వాత జరుగుతాయి. అయితే క్యాష్‌లెస్ క్లెయిమ్‌లు అడ్మిషన్ సమయంలోనే ఆమోదం పొందుతాయి. అలాగే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

క్యాష్​లెస్ క్లెయిమ్, రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ మధ్య తేడా?

పైన చెప్పినట్టుగా ఆరోగ్య బీమాలో- క్లెయిమ్‌ సమయంలో మీరు రెండు రకాల ప్రక్రియలు ఎంచుకోవచ్చు. క్యాష్​లెస్ లేదా రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్. రెండింటి మధ్య కీలకమైన వ్యత్యాసాలను అర్థం చేసుకునేందుకు మీకు సహాయపడే పట్టిక కింద ఉంది!

క్యాష్​లెస్ క్లెయిమ్

రీయింబర్స్​మెంట్ క్లెయిమ్

దీని అర్థం ఏంటి?

క్యాష్​లెస్ క్లెయిమ్ అంటే మీ ఆరోగ్య బీమా సంస్థ యొక్క నెట్‌వర్క్ ఆస్పత్రిలో మొదటి నుంచీ బిల్లులను చూసుకుంటుంది. మీరు ముందుగా ఎలాంటి డబ్బూ చెల్లించాల్సిన అవసరం లేదు.

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లో, మీరు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. మీ క్లెయిమ్ ఆమోదం, రీయింబర్స్‌మెంట్ కోసం మీ ఆసుపత్రి బిల్లులు, ఆసుపత్రిలో చేరిన తర్వాత అన్ని చెల్లింపులు, మీ మెడికల్ ధ్రువపత్రాలు సమర్పించాలి.

క్లెయిమ్‌ల కోసం ముందస్తు ఆమోదం అవసరమా?

ముందుగానే తెలిసి ఆసుపత్రిలో చేరితే కనీసం 72-గంటల ముందు.. అలాగే మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితిలో 24-గంటల లోపు క్లెయిమును ఆమోదించుకోవాలి.

ముందుగానే మీ క్లెయిమును ఆమోదించుకోవాల్సిన అవసరం లేదు. అయినా కూడా మీ చికిత్స కవర్ అవుతుందో లేదో ఓసారి మీ బీమా సంస్థతో తనిఖీ చేసుకుంటే మంచిది. రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ మీ చికిత్స తర్వాత ప్రారంభం అవుతుంది. సాధారణంగా, అన్నీ పూర్తవడానికి 2 నుంచి 4 వారాల సమయం పడుతుంది.

ఇది అన్ని ఆసుపత్రుల్లో వర్తిస్తుందా?

క్యాష్​లెస్ క్లెయిమ్‌లు మీ బీమా సంస్థ యొక్క నెట్‌వర్క్ ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తాయి.

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను ఏదైనా ఆస్పత్రి ద్వారా చేయొచ్చు. ఇది నెట్‌వర్క్ ఆస్పత్రిలో భాగమా లేదా అనేదానితో సంబంధం ఉండదు.

భారతదేశంలో క్యాష్​లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)