ప్రస్తుతం భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం విపరీతంగా మార్పులకు లోనవుతోంది. ఆరోగ్యం మన జీవితంలో అత్యంత కీలకమైన భాగాలలో ఒకటి, సరైన రకమైన ఆరోగ్య సంరక్షణ అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి, మనకు కొంత మనశ్శాంతిని ఇవ్వడానికి సహాయపడే వాటిలో ఒకటి.
ఏదేమైనా ఈరోజుల్లో అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుండి మీ ఆరోగ్యాన్ని సంరక్షించే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా ఎంచుకుంటారు? ఇక్కడ మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.
1. కవరేజీ వివరాలను లెక్కించండి: చాలా మంది ప్రజలు పొరపాటున హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను మాత్రమే పోలుస్తారు. అయితే ప్రతీ హెల్త్ ఇన్సూరెన్స్ విభిన్న కవరేజీ స్పెసిఫికేషన్లతో వస్తుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల మీ కోసం బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడంలో మీకు సహాయపడే సూక్ష్మమైన వివరాలతో పాటు లభ్యం అవుతున్న అన్ని కవర్లను మీరు పోల్చడం, మదింపు చేయడం ఎంతో ముఖ్యం.
2. ప్రాసెస్లను చెక్ చేయండి: కొనుగోలు చేసే ప్రక్రియ, మరీ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ ఎల్లప్పుడూ సుదీర్ఘమైనదిగా, గజిబిజిగా ఉంటుంది. అయితే సరళమైన, ఆన్లైన్ ప్రక్రియలతో వచ్చే బీమా సంస్థలను ఎంచుకోండి. అందువల్ల, మీరు కోరుకున్న బీమా సంస్థ క్లెయిమ్, కొనుగోలు ప్రక్రియ ఎలా ఉంటుందో ఎల్లప్పుడూ గమనించండి. దానికి అనుగుణంగా మీ ఆప్షన్లను లెక్కించండి.
3. సర్వీస్ ప్రయోజనాలు: కవరేజీ ప్రయోజనాలతో పాటుగా, బీమా సంస్థలు తమ కస్టమర్లకు ప్రత్యేక సర్వీస్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అందువల్ల మీరు ఎంచుకోవడానికి ముందు విభిన్న సర్వీస్ ప్రయోజనాలను కూడా పరిశీలించండి.
4. క్యుములేటివ్ బోనస్: క్యుములేటివ్ బోనస్ అనేది మీరు ఎన్నడూ హెల్త్ ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోనట్లయితే రెన్యువల్ సమయంలో మీరు పొందే బీమా మొత్తం యొక్క అదనపు శాతం. ఒక్కో బీమా సంస్థ ఒక్కోలా క్యుములేటివ్ బోనస్‌ను అందిస్తాయి. అందువల్ల మీ ఆప్షన్లను పోల్చి, మీకు ఏది సరిగ్గా సరిపోతుందో చూడండి.
5. కోపేమెంట్: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయంలో మీ జేబు నుండి మీరు చెల్లించాల్సిన డబ్బు మొత్తాన్ని కోపేమెంట్ సూచిస్తుంది. సాధారణంగా చాలా హెల్త్ ఇన్సూరెన్స్ లు వారి ప్లాన్లలో కనీసం 10 నుండి 20% కోపేమెంట్ ను కలిగి ఉంటాయి. ఏదేమైనా మాలాంటి ప్లాన్లకు వయసు ఆధారిత కోపేమెంట్లు ఉండవు. అందువల్ల మీకు ఏది సరిపోతుందో చూసుకోండి, దానికి తగ్గట్టుగా ఒక దానిని ఎంపిక చేసుకోండి.