హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉపయోగించే అన్ని సంక్లిష్టమైన నిబంధనలు మరియు పరిభాషను అర్థం చేసుకోవడం మీకు కష్టంగా ఉందా? మీరు ఒంటరి వారు కారు.చింతించకండి. దాదాపుగా 50 పేజీల ఇన్సూరెన్స్ పత్రాలను చదవడం ఎంత కష్టమో మేము అర్థం చేసుకున్నాము.
అయితే చింతించకండి, మీ కోసం ఇన్సూరెన్స్ ను సులభతరం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ముందు మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన నిబంధనలతో సిద్ధంగా ఉండటానికి మేము మీకు సహాయం చేస్తాము.
మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన పదం సమ్ ఇన్సూర్డ్.
సమ్ ఇన్సూర్డ్ అంటే ఏమిటి?
సమ్ ఇన్సూర్డ్ (SI) అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, అనారోగ్యానికి సంబంధించిన చికిత్స మొదలైన వాటి కారణంగా మీరు క్లయిమ్ చేసిన సందర్భంలో మీకు (భీమా చేసిన వ్యక్తికి) అందించబడే గరిష్ట మొత్తం. ఇది నేరుగా నష్టపరిహారం అనే భావనపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీరు క్లయిమ్ చేసినప్పుడు, వైద్య చికిత్స కోసం ఖర్చు చేసిన ఖర్చుల రీయింబర్స్మెంట్ మీకు లభిస్తుంది.
చికిత్సకు అయ్యే ఖర్చు సమ్ ఇన్సూర్డ్ కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటే, మొత్తం బిల్లు మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది.
అయితే, చికిత్స లేదా ఆసుపత్రిలో చేరే ఖర్చులు సమ్ ఇన్సూర్డ్ కంటే ఎక్కువగా ఉంటే, SIకి మించిన అదనపు ఖర్చును మీరే భరించాలి.
సంక్షిప్తంగా, మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థతో క్లయిమ్ చేసిన సందర్భంలో మీరు పొందగలిగే నష్టపరిహారం-ఆధారిత రీయింబర్స్మెంట్ మొత్తాన్ని సమ్ ఇన్సూర్డ్ అంటారు.
హెల్త్ ఇన్సూరెన్స్, గృహ ఇన్సూరెన్స్ , మోటారు ఇన్సూరెన్స్ మొదలైన అన్ని నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ లు ఈ బీమా మొత్తాన్ని అందిస్తాయి.