1. చురుగ్గా ఉండండి – చాలా మంది వయసు పెరిగే కొద్ది వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. ఇలా చేయడం వలన మీరు అనేక రకాల వ్యాధులకు గురికావచ్చు. మీరు ఈ విషయాన్ని మీ కోసం చదివినా, లేదా మీ తల్లిదండ్రుల కోసం చదివినా వ్యాయామం మాత్రం ముఖ్యం. ప్రతి రోజూ 15-20 నిమిషాల పాటు యోగా కానీ, వాకింగ్ కానీ చేసి ఆరోగ్యంగా ఉండవచ్చు.
2. ఆరోగ్యకరమైన ఆహారం తినండి – మనం తినే ఆహరం వలన మన ఆరోగ్యం 70% మెరుగుపడుతుంది. ఈ విషయాన్ని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మీరు కానీ, మీ తల్లిదండ్రులు కానీ తీసుకునే ఆహారం మీద జాగ్రత్త వహించండి. మీరు, మీ తల్లిదండ్రులు తప్పకుండా సమతుల ఆహారం తీసుకోండి. క్యాల్షియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. ఆయిల్ ఫుడ్స్, డెయిరీ ఉత్పత్తులను వీలయినంత వరకు తినడం మానేయండి.
3. నివారణ మీద దృష్టి పెట్టండి - జబ్బు బారినపడి కోలుకోవడం కంటే ముందే జబ్బు బారిన పడకుండా ఉండటం ఉత్తమం. 😊 కావున ప్రతి సారి వార్షిక చెకప్స్ కోసం వెళ్లండి. మీ ఆరోగ్యం పట్ల అవగాహనను కల్గి ఉండండి. అవగాహన అనేది అనేక రకాలుగా వచ్చే ఆరోగ్య ప్రమాదాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
4. మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి – మన దేశంలో 65 సంవత్సరాలకు పైబడిన వారిలో 50శాతం కంటే ఎక్కువ మంది ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు. చిన్న చిన్న చిట్కాలను పాటించి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ధ్యానం, తోట పని వంటి పనుల్లో పాలు పంచుకోవడం వలన మీ మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. పెద్దలయిన మీ తల్లిదండ్రులు ఒత్తిడి, ఆందోళనకు లోనయితే వెంటనే దగ్గర్లోని సైకాలజిస్ట్ వద్ద కౌన్సెలింగ్ ఇప్పించండి.
5. డెంటల్ చికిత్సకు వెళ్లండి – డెంటల్ సమస్యలు వయోవృద్ధులకు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి, మీ తల్లిదండ్రులకు తరచూ డెంటల్ పరీక్షలు చేయించండి.
6. జనంతో కలిసిపోండి – చాలా మంది వయోవృద్ధులు ఒంటరితనంతో బాధపడుతున్నారు. మనిషికి కావాల్సింది తోడు. అది తన పక్కింటి వారైనా కానీ, కుటుంబ సభ్యులైనా కానీ, స్నేహితులైనా కానీ తోడుగా ఉంటే మనిషి మానసికంగా బలంగా ఉంటాడు. పక్కవారితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.
7. బాగా విశ్రాంతి తీసుకోండి – మంచి నిద్ర మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. ప్రతిరోజు మీ తల్లిదండ్రులు కనీసం ఎనిమిది గంటలైనా సరిగ్గా నిద్ర పోయేలా చూడండి.
8. ధూమపానం (స్మోకింగ్) మానేయండి– మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ ధూమపానం చేసేవారైతే ఆ అలవాటును వెంటనే మానేయండి. మానేసేందుకు ఇదే సరైన సమయం. ధూమపానం వలన ఏ ఒక్క లాభం చేకూరదు. ఏదేమైనప్పటికీ వయసు పెరిగే కొద్ది ధూమపానం చాలా దుష్ప్రభావాలను చూపిస్తుంది.
9. బాగా చదవండి – వయసు మళ్లిన తర్వాత జ్ఞాపకాలు బలహీనం అవుతాయని ఒక పురాణంలో ఉంది. ఇది అబద్ధం. ఎందుకంటే మీకు వయసు మళ్లిన తర్వాత మీ మెదడును చురుకుగా ఉంచుకోండి. చదవడం వలన మీ మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉండేందుకు ఇది చాలా సహాయపడుతుంది. కావున మీరు మీ మెదడును చురుకుగా ఉంచుకునేందుకు చదవడమనేది బాగా సాయపడుతుంది.
10. శరీరంలో నీటి స్థాయులు బాగా ఉండేలా చూసుకోండి – నీరు. మన జీవితంలో చాలా ముఖ్యమైన ద్రవం. మన శరీరంలో ఉన్న అనేక విషపదార్థాలను నీరు బయటకు పంపుతుంది. మేము ఈ విషయంలో జోక్ చేయడం లేదు. అధికంగా నీటిని తీసుకుని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు, మీ తల్లిదండ్రులు రోజుకు 8 గ్లాసుల మంచి నీటిని తప్పనిసరిగా తీసుకోండి. నీటిని ఎంత ఎక్కువ మొత్తంలో తాగితే అంత మంచిది.