జనరల్
జనరల్ ప్రోడక్ట్స్
సాధారణ & పారదర్శకమైనవి! మీ అన్ని ఇన్సూరెన్స్ అవసరాలకు సరిపోయే పాలసీలు.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
లైఫ్
లైఫ్ ప్రోడక్ట్స్
డిజిట్ లైఫ్ వచ్చింది! మీ ప్రియమైన వారి భవిష్యత్తును సురక్షితంగా, సరళంగా మరియు ఆదా చేసే విధంగా రక్షించడానికి.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
క్లెయిమ్స్
క్లెయిమ్స్
మేము ఉంటాము! మీకు ఎప్పుడు, ఎలాగైనా మేము అవసరం అవుతాము.
37K+ Reviews
7K+ Reviews
Scan to download
ఏజెంట్ అవ్వండి
రిసోర్సెస్
రిసోర్సెస్
ఇప్పుడు మీ జీవితంలో డిజిట్ సరళతను అనుభవించడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి!
37K+ Reviews
7K+ Reviews
Scan to download
37K+ Reviews
7K+ Reviews
మా WhatsApp నంబర్ ద్వారా కాల్స్ చేయలేరు. ఇది కేవలం చాట్ కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది.
26,000+
కార్పోరేట్లు కవర్ అయ్యారు
45 Lakh+
జీవితాలు ఇన్సూర్ చేయబడ్డాయి
Please enter your name
Please enter your Company Name
Please enter your designation
Please enter no. of employees
Please enter valid email address
Please enter your company email address
Please enter valid mobile number
Didn't receive SMS? Resend OTP
Please wait a moment....
Terms and conditions
We've just sent you an
OTP on this number.
+91 {{grphealthCtrl.userDetails.mobile}}
Resend code in
Resend OTP
By submitting my contact number and/or email ID, I authorize Go Digit General Insurance (Digit Insurance) to call, send email/SMS/WhatsApp and offer information and services about its product(s) and/or assist me for completing any incomplete journey/transaction. I further acknowledge and agree that such authorization will be over and above any registration of my contact number on TRAI’s NDNC registry.
గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ఒకే సంస్థ కింద పనిచేసే వ్యక్తుల సమూహాన్ని కవర్ చేస్తుంది. దీనికి సంస్థ యజమాని ప్రీమియం చెల్లిస్తారు కనుక ఇది తరచుగా ఉద్యోగులకు విలువైన ప్రయోజనంగా అందించబడుతుంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా విస్తరించవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పథకం కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఎంప్లాయి హెల్త్ ఇన్సూరెన్స్‌గా కూడా పేర్కొనబడుతుంది.
అయితే, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే దీనికి ధర చాలా తక్కువగా ఉంటుంది. పన్ను తగ్గింపుల్లో యజమానులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల ఇది అటు యజమాని, ఇటు ఉద్యోగి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.
డిజిట్లో అన్ని అస్వస్థతలు, వ్యాధుల నుంచి మీ ఉద్యోగులను కవర్ చేయడం కొరకు కాంప్రహెన్సివ్ ఎంప్లాయి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, కోవిడ్–19 లాంటి తీవ్రమైన మహమ్మారుల నుంచి మీ ఉద్యోగులు కవర్ అయ్యేలా చూడటం కొరకు కోవిడ్-19 స్పెసిఫిక్ గ్రూప్ కవర్ని మేం అందిస్తున్నాం.
డిజిట్ హెల్త్ ప్లస్ పాలసీ (రివిజన్) - GODHLGP21487V032021 (Digit Health Plus Policy (Revision) - GODHLGP21487V032021)
సులభమైన ఆన్లైన్ ప్రక్రియలు
సుదీర్ఘమైన పేపర్ వర్క్‌పై తమ సమయాన్ని వృథా చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. దాన్ని మేము అర్థం చేసుకున్నాము. మా దగ్గర గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసే ప్రక్రియ నుంచి క్లెయిమ్ చేయడం వరకు పేపర్ లెస్, తేలికగా, వేగంగా, చిరాకు లేకుండా ఉంటుంది! డిజిటల్ విప్లవంలో మేము కూడా ఒక భాగం.
కోవిడ్-19 కవర్ అవుతుంది!
ప్రతిరోజూ కేసులు పెరగడం, భారతదేశంలో ఇప్పటికే మూడో వేవ్ ప్రభావం ఉన్నందున, కోవిడ్-19 నుండి మీ ఉద్యోగులను కవర్ చేయడం ద్వారా కనీసం వారి ఆర్థిక, శారీరక ఆరోగ్యం, శ్రేయస్సును కోరుకున్న వారవుతారు. మీరు కోవిడ్-19 కవర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ని మాత్రమే తీసుకోవచ్చు లేదంటే అన్ని వ్యాధులు, అస్వస్థతలను కవర్ చేసే పూర్తి స్థాయి కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కూడా ఎంచుకోవచ్చు.
నగదు రహిత క్లెయిమ్‌లు
భారతదేశంలో విస్తరించిన మా ఆసుపత్రుల విస్తృత నెట్ వర్క్ ద్వారా నగదు రహిత (క్యాష్ లెస్) క్లెయిములను ఎంచుకునే అవకాశాన్ని మీ ఉద్యోగులకు ఇస్తుంది. కాబట్టి వారు భారతదేశంలో ఎక్కడ ఉన్నా, ఎల్లప్పుడూ సులభంగా కవర్ చేయబడతారు!
తక్కువ ధర ప్రీమియం
డిజిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కావడం వల్ల, మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు తక్కువ ఖర్చుతో కూడిన ప్రీమియంలతో వస్తాయి. తద్వారా మీరు మీ ఉద్యోగులందరినీ సౌకర్యవంతంగా కవర్ చేయవచ్చు.
ఆస్పత్రిపాలైన తర్వాత ఏకమొత్త ప్రయోజనం
మేము సరళమైన, త్వరిత క్లెయిముల ఆలోచనను సీరియస్‌గా తీసుకున్నాము. ఆసుపత్రిలో చేరిన తరువాత ఏక మొత్తం వల్ల బిల్లులు, రసీదులు మొదలైన వాటిని సేకరించాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రిలో చేరిన తరువాత అయ్యే ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రజలకు ఏక మొత్తం అందించడం ద్వారా ప్రయోజనం కలిగిస్తున్నాము.
ఒకటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్
థర్డ్ పార్టీలు, ఎక్కువ కాంటాక్ట్ పాయింట్లతో మీరు కో–ఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిజిట్ యొక్క గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో, మీరు మమ్మల్ని మాత్రమే సంప్రదిస్తే చాలు.
అన్ని రకాల కంపెనీ సైజులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి అర్హులు. మీరు 10 మంది సభ్యుల టీమ్ లేదా 25+ సభ్యుల స్టార్టప్ అయినా ఫర్వా లేదు. మా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని రకాల, సైజుల కంపెనీలను కవర్ చేస్తుంది.
16400+ క్యాష్‌లెస్ ఆసుపత్రులు
భారతదేశం అంతటా 16400+ క్యాష్ లెస్ ఆసుపత్రులతో, మీ ఉద్యోగులు భారతదేశంలో ఎక్కడ ఉన్నా సులభంగా కవర్ చేయబడతారు!
ప్రమాదం జరిగి ఆసుపత్రిపాలైతే
ఒకవేళ మీ ఉద్యోగి లేదా వారిపై ఆధారపడిన వారు ప్రమాదానికి గురైనట్లయితే రోడ్డు అంబులెన్స్ ఛార్జీలు, గది అద్దె, చికిత్స, డే కేర్ ప్రక్రియలు మొదలైన ఆసుపత్రిలో చేరడానికి ముందు, చేరిన తర్వాత అయ్యే ఖర్చులను ఇది కవర్ చేస్తుంది.
కోవిడ్-19 తో ఆసుపత్రిలో చేరడం
ఒకవేళ మీ ఉద్యోగి లేదా అతడి/ఆమె కుటుంబ సభ్యులు కోవిడ్-9 పాజిటివ్‌గా తేలితే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఆసుపత్రిలో చేరడానికి అయ్యే ఖర్చులకు కవరేజ్ లభిస్తుంది.
అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడం
కొన్నిసార్లు కొన్ని అనుకోని అస్వస్థతల వల్ల ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనం మీ ఉద్యోగి, వారిపై ఆధారపడిన వారికి అందించే అన్ని చికిత్సలు, ఆసుపత్రిలో చేరేందుకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.
రోజువారీ హాస్పిటల్ క్యాష్ కవర్
ఒకవేళ మీ ఉద్యోగి లేదా వారిపై ఆధారపడినవారు ఆసుపత్రిలో చేరినట్లయితే, ఖర్చులు ఆసుపత్రి బిల్లుకు మించి ఉంటాయి. అవి వారికి ఈ ప్రయోజనం కింద కవర్ చేయబడతాయి.
సైకియాట్రిక్ బెనిఫిట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యయనం ప్రకారం, భారతదేశ జనాభాలో కనీసం 6.5% మంది తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. అదృష్టవశాత్తూ, మీ ఉద్యోగి మానసిక ఆరోగ్యం కూడా మా హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ చేయబడుతుంది; మానసిక ఆరోగ్యం (మెంటల్ హెల్త్) ఎంత ముఖ్యమో, శారీరక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.
క్రిటికల్ ఇల్నెస్ కవర్
రోజురోజుకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు (క్రిటికల్ ఇల్‌నెస్‌లు) పెరుగుతున్నాయి. మా ప్లాన్ క్రిటికల్ ఇల్నెస్ ప్రయోజనంతో వస్తుంది. తద్వారా మీ ఉద్యోగి, వారిపై ఆధారపడిన వారు ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఉన్నట్లుగా నిర్ధారించబడినట్లయితే దానికి కవర్ చేయబడతారు.
న్యూ బేబీ బోర్న్ కవర్‌తో మాతృత్వ ప్రయోజనం
ఇది చాలా మంది యువ ప్రొఫెషనల్స్ ఆందోళన చెందుతున్న విషయం! మీ ఉద్యోగి లేదా వారి జీవిత భాగస్వామి కొరకు పిల్లల డెలివరీ ఖర్చులను కవర్ చేయడం కొరకు ఈ ప్రయోజనాన్ని ఎంచుకోవచ్చు. వంధ్యత్వ (ఇన్ఫర్నిలిటీ) చికిత్స లేదా వైద్యపరంగా అవసరమైన తొలగింపుల విషయంలో కూడా ఇది ఖర్చులను కవర్ చేస్తుంది.
ఇతర ప్రయోజనాలు
మా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యామ్నాయ చికిత్స (ఆయుష్), అవయవ దాన ఖర్చులు, వంధ్యత్వ (ఇన్ఫర్టిలిటీ) చికిత్స, బేరియాట్రిక్ శస్త్రచికిత్సల వంటి వాటికి కూడా కవర్ చేస్తుంది.
ప్రసూతికి ముందు, అనంతర ఖర్చులు
ప్రసూతికి ముందు, ప్రసూతి అనంతర వైద్య ఖర్చులు, ఉద్యోగి లేదా వారి జీవిత భాగస్వామి ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తే తప్ప.
పీఈడీ (PED) వెయిటింగ్ పీరియడ్
ఒకవేళ ముందే ఏదైనా వ్యాధి ఉన్నట్లయితే, వెయిటింగ్ పీరియడ్ ముగియనట్లయితే, ఆ వ్యాధి లేదా అస్వస్థత కొరకు క్లెయిమ్ చేయలేరు. అయితే, మీరు 50 మందికి పైగా సభ్యులను కవర్ చేయాలని అనుకుంటున్నట్లయితే, పీఈడీ (PED) వెయిటింగ్ పీరియడ్ మినహాయింపు ఉంటుంది.
వైద్యుని సిఫారసు లేకుండా ఆసుపత్రిలో చేరితే
మీ ఉద్యోగి ఆసుపత్రిలో చేరాల్సిన ఏ పరిస్థితికైనా, డాక్టర్ సిఫారసు లేకుండా మీ ఉద్యోగి ఆసుపత్రిలో చేరితే అది కవర్ కాదు.
సింగిల్ కవర్ కోసం మాత్రమే కోవిడ్ చికిత్స
ఒకవేళ మీరు కేవలం కోవిడ్ కవర్ని మాత్రమే ఎంచుకుంటున్నట్లయితే, ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ప్రభుత్వ అధీకృత పరీక్షా కేంద్రం నుంచి పాజిటివ్‌గా తేలితే మాత్రమే వర్తిస్తుంది.
ప్రాథమిక వెయిటింగ్ పీరియడ్‌కు ముందు చేయబడిన క్లెయిములు
కోవిడ్ సంబంధిత క్లెయిముల కొరకు, 15 రోజుల ప్రారంభ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది పూర్తి కావడానికి ముందు చేసిన క్లెయిములు కవర్ చేయబడవు.
|
ప్రీమియం |
ఒక్కో ఉద్యోగికి ₹1302 నుండి ప్రారంభం |
|
కో–పేమెంట్ |
కో–పేమెంట్‌కు వయసుతో సంబంధం లేదు |
|
క్యాష్‌లెస్ ఆస్పత్రులు |
భారతదేశ వ్యాప్తంగా 16400+ క్యాష్‌లెస్ ఆస్పత్రులు |
|
కొనుగోలు & క్లెయిమ్ ప్రక్రియ |
పేపర్ లెస్ ప్రక్రియ, డిజిటల్ ఫ్రెండ్లీ |
|
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ |
సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ |
|
కరోనా వైరస్‌కు చికిత్స |
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడుతుంది. ప్రత్యేక గ్రూప్ కవర్లా కూడా ఆఫర్ చేయబడుతుంది. |
ఉద్యోగుల గురించి శ్రద్ధ వహించే యజమానిగా ఉండండి. పేరులో సూచించినట్లుగా, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకే గొడుగు కింద పని చేసే వ్యక్తుల సమూహానికి సంబంధించినది.
సాధారణంగా కొత్త స్టార్టన్లు, పెద్ద సంస్థల ఉద్యోగుల కోసం ఇది కొనుగోలు చేయబడుతుంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కేవలం ఉద్యోగులకు ప్రయోజనాలు అందించడమే కాకుండా, సంస్థకు కూడా ప్రయోజనం అందిస్తుంది.
సాధారణంగా, 10 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న ఏదైనా సంస్థ తమ ఉద్యోగులను హెల్త్ ఇన్సూరెన్స్‌తో సంరక్షించాలి. మీకు అవసరమో లేదో ఖచ్చితంగా తెలియకపోతే, మేము మీకు సాయం చేస్తాము.
చిన్న కంపెనీలు & యువ స్టార్టప్‌లు
ఒకవేళ మీరు మీ సొంత యువ స్టార్టప్‌ను ప్రారంభించి, కనీసం 15 మంది టీమ్ సభ్యులను కలిగి ఉన్నట్లయితే, అప్పుడు మీరు మీ ఉద్యోగులను సంరక్షించడమే కాకుండా, మీ పన్ను పొదుపును ఆదా చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొరకు సైనప్ అవ్వవచ్చు. ఒకవేళ మీరు ఖర్చుల గురించి చాలా ఆందోళన చెందుతున్నట్లయితే, ఆందోళన చెందవద్దు- కంపెనీ యొక్క ఆర్థిక, ఉద్యోగుల బలం ప్రకారం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కస్టమైజ్ చేయబడతాయి.
మీడియం సైజ్ కంపెనీలు & వృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు
మీ కంపెనీ చిన్నది, కానీ గత కొంతకాలంగా కార్యకలాపాలు సాగిస్తోంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో మీ ఉద్యోగులను సంరక్షించడాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఇది మీ ఉద్యోగుల సంతోషం, ప్రేరణను పెంచడానికి మాత్రమే కాకుండా ఆ ప్రేరణను ఎక్కువ కాలం నిలుపుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది.
పెద్ద సంస్థలు, బాగా పేరొందిన స్టార్టప్‌లు
పెద్ద, బాగా పేరొందిన స్టార్టప్, ఆర్గనైజేషన్- కావడం వల్ల ఉద్యోగులు తమ ప్యాకేజీలో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలను ఆశిస్తారు. అందువల్ల మీకు 1,000 మంది సభ్యులు లేదా అంతకంటే తక్కువ మంది సభ్యులు ఉన్న కంపెనీ ఉన్నట్లయితే, వారిని, వారి పై ఆధారపడిన వారిని కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో కవర్ చేయాలి. ఇది వారికి భద్రతా భావాన్ని కలిగించడమే కాకుండా, మీ సంస్థ యొక్క సుహృద్భావాన్ని కూడా పెంచుతుంది.
తక్కువ ధర ప్రీమియంలు
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వ్యక్తుల గ్రూపుపై పంచబడుతుంది. కాబట్టి, ఇతర హెల్త్ పాలసీల కంటే దీని ప్రీమియం చాలా చవక.
పన్ను ప్రయోజనాలు
భారత ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను తమ ఉద్యోగులకు అందించే కంపెనీలు కొంత పన్నును ఆదా చేసుకోవచ్చు!
కంపెనీకి మంచి పేరు
తమ ఉద్యోగులకు విలువైన ప్రయోజనాలను అందించే సంస్థలు సంతోషకరమైన ఉద్యోగులు, పని వాతావరణాలకు దారితీస్తాయి. ఇది అంతిమంగా పెద్ద, చిన్న ఏ కంపెనీకైనా మంచి సుహృద్భావ వాతావరణానికి దారితీస్తుంది. ప్రతి ఒక్కరూ తమ గురించి ఆలోచించే తమ పాత సంస్థను ప్రేమిస్తారు!
అర్థవంతమైన ప్రయోజనాలు
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రాథమిక ఉద్దేశ్యం ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడం. ఒక ఉద్యోగి నిజంగా విలువైనదిగా భావించే ప్రయోజనాలు మాత్రమే అర్ధవంతంగా ఉండాలి. అందువల్ల, మీ ఉద్యోగుల కొరకు అత్యుత్తమ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకునేటప్పుడు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఎలాంటి ప్రయోజనాలు అందించబడాలి? ఉదాహరణకు: కోవిడ్-19 మహమ్మారి వల్ల భారతదేశం ఎంత ప్రభావితమైందో చూస్తే, మీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ దీనిని కవర్ చేసేలా చూసుకోండి.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం
మొత్తానికి డబ్బు ముఖ్యం! అందుకే, మీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఎంత ఖర్చు అవుతుందనేది మదింపు చేయడం చాలా ముఖ్యం. అలాగే, అది అందించే లేదా అందించని ప్రయోజనాలు కూడా లెక్కలో ఉంటాయి. చవకైన ప్రీమియంల కోసం గుడ్డిగా వెళ్లవద్దు, దానితో వచ్చే ప్రయోజనాలను పోల్చుకోండి.
కమ్యూనికేషన్ సమర్థత
మీరు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, ప్లాన్ ప్రయోజనాలు మాత్రమే కాదు, మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ప్రభావవంతంగా ప్రతిస్పందిస్తుందనేది కూడా ముఖ్యం. అవసరమైన సమయాల్లో, సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీతో కమ్యూనికేట్ చేయడం, వ్యవహరించడంలో మీ ఉద్యోగులకు ఆహ్లాదకరమైన అనుభవం ఉండేలా మీరు ధ్రువీకరించుకోవాలి. చాలాసార్లు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు థర్డ్ పార్టీలను కూడా మధ్యవర్తిగా ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో, సంబంధిత థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ తగినంత మంచిగా ఉన్నారా లేదా అని మీరు ధ్రువీకరించుకోవాలి.
సర్వీస్ ప్రయోజనాలు
హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, సర్వీస్ గతంలో కంటే ఎక్కువ ముఖ్యమైనది. ఆరోగ్య సంరక్షణ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా, సున్నితత్త్వంతో వ్యవహరించే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు అవసరం. అందువల్ల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని నిర్ణయించడానికి ముందు విభిన్న ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు అందిస్తున్న సేవలను మదింపు చేయండి, పోల్చి చూడండి.
భౌగోళిక కవరేజ్
ప్రమాదాలు, అస్వస్థతలు ఎక్కడైనా జరగవచ్చు! అందువల్ల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన విషయాల్లో ఒకటి, ఇది మొత్తం దేశాన్ని కవర్ చేస్తుందా లేదా అనేది, ఒకవేళ అలా జరిగినట్లయితే దేశవ్యాప్తంగా ఎన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి, మొదలగునవి పరిగణనలోకి తీసుకోవాలి.
డీఫాల్ట్ హెల్త్ కేర్ ప్రయోజనం
గ్రూప్ హెల్త్ ప్లాన్లను అందించే చాలా కంపెనీలు తమ ఉద్యోగి యొక్క వార్షిక ప్రయోజనాల్లో భాగంగా ఉంటాయి; అంటే మీరు ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా, మీ కంపెనీకి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నట్లయితే- ప్రీమియం మీ ద్వారా చెల్లించినా, చెల్లించకపోయినా, మీరు దానిలో కవర్ చేయబడతారు.
ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు
సాధారణంగా, మీరు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకున్నప్పుడు, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని జారీ చేయడానికి, ధ్రువీకరించడానికి ముందు మీ ఇన్సూరెన్స్ కంపెనీ ముందస్తు వైద్య పరీక్షలను చేపట్టవచ్చు. అయితే, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ విషయంలో ఇది అవసరం లేదు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మీ పాలసీ చెల్లుబాటు అవుతుంది.
ప్రీమియం ఉండదు
పైన పేర్కొన్నవిధంగా, చాలా మంది యజమానులు సాధారణంగా కంపెనీ అందించే మీ వార్షిక ప్రయోజనాల్లో మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని చేర్చుతారు. అంటే మీరు దాని ప్రీమియంకు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ కంపెనీనే మీ కొరకు చెల్లిస్తుంది. అయితే ఇది యజమాని నుండి యజమానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ, మీ యజమాని మీ వద్ద నుండి అదే వసూలు చేసినా లేదా చేయకపోయినా, దాని ప్రీమియం వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ కంటే చాలా తక్కువ.
సరళమైన క్లెయిమ్ ప్రక్రియ
మీ యజమాని సంబంధిత గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకున్నవ్యక్తి కనుక వారు ప్రధానంగా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతుంటారు. అందువల్ల, ఇది ముందుకు, వెనుకకు సంప్రదింపులు జరపడంలో మీ ప్రయత్నాలను తగ్గిస్తుంది. తద్వారా మీ క్లెయిమ్ ప్రక్రియ చాలా సరళంగా మారుతుంది.
|
ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ |
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ |
|
ఈకేసులో ప్రతి వ్యక్తి నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీతో సంప్రదింపులు చేస్తుంటాడు |
ఈ కేసులో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కంపెనీతో నేరుగా కాంటాక్టులో ఉంటుంది |
|
ప్రతి వ్యక్తి తనకు నచ్చిన సమయంలో పాలసీని రద్దు చేసుకునే హక్కును కలిగి ఉంటాడు |
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో, కేవలం యజమాని మాత్రమే రద్దు చేసే హక్కును కలిగి ఉంటాడు |
|
వ్యక్తిగత పాలసీ ఒక వ్యక్తి ఎంత కాలం ప్రీమియంలు చెల్లిస్తే అన్ని సంవత్సరాలు కొనసాగుతుంది |
గ్రూప్ హెల్త్ పాలసీ విషయంలో ఉద్యోగి సదరు కంపెనీలో పని చేస్తున్నంత వరకు కొనసాగుతుంది |
|
వ్యక్తిగత హెల్త్ పాలసీ ప్రాథమికంగా వ్యక్తి వయసు, వైద్య చరిత్ర, ఆరోగ్య పరిస్థితి మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది |
గ్రూప్ హెల్త్ పాలసీ ప్రాథమికంగా సంస్థ బలం మీద ఆధారపడి ఉంటుంది. అది ఆర్థికంగా, ఉద్యోగుల బలం మీద ఆధారపడి ఉంటుంది. |
|
సాధారణంగా, ఏదైనా వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ ముంద్తు వైద్య పరీక్షలు చేస్తుంది. దీని ఆధారంగానే పాలసీలు జారీ చేయబడతాయి. |
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ముందస్తు వైద్య పరీక్షలు చేయబడవు. ఇది పాలసీలు తిరస్కరించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. |
|
డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ |
డిజిట్ ఇల్ నెస్ గ్రూప్ ఇన్సూరెన్స్ (కోవిడ్-19) |
|
డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక కాంప్రహెన్సివ్ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది అస్వస్థతలు, వ్యాధులు, ప్రమాదాల వల్ల ఉత్పన్నమయ్యే ఆసుపత్రిలో చేరే ఖర్చుల నుంచి ఒక సంస్థ యొక్క ఉద్యోగులందరినీ కవర్ చేస్తుంది. అదనంగా, డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోవిడ్-19ను కూడా కవర్ చేస్తుంది. |
ప్రస్తుత పరిస్థితిని బట్టి, ప్రీమియం ఖర్చులు, ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక అభద్రతల కారణంగా అనేక వ్యాపారాలు పూర్తి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చని మేము అర్థం చేసుకున్నాము. అయితే, యజమానులు తమ ఉద్యోగులను కనీసం కోవిడ్-19 కోసం కవర్ చేయాలని సిఫారసు చేయబడుతోంది. అందుకే కోవిడ్-19 నుంచి ఉద్యోగులందరికీ అందరికీ అందుబాటులో ఉండే ప్రీమియంతో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో సహాయపడటానికి మేము ప్రత్యేకంగా ఒక కవర్ని రూపొందించాం. |
అవును, కరోనా వైరస్ డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతుంది. అలాగే, ప్రత్యేక కవర్ రూపంలో కూడా అందించబడుతుంది.
అవును, కరోనా వైరస్ డిజిట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతుంది. అలాగే, ప్రత్యేక కవర్ రూపంలో కూడా అందించబడుతుంది.
ప్రాథమికంగా మా కార్పోరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియడ్ కేవలం 15 రోజులు మాత్రమే. అయితే 50+ సభ్యులను కవర్ చేసే సంస్థలకు దీనిని రద్దు కూడా చేయవచ్చు.
ప్రాథమికంగా మా కార్పోరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియడ్ కేవలం 15 రోజులు మాత్రమే. అయితే 50+ సభ్యులను కవర్ చేసే సంస్థలకు దీనిని రద్దు కూడా చేయవచ్చు.
నిర్ధిష్ట ప్రయోజనాల కోసం క్లెయిములు చేయడం ప్రారంభించడానికి ముందు వేచి ఉండాల్సిన సమయాన్ని వెయిటింగ్ పీరియడ్ తెలియజేస్తుంది.
నిర్ధిష్ట ప్రయోజనాల కోసం క్లెయిములు చేయడం ప్రారంభించడానికి ముందు వేచి ఉండాల్సిన సమయాన్ని వెయిటింగ్ పీరియడ్ తెలియజేస్తుంది.
ప్రతి కంపెనీ కనీసం తన ఉద్యోగులకు ప్రాథమిక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందించాలని మేము భావిస్తున్నాం. ఒకవేళ మీ సంస్థలో కనీసం 10 మంది సభ్యులు ఉన్నట్లయితే, వారందరినీ సంరక్షించడం కొరకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పొందడం గురించి మీరు ఆలోచించాలి. అయితే, ప్రస్తుత పరిస్థితి కారణంగా మీరు అలా చేయలేకపోయినట్లయితే, కరోనా వైరస్ నుంచి మీ ఉద్యోగులను సరసమైన ఖర్చుతో కవర్ చేయడం కొరకు కరోనావైరస్ గ్రూప్ కవర్‌ను అయినా మీరు ఎంచుకోవచ్చు.
ప్రతి కంపెనీ కనీసం తన ఉద్యోగులకు ప్రాథమిక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందించాలని మేము భావిస్తున్నాం. ఒకవేళ మీ సంస్థలో కనీసం 10 మంది సభ్యులు ఉన్నట్లయితే,
వారందరినీ సంరక్షించడం కొరకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పొందడం గురించి మీరు ఆలోచించాలి.
అయితే, ప్రస్తుత పరిస్థితి కారణంగా మీరు అలా చేయలేకపోయినట్లయితే, కరోనా వైరస్ నుంచి మీ ఉద్యోగులను సరసమైన ఖర్చుతో కవర్ చేయడం కొరకు కరోనావైరస్ గ్రూప్ కవర్‌ను అయినా మీరు ఎంచుకోవచ్చు.
అవును, మీరు తీసుకోవచ్చు. ఇతర గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగా కాకుండా కనీసం 10 మంది సభ్యులు ఉన్న కంపెనీలకు కూడా మా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
అవును, మీరు తీసుకోవచ్చు. ఇతర గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగా కాకుండా కనీసం 10 మంది సభ్యులు ఉన్న కంపెనీలకు కూడా మా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
ముందస్తు నగదు ప్రయోజనం అంటే ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి చికిత్స ఖర్చుల అంచనా ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీ అందులో 50%ని నగదు రూపంలో ముందుగా (అడ్వాన్స్) చెల్లిస్తుంది. తద్వారా వారు ఎల్లప్పుడూ కవర్ చేయబడతారని, వారి చికిత్స ముగిసే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇవ్వవచ్చు. మిగిలిన 50% అంచనా వ్యయాలను చికిత్స తరువాత తిరిగి చెల్లించవచ్చు.
ముందస్తు నగదు ప్రయోజనం అంటే ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి చికిత్స ఖర్చుల అంచనా ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీ అందులో 50%ని నగదు రూపంలో ముందుగా (అడ్వాన్స్) చెల్లిస్తుంది. తద్వారా వారు ఎల్లప్పుడూ కవర్ చేయబడతారని, వారి చికిత్స ముగిసే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇవ్వవచ్చు. మిగిలిన 50% అంచనా వ్యయాలను చికిత్స తరువాత తిరిగి చెల్లించవచ్చు.
ఒక సంస్థలో పని చేస్తున్న 18 సంవత్సరాల పైబడిన, 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులు అందరూ ఆ సంస్థ యొక్క గ్రూప్ హెల్త్ పాలసీ కింద కవర్ కావడానికి అర్హులు. అదనంగా, వారు తమ జీవిత భాగస్వామిని, 3 నెలల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలను కూడా జోడించవచ్చు.
ఒక సంస్థలో పని చేస్తున్న 18 సంవత్సరాల పైబడిన, 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులు అందరూ ఆ సంస్థ యొక్క గ్రూప్ హెల్త్ పాలసీ కింద కవర్ కావడానికి అర్హులు. అదనంగా, వారు తమ జీవిత భాగస్వామిని, 3 నెలల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలను కూడా జోడించవచ్చు.
అవును, సాధారణంగా కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ధరతో వస్తుంది. ఎందుకంటే గ్రూపులోని సభ్యుల అందరి మీద ఇది ఆధారపడుతుంది కాబట్టి.
అవును, సాధారణంగా కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ధరతో వస్తుంది. ఎందుకంటే గ్రూపులోని సభ్యుల అందరి మీద ఇది ఆధారపడుతుంది కాబట్టి.
డిజిట్లో పెద్ద, చిన్న వ్యాపారాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని మేము అందిస్తాం. మీ ప్లాన్ ప్రారంభించడానికి, పైన మీ వివరాలను నమోదు చేయండి. కస్టమైజ్డ్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోట్తో మేము మీ వద్దకు తిరిగి వస్తాం.
డిజిట్లో పెద్ద, చిన్న వ్యాపారాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని మేము అందిస్తాం. మీ ప్లాన్ ప్రారంభించడానికి, పైన మీ వివరాలను నమోదు చేయండి. కస్టమైజ్డ్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోట్తో మేము మీ వద్దకు తిరిగి వస్తాం.
ఇది ప్రధానంగా మీ వద్ద ఉన్న కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీ సంబంధిత యజమాని ద్వారా చెల్లించబడతాయి. మీరు ఆ కంపెనీని విడిచిపెట్టిన తరువాత అవి రద్దు చేయబడతాయి. అయితే, మీరు చేయగలిగింది వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడం. ఇది వ్యక్తిగతంగా మీరు చెల్లించాల్సిన పన్నును కూడా పొదుపు చేస్తుంది. మీకు అదనపు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందిస్తుంది.
ఇది ప్రధానంగా మీ వద్ద ఉన్న కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీ సంబంధిత యజమాని ద్వారా చెల్లించబడతాయి. మీరు ఆ కంపెనీని విడిచిపెట్టిన తరువాత అవి రద్దు చేయబడతాయి.
అయితే, మీరు చేయగలిగింది వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడం. ఇది వ్యక్తిగతంగా మీరు చెల్లించాల్సిన పన్నును కూడా పొదుపు చేస్తుంది. మీకు అదనపు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందిస్తుంది.
అవును, పైన పేర్కొన్నవిధంగా మీరు ఖచ్చితంగా కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెండింటినీ కలిగి ఉండవచ్చు.
అవును, పైన పేర్కొన్నవిధంగా మీరు ఖచ్చితంగా కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెండింటినీ కలిగి ఉండవచ్చు.
ప్రతీ కంపెనీ విభిన్న ఉద్యోగుల బలంతో (సంఖ్యతో) ఉంటుంది కాబట్టి ఎంప్లాయర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ధర ఒక్కో కంపెనీకి ఒక్కోలా ఉంటుంది.
ప్రతీ కంపెనీ విభిన్న ఉద్యోగుల బలంతో (సంఖ్యతో) ఉంటుంది కాబట్టి ఎంప్లాయర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ధర ఒక్కో కంపెనీకి ఒక్కోలా ఉంటుంది.
సంబంధిత గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మీరు కవర్ చేయాలని అనుకుంటున్న ఉద్యోగుల సంఖ్య, వారి వయస్సులు, ప్రాంతం, వారిపై ఆధారపడిన వారి సంఖ్య ఆధారంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించబడుతుంది.
సంబంధిత గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మీరు కవర్ చేయాలని అనుకుంటున్న ఉద్యోగుల సంఖ్య, వారి వయస్సులు, ప్రాంతం, వారిపై ఆధారపడిన వారి సంఖ్య ఆధారంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించబడుతుంది.
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ యజమాని, ఉద్యోగి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, దాని అతిపెద్ద పరిమితుల్లో ఒకటి ఏమిటంటే, ఒక ఉద్యోగికి సంబంధించి, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ ఆవశ్యకతలకు అనుగుణంగా కస్టమైజ్ చేయగల వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలా కాకుండా, చాలా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు పరిమితంగా, జనరిక్ స్వభావం కలిగి ఉంటాయి. కనుక అన్ని ఆరోగ్య సంరక్షణ అవసరాలను కవర్ చేయడానికి అవి సరిపోకపోవచ్చు. అయితే దీని కన్నా ఆదర్శవంతమైన మార్గం ఏమిటంటే, ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఒక వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ రెండింటినీ కలిగి ఉండటం వల్ల ఆరోగ్య అవసరాలకు ఉపయోగడపడటంతో పాటు పన్ను ప్రయోజనాలు చేకూరతాయి.
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ యజమాని, ఉద్యోగి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, దాని అతిపెద్ద పరిమితుల్లో ఒకటి ఏమిటంటే, ఒక ఉద్యోగికి సంబంధించి, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ ఆవశ్యకతలకు అనుగుణంగా కస్టమైజ్ చేయగల వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలా కాకుండా, చాలా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు పరిమితంగా, జనరిక్ స్వభావం కలిగి ఉంటాయి. కనుక అన్ని ఆరోగ్య సంరక్షణ అవసరాలను కవర్ చేయడానికి అవి సరిపోకపోవచ్చు.
అయితే దీని కన్నా ఆదర్శవంతమైన మార్గం ఏమిటంటే, ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఒక వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ రెండింటినీ కలిగి ఉండటం వల్ల ఆరోగ్య అవసరాలకు ఉపయోగడపడటంతో పాటు పన్ను ప్రయోజనాలు చేకూరతాయి.
డిస్క్లైమర్: ఈ డేటాలో డిజిట్ హెల్త్ ప్లస్ పాలసీ (రివిజన్), డిజిట్ ఇల్నెస్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడిన సభ్యుల సంఖ్యను 13 సెప్టెంబర్, 2021 వరకు లెక్కలోకి తీసుకోవడం జరిగింది.
Please try one more time!
నిరాకరణ #1: *కస్టమర్ బీమా పొందే సమయంలో ఎంపికలను ఎంచుకోవచ్చు. దీని ప్రకారం ప్రీమియం మొత్తం మారవచ్చు. పాలసీ జారీకి ముందు బీమా చేసినవారు ముందుగా ఉన్న ఏదైనా పరిస్థితిని లేదా ప్రస్తుతం కొనసాగుతున్న చికిత్సను ప్రతిపాదన రూపంలో బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
నిరాకరణ #2: ఈ సమాచారం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే జోడించబడింది మరియు ఇంటర్నెట్లోని వివిధ మూలాల నుండి సేకరించబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు సమాచారాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 17-10-2025
CIN: L66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.
డిజిట్ యాప్‌లో ప్రత్యేక ఫీచర్లను అన్వేషించండి, క్లెయిమ్‌లు ఫైల్ చేయండి మరియు పాలసీని యాక్సెస్ చేయండి!
యాప్‌ను డౌన్లోడ్ చేయడానికి మీరు ఈ QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు.