కోపే, కోఇన్సూరెన్స్ & డిడక్టబుల్ అంటే ఏమిటి
హెల్త్ ఇన్సూరెన్స్ ను పొందే విషయానికి వస్తే, కొన్ని పాదాల గురించి మీకు స్పష్టత ఉండాలి, ఎందుకంటే ఇవి తరచుగా గందరగోళం సృష్టించవచ్చు.
ప్రత్యేకించి, కోపే, డిడక్టబుల్ మరియు కోఇన్సూరెన్స్ వంటి నిబంధనల విషయానికి వస్తే, సరైన సమాచారం లేకుంటే ఎవరైనా చాలా త్వరగా గందరగోళానికి గురవుతారు.
చింతించకండి, మీకోసం మేము ఉన్నాము!
ఇక్కడ, మేము కోఇన్సూరెన్స్, డిడక్టబుల్ మరియు కోపే లకు అర్థం మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విషయంలో వాటి ప్రభావం గురించి వివరిస్తాము.
ఒకసారి చూద్దాము!
హెల్త్ ఇన్సూరెన్స్ లో కోపే అంటే ఏమిటి?
పాలసీ హోల్డర్లు వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చులలో కొంత భాగాన్ని వారు భరించడం మరియు మిగిలిన మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ భరించడాన్ని కోపే అంటారు. ఇది నిర్ణీత మొత్తం కావచ్చు లేదా చికిత్స ఖర్చులలో నిర్ణీత శాతం కూడా కావచ్చు.
ఉదాహరణకు, మీ ఇన్సూరెన్స్ పాలసీ మీ చికిత్స ఖర్చులలో రూ.2000 కోపే నిబంధనతో వచ్చిందనుకోండి మరియు చికిత్సకు మీకు రూ. 10,000 ఖర్చు అయినప్పుడు, మీరు మీ చికిత్స కోసం రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 8000 ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా కవర్ చేయబడుతుంది.
అలాగే, ఒకవేళ కోపే నిబంధన ప్రకారం మీరు మొత్తం ఖర్చులో 10% కవర్ చేయాల్సి ఉంటే, మీరు దానికి రూ.1000, మిగిలిన 90% (రూ. 9000) ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించాలి.
ఇన్సూరెన్స్ పాలసీల కింద కోపేమెంట్ యొక్క ఫీచర్లు క్రింది విధంగా జాబితా చేయబడతాయి:
- కోపే చెల్లింపు నిబంధనతో, ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు క్లయిమ్ లో ఎక్కువ భాగాన్ని భరిస్తారు, అయితే పాలసీ హోల్డర్ నిర్దిష్ట ఫిక్సడ్ భాగాన్ని కవర్ చేయాల్సి ఉంటుంది.
- వైద్య సేవను అనుసరించి కోపే చెల్లింపు మొత్తం నిర్ణయించబడుతుంది.
- తక్కువ కోపేమెంట్ మొత్తం అంటే అధిక ప్రీమియం చెల్లింపు.
- ఈ నిబంధనలు ఎక్కువగా సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై విధించబడతాయి.
- చికిత్స ఖర్చు ఎక్కువగా ఉండే మెట్రోపాలిటన్ నగరాల్లో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి.
ఎటువంటి కోపేమెంట్ లేదు అంటే చికిత్స ఖర్చు మొత్తం ఇన్సూరెన్స్ ప్రొవైడర్ భరిస్తుంది.
డిజిట్ ఇన్సూరెన్స్ 0% కోపేమెంట్తో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది మరియు ఒక వ్యక్తికి అయ్యే మొత్తం చికిత్స ఖర్చులను కవర్ చేస్తుంది.
దీని గురించి మరింత తెలుసుకోండి:
డిడక్టబుల్ లు అంటే ఏమిటి?
డిడక్టబుల్ అనేది వారి ఇన్సూరెన్స్ పాలసీ వారి వైద్య చికిత్సకు సహకరించడం ప్రారంభించే ముందు పాలసీ హోల్డర్ లు చెల్లించాల్సిన నిర్ణీత మొత్తం. డిడక్టబుల్ లను చెల్లించే నిబంధనలు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ చే నిర్ణయించబడుతుంది - సంవత్సరానికా లేదా ప్రతి చికిత్సకా అనేది.
ఉదాహరణకు, మీ పాలసీ ప్రకారం రూ. 5000 డిడక్టబుల్ తప్పనిసరి అయితే , మీరు రూ. 5000 వరకు మీ చికిత్స ఖర్చులకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించడం ప్రారంభమవుతుంది.
డిడక్టబుల్ ల యొక్క కొన్ని ఫీచర్లు క్రింది ఇవ్వబడ్డాయి:
- ఇది క్రమం తప్పకుండా వచ్చే మరియు అనవసరమైన క్లయిమ్ ల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలకు సహాయం చేయడానికి విధించబడుతుంది.
- ఇది ఇన్సూరెన్స్ పాలసీలకు ప్రీమియం చెల్లింపులను తగ్గించడంలో సహాయపడుతుంది.
- ఇది ఒక వ్యక్తి వారి వైద్య చికిత్స కోసం చేసే మొత్తం ఖర్చును పెంచవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ లో డిడక్టబుల్ ల గురించి మరింత తెలుసుకోండి.
కోఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
కోఇన్సూరెన్స్ అనేది డిడక్టబుల్ లను చెల్లించిన తర్వాత మీరు భరించాల్సిన చికిత్స ఖర్చుల శాతాన్ని సూచిస్తుంది. ఈ మొత్తం సాధారణంగా నిర్ణీత శాతంగా అందించబడుతుంది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కింద కోపేమెంట్ నిబంధనను పోలి ఉంటుంది.
ఉదాహరణకు, మీ కోఇన్సూరెన్స్ 20% అయితే, మీ చికిత్స ఖర్చులో మీరు 20% భరించవలసి ఉంటుంది, మిగిలిన 80% మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ద్వారా భరించబడుతుంది.
అంటే, ఒక నిర్దిష్ట వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు రూ. 10,000 అయితే, మీరు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. కాగా రూ. 8000 మీ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కవర్ చేయబడుతుంది. మీరు మీ డిడక్టబుల్ లను చెల్లించిన తర్వాత ఈ మొత్తం సాధారణంగా లెక్కించబడుతుంది.
కోఇన్సూరెన్స్ ప్లాన్ల యొక్క కొన్ని ఫీచర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- ఇది పెద్ద క్లయిమ్ ల నుండి ఇన్సూరెన్స్ సంస్థలను రక్షించడంలో సహాయపడుతుంది.
- పాలసీ హోల్డర్ లు వారి కోఇన్సూరెన్స్ ప్లాన్ అమలులోకి రాకముందే తమ డిడక్టబుల్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
- కోఇన్సూరెన్స్ శాతం స్థిరంగా ఉంటుంది.
- ఈ శాతం మీ ఇన్సూరెన్స్ పాలసీ మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి ముందు ఒక సంవత్సరం పాటు మీరు గరిష్టంగా చెల్లించాల్సిన అవుట్ అఫ్ పాకెట్ మొత్తాన్ని కలిగి ఉంటుంది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబందించిన ఈ పదాలలో ప్రతి ఒక్కదానికి అర్థం ఏమిటో ఇప్పుడు మేము వివరించాము, ఇప్పుడు వీటిలో ప్రతి దాని మధ్య తేడాలను చూద్దాం.