టి పి ఏ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ మరియు పాలసీదారు మధ్య మధ్యవర్తి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కింద క్లయిమ్ విధానాన్ని సులభతరం చేయడం వారి పని. మనకు తెలిసినట్లుగా క్లయిమ్ లు రెండు రకాలు లేదా విధాలుగా ఉండవచ్చు : ఎ) నగదు రహితం మరియు బి) రీయింబర్స్మెంట్.
వైద్యం లేదా అత్యవసర చికిత్స అవసరం ఏర్పడిన వెంటనే, పాలసీదారు ఆసుపత్రిని సందర్శిస్తారు. వ్యక్తిని కనీసం 24 గంటల పాటు ఆసుపత్రిలో చేరమని అడిగితే (కాటరాక్ట్ వంటి జాబితా చేయబడిన వ్యాధులకు మినహా) క్లయిమ్ ఆమోదయోగ్యమవుతుంది.
పాలసీదారు, ఈ సందర్భంలో, టి పి ఏ లేదా ఇన్సూరెన్స్ సంస్థకు అడ్మిషన్ మరియు చికిత్స అవసరం గురించి తెలియజేస్తారు. వీలైతే నగదు రహిత సౌకర్యాన్ని ఏర్పాటు చేయమని టి పి ఏ ఆసుపత్రిని కోరుతుంది. లేకపోతే, క్లయిమ్ రీయింబర్స్మెంట్ కోసం ప్రాసెస్ చేయబడుతుంది. చికిత్స ముగిసిన తర్వాత, నగదు రహిత ఆమోదం పొందినట్లయితే ఆసుపత్రి అన్ని బిల్లులను టి పి ఏ కి పంపుతుంది. కాకపోతే, పాలసీదారు తర్వాత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
టి పి ఏ వద్ద ఉన్న అధికారులు క్లయిమ్ సెటిల్మెంట్ అనుమతించబడే బిల్లులు మరియు ఇతర పత్రాలను పరిశీలిస్తారు. నగదు రహితంగా ఉంటే, ఆసుపత్రికి చెల్లింపు చేయబడుతుంది. రీయింబర్స్మెంట్ కోసం అయితే, పాలసీదారు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఖర్చులు అందుకుంటారు.