మీ వయస్సు: మీరు ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత ఎక్కువగా మీ సమ్ ఇన్సూర్డ్ ఉండాలి, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉంటే అంత ఎక్కువ భద్రతా వలయం అవసరం.
మీ జీవిత దశ: మీరు ఉన్న జీవిత దశ ఆధారంగా, ఉదాహరణకు, మీరు వివాహం చేసుకోబోతున్నట్లయితే లేదా కుటుంబాన్ని ప్రారంభించబోతున్నట్లయితే, మీ సమ్ ఇన్సూర్డ్ దానికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ ఖర్చులని దృష్టిలో పెట్టుకోవాలి.
ఆరోగ్య పరిస్థితులు: మీకు మీ కుటుంబంలో వైద్య పరిస్థితి చరిత్ర ఉన్నట్లయితే, మీ సమ్ ఇన్సూర్డ్ భవిష్యత్తులో ఊహించని ఆరోగ్య పరిస్థితి ని దృష్టిలో పెట్టుకోవాలి.
కుటుంబంలో ఆధారపడినవారు: మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లోటర్ పాలసీని తీసుకోవాలని ప్రణాళిక రచిస్తూంటే, సమ్ ఇన్సూర్డ్ ప్రతి సభ్యుని అవసరాలను మరియు వారి భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి.
జీవనశైలి మరియు వ్యక్తిగత అలవాట్లు: ఉద్యోగం రకం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి స్థాయిలు మరియు ఇతర వ్యక్తిగత అలవాట్లు వ్యక్తి యొక్క భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ అవసరాలకు మార్గాన్ని చూపుతాయి. సమ్ ఇన్సూర్డ్ ఎంచుకునేటప్పుడు వీటి గురించి కూడా ఆలోచించాలి.