టూ వీలర్ ఇన్సూరెన్స్​లో యాడ్–ఆన్ కవర్స్

యాడ్​–ఆన్స్​తో బైక్ ఇన్సూరెన్స్ కోట్ పొందండి.
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

టూ వీలర్ ఇన్సూరెన్స్​లో యాడ్–ఆన్ కవర్ అంటే ఏమిటి?

డిజిట్ అందించే టూ వీలర్ ఇన్సూరెన్స్ యాడ్–ఆన్లు

జీరో డిప్రిషియేషన్ కవర్

చాలా వరకు సందర్భాల్లో ప్రమాదం తర్వాత డిప్రిషియేషన్, కొత్త భాగాల కోసం అయిన ఖర్చును బైక్ యజమానే భరించాలి. ఎవరైతే ఈ ఖర్చులను కూడా బీమా సంస్థే చెల్లించాలని అనుకుంటారో వారు నిల్ లేదా జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్​ను తీసుకోవాలి. ఈ యాడ్–ఆన్​ ఉంటేనే పై విధంగా ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ఖర్చులను మీరే భరించాల్సి వస్తుంది.

రోడ్​సైడ్ అసిస్టెన్స్

రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్–ఆన్ అనుకోని సందర్భాల్లో మీ టూ వీలర్ రోడ్డు పక్కన చిక్కుకుపోయినపుడు ఉపయోగపడుతుంది. ఈ యాడ్–ఆన్​ మీకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మీ బైక్​ను టోయింగ్ చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మేము నగరం నుంచి 500 కిలోమీటర్ల దూరంలో మీకు ఎక్కడ మీ బైక్ ట్రబుల్ ఇచ్చినా కవర్ చేస్తాం.

కంజూమబుల్ కవర్

క్లెయిములు చేసిన సమయంలో ఆయిల్, నట్లు, బోల్టుల వంటి కంజూమబుల్స్ (మళ్లీ మళ్లీ వాడాల్సి వచ్చేవి) బీమా​లో కవర్ కావు. కానీ మీరు ఈ యాడ్–ఆన్​ తీసుకున్నట్లయితే మీరు అటువంటి కంజూమబుల్స్​ను కూడా కవర్ చేయొచ్చు. అవి ఎంత చిన్నవి అయినా సరే కవర్ అవుతాయి. ప్రమాదం వలన ఉత్పన్నమయ్యే నష్టాల వలన ఉపయోగించ రాకుండా పోయిన కంజూమబుల్స్ ఖర్చును ఇది కవర్ చేస్తుంది.

ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్

స్టాండర్డ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో కేవలం ప్రమాదం సమయంలో అయిన డ్యామేజీలకు మాత్రమే కవరేజీ వర్తిస్తుంది. చాలా సందర్భాల్లో ప్రమాదం తర్వాత మీ ఇంజిన్ పర్యవసాన నష్టాలను ఎదుర్కొంటుంది. కానీ ఈ యాడ్–ఆన్​ను కనుక మీరు తీసుకుంటే ఆయిల్ లీకేజీ కానీ, ప్రకృతి విపత్తుల వలన బండి ఇంజిన్​లోకి నీళ్లు ప్రవేశించిన సమయంలో కవర్ చేస్తుంది.

రిటర్న్ టు ఇన్​వాయిస్ కవర్

మీ బైక్ రిపేర్ చేయరాకుండా డ్యామేజ్ కావడం కంటే పెద్ద నష్టం మరేదీ ఉండదు. ఇటువంటి సందర్భాలలో మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేసేందుకు ఈ రిటర్న్ టు ఇన్​వాయిస్ కవర్ యాడ్–ఆన్​ ఉంది. మీ ఇన్​వాయిస్​లో పేర్కొన్న విధంగా బీమా సంస్థలు మీకు డబ్బును తిరిగిస్తాయి. 

టైర్ ప్రొటెక్షన్ కవర్

మీ టూ వీలర్ టైరు పాడైపోయినట్లయితే ఈ యాడ్-ఆన్ కవర్ మీకు సహాయపడుతుంది. పాడైపోయిన టైరు స్థానంలో కొత్త టైరును అమర్చడానికి అయ్యే ఖర్చును ఈ కవర్ తిరిగి చెల్లిస్తుంది. అదేవిధంగా వీల్ బ్యాలెన్సింగ్ కొరకు ఛార్జీలు మరియు టైరును మార్చడానికి అయ్యే లేబర్ ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది.

డైలీ కన్వేయన్స్ బెనిఫిట్

ఈ యాడ్-ఆన్ కవర్ ప్రకారం, డిజిట్ పాలసీదారుడికి నిర్ణీత అలవెన్స్ చెల్లిస్తుంది లేదా రిపేర్ చేసినప్పుడు వాహనం అందుబాటులో లేకపోవడం వల్ల తెలిసిన టాక్సీ ఆపరేటర్ల నుండి కూపన్లను అందిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ యొక్క 'ఓన్ డ్యామేజీ' కింద టూవీలర్  ప్రమాదవశాత్తు డ్యామేజీ అయి, దాని కింద క్లైయిమ్ కు పెడితేనే ఇది వర్తిస్తుంది.