సెకండ్​ హ్యాండ్​ బైక్​ ఇన్సూరెన్స్

సెకండ్​ హ్యాండ్​ బైక్​ ఇన్సూరెన్స్​ కోట్‌ను ఆన్​లైన్​లో పొందండి
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

వాడిన బైక్​ ఇన్సూరెన్స్​ గురించి తెలుసుకోవాల్సింది

సెకండ్​ హ్యాండ్​ బైక్​ ఇన్సూరెన్స్​ అంటే ఏమిటి?

సెకండ్​ హ్యాండ్​ బైక్​ ఇన్సూరెన్స్​కు యాడ్​–ఆన్​ కవర్లు

మీరు బేసిక్​ కాంప్రహెన్సివ్​ బైక్​ ఇన్సూరెన్స్ తీసుకున్నపుడు మీరు తప్పక యాడ్​–ఆన్స్​ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల యాడ్​ ఆన్స్​ వివరాలు..

నిల్​ డెప్రిసేషన్​ కవర్

ఒకవేళ మీకు ఇన్సూరెన్స్​ ఉన్నా కానీ ప్రమాదం జరిగిన సమయంలో రిపేర్​ ఖర్చులను ఇన్సూరెన్స్​ కంపెనీ పాక్షికంగానే చెల్లిస్తుంది. ఇటువంటి సమయంలో మీకు నిల్​ డెప్రిసియేషన్​ కవర్​ యాడ్​–ఆన్​ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ కవర్​ను తీసుకుంటే ప్రీమియం కాస్త పెరిగినా రిపేర్​ ఖర్చుల విషయంలో మాత్రం మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఐదు సంవత్సరాల కంటే వయసు పైబడిన వాహనాలకు నిల్​ డెప్రిసియేషన్​ కవర్​ యాడ్ ఆన్​ లభించదు.

రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్

మీ బైక్​ దొంగతనానికి గురైనపుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు చేయించిన రిపేర్​ ఖర్చులకు మీ ఇన్సూరెన్స్​ పాలసీ విలువ మొత్తం చెల్లించినా కానీ మీరు ఇంకా అదనంగా చెల్లించాల్సి వచ్చినపుడు మిమ్మల్ని అదనపు ఖర్చుల నుంచి రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్​ యాడ్​–ఆన్​ కాపాడుతుంది. ఈ కవర్​ మీ రోడ్​ టాక్స్​, రిజిస్ట్రేషన్​ ఫీజులను కూడా తిరిగి చెల్లిస్తుంది.

ఇంజన్​, గేర్​ ప్రొటెక్షన్​ కవర్​

ప్రమాదం జరిగినా, జరగకపోయినా ఇంజన్,​ గేర్​ బాక్స్​కు అదనపు సంరక్షణ చాలా అవసరం.  ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇంజన్​ & గేర్​ ప్రొటెక్షన్​ యాడ్​–ఆన్​ వలన ఈ సంరక్షణ సాధ్యపడుతుంది. ఎటువంటి సందరర్భాల్లో మీ గేర్​ బాక్స్​ పాడైపోయినా ఇది కవర్​ చేస్తుంది.

బ్రేక్​డౌన్​ అసిస్టెన్స్

రోడ్​ సైడ్​ అసిస్టెన్స్​ యాడ్​–ఆన్​ తీసుకోవడం వలన మీ బండికి ఏదైనా సందర్భంలో బ్రేక్​డౌన్​ అయినపుడు మీరు దానికయ్యే ఖర్చును ఈ యాడ్​ ఆన్​ కవర్​ చేస్తుంది. కానీ ఇది ఒక క్లెయిమ్‌గా పరిగణించబడదు.

కన్జూమబుల్​ కవర్

బైకులో ముఖ్య భాగాలైన ఇంజన్​ ఆయిల్​​, స్క్రూలు, నట్లు, బోల్టులకు సంబంధించిన కవర్​ ఇది.

బైక్​ ఓనర్​షిప్​, ఇన్సూరెన్స్​ బదిలీ చేయించుకోండి

సెకండ్​ హ్యాండ్​ బైక్​ కొనే ముందు చూడాల్సిన విషయాలు

మీ సెకండ్​ హ్యాండ్​ బండికి కొత్త ఇన్సూరెన్స్​ తీసుకోవాలని చూస్తున్నారా?