మీరు ఒక బండిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లతే.. మరియు అందుకోసం ఎక్కువగా ఖర్చు చేయకూడదనుకుంటే సెకండ్ హ్యాండ్ (వాడిన) బైక్ తీసుకోవడం మంచి ఆలోచన. సెకండ్ హ్యాండ్ బండిని కొనుగోలు చేసే ముందు ఎటువంటి విషయాలు పరిశీలించాలో తెలుసుకోండి. వాటి మీద దృష్టి పెట్టండి. మీకు రోడ్డు మీద మంచి మజాను అందించే బైక్‌ను ఎంచుకోండి.
ఎలా తనిఖీ చేయాలని తికమకపడుతున్నారా? ఏమీ పర్లేదు.. మేము మీకు సాయం చేస్తాం. సవివరమైన గైడ్ కింద ఉంది.
వాడిన బైక్ కొనుగోలు చేసే ముందు ఈ చెక్ లిస్ట్ తనిఖీ చేయండి.
మీ రైడింగ్ కోసం తగిన బైక్‌లను వెతకండి – మీరు ఎటువంటి ప్రయోజనాల కోసం బైక్ కొంటున్నారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అందుకు తదనుగుణంగా వెతకండి.
పరిశోధన ముఖ్యం – మీరు ఎటువంటి బైక్ కావాలనుకుంటున్నారో.. దాని గురించి నిపుణులతో చర్చించండి. ఆన్లైన్లో వెతకండి.
బైక్‌ను నిశితంగా తనిఖీ చేయండి – బండికి వేసిన రంగు, మరకలు, ఏమైనా లీకేజీలు, టైర్లు, సొట్టలను పరిశీలించండి. అవతలివైపు బాడీని కూడా తనిఖీ చేయండి. ఏవైనా సొట్టలు ఉన్నాయో ప్రత్యేకించి తనిఖీ చేయండి. సొట్టలు కనుక మరీ అంతగా లేకపోతే ఓకేగా పరిగణించండి.
బ్రేక్స్ - వాడిన బైకులలో ఎక్కువ డ్రమ్స్ బ్రేక్స్ ఉంటాయి. కావున బ్రేకులను పరీక్షించండి. మీరు వాటిని అలాగే ఉంచాలని అనుకుంటున్నారా.. మార్చాలని చూస్తున్నారా నిర్ణయించుకోండి. సర్వీస్ కూడా పరిగణించాలి.
సర్వీసింగ్ రికార్డ్ – ఆ బైక్ ఎన్నిసార్లు సర్వీసింగ్‌కు వెళ్లిందో, ఎందుకు వెళ్లిందో యజమానిని అడిగి తెలుసుకోండి.
బైక్ VIN నెంబర్ స్కాన్ చేయండి. ఏదైనా సమస్య ఉందో చూడండి - వెహికిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (VIN) అనేది చాలా ముఖ్యం. చాలా బైకులలో స్టీరింగ్ వద్ద మీకు VIN నెంబర్ స్టాంప్ చేసి కనబడుతుంది. హెడ్‌లైట్ కింద అది ఉంటుంది. అధికారిక టైటిల్లో ఉన్న నెంబర్‌తో ఈ నెంబర్ సరిపోలుతుందో లేదో తనిఖీ చేయండి.
లైట్స్ - హెడ్‌లైట్ బల్బ్, ఇండికేటర్లు, టెయిల్ లైట్స్ పని చేసే స్థితిలో ఉన్నాయో లేదో చూడండి. ఒకవేళ పని చేయకపోతే వాటిని మార్పించండి.
పేపర్లను తనిఖీ చేయండి – ఆర్సీ బుక్, బైక్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ, పొల్యూషన్ సర్టిఫికెట్, ఎక్స్టెండెడ్ వారంటీ సర్టిఫికెట్ (ఉంటే)..
టెస్ట్ డ్రైవ్ (Test drive) – బండి వేగం, మైలేజీని చెక్ చేసేందుకు, నడిపినపుడు బైక్ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి దాన్ని నడిపి చూడండి.
లోకల్ మెకానిక్‌తో మాట్లాడి పూర్తిగా తనిఖీ చేయించండి – మీరు సెకండ్ హ్యాండ్ బైక్‌ను ప్రైవేట్ వ్యక్తి నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. అందుకు ఏదైనా కాంట్రాక్ట్ చేసుకునే ముందు థర్డ్ పార్టీని పరిశీలించాలి.
మీరు కావాలనుకున్న సెకండ్ హ్యాండ్ బైక్ దొరికితే.. దానిని మీకు దగ్గర్లోని లోకల్ మెకానిక్ షాపులో చెక్ చేయించేందుకు తీసుకెళ్లండి. (మీకు బైక్ మెకానిక్ గురించి తెలియకపోతే) ఈ చెకింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు ఓనర్షిప్, ఇన్సూరెన్స్‌కు సంబంధించిన పత్రాలను తనిఖీ చేయాలి.