డిజిట్ పార్ట్నర్గా మారండి
Work
in spare time
Earn
side income
FREE
training by Digit
Become a Digit Partner
Work
Cashless Garages
Earn
side income
FREE
training by Digit
మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఎవరు?
మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే నిర్ధిష్ట మోటార్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను విక్రయించడం కొరకు ఇన్సూరెన్స్ కంపెనీతో పని చేసే వ్యక్తి. ఒకవేళ మీరు మోటార్ ఏజెంట్ లేదా పివోఎస్పీ (POSP) అయితే, అన్ని మోటార్ వాహనాల సంబంధిత ఇన్సూరెన్స్ ప్లాన్ల నుంచి తమ అవసరాలకు అనుగుణంగా సరైన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడానికి మీరు కస్టమర్లకు సహాయపడతాయి.
డిజిట్ తో, మీరు కార్, బైక్ (లేదా 2-వీలర్), కమర్షియల్ వెహికల్ పాలసీలను విక్రయించవచ్చు.
మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
కారు, టూ–వీలర్ వాహనాలు, ఆటో లేదా ట్రక్కుల వంటి వాణిజ్యపరమైన వాహనాన్ని కవర్ చేయడానికి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఉపయోగించవచ్చు. అలాగే, భారతదేశంలోని అన్ని వాహనాలకు ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం తప్పనిసరి. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వంటి డ్యామేజీలు, నష్టాలను కవర్ అయ్యేలా ప్రజలు దీనిని కలిగి ఉండటం కూడా ముఖ్యం.
ప్రధానంగా మూడు రకాల మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి - థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, ఓన్ డ్యామేజ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, కాంప్రహెన్సివ్ (లేదా స్టాండర్డ్) మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ.
- భారతదేశంలో మోటార్ వాహనాల చట్టం ద్వారా థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది లేని వాహనదారులు భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. వారి కారు ఏదైనా థర్డ్ పార్టీ వాహనం, వ్యక్తి లేదా ఆస్తికి డ్యామేజీ కలిగించినట్లయితే తలెత్తే నష్టాల నుండి ఈ పాలసీ మీ జేబును రక్షిస్తుంది.
- రెండోది ఓన్ డ్యామేజీ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ఒక కస్టమైజ్డ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది తమకు, తమ సొంత వాహనానికి అయ్యే డ్యామేజీలు, నష్టాల నుంచి సంరక్షించడానికి రూపొందించబడింది.
- చివరగా కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ డ్యామేజీలు, నష్టాలతో పాటు సొంత డ్యామేజీల నుంచి కూడా పూర్తి సంరక్షణను అందిస్తుంది. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యం, మంటలు లేదా దొంగతనం వంటి ఊహించని నష్టాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది.
*డిస్‌క్లెయిమర్ - ఏజెంట్ల కొరకు ఎలాంటి నిర్ధిష్ట కేటగిరీ అంటూ ఏమీ లేదు. మీరు సాధారణ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి నమోదు చేసుకుంటే చాలు, అన్ని సాధారణ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను విక్రయించవచ్చు.
భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ రంగం గురించి ఆసక్తికరమైన వాస్తవాలు
డిజిట్‌తో మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎందుకు అవ్వాలి?
మీరు మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఎందుకు మారాలి, దానికి డిజిట్నే ఎందుకు ఎంచుకోవాలి అనే వాటి గురించి మరింత తెలుసుకోండి.
మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడం ఎలా?
పీవోఎస్‌పీ (POSP) సర్టిఫికేషన్ పూర్తి చేయడం అనేది వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి సులభమైన మార్గం. నిర్ధిష్ట ఇన్సూరెన్స్ ఉత్పత్తులను విక్రయించగల ఇన్సూరెన్స్ ఏజెంట్‌కు పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) అనే పేరు ఇవ్వబడుతుంది.
పీవోఎస్‌పీ (POSP) కావడానికి, ఐఆర్డీఏఐ (IRDAI) నిర్దేశించిన విధంగా కనీస విద్యార్హతలు ఉండటంతో పాటు మా శిక్షణను పూర్తి చేసుకోవాలి. డిజిట్ మీ శిక్షణ ప్రక్రియను చూసుకుంటుంది. చింతించకండి!
మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి అర్హతలు ఏమిటి, ఏమేం అవసరం?
కార్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఎలా మారాలో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీకు 18 సంవత్సరాలు పైబడిన వారు అయి ఉండాలి. కనీసం 10వ తరగతి వరకు చదువుకొని ఉండాలి. చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు, పాన్ (PAN) కార్డును కలిగి ఉండాలి.
ఐఆర్డీఏఐ (IRDAI) ద్వారా పేర్కొనబడిన విధంగా 15 గంటల శిక్షణను తప్పనిసరిగా పూర్తి చేయమని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మీరు తెలుసుకోవాల్సిన ప్రతిదీ నేర్చుకోవడానికి మేము మీకు సహాయం చేస్తామని మాటిస్తున్నాము!
ఎవరు మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కాగలరు?
మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి ఏకైక ఆవశ్యకత ఏమిటంటే, అభ్యర్థికి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండటం, 10వ తరగతి పూర్తి చేసి ఉండటం.
అంటే ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించే ఆప్టిట్యూడ్ ఉన్న ఎవరైనా పీవోఎస్‌పీ (POSP) ఏజెంట్ కావొచ్చు. దీనిలో కాలేజీ విద్యార్థులు, ఇంట్లోనే ఉండే జీవిత భాగస్వాములు, పదవీ విరమణ పొందిన వారు, వ్యాపారవేత్తలు/మహిళలు ఉంటారు.
డిజిట్‌తో మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్/ పీవోఎస్‌పీ (POSP)గా ఎలా మారాలి?
స్టెప్ 1
పైన ఇవ్వబడిన మా పీవోఎస్ (POSP) ఫారాన్ని నింపి సైనప్ చేయండి. అందేలె అన్ని వివరాలను నింపండి. అలాగే, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
స్టెప్ 2
మాతో కలిసి మీ 15-గంటల శిక్షణను పూర్తి చేయండి
స్టెప్ 3
సిఫారసు చేయబడిన పరీక్షను పూర్తి చేయండి.
స్టెప్ 4
మాతో ఒప్పందంపై సంతకం చేయండి, అంతే! మీరు సర్టిఫైడ్ పీవోఎస్‌పీ (POSP) అవుతారు.
మీరు ఎంత సంపాదించగలరు?
ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మీ ఆదాయం మీరు విక్రయించే పాలసీల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మీరు విక్రయించే పాలసీల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది. మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కార్, బైక్, కమర్షియల్ వాహనాల సంబంధిత ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించవచ్చు.
అంటే మీరు కాంప్రహెన్సివ్, స్టాండలోన్ పాలసీలు రెండింటినీ కస్టమర్లకు విక్రయించవచ్చు. దీని కొరకు కమిషన్ విధానం కింద ఇవ్వబడింది:
|
పాలసీ, వాహనం రకం |
వాహనం వయసు |
కమిషన్ యొక్క గరిష్ట రేటు |
|
కాంప్రహెన్సివ్ పాలసీ - నాలుగు చక్రాల వాహనాలు, ఇతర రకాల ప్రైవేటు లేదా వాణిజ్యపరమైన వాహనాలు |
1-3 సంవత్సరాల వయస్సు |
సొంత డ్యామేజీ ప్రీమియంలో 15% |
|
కాంప్రహెన్సివ్ పాలసీ – టూ వీలర్లు |
1-3 సంవత్సరాల వయస్సు |
సొంత డ్యామేజీ ప్రీమియంలో 17.5% |
|
కాంప్రహెన్సివ్ పాలసీ - నాలుగు చక్రాల వాహనాలు, ఇతర రకాల ప్రైవేటు లేదా వాణిజ్యపరమైన వాహనాలు |
4 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ |
1సొంత డ్యామేజీ ప్రీమియంలో 15% + థర్డ్ పార్టీ ప్రీమియంలో 2.5% |
|
కాంప్రహెన్సివ్ పాలసీ – టూ వీలర్లు |
4 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ |
సొంత డ్యామేజీ ప్రీమియంలో 17.5% + థర్డ్ పార్టీ ప్రీమియంలో 2.5% |
|
స్టాండలోన్ థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ - అన్ని రకాల వాహనాలు |
ఏ వయసైనా |
ప్రీమియంలో 2.5% |
నేను మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఎందుకు మారాలి?
తరచూ అడిగే ప్రశ్నలు
పీవోఎస్ (POSP) ఏజెంట్ కావడానికి ప్రమాణాలు ఏమిటి?
నేను ఏ ఏ డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది?
పాన్ కార్డు హోల్డర్, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఒక్కరే ఉండాలా?
మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను నేను ఎప్పుడు విక్రయించడం ప్రారంభించగలను?
పీవోఎస్‌పీ (POSP) వ్యక్తిగా సర్టిఫికెట్ పొందడానికి శిక్షణ పొందడం తప్పనిసరా?
నేను డిజిట్‌తో పార్ట్నర్ అయితే నాకు ఎటువంటి సపోర్ట్ సేవలు లభిస్తాయి?
పీవోఎస్ (POSP) సర్టిఫికేషన్ పూర్తి చేసిన తరువాత నా పరిజ్ఞానాన్ని నేను ఎలా పెంపొందించుకోగలను?
సర్టిఫికేషన్ తరువాత మా పీవోఎస్‌పీ (POSP)ల కోసం మరో విస్తృతమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఇది మీ ఇన్సూరెన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, మీ అమ్మకాలు, సర్వీసింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ శిక్షణా కార్యక్రమాలు, ఈవెంట్లు దిగువ పేర్కొన్నవాటిని కవర్ చేస్తాయి:
- సంక్లిష్టమైన కేసులను హ్యాండిల్ చేయడం కొరకు అవసరమైన అత్యాధునిక ఇన్సూరెన్స్ పరిజ్ఞానం
- తాజా ఇన్సూరెన్స్ ఉత్పత్తులతో, వాటిని ఎలా పిచ్ చేయాలనే దాని గురించి
- మీ అమ్మకాల పరిమాణాలను పెంచడంలో సహాయపడే వివిధ అమ్మకపు పద్ధతులను నేర్చుకోవడానికి సరదా, ఆసక్తికరమైన మార్గాలు
మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి నాకు సేల్స్ అనుభవం అవసరమా?