డిజిట్ పార్ట్నర్గా మారండి
Work
in spare time
Earn
side income
FREE
training by Digit
Become a Digit Partner
Work
Cashless Garages
Earn
side income
FREE
training by Digit
జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఎవరు?
ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మే వ్యక్తిని ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటారు. ఇతడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆధీనంలో పని చేస్తాడు. ఆ కంపెనీ పాలసీలనే విక్రయిస్తాడు.
ఇంటి నుంచే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎలా కావాలని మీరు చూస్తున్నట్లయితే లేదా సర్టిఫైడ్ పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) గా ఎలా మారాలా అని చూస్తుంటే డిజిట్ మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారడం వలన కస్టమర్లకు సాయం చేసే అవకాశం కలుగుతుంది. వారు పాలసీలు ఎంచుకునేటపుడు వారి అవసరాలకు తగిన పాలసీని వారికి సిఫారసు చేయవచ్చు.
డిజిట్ కంపెనీతో మీరు హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ (కార్, బైక్, కమర్షియల్ వాహనాలు) ఇన్సూరెన్స్, ఎస్‌ఎఫ్‌ఎస్‌పీ (SFSP) ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ చేయించొచ్చు.
జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
జనరల్ ఇన్సూరెన్స్‌లో కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎస్‌ఎఫ్‌ఎస్‌పీ (SFSP) ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.
అనుకోని సందర్భాల్లో రక్షించుకునేందుకు జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రజలకు బాగా సాయం చేస్తాయి.
ఉదాహరణకు, ఒక కార్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నట్లైతే ఆ కారుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అయ్యే ఖర్చులు, నష్టాల నుంచి కవర్ చేస్తుంది. రిపేర్లకు అయ్యే ఖర్చులు జేబు నుంచి పెట్టుకోనవసరం లేకుండా సహాయపడుతుంది. అదేవిధంగా ఎస్‌ఎఫ్‌ఎస్‌పీ (SFSP) ఇన్సూరెన్స్ పాలసీ ప్రకృతి విపత్తుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
మోటారు వాహనాల చట్టం, పట్టణ జనాభా పెరగడం వంటి కారణాల వలన చాలా మంది భారతీయులు ప్రస్తుత రోజుల్లో తమను తాము, తమ ఆస్తులను కాపాడుకునేందుకు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు.
*డిస్‌క్లెయిమర్ (Disclaimer) – ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ప్రత్యేక కేటగిరీ అంటూ ఏమీ లేదు. మీరు జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా నమోదు చేసుకుంటే అన్ని రకాల జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మవచ్చు.
భారతదేశంలో జనరల్ ఇన్సూరెన్స్ రంగం గురించి ఆసక్తికర విషయాలు
డిజిట్‌తోనే ఎందుకు నేను జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారాలి?
మీరు ఎందుకోసం ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారాలి? డిజిట్‌ను ఎందుకు ఎంచుకోవాలనే విషయాలను గురించి మరింతగా తెలుసుకోండి.
ఆన్లైన్లో ఇన్సూరెన్స్ ఏజెంట్ అవడం ఎలా?
ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారేందుకు సులభమైన మార్గం పీవోఎస్‌పీ (POSP) సర్టిఫికేషన్ పూర్తి చేయడం. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ (POSP) అనే పేరును ఇన్సూరెన్స్ ఏజెంట్‌కి కంపెనీ ఇచ్చిందంటే అతడు ఇన్సూరెన్స్ ప్రొడక్టులను అమ్మేందుకు అర్హత కలిగి ఉంటాడు.
పీవోఎస్‌పీ (POSP)గా మారేందుకు మీకు కొన్ని కనీస విద్యార్హతలు అవసరం. ఐఆర్‌డీఏఐ (IRDAI) నిబంధనల ప్రకారం మీరు తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా, శిక్షణా కార్యక్రమాన్ని కూడాపూర్తి చేయాలి. మీ శిక్షణ కాలం గురించి ఎటువంటి చింత అవసరం లేదు. డిజిట్ అంతా చూసుకుంటుంది.
ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి కావాల్సిన అర్హతలు ఏంటి?
మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడానికి ఏం కావాలంటే..
- మీకు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి
- కనీసం మీరు పదో తరగతి అయినా ఉత్తీర్ణులు అయి ఉండాలి
- మీకు సరైన ఆధార్ కార్డు, పాన్ (PAN) కార్డు ఉండాలి
- ఐఆర్‌డీఏఐ (IRDAI) అందించే 15 గంటల శిక్షణా కార్యక్రమాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి.
మీరు తెలుసుకోవాల్సినవి నేర్చుకోవడంలో మేము మీకు సాయం చేస్తామని హామీ ఇస్తున్నాము!
ఎవరు ఇన్సూరెన్స్ ఏజెంట్ కావచ్చు?
ఇన్సూరెన్స్ ఏజెంట్ అయ్యేందుకు మీరు కేవలం 18 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
పదో తరగతి ఉత్తీర్ణులైన ఎవరైనా సరే ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మడానికి అర్హులే. అలాగే, వారు సర్టిఫైడ్ పీవోఎస్‌పీ (POSP) ఏజెంట్‌గా మారొచ్చు. ఈ పనిని కళాశాల విద్యార్థులు, ఇంట్లో ఉండే గృహిణులు, పదవీ విరమణ పొందినవారు, వ్యాపారవేత్తలు ఇలా ఎవరైనా సరే చేయించొచ్చు.
డిజిట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడమెలా?
స్టెప్ 1
మా పీవోఎస్‌పీ (POSP) ఫామ్ నింపి సంతకం చేస్తే సరిపోతుంది. అన్ని రకాల వివరాలను నింపి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
స్టెప్ 2
మీ 15 గంటల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి.
స్టెప్ 3
సూచించిన పరీక్షను విజయవంతంగా రాయండి.
స్టెప్ 4
మాతో అగ్రిమెంట్ మీద సంతకం చేస్తే సరిపోతుంది. మీరు సర్టిఫైడ్ పీవోఎస్‌పీ (POSP)గా మారొచ్చు.
నేను జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఎందుకు మారాలి?
తరచూ అడిగే ప్రశ్నలు
డిజిట్‌తో ఇన్సూరెన్స్ ఏజెంట్ (POSP) గా మారేందుకు ఏం సర్టిఫికెట్స్ అవసరం?
పాన్ (PAN) కార్డు హోల్డర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఒక్కరే అయి ఉండాలా?
నేను ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మడం ఎప్పుడు మొదలు పెట్టొచ్చు?
మీరు మాతో రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీకు పీవోఎస్‌పీ (POSP) శిక్షణ కోసం పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో పాసయితే మీకు ఈ-సర్టిఫికెట్ అందుతుంది.
అప్పుడు మీరు పీవోఎస్‌పీ (POSP) ఏజెంట్‌గా ఇన్సూరెన్స్ అమ్మడానికి అర్హులవుతారు.
నేను సర్టిఫైడ్ పీవోఎస్ (POS) పర్సన్‌గా మారేందుకు శిక్షణ తీసుకోవడం తప్పనిసరా?
నేను డిజిట్ ఇన్సూరెన్స్‌తో పార్ట్నర్ అయితే ఎటువంటి సపోర్ట్ సేవలు నాకు లభిస్తాయి?
మీరు డిజిట్ ప్లాట్‌ఫాం మీద అమ్మే పాలసీల గురించి మీకు ఏవైనా సందేహాలుంటే డిజిట్ రిలేషన్షిప్ మేనేజర్ మీకు సాయం చేస్తారు. ప్రతి ఒక్క డిజిట్ పార్ట్నర్కి రిలేషన్షిప్ మేనేజర్ని కేటాయిస్తారు. మీకు ఎటువంటి సందేహాలున్నా వారు నివృత్తి చేస్తారు.
partner@godigit.com మెయిల్‌కు తమ సందేహాలను పంపడం ద్వారా కూడా ఏజెంట్స్ మరింత సమాచారం పొందొచ్చు.
పీవోఎస్‌పీ (POSP) సర్టిఫికేషన్ పూర్తయిన తర్వాత నేను నా పరిజ్ఞానాన్ని ఎలా పెంచుకోవచ్చు?
మా పీవోఎస్‌పీ (POSP) లు సర్టిఫికేషన్ పొందిన తర్వాత మరొక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అది మీరు ఇన్సూరెన్స్ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ అమ్మకాలను మెరుగు పరుచుకునేందుకు, మీ సర్వీస్ నైపుణ్యాలను పెంచుకునేందుకు సహాయపడుతుంది. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా మీరు ఈ కింది అంశాలను నేర్చుకోవచ్చు:
- సంక్లిష్టమైన ఇన్సూరెన్స్ కేసులను పరిష్కరించేందుకు అధునాతన ఇన్సూరెన్స్ పరిజ్ఞానం
- కొత్తగా వచ్చిన ఇన్సూరెన్స్ ప్రొడక్టుల గురించి, వాటి వలన కలిగే మేలు గురించి.
- వివిధ రకాల అమ్మకపు చిట్కాలను ఎంజాయ్ చేస్తూనే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాల వలన మీ అమ్మకాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది.