7 Crore+ Customers
Affordable Premium
పాస్పోర్ట్ అనేది మీ గుర్తింపు మరియు మీ పౌరసత్వాన్ని నిరూపించే ముఖ్యమైన పత్రాల్లో ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా, మీ పాస్‌పోర్ట్ చెల్లుబాటు పది సంవత్సరాలు దాటినప్పుడు దానిని తప్పకుండా రిన్యూవల్ చేయించాలి.
కావున ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ రిన్యూవల్ గురించి తెలుసుకునేందుకు కిందికి స్క్రోల్ చేయండి. అంతే కాకుండా పాస్‌పోర్ట్‌ను రిన్యూవల్ చేసేందుకు అవసరమయ్యే పత్రాలు, ప్రక్రియకు పట్టే సమయం గురించి కూడా ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
అన్నింటికన్నా ముందు మీరు పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్‌సైట్‌లో మీ పాస్‌పోర్ట్ ఖాతాను సృష్టించాలి. ఇందుకోసం మీరు తప్పకుండా ఈ స్టెప్స్ ఫాలో కావాలి:
మీరు పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత కొత్త పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఉన్న పాస్ పోర్ట్ నే రిన్యువల్ చేయించుకోవచ్చు.
ఇప్పుడు మీరు ఆన్‌లైన్ పాస్పోర్ట్ రిన్యువల్ విధానం కోసం సిద్ధంగా ఉన్నారు!
పాస్పోర్ట్ రిన్యువల్ కోసం మీరు ఈ దశలను అనుసరించవచ్చు:
అంతేకాకుండా మీరు ఈ-ఫారం ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. మీరు ప్రింట్ తీసిన ఈ ఫారాన్ని పీఎస్కేలో లేదా ప్రాంతీయ పోస్టాఫీస్‌లో సబ్మిట్ చేయలేరు.
పాస్పోర్ట్ రిన్యువల్ గురించి మొత్తం ఇదే. రిన్యువల్ చేయబడిన మీ పాస్ పోర్ట్ ను పొందేందుకు అపాయింట్‌మెంట్ ఎలా షెడ్యూల్ చేయాలో తెలుసుకుందాం.
మీ రిన్యువల్ పాస్ పోర్ట్‌ను పొందేందుకు మీకు అనుకూలమైన స్లాట్‌ను ఎంచుకునేందుకు కింద చూడండి:
|
వర్గము |
పాస్‌పోర్ట్ రిన్యూవల్ కోసం పట్టే సమయం |
|
యుక్తవయస్కులు |
యుక్తవయస్కులు గడువు తేదీ కంటే 1 సంవత్సరం ముందుగానే మీరు పాస్పోర్ట్ రిన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. |
|
మైనర్స్ (4 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు) |
5 సంవత్సరాల చెల్లుబాటు ముగిసిన తర్వాత లేదా వారికి 18 సంవత్సరాలు వచ్చే వరకు (ఏది ముందుగా వస్తే అది) వారు రీ-ఇష్యూ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 15-18 సంవత్సరాల వయస్సు పరిమితి గల మైనర్లు కూడా 10 సంవత్సరాల చెల్లుబాటు పాస్ పోర్ట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. |
పాస్పోర్ట్ రిన్యువల్ కోసం అవసరం అయ్యే పత్రాలు జాబితా ఇక్కడ ఉంది:
మీరు తప్పకుండా 4.5 X 3.5 సెం.మీ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను తీసుకురావాలి. ఫొటోగ్రాఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్ తప్పకుండా తెలుపై ఉండాలి.
మీరు ప్రస్తుతం ఉంటున్న నివాస చిరునామా రుజువును తల్లిదండ్రుల పేరుతో సమర్పించవచ్చు.
మైనర్ తరఫున తల్లిదండ్రులు పత్రాలను ధృవీకరించవచ్చు.
అంతే కాకుండా పాస్పోర్ట్ రిన్యువల్ ప్రక్రియ అనేది (నార్మల్ లేదా తత్కాల్) దరఖాస్తుదారు వయసు (వయోజన లేదా మైనర్) మీద ఆధారపడి భిన్నంగా ఉంటుంది.
పాస్పోర్ట్ రిన్యువల్: కొరకు వర్తించే చార్జీలను కింది టేబుల్ వివరిస్తుంది:
|
సేవలు |
అప్లికేషన్ కు ఫీజు |
అదనపు ఫీజు లు (తత్కాల్) |
|
తాజా పాస్ పోర్ట్/రీ-ఇష్యూ; 10 సంవత్సరాల చెల్లుబాటు తో ఉన్న వీసా బుక్‌లెట్ లో పేజీలు అయినపోయిన కారణంగా (36 పేజెస్) అదనపు బుక్‌లెట్ తో సహా |
రూ. 1,500 |
రూ. 2,000 |
|
తాజా పాస్ పోర్ట్/రీ-ఇష్యూ; 10 సంవత్సరాల చెల్లుబాటు తో ఉన్న వీసా బుక్‌లెట్ లో పేజీలు అయినపోయిన కారణంగా (60 పేజెస్) అదనపు బుక్‌లెట్ తో సహా |
రూ. 2,000 |
రూ. 2,000 |
|
మైనర్ కోసం ఫ్రెష్/రీ-ఇష్యూ పాస్ పోర్ట్ (18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే) 5 సంవత్సరాల చెల్లుబాటు లేదా మైనర్‌కు 18 సంవత్సరాలు వచ్చే వరకు (36 పేజెస్) |
రూ. 1,000 |
రూ. 2,000 |
పాస్పోర్ట్ రిన్యూవల్‌కు ఎంత సమయం పడుతుందని చూపేందుకు ఇక్కడ పట్టిక ఉంది:
|
పాస్‌పోర్ట్ టైప్ |
ప్రక్రియ సమయం |
|
నార్మల్ |
30-60 రోజులు |
|
తత్కాల్ |
3-7 రోజులు |
పాస్‌పోర్ట్ రిన్యూవల్, రీ-ఇష్యూ మధ్య వ్యత్యాసం ఉందని మీరు గుర్తుంచుకోవాలి. పాస్‌పోర్ట్ రిన్యూవల్ విషయంలో పాస్‌పోర్ట్ అథారిటీ మీకు ఇప్పటికే ఉన్న పాస్‌పోర్ట్‌ను రిన్యూవల్ చేసి అందిస్తుంది. మీరు రీ-ఇష్యూ కోసం దరఖాస్తు చేసినపుడు కొత్త పాస్‌పోర్ట్ పొందుతారు.
ముందే చెప్పినట్లుగా మీ పాస్‌పోర్ట్ చెల్లుబాటు గడువు ముగిసినపుడు దానిని రిన్యూవల్ చేయించుకునేందుకు మీరు అర్హులు. మరోవైపు చూసుకుంటే కింది సంఘటనలు జరిగినపుడు పాస్‌పోర్ట్ మళ్లీ జారీ చేయబడుతుంది:
మీరు మీ పాస్‌పోర్ట్‌ను ఎప్పుడు కోల్పోయారు
పాస్‌పోర్ట్ దొంగిలించబడింది
మీ పాస్‌పోర్ట్ దెబ్బతింది
పేజీలు అయిపోయాయి
వ్యక్తిగత సమాచారంలో మార్పు
పాస్పోర్ట్ సేవ పోర్టల్ ద్వారా మీరు సులభంగా మీ పాస్‌పోర్ట్ రిన్యూవల్ స్థితిని ట్రాక్ చేయొచ్చు. మీ అప్లికేషన్ టైప్, ఫైల్ నెంబర్, జన్మదినం వంటి వివరాలను పోర్టల్‌లో ఎంటర్ చేయండి. తర్వాత ట్రాక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి.
మీరు హాలీడేకు వెళ్లినా లేక బిజినెస్ ట్రిప్‌కు వెళ్లినా కానీ పాస్‌పోర్ట్ తీసుకెళ్లడం చాలా అవసరం. మీ పాస్‌పోర్ట్ చెల్లుబాటు గడువు పూర్తయితే వీలైనంత త్వరగా పాస్‌పోర్ట్ ఆన్‌లైన్ ద్వారా రిన్యూవల్ ఎంచుకోండి. ఆన్‌లైన్ పాస్పోర్ట్ రిన్యువల్ ప్రాసెస్ కోసం పైన పేర్కొన్న వివరాలను గుర్తుంచుకోండి. అవాంతరాలు లేకుండా రిన్యువల్ చేయించుకోండి.