డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి

ఇండియాలోని జనరల్ ఇన్సూరెన్ కంపెనీలు

జీవితంలో ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతాయి కాబట్టి మంచి మరియు చెడు రెండింటి కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆహ్లదరకంగా సర్‌ప్రైజెస్ నిర్వహించడం సులభమే. అయినప్పటికీ ఎమర్జెన్సీ పరిస్థితులు మీకు మరియు మీ కుటుంబానికి చాలా కష్టంగా ఉంటాయి. అందుకోసమే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

మీరు ముందుగానే అటువంటి కవరేజీని పొందినట్లయితే.. అదృష్టవశాత్తు ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆర్థిక సహాయాన్ని అందజేస్తాయి.

ఇండియాలో ఇన్సూరెన్స్ రెండు భాగాలుగా విభజించబడింది - లైఫ్ ఇన్సూరెన్స్ మరియు నాన్-లైఫ్ ఇన్సూరెన్స్. తర్వాత పాలసీలు జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌గా విభజించబడ్డాయి. ఇవి అనేక రకాల భిన్నమైన కవరేజ్ లను కలిగి ఉంటాయి.

ప్రతి ఒక వ్యక్తికి అన్ని రకాల జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు అవసరం లేనప్పటికీ అవసరమైన పాలసీలను తీసుకోవడం ఎంతో అవసరం.

జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఏమిటి?

జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒక ఎంటర్‌ప్రైజ్. ఇది వినియోగదారులకు వివిధ రకాల నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. వారి అవసరాలకు తగిన విధంగా క్రియేట్ చేస్తుంది. మార్కెట్ చేసి మద్దతు కూడా అందిస్తోంది. పాలసీదారులు అటువంటి కంపెనీకి జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం ప్రీమియం చెల్లించాలి.

అందుకు ప్రతిగా ఈ కంపెనీలు నిర్దిష్ట ముందస్తు షరతులు నెరవేరినపుడు ఈ వ్యక్తులకు ఆర్థిక లాభాలను అందజేస్తాయి.

ఒకరు ఎంచుకునే జనరల్ ఇన్సూరెన్స్ పాలసీని బట్టి ఈ షరతులు వేర్వేరుగా ఉంటాయి. జనరల్ ఇన్సూరెన్స్‌లో ఈ కింది రకాలు ఉంటాయి:

  • హెల్త్ ఇన్సూరెన్స్

  • మోటార్ ఇన్సూరెన్స్ (కార్, బైక్, కమర్షియల్ వాహనాల కొరకు)

  • ట్రావెల్ ఇన్సూరెన్స్

  • వినియోగదారులు వాడే వస్తువులకు ఇన్సూరెన్స్

  • కమర్షియల్ ఇన్సూరెన్స్

  • ప్రాపర్టీ ఇన్సూరెన్స్ (ఇల్లు, షాప్, కట్టడం మొదలయిన వాటికి)

  • అగ్రికల్చర్ ఇన్సూరెన్స్

ఈ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు కొన్ని పరిస్థితులకు సరిగ్గా సరిపోతాయి. అయినప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ మినహా ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ అవసరం లేదు.

మెడికల్ ఇన్సూరెన్స్ అనేది వయసు, ఆరోగ్యం మరియు ఇతర కారణాలతో సంబంధం లేకుండా ఎంచుకునే అత్యంత ముఖ్యమైన ఇన్సూరెన్స్ కవరేజ్.

ఇండియాలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా

కంపెనీ పేరు స్థాపించిన సంవత్సరం హెడ్ క్వార్టర్ (ప్రధాన కార్యాలయం) ఎక్కడ ఉంది
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1906 కోల్‌కతా
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ 2016 బెంగళూరు
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2001 పూనే
చోళమండలం ఏంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2001 చెన్నై
భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2008 ముంబై
హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2002 ముంబై
ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2007 ముంబై
ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1919 ముంబై
ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2000 గురుగ్రామ్
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2000 ముంబై
రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2001 చెన్నై
ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1947 న్యూ ఢిల్లీ
టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2001 ముంబై
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2009 ముంబై
ఆకో జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ 2016 ముంబై
నేవీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ 2016 ముంబై
జునో జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఎడెల్వీస్ జనరల్ ఇన్సూరెన్స్ అనేవారు) 2016 ముంబై
ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2001 ముంబై
కొటక్ మహీంద్రా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2015 ముంబై
లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ 2013 ముంబై
మాగ్మా హెచ్డీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2009 కోల్‌కతా
రహేజా క్యుబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2007 ముంబై
శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2006 జైపూర్
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1938 చెన్నై
యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2007 ముంబై
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 2002 న్యూ ఢిల్లీ
ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2015 ముంబై
మనిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2012 ముంబై
ఈసీజీసీ లిమిటెడ్ 1957 ముంబై
మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2008 న్యూ ఢిల్లీ
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ 2012 గురుగ్రామ్
స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ. లిమిటెడ్ 2006 చెన్నై

తరచూ అడిగే ప్రశ్నలు

జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమిటి?

లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా మిగతా అన్ని రకాల బీమా పథకాలు జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్లుగా వర్గీకరించబడ్డాయి. ఉదాహరణకు మీరు కొత్త బైక్ కొంటున్నపుడు దానికి ఇన్సూరెన్స్ చేయించడం అనేది ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు మీరు చేసే ఒక సాధారణ ప్రయత్నం. దీనినే జనరల్ ఇన్సూరెన్స్ అని అంటారు. అయితే ఈ రకమైన జనరల్ ఇన్సూరెన్స్‌ను మోటార్ ఇన్సూరెన్స్ అని అంటారు.

జనరల్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ మధ్య తేడాలు ఏంటి?

లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పాలసీ. ఇది కవర్‌ చేయబడిన పాలసీదారులకు మరణ ప్రయోజనాలు అందిస్తుంది. ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి మరణించిన తర్వాత అతడి కుటుంబానికి జీవిత బీమా పాలసీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎటువంటి మరణ ప్రయోజనాలను అందించవు. బదులుగా అటువంటి ప్లాన్స్ ఎంచుకున్న పాలసీదారులు కొన్ని నిబంధనలు నేరవేరినప్పుడు పాలసీని క్లెయిమ్ చేయొచ్చు.

మీరు నమ్మకమైన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థను ఎలా ఎంచుకోవచ్చు?

మీ అవసరాలకు అనుగుణంగా ఉండే ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునే ముందు మీరు అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.

మొదటగా ఫేస్‌బుక్ మరియు గూగుల్ నుంచి పొందే రేటింగ్స్ ద్వారా బ్రాండ్ యొక్క కీర్తిని ధృవీకరించాలి.

తర్వాత క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను అంచనా వేయడం వలన అవసరమైన సమయాల్లో ఎవరైనా కంపెనీ నుంచి ఎంత తొందరగా పరిహారం పొందగలుగుతారో ఇది తెలియజేస్తుంది.

చివరగా పాలసీల ప్రీమియంలు ఆదర్శ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు సంబంధించి మీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి.