డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి

పాన్ కార్డ్ తో ఫారం 26AS డౌన్ లోడ్ చేయడం మరియు వీక్షించడం ఎలా?

ఫారం 26AS వాడకం మరియు దాని నేచర్ లో కొంత గందరగోళం ఉంది. ఇది వ్యక్తులు భరించాల్సిన అదనపు పన్ను రూపమని చాలా మంది విశ్వసిస్తారు. అయితే వాస్తవానికి ఇది మొత్తం పన్ను సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంటుంది.

వ్యక్తులు సులభంగా ఇన్కమ్ టాక్స్ ఈ-ఫిల్లింగ్ పోర్టల్లో పాన్ తో ఫారం 26ASకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అయితే మీరు తప్పక తెలుసుకోవాల్సిన అదనపు సమాచారం ఇక్కడ ఉంది.

ఫారం 26AS అంటే ఏమిటి?

2020 ప్రారంభంలో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఫారం 26ASను ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ గా పునరుద్ధరించింది. ఇప్పుడు ఇది పేర్కొన్న ద్రవ్య లావాదేవీలు, పన్ను చెల్లింపులు, చెల్లింపుదారులు చేపట్టిన పూర్తి ప్రొసీడింగ్స్TDS/TCS వివరాలతో సహా రీఫండ్ డిటెయిల్స్ కూడా కలిగి ఉంటుంది.

ఫారం 26ASను ఆన్ లైన్ లో ఎలా డౌన్ లోడ్ చేయాలి?

మీ ఐటీఆర్ ను ఫైల్ చేసే ముందు మీ ఖాతాలో జమ అయిన పన్ను మొత్తం తనిఖీ చేసేందుకు మీరు ఒకసారి స్టేట్‌మెంట్ ను పరిశీలించాలి. ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫారం 26AS అంటే ఏంటో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి దాన్ని ఎలా యక్సెస్ చేయాలో మరియు ఎలా అవసరం అయిన సమాచారాన్ని పొందాలో ఇప్పుడు చూద్దాం.

ఆన్ లైన్ లో 26ASను వీక్షించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి -

  • మీరు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ మీ బ్యాంక్ ఖాతా మీ పాన్ తో లింక్ చేయబడాలి. ఈ విషయంలో మీ బ్యాంక్ NSDLతో రిజిస్టర్ చేయబడిందో లేదో తనిఖీ చేయాలి.
  • మీరు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. మరియు ఫారం 26ASను పాన్ తో చూడొచ్చు. అంతే కాకుండా జన్మదినం, లేదా డేట్ ఆఫ్ ఇన్‌కార్పొరేషన్ సహాయంతో చూడొచ్చు.

మీ వార్షిక సమాచార ప్రకటన కాపీని మీతో ఉంచుకోవాలని అనుకుంటున్నారా? దీనిని డౌన్ లోడ్ చేసేందుకు దిగువ పేర్కొన్న పద్ధతిని అనుసరించండి.

స్టెప్ 1: ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఈ-ఫిల్లింగ్ పోర్టల్ను సందర్శించి మీరు రిజిస్టర్ చేసుకుని ప్రాసెస్ ప్రారంభించండి.

స్టెప్ 2: తర్వాత మీ యూజర్ ఐడీ ఎంటర్ చేయండి (ఆధార్ లేదా పాన్). సురక్షితంగా ఉండేందుకు మరియు నిర్దారించేందుకు ఇచ్చిన చెక్ బాక్స్ ను ఎంచుకుని పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.

స్టెప్ 3: మెనూ నుంచి ఈ ఫైల్ ను ఎంచుకోండి. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లో ఉన్న వ్యూ ఫారం 26AS’ ను ఎంచుకోండి.

స్టెప్ 4: తదుపరి మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్ (TRACES పోర్టల్) కు రీడైరెక్ట్ చేయబడతారని ఒక పాపప్ మెస్సేజ్ వస్తుంది. ప్రాసెస్ ను కంప్లీట్ చేసేందుకు అసెస్‌మెంట్ సంవత్సరం మరియు ఫార్మాట్ ను ఎంచుకోండి.

మీరు దీనిని ఆన్ లైన్ లో చూడాలని అనుకుంటే HTML ఫార్మాట్ ఎంచుకోండి. మీరు TRACES వెబ్సైట్ నుంచి ఫారం 26ASను డౌన్ లోడ్ చేసి మీ పన్యాను క్రెడిట్ స్టేట్ మెంట్ లోని వివిధ భాగాలను తర్వాత చూడాలని అనుకుంటే ఫార్మాట్ ను PDFగా వదిలివేయండి.

ఫారం 26ASలోని వివిధ భాగాలు ఏమిటి?

ఫారం 26AS A నుంచి H వరకు మొత్తం 8 భాగాలను కలిగి ఉంటుంది. అందులో ఉన్న ప్రతీది ఒక ట్యాక్స్ కంపోనెంట్ తో వ్యవహరిస్తుంది. అవేంటంటే;

పార్ట్ 1: సోర్స్ వద్ద డిడక్ట్ చేయబడిన ట్యాక్స్ డిటేయిల్స్ (TDS)

మీరు TRACES వెబ్సైట్ లో ఫారం 26AS ను వీక్షించినపుడు TDS, పెన్షన్ ఆదాయం, సాలరీ, వడ్డీ ఆదాయం మొదలైన వాటి గురించి మొత్తం తెలసుకుంటారు. ఇది కలెక్షన్ అకౌంట్ నంబర్ (TAN) వివరాలతో పాటు పన్ను మినహాయింపు వివరాలు ఎన్ని టీడీఎస్ లు డిపాజిట్ చేయబడ్డాయి మరియు తీసివేయబడ్డాయి అనే వివరాలను కూడా చూపుతుంది.

పార్ట్ 2: సోర్స్ వద్ద డిడక్ట్ చేయబడిన పన్ను వివరాలు15G & 15H

ఫారం 15G మరియు 15H అనేవి సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు. వీటిని వ్యక్తులు సోర్స్ వద్ద ట్యాక్స్ డిడక్షన్ కోసం ఉపయోగిస్తారు. ఇవి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగిస్తాయి. తమ మొత్తం ఇన్కమ్ టాక్స్ విధించదగిన పరిమితి కంటే తక్కువగా ఉంటే వినియోగిస్తారు.

పార్ట్ 3: సెక్షన్194B యొక్క ప్రొవిసో కింద లావాదేవీల వివరాలు. సెక్షన్ 194R యొక్క సబ్ సెక్షన్ (1) మొదటి నిబంధన. సెక్షన్ 194S యొక్క సబ్ సెక్షన్ (1) కి ప్రొవిసో

పార్ట్ 4: సెక్షన్ 194IA కింద స్థిరాస్తి విక్రయం కోసం మినహాయించబడిన పన్ను వివరాలు

ఫారం 26ASలని విభాగంలో మీరు ఆస్తిని కొనుగోలు చేసేటపుడు తీసివేసిన మరియు డిపాజిట్ చేసిన టీడీఎస్ సంబంధించిన సమాచారం ఉంటుంది.

పార్ట్ 5: సెక్షన్ 194S లోని సబ్ సెక్షన్ (1) కి సంబంధించి ప్రోవిసో ట్రాన్సాక్షన్స్ ఫారం -26QE కింద ఉంటాయి

ఫారం 26QE ప్రకారం సెక్షన్ 194Sలోని సబ్ సెక్షన్ (1) కింద లావాదేవీలు ప్రత్యేకంగా డిజిటల్ వర్చువల్ ఆస్తులను అమ్మేవారికి సంబంధించినవై ఉంటాయి. అటువంటి ఆస్తులను బదిలీ చేసేటపుడు నిర్ణీత రేటుతో టీడీఎస్ తీసేయాల్సి ఉంటుంది.

పార్ట్ 6: సోర్స్ వద్ద కలెక్ట్ చేయబడిన పన్ను వివరాలు (TCS)

ఈ భాగం పలువురు విక్రేతలు అమ్మిన పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ గురించిన TCS కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. TCS అనేది ప్రాథమికంగా ఆదాయపు పన్ను విక్రేతలు పేర్కొన్న వస్తువుల అమ్మకంపై చెల్లింపుదారులు లేదా కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తారు. కావున మీరు ఈ పార్ట్ లో ట్యాక్స్ కలెక్టర్స్ వివరాలు, చెల్లించిన మొత్తం అమౌంట్ మొదలైన వివరాలు ఉంటాయి.

పార్ట్ 7: చెల్లించిన రిఫండ్ వివరాలు

ఈ భాగం పన్ను చెల్లింపుదారులు స్వీకరించిన పన్ను రిఫండ్ కు సంబంధించిన వివరాలను కలిగి ఉంటుంది. అదనంగా ఇది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి రిఫండ్ చేసిన సమాచారాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇందులో చెల్లించిన మొత్తం, పేమెంట్ మోడ్, డేట్ మరియు ఇతర మొత్తం వివరాలు ఉంటాయి.

పార్ట్ 8: 194IA/ 194IB /194M/194S కింద సోర్స్ వద్ద డిడక్ట్ చేసిన పన్ను వివరాలు (కొనుగోలుదారు/ ఆస్తి అద్దెదారులు/కాంట్రాక్టర్ లు లేదా ప్రొఫెషనల్ లు / వర్చువల్ డిజిటల్ అసెట్ కొనుగోలు చేసే వ్యక్తి చెల్లింపు కోసం)

194IA, 194IB, 194M, మరియు 194S అనేవి వేర్వేరు రకాల పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తాయి. ఈ సెక్షన్ల కింద సోర్స్ వద్ద పన్ను మినహాయించబడుతుంది. ఇది ప్రాపర్టీ కొనుగోలుదారులు/ అద్దె చెల్లించేవారు, వ్యక్తులు ఎవరైతే కాంట్రాక్టర్స్ ప్రొఫెషనల్స్ కు చెల్లింపులు చేస్తారో వారికి వర్తిస్తుంది.

పార్ట్ 9: ఫారం 26QE (వర్చువల్ డిజిటల్ అసెట్ కొనుగోలుదారులకు) ప్రకారం సెక్షన్ 194S యొక్క ఉపవిభాగం (1) కి సంబంధించిన లావాదేవీలు/డిమాండ్ చెల్లింపు వివరాలు

ఫారం 26QE ప్రకారం సెక్షన్ 194S యొక్క సబ్ సెక్షన్ (1) కి సంబంధించిన లావాదేవీలు/డిమాండ్ చెల్లింపులు అటువంటి చెల్లింపులు చేస్తున్నపుడు నిర్ణీత రేటుతో టీడీఎస్ ను మినహాయించాల్సిన వర్చువల్ డిజిటల్ ఆస్తుల కొనుగోలుదారులకు వర్తిస్తాయి.

పార్ట్ 10: TDS/TCS డిఫాల్స్ట్ * (ప్రాసెసింగ్ ఆఫ్ స్టేట్‌మెంట్స్)

TDS/TCS డిఫాల్ట్ లు సమర్పించిన పన్ను మినహాయింపులు లేదా సేకరణ స్టేట్‌మెంట్లలోని వ్యత్యాసాలను తేడాలను చూపిస్తాయి. వాటితో సహా స్వల్ప తగ్గింపు, వడ్డీ చెల్లింపు, ఆలస్యంగా దాఖలు చేసే ఫైలింగ్ మొదలయినవి. ఇక్కడ మీరు పన్ను డిఫాల్ట్ ల గురించి సమాచారాన్ని కనుగొంటారు. అలాగే మీరు స్టేట్‌మెంట్‌ల ప్రాసెస్ కు సంబంధించిన వివరాలు మరియు సెక్షన్ 234E లేట్ ఫీజుల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఫారం నంబర్ 26ASని పాన్ నంబర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది. ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే డిడక్టర్ ను సంప్రదించడానికి కాపీని మీ వద్ద ఉంచుకోవాలి.

26AS ట్యాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి?

CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) ప్రవేశపెట్టిన ఫారం 26AS ఫైలింగ్ లో మీరు కొన్ని మార్పులు చూడొచ్చు. వీటిని చెక్ చెయ్యండి!

  • ఫారం 26AS షేర్ల కొనుగోలు, క్రెడిట్ కార్డు పేమెంట్స్, విదేశీ కరెన్సీ, సేవల కోసం నగదు చెల్లింపు వంటి అన్ని రకాల సమగ్ర సమాచారాన్ని కలిగి ఉంటుంది.
  • మీరు పాన్ తో ఫారం 26ASను వీక్షించినపుడు పన్ను చెల్లింపుదారుల మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఈ మెయిల్ ఐడీ మొదలైనవి కనుక్కోవచ్చు.
  • ఇది లైవ్ 26AS ఫారం అవుతుంది. ఇది ప్రతి 3 నెలలకోసారి అప్డేట్ చేయబడుతుంది.

ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్ లో ట్రాన్స్ పరన్సీని (పారదర్శకత) నెలకొల్పడం కోసమే ఈ మార్పులన్నీ. అటువంటి ఆర్థిక సమాచారం ఓపెన్ చేసి ఉంచడం వలన ఆదాయపు పన్ను ఫైల్ చేసేటపుడు వ్యత్యాసాలను నివారించడం సులభం అవుతుంది.

ఇప్పుడు ఈ ఫైలింగ్ పోర్టల్ ను ప్రారంభించడంతో 26AS ఫారం డౌన్ లోడ్ ప్రక్రియ సులభతరమైంది. మీరు మీ పన్ను లయబిలిటీలు, లావాదేవీల వివరాలు మొదలైన వాటిని కొద్ది నిమిషాల్లోనే తనిఖీ చేయవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు ఇండియా అవతల నివసిస్తున్నపుడు ఫారం 26ASను యాక్సెస్ చేయగలరా?

అవును. మీరు TRACES వెబ్సైట్ లో NRI సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాలి. ఫారం 26AS ఈ ఫైలింగ్, వ్యూ, డౌన్ లోడ్ కోసం సేమ్ దశలను అనుసరించాలి.

ఫారం 26ASలో నేను కరెక్షన్స్ ఎలా చేయగలను?

మీరు మీ ఫారం 26ASలో ఏవైనా తప్పులను గమనించినట్లయితే మీరు నేరుగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ను సంప్రదించి సరిదిద్దమని అభ్యర్థించవచ్చు.