మీ ఐటీఆర్ ను ఫైల్ చేసే ముందు మీ ఖాతాలో జమ అయిన పన్ను మొత్తం తనిఖీ చేసేందుకు మీరు ఒకసారి స్టేట్మెంట్ ను పరిశీలించాలి. ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫారం 26AS అంటే ఏంటో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి దాన్ని ఎలా యక్సెస్ చేయాలో మరియు ఎలా అవసరం అయిన సమాచారాన్ని పొందాలో ఇప్పుడు చూద్దాం.
ఆన్ లైన్ లో 26ASను వీక్షించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి -
- మీరు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ మీ బ్యాంక్ ఖాతా మీ పాన్ తో లింక్ చేయబడాలి. ఈ విషయంలో మీ బ్యాంక్ NSDLతో రిజిస్టర్ చేయబడిందో లేదో తనిఖీ చేయాలి.
- మీరు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. మరియు ఫారం 26ASను పాన్ తో చూడొచ్చు. అంతే కాకుండా జన్మదినం, లేదా డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సహాయంతో చూడొచ్చు.
మీ వార్షిక సమాచార ప్రకటన కాపీని మీతో ఉంచుకోవాలని అనుకుంటున్నారా? దీనిని డౌన్ లోడ్ చేసేందుకు దిగువ పేర్కొన్న పద్ధతిని అనుసరించండి.
స్టెప్ 1: ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఈ-ఫిల్లింగ్ పోర్టల్‌ను సందర్శించి మీరు రిజిస్టర్ చేసుకుని ప్రాసెస్ ప్రారంభించండి.
స్టెప్ 2: తర్వాత మీ యూజర్ ఐడీ ఎంటర్ చేయండి (ఆధార్ లేదా పాన్). సురక్షితంగా ఉండేందుకు మరియు నిర్దారించేందుకు ఇచ్చిన చెక్ బాక్స్ ను ఎంచుకుని పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.
స్టెప్ 3: మెనూ నుంచి ఈ ఫైల్ ను ఎంచుకోండి. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లో ఉన్న వ్యూ ఫారం 26AS’ ను ఎంచుకోండి.
స్టెప్ 4: తదుపరి మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్ (TRACES పోర్టల్) కు రీడైరెక్ట్ చేయబడతారని ఒక పాపప్ మెస్సేజ్ వస్తుంది. ప్రాసెస్ ను కంప్లీట్ చేసేందుకు అసెస్మెంట్ సంవత్సరం మరియు ఫార్మాట్ ను ఎంచుకోండి.
మీరు దీనిని ఆన్ లైన్ లో చూడాలని అనుకుంటే HTML ఫార్మాట్ ఎంచుకోండి. మీరు TRACES వెబ్సైట్ నుంచి ఫారం 26ASను డౌన్ లోడ్ చేసి మీ పన్యాను క్రెడిట్ స్టేట్ మెంట్ లోని వివిధ భాగాలను తర్వాత చూడాలని అనుకుంటే ఫార్మాట్ ను PDFగా వదిలివేయండి.