డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54EC: దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పై డిడక్షన్ వివరించబడింది

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54EC లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఆస్తులు అమ్మడం ద్వారా వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాభాలకు పన్ను మినహాయింపులను క్లయిమ్ చేయడం ద్వారా పన్ను లయబిలిటీలను తగ్గించుకునేందుకు వ్యక్తులను అనుమతిస్తుంది. దాని గురించి మరింత తెలుసుకునేందుకు చదువుతూ ఉండండి.

సెక్షన్ 54EC అంటే ఏమిటి?

ITA (ఆదాయపు పన్ను చట్టం) సెక్షన్ 54EC ప్రకారం ఒక పెట్టుబడిదారుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఆస్తులను విక్రయించడం ద్వారా లేదా స్థిరాస్తులను విక్రయించడం ద్వారా పొందిన లాభాలను 6 నెలల లోపు పేర్కొన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఆస్తులలో పెట్టుబడి పెడితే అతడికి వచ్చిన క్యాపిటల్ లాభాలు పన్ను మినహాయింపు కోసం అర్హత పొందుతాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ బాండ్లలోని పెట్టుబడి పరిమితి రూ. 50,00,000.

[మూలం]

సెక్షన్ 54EC కింద పన్ను మినహాయింపును క్లయిమ్ చేయడానికి అర్హత ఏమిటి?

కింది ప్రమాణాలకు అనుగుణంగా టాక్స్ పేయర్స్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54EC కింద పన్ను ప్రయోజనాలను పొందొచ్చు:

  • వ్యక్తులు లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టాలి. మరియు వాటి నుంచి వచ్చే లాభాలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాభాలు అయి ఉండాలి.
  • పెట్టుబడిదారులు లాంగ్ టర్మ్ క్యాపిటల్‌లో 1 ఏప్రిల్ 2000 తర్వాత పెట్టుబడి పెట్టాలి.
  • ముందే చెప్పినట్లుగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలను పూర్తిగా లేదా పాక్షికంగా పేర్కొన్న లాంగ్ టర్మ్ ఆస్తులపైనే ఖర్చు చేయాలి.
  • సెక్షన్ 54EC ప్రకారం కింది క్యాపిటల్ గెయిన్స్ లో పెట్టుబడి పెట్టాలి:
    • REC లేదా రూరల్ ఎలక్ట్రిఫిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన బాండ్స్
    • NHAI లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన బాండ్స్
    • PFC లేదా పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన బాండ్స్
    • IRFC లేదా ఇండియన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన బాండ్స్
  • ప్రభుత్వ మద్దతు ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఈ బాండ్స్ ను జారీ చేస్తాయి. అందువల్ల వీటితో తక్కువ రిస్క్ ఉంటుంది. మెచూరిటీ పీరియడ్ కు ముందే వ్యక్తులు ఈ బాండ్లను రీడిమ్ చేసుకోవచ్చు. ఇవి లిస్టెడ్ బాండ్స్ కావు, వ్యక్తులు ఈ బాండ్స్ ను విక్రయించలేరు.
  • వ్యక్తులు పైన పేర్కొన్న బాండ్స్ లో తమ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ను పెట్టుబడి పెట్టినట్లయితే సెక్షన్ 80C కింద వారు పన్ను మినహాయింపును పొందలేరు.

[మూలం 1]

[మూలం 2]

[మూలం 3]

సెక్షన్ 54EC కింద క్యాపిటల్ గెయిన్ బాండ్ల లాక్ ఇన్ పీరియడ్ ఎంత?

క్యాపిటల్ గెయిన్ బాండ్ల లాక్ ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు. ఏప్రిల్ 2018కి ముందు లాక్ ఇన్ పీరియడ్ 3 సంవత్సరాలు.

క్యాపిటల్ గెయిన్ బాండ్ల లాక్ ఇన్ పీరియడ్ కు సంబంధించి కింది విషయాలు తెలుసుకోండి:

  • వ్యక్తులు ఈ బాండ్స్ ను మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందే ట్రాన్ప్సర్ చేసినా లేదా రీడిమ్ చేసినా కానీ ITA (ఆదాయపు పన్ను చట్టం) ప్రకారం పన్ను మినహాయింపుకు అర్హత ఉండదు. ఈ బాండ్స్ ను రీడిమ్ చేయడానికి లేదా ట్రాన్స్ ఫర్ చేయడానికి ముందు ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు పొందిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాభాలుగా ఇది పరిగణించబడుతుంది.
  • వ్యక్తులు అటువంటి లాంగ్ టర్మ్ ఆస్తులను తాకట్టు పెట్టి లోన్ పొందాలని అనుకుంటే వారు రుణం తీసుకున్న అదే తేదీన బాండ్స్ ను నగదుగా రీడిమ్ చేసుకున్నారని ఇది సూచిస్తుంది.

[మూలం]

సెక్షన్ 54EC కింద పన్ను ప్రయోజనాలను పొందేందుకు అదనపు పరిస్థితులు ఏమిటి?

పైన పేర్కొన్న పరిస్థితులతో పాటు వ్యక్తులు ఇంకా పన్ను మినహాయింపును క్లయిమ్ చేయగల పరిస్థితులు:

ఇద్దరు వ్యక్తులు కలిసి బాండ్ ను కొనుగోలు చేస్తే

ఒక వ్యక్తి అసలు ఆస్తిని విక్రయించి వచ్చిన లాభాల ద్వారా ఒకరితో కలిసి బాండ్ కొనుగోలు చేశాడని అనుకుందాం. అలాంటపుడు ఆ వ్యక్తి సెక్షన్ 54EC కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాభాలకు పన్ను మినహాయింపును క్లయిమ్ చేసుకోవచ్చు.

డెప్రిసబుల్ ఆస్తుల మీద పెట్టిన పెట్టుబడులు

ఒక వ్యక్తి 36 నెలల కంటే ఎక్కువ ఉన్న తరుగుదల లేని ఆస్తిని విక్రయించినట్లయితే తరుగుదల బదిలీ నుంచి ఏదైనా లాభం STCGగా పరిగణించబడుతుంది. ఎందుకంటే డెప్రిసబుల్ (తరుగు లేని) ఆస్తులను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గా పరిగణిస్తారు. సెక్షన్ 54EC కింద మినహాయింపును క్లయిమ్ చేసేందుకు లాభం అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ (ఆస్తి) నుంచి బదిలీ చేసినది అయి ఉండాలి. అందువల్ల వ్యక్తి 54EC కింద మినహాయింపును క్లయిమ్ చేయలేరు

[మూలం]

వాయిదాలు

ఒక మదింపుదారుడు పేర్కొన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ లో తనకు లాభాలు వచ్చిన తేదీ నుంచి 6 నెలలలోపు వాయిదా పద్ధతిలో పెట్టుబడులు పెడతాడు. అలాంటపుడు అతను/ఆమె లాంగ్ టర్మ్ ఆస్తులపై పొందిన లాభాలపై మినహాయింపును క్లయిమ్ చేసుకోవచ్చు.

లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ కు యాక్సెస్ ఉండదు

ఒక వ్యక్తి ITA (ఆదాయపు పన్ను చట్టం) లోని సెక్షన్ 54EC కింద పేర్కొన్న లాంగ్ టర్మ్ ఆస్తుల మీద వచ్చే లాంగ్ టర్మ్ లాభాలను 6 నెలలలోపు అవి అందుబాటులో లేని కారణంగా పెట్టుబడి పెట్టకపోతే అతను/ఆమె మినహాయింపును క్లయిమ్ చేయవచ్చు. ఒక వ్యక్తి తనకు వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాభాలతో 6 నెలలో పెట్టుబడి పెట్టకపోవడానికి అతను/ఆమె సరైన కారణం చూపితే ఇది చెల్లుబాటు అవుతుంది. బాండ్స్ అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చిన లాభాలతో మరిన్ని బాండ్స్ కొనడం కూడా అవసరం.

సబ్ స్క్రిప్షన్ క్లోజ్ అయితే

సబ్‌స్క్రిప్షన్ మూసివేత కారణంగా ఒక వ్యక్తి 6 నెలల గడువు ముగిసిన తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఆస్తులలో పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి మొత్తం ITA (ఆదాయపు పన్ను చట్టం) లోని సెక్షన్ 54EC ప్రకారం మినహాయింపుకు అర్హత పొందుతుంది.

సెక్షన్ 54EC కింద కేటగరైజ్ చేసిన బాండ్లలో ఎలా పెట్టుబడి పెట్టాలి?

వ్యక్తులు ఎవరైనా కానీ లాంగ్ టర్మ్ కింద స్పెసిఫై చేసిన ఫిజికల్ లేదా డీమ్యాట్ ఫామ్స్ కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ లు మరియు తక్కువ ట్యాక్స్ లయబిలిటీల కోసం ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి:

  • స్టెప్ 1: అటువంటి బాండ్స్ ను జారీ చేసే సంస్థల అఫీషియల్ పోర్టల్ ను సందర్శించాలి. డౌన్ లోడ్ పేజీలో ఉన్న డైరెక్ట్ ట్యాబ్ ను ఎంచుకోండి.
  • స్టెప్ 2: వ్యక్తులు డౌన్ లోడ్ చేయాలనుకుంటున్న ఫారమ్ ల సంఖ్యను ఎంచుకోండి. క్యాప్చా ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసేందుకు ముందుకు కొనసాగండి.
  • స్టెప్ 3: ఫారం లు ZIP ఫార్మాట్ లో డౌన్ లోడ్ అవుతాయి. కావున వాటిని మనకు కావాల్సిన విధంగా ఎక్స్ ట్రాక్ట్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
  • స్టెప్ 4: చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ మరియు నియమించబడిన బ్యాంక్ అదనపు ఎన్ క్లోజర్ లను అటాచ్ చేయండి. ప్రత్యామ్నాయంగా వ్యక్తులు NEFT లేదా RTGS ద్వారా సంబంధిత ఖాతాకు బదిలీ చేయొచ్చు. ఈ NEFT సదుపాయాన్ని పొందేందుకు చెల్లింపుదారులు అప్లికేషన్ ఫారంను పూరించాలి. మరియు చెల్లింపు వివరాలు, UTR నెంబర్ ను సబ్మిట్ చేయాలి.

సెక్షన్ 54EC కింద పన్ను మినహాయింపును ఎలా లెక్కించాలి?

ఈ గణనను అర్థం చేసుకోవడానికి కింది ఉదాహరణను అర్థం చేసుకోవాలి -

మిస్టర్ అమర్ ఆ ఆస్తిని సంపాదించిన 42 నెలల తర్వాత ఆ ఆస్తిని రూ. 70,00,000 లక్షలకు విక్రయించాడు. రూ. 46,00,000 అతను ఆస్తిని కొనుగోలు చేసినపుడు పెట్టిన ఖర్చు, రూ. 10,00,000 అనేవి ఆస్తిలో వివిధ రకాల వసతులు కల్పించేందుకు అతడు పెట్టిన ఖర్చు. ఈ విధంగా మిస్టర్ అమర్ సెక్షన్ 54EC కింద ఉన్న ట్యాక్స్ లయబిలిటీల కింద సేవింగ్స్ చేసిన తర్వాత అతడికి ట్యాక్స్ విధించే లాభాలు ఎన్ని వచ్చాయో కింద వివరించబడింది:

  • కేస్ 1: అతడు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ జారీ చేసిన బాండ్స్ లో 6 నెలల వ్యవధిలో రూ. 14,00,000 పెట్టుబడి పెట్టాడు
  • కేస్ 2: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన బాండ్స్ లో 6 నెలల్లో రూ. 8,00,000 పెట్టుబడి పెట్టారు

కేస్ 1: REC బాండ్స్ లో పెట్టిన పెట్టుబడి లెక్కింపు (6 నెలల లోపు)

కాలుక్యులేషన్ ప్రత్యేకతలు కాలుక్యులేట్ చేయాల్సిన అమౌంట్
స్థిరాస్తిని అమ్మడం ₹ 70,00,000
డిడక్ట్ (తీసివేత): ఇండెక్స్ డ్ అక్విజేషన్ (సమపార్జన) ఖరీదు ₹ 46,00,000
డిడక్ట్: ఇండెక్స్డ్ ఇంప్రూవ్‌మెంట్ ఖరీదు ₹ 10,00,000
మొత్తం LTCG ₹ 14,00,000
డిడక్ట్: రూరల్ ఎలక్ట్రిఫిషియన్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన బాండ్స్ లో పెట్టుబడి ₹ 14,00,000
పన్ను విధించదగిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 0

NHAI బాండ్స్ లో పెట్టుబడి పెట్టిన రూ. 8,00,000 మీద గణన (6 నెలల లోపు)

కాలుక్యులేషన్ ప్రత్యేకతలు కాలుక్యులేట్ చేయాల్సిన అమౌంట్
స్థిరాస్తి అమ్మకం ₹ 70,00,000
డిడక్ట్ (తీసివేత): ఇండెక్స్డ్ అక్విజేషన్ (సమపార్జన) ఖరీదు ₹ 46,00,000
డిడక్ట్: ఇండెక్స్ డ్ ఇంప్రూవ్‌మెంట్ ఖరీదు ₹ 10,00,000
మొత్తం LTCG ₹ 14,00,000
డిడక్ట్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన బాండ్స్ లో పెట్టుబడి ₹ 8,00,000
పన్ను విధించదగిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ₹ 6,00,000

ముందు చెప్పినట్లుగా ఒక వ్యక్తి మెచూరిటీ పీరియడ్ పూర్తవడానికి ముందు దానిని నగదుగా మార్చుకుంటే దానిని రీడీమ్ చేయబడిన ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి మొత్తం పన్ను విధించబడుతుంది.

అందువల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54EC కింద పేర్కొన్న పన్ను పారామితులను పన్ను చెల్లింపుదారులు తమ పన్ను చెల్లింపులో భారాన్నితగ్గించుకోవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 54EC కింద బాండ్స్ కు వడ్డీరేటు ఎంత?

ఆదాయపు పన్ను చట్టం 54EC కింద పేర్కొన్న బాండ్స్ కు వార్షిక వడ్డీ 5%.

పన్ను చెల్లింపుదారుడు సెక్షన్ 54EC కింద పేర్కొన్న బాండ్స్ లో 6 నెలల తర్వాత పెట్టుబడి పెడితే ఏం జరుగుతుంది?

పన్ను చెల్లింపుదారుడు 6 నెలల గడువు ముగిసిన తర్వాత దీర్ఘకాలిక బాండ్ లో పెట్టుబడి పెడితే నిర్దిష్ట పరిస్థితిలో మినహా ఆ పన్ను మినహాయింపుకు అర్హులు కారు. ఉదాహరణకు బాండ్ సబ్‌స్క్రిప్షన్ క్లోజ్ అయినపుడు ఇది వర్తిస్తుంది.