ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్​లైన్​లో కొనుగోలు చేయండి
Instant Policy, No Medical Check-ups

వీసా అప్లికేషన్ స్టేటస్ ని ట్రాక్ చేయడానికి స్టెప్స్ ఏమిటి?

విదేశాలకు వెళ్లాలంటే వీసా కోసం అప్లై చేసుకోవడం, అప్రూవల్ పొందడం తప్పనిసరి. అయితే, ఈ ప్రక్రియ కష్టమైనది కావచ్చు. ముందుగా, మీరు తప్పనిసరిగా అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి మరియు అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత కూడా, ప్రాసెసింగ్ కోసం పట్టే సమయం గురించి ఒక అవగాహన పొందడానికి వీసా స్టేటస్ ను తరచూ చెక్ చేస్తూ ఉంటారు. 

వీసా స్టేటస్‌ని ఎలా చెక్ చేయాలో తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా? ఆపై, ఒక సమగ్ర గైడ్ ని పొందడానికి ఈ కథనాన్ని ఇక ముందు చదవండి.

వీసా అప్లికేషన్ స్టేటస్ ని ఎలా ట్రాక్ చేయాలి?

1. పాస్‌పోర్ట్ నంబర్‌ని ఉపయోగించడం

పాస్‌పోర్ట్ నంబర్‌లు ఉపయోగించడం అన్నది దరఖాస్తులను ట్రాక్ చేయడానికి ఒక సాధారణ మార్గం. అప్లికేషన్ ఫారమ్‌ను పూరించేటప్పుడు, వ్యక్తులు తమ అప్లికేషన్ లలో వారి పాస్‌పోర్ట్ నంబర్‌ను నమోదు చేయాలి. మీరు భారతీయ వీసాను పొందాలనుకుంటే, మీరు దిగువ పేర్కొన్న దశలను అనుసరించవచ్చు.

స్టెప్ 1: ఇండియన్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఈ హోమ్ పేజీ నుండి "భారతదేశాన్ని సందర్శించాలనుకునే విదేశీయుల కోసం ఆన్‌లైన్ వీసా అప్లికేషన్" లింక్‌ను ఎంచుకోండి.

స్టెప్ 2: ఈ పేజీలో "ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నమోదు"పై క్లిక్ చేయండి. ఇది కొత్త పేజీకి దారి మళ్లిస్తుంది.

స్టెప్ 3: “మీ వీసా స్టేటస్ ను చెక్ చేయండి”పై క్లిక్ చేయండి. తర్వాత, మీ పాస్‌పోర్ట్ నంబర్‌ను నమోదు చేసి, "సబ్మిట్"పై క్లిక్ చేయండి.

2. Using Application ID

మీరు మీ వీసా అప్లికేషన్ యొక్క స్టేటస్ ను మీ అప్లికేషన్ ఐడీ ద్వారా కూడా చెక్ చేయవచ్చు. మీరు మీ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, ఈ పేజీ ఒక నెంబర్ ను చూపిస్తుంది. ఇది మీ ప్రత్యేక అప్లికేషన్ ఐడీ మరియు దానిని ఒక చోట నోట్ చేసుకొని ఉంచుకోవడం మంచిది. మీ భారతీయ వీసా స్టేటస్‌ని ఎలా చెక్ చేయాలో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.

స్టెప్ 1: ఇండియన్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఈ హోమ్ పేజీ నుండి "భారతదేశాన్ని సందర్శించాలనుకునే విదేశీయుల కోసం ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ " లింక్‌ను ఎంచుకోండి.

స్టెప్ 2: ఈ పేజీలో "ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ "పై క్లిక్ చేయండి. ఇది కొత్త పేజీకి దారి మళ్లిస్తుంది.

స్టెప్ 3: “మీ వీసా స్టేటస్ ను చెక్ చేయండి”పై క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ ఐడీ ని నమోదు చేయండి.

స్టెప్ 4: క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, "సబ్మిట్ "పై క్లిక్ చేయండి.

వివిధ దేశాల కోసం వీసా అప్లికేషన్ స్టేటస్ ను ఎలా చెక్ చేయాలి?

మీరు ఇప్పటికే తెలుసుకున్నట్లు, వీసా స్టేటస్ ను ట్రాక్ చేయడం ఒక సరళమైన ప్రక్రియ. పైన పేర్కొన్న సెక్షన్ లు కేవలం భారతీయ వీసాను పొందే మార్గాలపై మాత్రమే దృష్టి సారించాయి, ఈ క్రింది దశలు వివిధ దేశాలకు వీసా స్టేటస్ ను చెక్ చేయడానికి మీకు సాధారణ గైడ్ లైన్స్ ను అందిస్తాయి.

స్టెప్ 1: సంబంధిత దేశం యొక్క అధికారిక ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోమ్ పేజీని పరిశీలించి వీసా అప్లికేషన్ ఆప్షన్ కోసం వెదకండి.

స్టెప్ 2: మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత, మీరు వీసా అప్లికేషన్ వివరాల పేజీకి దారి మళ్లించబడతారు. వీసా స్టేటస్ చెక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: అప్లికేషన్ ఐడీ కి సంబందించిన మీ పాస్‌వర్డ్ నంబర్‌ను నమోదు చేయండి. అదనంగా, మీ పుట్టిన తేదీ లేదా క్యాప్చా కోడ్‌ను అవసరమైన విధంగా నమోదు చేయండి.

స్టెప్ 4: చివరగా, సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఇది మీ వీసా అప్లికేషన్ స్టేటస్ ను మీకు చూపిస్తుంది.

ఈ విధంగా, ఈ కథనం తెలిపినట్లుగా, వీసా స్టేటస్ ను చెక్ చేసే స్టెప్స్ కష్టతరంగా ఉండవు మరియు మీరు దీన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లో చెక్ చెయ్యవచ్చు. దరఖాస్తుదారులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దీన్ని త్వరగా చెక్ చేయవచ్చు. అంతే కాకుండా, ఇది వారి అప్లికేషన్ ను ట్రాక్ చేయడానికి మరియు దాని అప్రూవల్ ఎప్పటిలోగా పొందవచ్చు అనే సమయాన్ని అంచనా వేయడానికి వారిని సహాయం చేస్తుంది.

వీసా అప్లికేషన్ స్టేటస్ ను ట్రాక్ చేయడానికి స్టెప్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

వీసా అప్లికేషన్ లకు సంబంధించి ఏ ఏ స్టేటస్ లు ఉంటాయి?

వీసా అప్లికేషన్ కు సంబంధించిన కొన్ని సాధారణ స్టేటస్‌లలో “అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్‌లో”, “ఇష్యూడ్”, “తిరస్కరించబడింది” మరియు “ఇమ్మిగ్రెంట్ వీసా” ఉన్నాయి. మీ దగ్గర చివరిది ఉంటే, కొన్ని ఇతర స్టేటస్‌లలో "ఎక్స్పైర్డ్ ," "ఎక్స్పైరింగ్ సూన్, " " రిటర్న్ టు NVC లేదా "ట్రాన్స్ఫర్ ఇన్ ప్రోగ్రెస్."

నేను నా అప్లికేషన్ ఐడీ ని పోగొట్టుకుంటే నా వీసా అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేయవచ్చా?

అవును, మీరు మీ పాస్‌పోర్ట్ నంబర్ మరియు పుట్టిన తేదీ ద్వారా మీ వీసా అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేయవచ్చు. అయితే, అప్లికేషన్ ఐడీ ని నోట్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఇది భవిష్యత్ రిఫరెన్స్ ల కోసం అవసరం కావచ్చు.