డిజిట్​ ఇన్సూరెన్స్​కు మారండి

ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ

ఇండియాలో ఉన్న ట్యాక్స్ పేయర్ లు తప్పనిసరిగా ట్యాక్సేషన్ గురించిన ముఖ్యమైన తేదీలు తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్ మీ ట్యాక్స్ ఫైల్ చేసేందుకు సంబంధించి అన్ని ముఖ్యమైన తేదీల గురించి తెలియజేస్తుంది.

కావున ఇండియన్ ట్యాక్స్ పేయర్ లు తరచూ ఆలోచించే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇద్దాం:

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ ఏది?

2021-22 ఆర్థిక సంవత్సరం మరియు వార్షిక సంవత్సరం 2022-23 కి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత దానిని ఫైల్ చేయాలి. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన టాక్స్ పేయర్ లు సంబంధిత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30లోపు ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయాలి. అయితే ఈ తేదీ అనేది ఇండియన్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా పొడగించబడవచ్చు.

ఉదాహరణ చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2020. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వ్యక్తులు మరియు నాన్-ఆడిట్ కేసుల కోసం డిసెంబర్ 31 2020 వరకు పొడిగించింది. అదే ఆడిట్ కేసులకు 31 జనవరి 2020 వరకు పొడిగించబడింది. మీరు 2020లో ఐటీఆర్ ఫైల్ చేసేందుకు చివరి తేదీకి కట్టుబడి ఉన్నారని నిర్దారించుకోండి.

ముందస్తు ట్యాక్స్ వాయిదాలు చెల్లించు గడువు తేదీ

ఐటీఆర్ దాఖలు చేసేందుకు చివరి తేదీ ఏమిటో ఇప్పుడు మీకు తెలుసు. ఇచ్చిన ఆర్థిక సంవత్సరంలో ముందస్తు పన్ను వాయిదాల గడువును తెలుసుకునేందుకు ఈ కింది పట్టికలను చూడండి:

  • స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు మరియు వ్యాపార ఓనర్లకు ముందస్తు ట్యాక్స్ పేమెంట్

ఆర్థిక సంవత్సరం (FY 2022-23)కి ట్యాక్స్ వాయిదా చెల్లించు తేదీ చెల్లించాల్సిన ట్యాక్స్ అమౌంట్
1వ విడత - జూన్ 15 లేదా అంతకుముందు ముందస్తు ట్యాక్స్ లయబిలిటీలో కనీసం 15 శాతం
2వ వాయిదా - సెప్టెంబర్ 15 లేదా అంతకుముందు ముందస్తు ట్యాక్స్ లయబిలిటీలో కనీసం 45 శాతం
3వ విడత డిసెంబర్ 15 లేదా అంతకుముందు ముందస్తు ట్యాక్స్ లయబిలిటీలో కనీసం 75 శాతం
4వ విడత- 15 మార్చి లేదా అంతకంటే ముందు 100 శాతం ట్యాక్స్ లయబిలిటీ

  • కంపెనీల విషయంలో ముందస్తు ట్యాక్స్ చెల్లింపు

ట్యాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించే గడువు తేదీ చెల్లించాల్సిన ట్యాక్స్ అమౌంట్
15 జూన్ లేదా అంతకంటే ముందు ముందస్తు ట్యాక్స్ లయబిలిటీలో కనీసం 15 శాతం
15 సెప్టెంబర్ లేదా అంతకంటే ముందు ముందస్తు ట్యాక్స్ లయబిలిటీలో కనీసం 45 శాతం
15 డిసెంబర్ లేదా అంతకంటే ముందు ముందస్తు ట్యాక్స్ లయబిలిటీలో కనీసం 75 శాతం
15 మార్చి లేదా అంతకంటే ముందు 100 శాతం ట్యాక్స్ లయబిలిటీ

[మూలం]

టీడీఎస్ చెల్లింపునకు గడువు తేదీ ఏంటి?

కేవలం 2023లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చెల్లించేందుకు చివరి తేదీ ఏంటో తెలుసుకుంటే సరిపోదు. వచ్చే నెలలో సంస్థలు రెస్పాన్సిబుల్ గా టీడీఎస్ చెల్లించాలి. టీడీఎస్ చెల్లింపు గడువు తేదీ వచ్చే నెల 7వ తేదీ.

ఉదాహరణ ద్వారా మీకు క్లారిటీ ఇచ్చేందుకు అనుమతివ్వండి:

2022-23 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుందాం. ఈ సంవత్సరం టీడీఎస్ చెల్లింపు గడువు తేదీ కింది విధంగా ఉంటుంది:

ఆర్జిత టీడీఎస్ యొక్క నెల టీడీఎస్ గడువు తేదీ
ఏప్రిల్ 2022 7 మే 2022
మే 2022 7 జూన్ 2022
జూన్ 2022 7 జూలై 2022
జూలై 2022 7 ఆగస్టు 2022
ఆగస్టు 2022 7 సెప్టెంబర్ 2022
సెప్టెంబర్ 2022 7 అక్టోబర్ 2022
అక్టోబర్ 2022 7 నవంబర్ 2022
నవంబర్ 2022 7 డిసెంబర్ 2022
డిసెంబర్ 2022 7 జనవరి 2023
జనవరి 2023 7 ఫిబ్రవరి 2023
ఫిబ్రవరి 2023 7 మార్చి 2023
మార్చి 2023 7 ఏప్రిల్ 2023

సెక్షన్ 194IB మరియు టీడీఎస్ ప్రకారం వ్యక్తులు లేదా HUF అద్దె నుంచి టీడీఎస్ చెల్లించు గడువు తేదీ సెక్షన్ 194IA ప్రకారం నెల చివరి 30 రోజులు. ఉదాహరణకు 15 జూన్ 2022న డిడక్షన్ అయిన టీడీఎస్ ను 30 జూలై 2022లోపు చెల్లించాలి.

సరైన విధంగా ట్యాక్స్ ఫైల్ చేసేందుకు TCS చెల్లింపు గురించి కూడా తెలుసుకోవాలి.

[మూలం 1]

[మూలం 2]

మీరు టీడీఎస్ రిటర్న్ లను ఎప్పుడు ఫైల్ చేయాలి?

ఒక డిడక్టర్ టీడీఎస్ ను డిపాజిట్ చేసిన తర్వాత వారు తప్పనిసరిగా టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం టీడీఎస్ రిటర్న్ గడువు తేదీ కింది విధంగా ఉంటుంది:

ఆర్థిక సంవత్సరం క్వార్టర్ (మూడు నెలలు) క్వార్టర్ పీరియడ్ డీఎస్ రిటర్న్ దాఖలు తేదీ
ఆర్థిక సంవత్సరం 1వ క్వార్టర్ 1 ఏప్రిల్ నుంచి 30 జూన్ 31 జూలై 2022
ఆర్థిక సంవత్సరం 2వ క్వార్టర్ 1 జూలై నుంచి 30 సెప్టెంబర్ 31 అక్టోబర్ 2022
ఆర్థిక సంవత్సరం 3వ క్వార్టర్ 1 అక్టోబర్ నుంచి 30 డిసెంబర్ 31 జనవరి 2023
ఆర్థిక సంవత్సరం 4వ క్వార్టర్ 1 జనవరి నుంచి 31 మార్చి 31 మే 2023

గడువు తేదీకి ముందు ఐటీఆర్ దాఖలు చేయడం మర్చిపోయారా? మీరేం చేయాలో ఇక్కడ ఉంది.

మీరు ఆలస్యమైన రిటర్న్ ను ఫైల్ చేసేందుకు ఎంచుకోవచ్చు. ఇది టీడీఎస్ రిటర్న్ ను ఫైల్ చేసేందుకు చివరి తేదీకి ముందు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అయితే వర్తించే ఐటీఆర్ అప్లికేషన్ ఫారం ను ఫిల్ చేసేటపుడు ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే మీరు తప్పనిసరిగా సెక్షన్ 139 (4) కింద రిటర్న్ ఫైల్ చేయాలి.

ఇంకా ఐటీఆర్ ను గడువు తర్వాత దాఖలు చేస్తే సెక్షన్ 234F కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా ఫైల్ చేస్తే టాక్స్ పేయర్ మీద వేసే గరిష్ట లేట్ ఫీ రూ. 10,000. ఎవరి ఆదాయం అయితే రూ. 5,00,000 దాటకుండా ఉంటుందో వారికి IT శాఖ రూ. 1000 పెనాల్టీ విధిస్తుంది. ఇది ట్యాక్స్ పేయర్ లకు రిలీఫ్ ఇచ్చే అంశం.

ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేయడం వల్ల వేసే పెనాల్టీని దిగువన పట్టిక సూచిస్తుంది:

[మూలం]

దాఖలు రిటర్న్ తేదీ మొత్తం ఆదాయం రూ. 5,00,000 కంటే ఎక్కువ ఉన్న ట్యాక్స్ పేయర్ లకు పెనాల్టీ మొత్తం ఆదాయం రూ. 5,00,000 కంటే తక్కువ ఉన్న టాక్స్ పేయర్ లకు పెనాల్టీ
ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 31 చివరి తేదీ ఆలస్యంగా దాఖలు చేస్తే లేట్ ఫీ వర్తించదు ఆలస్యంగా దాఖలు చేస్తే లేట్ ఫీ వర్తించదు
ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31వరకు ₹5,000 ₹1,000
ఆర్థిక సంవత్సరం 1 జనవరి నుంచి మార్చి 31 వరకు ₹10,000 ₹1,000

అయితే మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ ను ఫైల్ చేసే తేదీ కంటే ముందే రిటర్న్ లను ఫైల్ చేయాలని మేము మీకు సూచిస్తున్నాం. ఐటీఆర్ లను బాధ్యతాయుతంగా ఫైల్ చేయడం ద్వారా మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మారొచ్చు. ఈ ప్రయోజనాలు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి:

  • సరైన సమయం లో ఆదాయపు పన్ను రిటర్న్ లను ఫైల్ చేయడం ద్వారా వ్యక్తులు హౌస్ లోన్ మరియు వాహన రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మీరు సమయానికి ఐటీఆర్ ఫైల్ చేసినపుడు మీరు వీలైనంత త్వరగా వాపసు పొందుతారు.
  • లోన్ లేదా వీసా కోసం అప్లై చేసినపుడు ఐటీఆర్ అడ్రస్ ప్రూఫ్ లేదా ఇన్కమ్ ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది.
  • వీసా అప్లికేషన్ సమయం లో చాలా ఎంబసీలు మరియు కాన్సులేట్ గత రెండు సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్ కాపీలను సమర్పించమని కోరుతాయి.
  • గడువు తేదీ కంటే ముందే ఐటీఆర్ ను ఫైల్ చేయడం ద్వారా మీరు పెనాల్టీ లు మరియు వేధింపులను నివారించగల్గుతారు. మీరు చెల్లించాల్సిన నెట్ ట్యాక్స్ అమౌంట్ రూ. 3,000 కంటే ఎక్కువగా ఉన్నపుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీకు 2 సంవత్సరాల జైలు శిక్షను విధించవచ్చు. ఒక వ్యక్తి రూ. 25,00,000 కంటే ఎక్కువ ట్యాక్స్ బకాయి ఉంటే అతడికి 7 సంవతర్సాల వరకు జైటు శిక్ష (వేధింపులు) పడొచ్చు. ఒక వేళ మీరు ఆదాయాన్ని కనుక తక్కువగా చూపిస్తే అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ ట్యాక్స్ పై 50 శాతం పెనాల్టీ విధించవచ్చు.
  • టాక్స్ పేయర్ లు ట్యాక్స్ చెల్లించకుండా ఐటీఆర్ ఫైల్ చేయలేరు. సెక్షన్ 234A కింద పన్నులు చెల్లించాల్సిన గడువు తేదీ కంటే ఆలస్యంగా ట్యాక్స్ చెల్లిస్తే నెలకు మ్యాండేట్ గా 1 శాతం ఇంట్రెస్ట్ విధించబడుతుంది. మీరు సమయానికి ఆదాయపు పన్ను రిటర్న్ ను ఫైల్ చేసినపుడు మీరు అదనపు వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల మీరు ట్యాక్స్ లు ఫైల్ చేయడానికి మీరు ఎంత కాలం వేచి ఉంటే అంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

మేము ఈనాటి ఆర్టికల్ తుది దశకు చేరుకున్నాం. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు ఈ గైడ్ ఉపయోగపడుతుంది. అన్ని ముఖ్యమైన ట్యాక్స్ సంబంధింత విషయాలను ముందే తెలుసుకోవడం ద్వారా ఈ ప్రాసెస్ చాలా తక్కువగా గజిబిజిగా మరియు సులభంగా ఉంటుంది.

తరచూ అడిగే ప్రశ్నలు

మనం ఒకవేళ ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏమవుతుంది?

ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు తేదీని మిస్ అయినపుడు ట్యాక్స్ పేయర్ లు బిలేటెడ్ రిటర్న్ ను ఫైల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆలస్యమైన రిటర్న్ ను ఫైల్ చేస్తే రూ. 10,000 వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది.

ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?

వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్ ను దాఖలు చేయడం ద్వారా ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన లేదా డిడక్షన్ చేయబడిన అదనపు ట్యాక్స్ పై క్లయిమ్ చేయవచ్చు. అదనంగా అన్ని ప్రధాన బ్యాంక్ లకు ట్యాక్స్ రిటర్న్ కాపీలు అవసరం. కావున పన్ను చెల్లింపుదారులు హోమ్ లోన్ లేదా వాహన రుణం కోసం దరఖాస్తు చేసుకున్నపుడు ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా సహాయకరంగా ఉంటుంది. ఐటీఆర్ ను అడ్రస్ కు మరియు ఆదాయానికి ప్రూఫ్ గా వాడొచ్చు.

టీడీఎస్ రిటర్న్ ను ఎవరు ఫైల్ చేయాలి?

వ్యాలీడ్ ట్యాక్స్ కలెక్షన్ మరియు డిడక్షన్ అకౌంట్ నెంబర్ (TAN) కలిగిన వ్యక్తులు లేదా సంస్థలు టీడీఎస్ రిటర్న్ ను ఫైల్ చేయొచ్చు. అంతే కాకుండా IT యాక్ట్ ప్రకారం పేర్కొన్న చెల్లింపులు చేసే ఏ వ్యక్తి అయినా మూలం వద్ద ట్యాక్స్ డిడక్ట్ చేయబడాలి. మరియు దానిని నిర్ణీత సమయంలోగా డిపాజిట్ చేయాలి.

టీడీఎస్ పేమెంట్ అంటే ఏమిటి?

ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ ప్రకారం ఏదైనా కంపెనీ అయినా లేదా వ్యక్తి అయినా కానీ చెల్లించే ట్యాక్స్ నిర్దిష్ట థ్రెషోల్డ్ లిమిట్ మించి ఉంటే తప్పనిసరిగా మూలం వద్ద పన్ను మినహాయింపు ఇవ్వాలి. ఈ డిడక్షన్ అనేది ఇండియన్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ సూచించిన రేట్ల ప్రకారం ఉంటుంది.

ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరా?

రూ. 3,00,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. అయితే ఎవరైనా సరే వారి ఆదాయంతో సంబంధం లేకుండా రిటర్న్ ఫైల్ చేయాలని సూచించబడింది.

[మూలం]