డిజిట్ ఇన్సూరెన్స్ చేయండి

పాస్‌పోర్ట్‌ను వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌తో ఎలా లింక్ చేయాలి

(మూలం: india. com)

మీరు జాబ్ కోసం లేదా ఉన్నత చదువుల కోసం విదేశాలకు ట్రావెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? 

అవునయితే ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వెంటనే వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌తో లింక్ చేయండి.

కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్లను తగ్గించేందుకు గవర్నమెంట్ ఈ పద్ధతిని దేశం విడిచి వెళ్లేవారికి తప్పనిసరి చేసింది. మీ పాస్‌పోర్ట్‌ను మీ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌తో లింక్ చేయడం వలన వ్యాక్సినేషన్ స్టేటస్ అనేది ధృవీకరణ సమయంలో లేదా బయల్దేరే సమయంలో సహాయకారిగా ఉంటుంది.

ఈ ప్రక్రియ గురించి మీరు మరింత క్లుప్తంగా తెలుసుకోవాలని అనుకుంటే చదవడం కొనసాగించండి!

వ్యాక్సిన్ సర్టిఫికెట్‌తో పాస్‌పోర్ట్‌ను లింక్ చేసే విధానం.

మీరు కోవిన్ యాప్ లేదా వెబ్‌సైట్ ఉపయోగించి సులభంగా మీ పాస్‌పోర్ట్‌ను వ్యాక్సిన్ సర్టిఫికెట్‌తో లింక్ చేయొచ్చు. 

మీరు లాగిన్ చేసిన తర్వాత కింది స్టెప్స్ ఫాలో అవండి

  • స్టెప్ 1: అకౌంట్ డిటేయిల్ ట్యాబ్ నుంచి సమస్యను లేవనెత్తండి ఎంచుకోండి.
  • స్టెప్ 2: అందుబాటులో ఉన్న ఆప్షన్స్ నుంచి పాస్‌పోర్ట్ డిటేయిల్స్ ఎంచుకుని కొనసాగించండి.
  • స్టెప్ 3: రిడైరెక్ట్ అయిన పేజీలో మీరు ఎవరి పేరు మీదైతే పాస్‌పోర్ట్ తీయాలని అనుకుంటున్నారో అతని పేరుని యాడ్ చేయండి.
  • స్టెప్ 4: లబ్ధిదారుని పాస్‌పోర్ట్ సంఖ్యని సరిగ్గా పూరించి డైలాగ్ బాక్స్‌లో టిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద నొక్కండి.

మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్‌కు కన్ఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది.

నెంబర్ వచ్చిన తర్వాత అభ్యర్థన విజయవంతంగా అప్డేట్ అయిందని మీకు మరో నోటిఫికేషన్ వస్తుంది.

టీకా సర్టిఫికెట్‌తో మీ పాస్‌పోర్ట్‌ని లింక్ చేసేందుకు ఎంత సమయం పడుతుందో అని మీరు ఆందోళన చెందుతుంటే చింతించకండి దానికి కొన్ని సెకండ్ల సమయం మాత్రమే పడుతుంది.

మీరు కోవిన్ యాప్‌లో ఇంకా రిజిస్టర్ చేసుకోనట్లయితే వ్యాక్సినేషన్‌కు ముందు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీరు మీ పాస్‌పోర్ట్‌ను ఫొటో ఐడీ రుజువుగా వాడొచ్చు. మీరు కొన్ని నెలల్లో విదేశాలకు ట్రావెల్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్లయితే వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది.

పాస్‌పోర్ట్‌తో లింక్ చేయబడిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లోని సమాచారాన్ని ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌తో పాస్‌పోర్ట్‌ను లింక్ చేయాల్సిన ప్రాముఖ్యత

ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కే ముందు విమానాశ్రయ అధికారులు టీకా స్థితిని గురించి తనిఖీ చేస్తారు. ఇది కోవిడ్-19 ప్రోటోకాల్స్ మరియు ప్రయాణికుల భద్రతను కాపాడేందుకే.

ఒక నివేదిక ప్రకారం విద్య, ఉద్యోగాలు, టోక్యో ఒలంపిక్స్ కోసం విదేశాలకు వెళ్లే వారందరూ తమ పాస్‌పోర్ట్‌తో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పకుండా లింక్ చేయాలని భారత ప్రభుత్వం ప్రకటించింది.

మీరు మీ పాస్‌పోర్ట్‌ను టీకా సర్టిఫికెట్‌తో లింక్ చేసినప్పుడు వ్యాక్సిన్ డోసేజ్, బ్యాచ్ నెంబర్ వంటి వివరాలు అప్డేట్ చేయబడతాయి.

అంతే కాకుండా కోవిన్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ విమానాశ్రయంలో చెక్ చేయబడుతుంది. సాంకేతికంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తుంది.

వ్యాక్సిన్ సర్టిఫికెట్లతో పాస్‌పోర్ట్‌ను లింక్ చేయడం ఎలా అని వెతుకుతున్న వ్యక్తులు కింది సెక్షన్‌లో తెలిపిన స్టెప్స్ ఆధారంగా పూర్తి చేయొచ్చు.

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో సమాచారాన్ని ఎలా అప్డేట్ చేయాలి?

సర్టిఫికెట్‌ను అప్డేట్ చేసేందుకైనా మార్పులు చేసేందుకైనా ఈ స్టెప్స్ ఫాలో అవండి-

1. కోవిన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మరియు ఓటీపీతో లాగిన్ అవ్వండి.

2. హోమ్ పేజీలో రెయిస్ ఆన్ ఇష్యూ మీద క్లిక్ చేసి అప్పుడు ఓపెన్ అయిన పేజీలో కరెక్షన్ ఇన్ సర్టిఫికెట్ ఎంచుకోండి.

3. తర్వాత డ్రాప్-డౌన్ మెనూ నుంచి పర్సన్‌ను ఎంచుకుని కరెక్షన్ మరియు అప్డేట్ డిటేయిల్స్ పూర్తి చేయండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి.

ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మీరు ఈ లింక్డ్ సర్టిఫికెట్ యొక్క హార్డ్‌కాపీని ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులకు చూపించి మీరు రెండు డోసుల టీకా తీసుకున్నారని నిరూపించుకోవాలి.

కోవిన్ పోర్టల్ నుంచి ఈ సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలో కింద తెలియజేశాం.

పాస్‌పోర్ట్‌తో లింక్ చేయబడిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ కాపీని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

పాస్‌పోర్ట్‌ని వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌తో లింక్ చేయడం పూర్తైన తర్వాత మీరు కోవిన్ యాప్ మరియు పోర్టల్ నుంచి ఈ స్టెప్స్ అనుసరించి మీరు లింక్ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు-

1. డాష్‌బోర్డ్‌లో మీరు మొదటి రెండో డోస్ గురించిన సమాచారాన్ని కనుక్కొంటారు. ఈ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి అప్లికేబుల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

2. డౌన్‌లోడ్ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ సర్టిఫికెట్ యొక్క పీడీఎఫ్ రూపాన్ని కనుక్కొంటారు.

వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌తో లింక్ చేసేందుకు పైన పేర్కొన్న సింపుల్ స్టెప్స్‌ను ఫాలో అవండి. 

ఎటువంటి అవాంతరాలు లేకుండా విదేశాలకు ట్రావెల్ చేసేందుకు మరియు కోవిడ్ ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండేందుకు ఇది మీకు ఎంతో సహాయం చేస్తుంది.

పాస్‌పోర్ట్‌తో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లింక్ చేయడం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

ఫోన్ నెంబర్ లేకుండా నా పాస్‌పోర్ట్‌తో లింక్ అయి ఉన్న వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?

లేదు. మీరు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా లేదా రిజిస్టర్ చేసుకోవాలన్నా తప్పకుండా ఫోన్ నెంబర్ అందించాలి

కోవిన్ యాప్ నుంచి కాకుండా వేరే ఇతర యాప్స్ నుంచి నా పాస్‌పోర్ట్‌కు లింక్ అయి ఉన్న సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?

అవును. మీరు ఈ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఆరోగ్యసేతు యాప్‌లో కోవిన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్రభుత్వ వాట్సాప్ నెంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా కూడా మీరు ఈ సర్టిఫికెట్‌ను కనుక్కోవచ్చు.

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ లింకింగ్ అనేది తప్పనిసరా?

ఉద్యోగాలు లేదా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేవారు తమ రోగనిరోధక శక్తి రికార్డులను పాస్‌పోర్టులకు జత చేయడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది.