పాస్పోర్ట్ నష్టాన్ని కవర్ చేసే ట్రావెల్ ఇన్సూరెన్స్ను
Select Number of Travellers
మోటార్
హెల్త్
మోటార్
హెల్త్
More Products
మోటార్
హెల్త్
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
ఈ రోజు పాస్ పోర్ట్ అనేది మన ట్రావెల్ పత్రాలలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ మాత్రమే కాదు, మనం ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలు చుట్టి వచ్చామని చెప్పేందుకు ఒక సాక్ష్యం. పాస్ పోర్ట్ పేజీలలోని స్టాంపులు ప్రపంచవ్యాప్తంగా మనం వెళ్లిన ప్రాంతాలకు గుర్తుగా ఉంటాయి.
ఇది కేవలం మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ కు మాత్రమే కాకుండా గుర్తింపు ప్రక్రియలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనిని పొందే ప్రక్రియ ఒక్కోసారి ఆలస్యం అవుతూ ఉంటుంది! పాస్ పోర్ట్ అనేది మనం కలిగి ఉన్న ఐదు అతి ముఖ్య విషయాల్లో ఒకటి. మంటల్లో కూడా మీతో పాటు తీసుకెళ్లే 5 వస్తువులు ఏంటి? అనే ప్రశ్న తలెత్తినప్పుడు మీరు పాస్ పోర్ట్ అని తప్పకుండా చెబుతారు. ఇది అంత ఉపయోగకరమైనది.
ఇప్పుడు మీరు ఊహించుకోండి. మీరు సెలవులో ఉన్నప్పుడు మీ ఫ్లైట్ బయలుదేరే ముందు మీరు మీ ప్రయాణానికి సంబంధించిన వాటిని కోల్పోతే ఎలా ఉంటుంది! కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా ఇటువంటి విషయాలు జరుగుతాయి. కావున అటువంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి? అదృష్టవశాత్తు మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తో, మీ ట్రిప్ ను ముందుగానే సురక్షితం చేసుకుంటే దానంతట అదే వెనక్కు వస్తుంది (నష్టపరిహారం చెల్లించబడుతుంది)! అటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో మీరు మీ పాస్ పోర్ట్ ను కోల్పోయినప్పుడు మీరు చింతించకుండా ఉండేందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ధీమాను ఇస్తుంది!
పాస్ పోర్ట్ లాస్ కవర్ అనేది డిజిట్ అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ లో చేర్చబడిన ఒక ప్రయోజనం. సెలవుల్లో ఉండగా మీ పాస్ పోర్ట్ ను పోగొట్టుకున్నప్పుడు కొత్తదానిని పొందేందుకు లేదా తాత్కాలిక పాస్ పోర్ట్ ను పొందేందుకు కావాల్సిన ఖర్చును ఇది కవర్ చేస్తుంది. మీరు ఎక్కడికి ప్రయాణిస్తున్నా సరే, సంబంధిత దేశానికి చెందిన ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
మీరు హాలీడే లేదా వెకేషన్ లో ఉన్నప్పుడు మీ పాస్ పోర్ట్ ను పోగొట్టుకున్నట్లయితే మీరు పర్యటించే దేశంలో ఉన్న ఇండియన్ ఎంబసీ నుంచి పాస్ పోర్ట్ రిప్లేస్మెంట్ కోసం అయ్యే ఖర్చును ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
మీ పాస్ పోర్ట్ కోల్పోవడం మిమ్మల్ని బాధిస్తుంది! కానీ పాస్ పోర్ట్ పోతే ప్రపంచం అంతం అయినట్లు కాదు. మీ పాస్ పోర్ట్ పోయింది లేదా దొంగతనం చేయబడిందని మీరు గ్రహించిన తర్వాత మొదటగా చేయాల్సిందేంటంటే మొదట పోలీసులకు ఫిర్యాదు చేయడం మరియు రాతపూర్వక పోలీస్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్ కాపీ) కోసం అభ్యర్థించడం. మీ వద్ద మిస్ అయిన లేదా దొంగిలించబడిన మీ పాస్ పోర్ట్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దగ్గర్లోని ఇండియన్ కాన్సులేట్ లేదా ఎంబసీ నుంచి డూప్లికేట్ పాస్ పోర్ట్ లేదా ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ ను పొందేందుకు మీరు పోలీస్ రిపోర్ట్ ను ఉపయోగించుకోవచ్చు. మీరు మా 24x7 ట్రావెల్ అసిస్టెంట్ హెల్ప్ లైన్ లో మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. మీకు దగ్గర్లో ఉన్న ఇండియన్ ఎంబసీ లేదా కాన్సులేట్ నుంచి ఎమర్జెన్సీ పాస్ పోర్ట్ లేదా తాత్కాలిక పాస్ పోర్ట్ అనేది ఎలా పొందాలని మేము మీకు స్టెప్ బై స్టెప్ వివరించేందుకు 10 నిమిషాల్లోపు కాల్ బ్యాక్ చేస్తాం.
మీకు సింపుల్ స్టెప్స్ ద్వారా మార్గనిర్దేశనం చేయడంతో పాటు మీరు పాస్ పోర్ట్ తిరిగి పొందేందుకు అయ్యే ఖర్చును కూడా డిజిట్ మీకు చెల్లిస్తుంది. క్లయిమ్ చేసుకోగల ఖర్చులు:
1. మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించేందుకు లేదా ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పొందేందుకు నష్టపోయిన స్థలంలో సంబంధిత అధికారులకు చెల్లించాల్సిన ఫీజు.
2. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ను పొందేందుకు మీరు చేసే అన్ని ఖర్చుల కోసం USD 50 (అమెరికన్ డాలర్లు) నిర్దారిత మొత్తం చెల్లించబడుతుంది. ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్కు మీరు వెళ్లి వచ్చేందుకు అయ్యే క్యాబ్ చార్జీలను కూడా మేము చెల్లిస్తాం. మీ క్యాబ్ చార్జీకి సంబంధించిన రశీదును దగ్గరగా ఉంచుకుంటే సరిపోతుంది.
3. డూప్లికేట్ పాస్ పోర్ట్ ను పొందేందుకు ఇండియాలోని అధికారులకు చెల్లించాల్సిన అప్లికేషన్ ఫీజ్ అనేది మొత్తం ఇండియన్ రూపాయల్లో ఉంటుంది.
మీ ట్రిప్ లో తలెత్తే కొన్ని పరిస్థితులను అదుపు చేసేందుకు మీరు ట్రావెల్ చేసే ముందు చేయగలిగే విషయాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి:
ముందుగా మీ పాస్ పోర్ట్ మరియు వీసా ఫొటోకాపీలను తీసుకుని వాటిని ఒరిజినల్స్ ఉంచిన ప్రదేశానికి దూరంగా ఉంచండి. మీరు మీ ఫోన్ లో పత్రాలకు సంబంధించిన కాపీని కూడా ఉంచుకోవచ్చు. మీ పాస్ పోర్ట్ తో పాటు మీ ఫోన్ కూడా దొంగిలించబడినా లేక పోగొట్టుకున్నా కానీ మీ ప్రయాణానికి ముందు మీ పాస్ పోర్ట్ మరియు వీసా కాపీని జస్ట్ ఈ మెయిల్ చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ ఈమెయిల్ లోకి లాగిన్ అయి పత్రాలను ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
మీకు ఉపయోగపడే ఇంకో విషయం ఏమిటంటే మీరు సెలవుల్లో సందర్శించాలనుకునే అన్ని దేశాల ఇండియన్ కాన్సులేట్స్ మరియు ఎంబసీల ఫోన్ నెంబర్లు, అడ్రస్ లు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ ప్రక్రియలో మీకు సహాయం చేసేందుకు మా 24/7 ట్రావెల్ హెల్ప్ లైన్ కూడా అందుబాటులో ఉంది.
చివరగా చెప్పేది మరియు ముఖ్యమైనది ఏంటంటే మీరు ట్రిప్ కు బయల్దేరే ముందు డిజిట్ అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేశారని నిర్థారించుకోండి. ఎందుకంటే కేవలం మీ పాస్ పోర్ట్ పోయినప్పుడు మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల ప్రమాదాల నుంచి డిజిట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు రక్షణ అందిస్తుంది.
Please try one more time!
నిరాకరణ -
మీ పాలసీ మీ పాలసీ షెడ్యూల్ మరియు పాలసీ పదాలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. దయచేసి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి.
దేశాలు, వీసా ఫీజులు మరియు ఇతర వాటి గురించి ఇక్కడ పేర్కొన్న సమాచారం వివిధ మూలాల నుండి తీసుకోబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి మీరు మీ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు, వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ట్రావెల్ పాలసీని కొనుగోలు చేసే ముందు లేదా మరేదైనా నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 28-08-2024
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.