డిజిట్ ఇన్సూరెన్స్ చేయండి

పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారాన్ని ఎలా పూరించాలి?

ఈ రోజుల్లో మీ సౌకర్యాన్ని బట్టి దరఖాస్తు ఫారాన్ని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో పూరించవచ్చు. ICR స్కానర్లు ఈ ఫారాలను చదువుతాయి. దరఖాస్తును తప్పుగా నింపితే తిరస్కరిస్తాయి.

ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారాన్ని ఎలా పూరించాలో తెలుసుకునేందుకు చదువుతూనే ఉండండి.

పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారాన్ని పూరించేందుకు అవసరమైన ప్రమాణాలు ఏమిటి?

అవునయితే పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారాన్ని ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్‌లో ఎలా పూరించాలో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి:

1. సేవ అవసరం

ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారంలో ఉన్న ఖాళీలలో సమాచారాన్ని నమోదు చేయండి లేదా ఎంపిక చేయండి:

దేని కోసం దరఖాస్తు: రెండోసారి పాస్‌పోర్ట్ లేదా కొత్త పాస్‌పోర్ట్ కోసం

రెండోసారి పాస్‌పోర్ట్ కోసమయితే దానికి కారణమేంటో చెప్పండి:

  • పాస్‌పోర్ట్ బుక్‌లెట్‌లోని పేజీలు అయిపోయాయి 

  • పాస్‌పోర్ట్ యొక్క చెల్లుబాటు తేదీ 3 సంవత్సరాలలో ముగుస్తుంది లేదా గడువు ముగియాల్సి ఉంది

  • పాస్‌పోర్ట్ యొక్క చెల్లుబాటు గడువు ముగిసి 3 సంవత్సరాలే లేదా అంతకంటే ఎక్కువే అవుతోంది

  • దెబ్బతిన్న పాస్‌పోర్ట్

  • పాస్‌పోర్ట్ పోయింది 

  • ప్రస్తుత వ్యక్తిగత సమాచారం మారింది 

మీరు కనుక చివరి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి కారణాలు తెలపండి:

  • స్వరూపం

  • పేరు మరియు ఇంటి పేరు

  • జన్మదినం 

  • సంతకం

  • చిరునామా

  • జీవిత భాగస్వామి పేరు

  • ఈసీఆర్‌ని తొలగించండి

  • ఇతర కారణాలు

  • దరఖాస్తు రకం: తత్కాల్ లేదా సాధారణం  

  • పాస్‌పోర్ట్ బుక్‌లెట్ రకం: 60 లేదా 36 పేజీలు 

  • పాస్‌పోర్ట్ యొక్క చెల్లుబాటు అవసరం (15-18 సంవత్సరాల వయసున్న మైనర్లకు మాత్రమే): 10 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాల వయసును ఎంచుకోండి. సాధారణంగా పాస్‌పోర్ట్ చెల్లుబాటు అనేది జారీ  చేసిన తేదీ నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత మళ్లీ జారీ చేయబడుతుంది. మైనర్ దరఖాస్తుదారునికి పాస్‌పోర్ట్ 5 సంవత్సరాలు లేదా వారికి 18 సంవత్సరాలు వచ్చే వరకు పని చేస్తుంది. ఏది ముందు వస్తే అది.

2. దరఖాస్తుదారుల వివరాలు

పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారంలో అందుబాటులో ఉన్న కింది ఫీల్డ్‌లలో ప్రతిదానిలో సంబంధిత వివరాలను నమోదు చేయండి:

  • పేరు 

  • వేరే ఏదైనా ఇతర పేరుతో పిలుస్తారా (అవునయితే సప్లిమెంటరీ ఫారం 1లో వివరాలను పూరించండి)

  • మీ పేరును ఎప్పుడైనా మార్చారా (అవును అయితే, అనుబంధ ఫారం యొక్క కాలమ్ 2లో వివరాలను అందించండి)

  • జన్మదినం

  • దేశం, జిల్లా, రాష్ట్రంతో సహా జన్మస్థలం (సిటీ, టౌన్ లేదా గ్రామం)

మీరు 15.08.1947 కంటే ముందు మీరు కనుక పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌లో జన్మిస్తే అవిభక్త భారతదేశం అని పేర్కొనండి

  • పెళ్లి స్థితి

  • జెండర్

  • భారత పౌరసత్వం

  • ఓటర్ ID మరియు PAN కార్డు వివరాలు

  • ఎంప్లాయిమెంట్ రకం: మీ ఉద్యోగ స్థితి తెలిపేందుకు సరైన దానిని ఎంచుకోండి: 

  • పబ్లిక్ సెక్టార్ లేదా PSU

  • ప్రభుత్వం

  • స్వతహాగా ఉద్యగం (కుటీర పరిశ్రమల వంటివి)

  • ప్రైవేట్

  • సాట్యుటరీ బాడీ

  • గృహిణి

  • ఉద్యోగం లేదు

  • విద్యార్థి

  • రిటైరైన ప్రైవేట్ ఉద్యోగి

  • రిటైరైన ప్రభుత్వ ఉద్యోగి

  • FICCI, అసోచామ్, మరియు CII వంటి కంపెనీ ఓనర్లు, డైరెక్టర్లు మరియు పార్ట్‌నర్స్

  • ఇతర వ్యక్తులు

  • మీరు చట్టబద్ధమైన సంస్థ, PSU మరియు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆర్గనైజేషన్ పేరును సమర్పించండి.

  • మీ తల్లిదండ్రులు (మైనర్ దరఖాస్తుదారులకు వర్తిస్తుంది) లేదా జీవిత భాగస్వామి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా లేదా తెలపండి.

సమాచారంఅంతేకాకుండా, ఈ కాలమ్ క్రింద ఇతర సమాచారం పూరించండి:

  • విద్యార్హతలు 

  • ఒకవేళ నాన్-ఇసిఆర్‌ కేటగిరీకి అర్హులైతే 

  • కనిపించే ప్రత్యేక గుర్తు

  • ఆధార్ సంఖ్య

3. కుటుంబసభ్యుల వివరాలు

కింద పేర్కొన్న స్థలంలో వివరాలను పూరించండి:

  • తండ్రి మరియు తల్లి పేరు

  • చట్టపరమైన సంరక్షకుని పేరు

  • జీవిత భాగస్వామి పేరు

మైనర్ దరఖాస్తుదారుల విషయంలో, కింది సంబంధిత వివరాలను నమోదు చేయండి:

తల్లిదండ్రుల పాస్‌పోర్ట్‌ వివరాలు: కింది వాటిని పూరించండి:

  • తండ్రి లేదా చట్టపరమైన సంరక్షకుల ఫైల్ లేదా పాస్‌పోర్ట్ సంఖ్య 

  • తండ్రి లేదా సంరక్షకుని జాతీయత, ఒక వేళ భారతీయ పౌరసత్వం కాకపోతే

  • తల్లి లేదా చట్టపరమైన సంరక్షకుని ఫైల్ లేదా పాస్‌పోర్ట్ నెంబర్ 

  • తల్లి లేదా చట్టపరమైన సంరక్షకుని జాతీయత, ఒక వేళ భారతీయ పౌరసత్వం కాకపోతే 

4. ప్రస్తుతం నివాసం ఉంటున్న చిరునామా వివరాలు

ప్రతి ఫీల్డ్‌లో సంబంధిత వివరాలను నమోదు చేయండి:

  • ఇంటి  సంఖ్య మరియు వీధి పేరు 

  • పట్టణం, నగరం లేదా గ్రామం యొక్క వివరాలు 

  • జిల్లా, రాష్ట్రం లేదా UT (కేంద్ర పాలిత ప్రాంతం) లేదా పోలీస్‌స్టేషన్, పిన్ కోడ్ వివరాలు

  • కాంటాక్ట్ సంఖ్య మరియు ఈ-మెయిల్ ID

  • మీ శాశ్వత చిరునామా, ప్రస్తుతం ఉంటున్న చిరునామా ఒకటేనో లేదో తెలపండి. మీరు కాదని ఎంచుకుంటే కాలం 4 సప్లమెంటరీ ఫారంలో సమాచారం నింపండి.

5. దరఖాస్తుదారు ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలు

కింద పేర్కొన్న వివరాలను సమర్పించండి:

  • పేరు మరియు నివాస చిరునామా (మీ ప్రస్తుత చిరునామాతో శాశ్వత చిరునామా సమానంగా లేకపోతే పేర్కొనండి)

  • కాంటాక్ట్ సంఖ్య మరియు ఈ-మెయిల్ ID

6. మీ గత పాస్‌పోర్ట్ లేదా అప్లికేషన్ వివరాలు

కింది వాటి కోసం సమాచారం అందించండి:

  • పాస్‌పోర్ట్ లేదా ఐడెంటిటీ సర్టిఫికేట్ సంఖ్య

  • జారీ చేసిన మరియు గడువు ముగిసే తేదీలు

  • జారీ చేసిన స్థలం 

  • ఒక వేళ మీరు పాస్‌పోర్ట్‌కు అప్లై చేసినా కానీ జారీ కాకపోతే మీరు కనుక అవును అని ఎంచుకుంటే ఫైల్ సంఖ్య మరియు దరఖాస్తు నెల, సంవత్సరం, మీరు అప్లై చేసిన పాస్‌పోర్ట్ కార్యాలయ పేరును పేర్కొనండి.

  • మీరు దౌత్యవేత్త పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్నట్లయితే లేదా ఇప్పటికే కలిగి ఉన్నట్లయితే, సప్లిమెంటరీ ఫారంలోని కాలమ్ 6లో సమాచారాన్ని సమర్పించండి.

7. ఇతర వివరాలు

కింది వాటికోసం సంబంధిత వివరాలను నమోదు చేయండి:

  • మీ మీద ఏవైనా పెండింగ్ క్రిమినల్ కేసులు ఉన్నాయా

  • ఒక వేళ మిమ్మల్ని ఏదైనా భారతీయ న్యాయస్థానం దోషిగా తేల్చిందా

  • మీరు పాస్‌పోర్ట్ పొందేందుకు తిరస్కరించబడ్డారు

  • మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే లేదా విదేశీ పౌరసత్వం లభించినట్లయితే

  • మీరు ఎమర్జెన్సీ సర్టిఫికేట్‌పై ఇండియాకు వచ్చినట్లయితే 

8. చెల్లించాల్సిన ఫీజు వివరాలు

కింద పేర్కొన్న వివరాలు పూరించండి:

  • ఫీజు మొత్తం

  • మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించినట్లయితే DD జారీ చేసిన తేదీ, సంఖ్య, గడువు తేదీ, బ్యాంక్‌ పేరు మరియు బ్రాంచ్ పేరు 

9. ఎన్‌క్లోజర్‌లు (మూసివేయబడిన ప్రదేశం)

పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు ఓటర్ ID మరియు ఆధార్ కార్డు వంటి పత్రాలు సమర్పించండి.

10. సెల్ఫ్-డిక్లరేషన్

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసేందుకు మీ సంతకం లేదా బొటన వేలి ముద్ర వేయండి. స్థలం, తేదీ, నెల, సంవత్సరం పేర్కొనండి.

పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారాన్ని నింపేటపుడు గుర్తుంచుకోవాల్సిన వివరాలు

పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారమ్‌ను నింపేటపుడు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు సూచనలను జాగ్రత్తగా పాటించండి:

  • పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారాన్ని ఆఫ్‌లైన్‌లో పూరించేందుకు పెద్ద అక్షరాలను ఉపయోగించండి. 

  • ప్రామాణిక ఫాంట్‌లను ఉపయోగించండి. 

  • బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్‌ను ఉపయోగించి పూరించండి.

  • గందరగోళాన్ని నివారించేందుకు క్లియర్‌గా రాయండి.

  • మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్‌ను సెలెక్ట్ చేసుకుంటే క్రాస్ ఆప్షన్‌తో మార్క్ చేయండి. ఉదాహరణకు మీ లింగం స్త్రీ అయితే ఫీమేల్ ఆప్షన్‌ బాక్స్‌లో క్రాస్ మార్క్ చేయండి.

  • బాక్సెస్‌ను టిక్ మార్క్స్ లేదా డాట్స్‌తో పూరించకండి.

  • బాక్సెస్‌ను తాకకుండా వాటి సరిహద్దుల్లో సమాచారాన్ని మెన్షన్ చేయండి.

  • ప్రతి పదం పూర్తయిన తర్వాత ఒక బాక్స్‌ను వదిలిపెట్టండి.

  • బాక్సెస్ బయట డిటేయిల్స్ నింపవద్దు.

  • మీరు ఏదైనా తప్పుడు వివరాలను పేర్కొన్నట్లయితే దానిని కొట్టేయండి.

  • పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫారాన్ని మడవకండి.

  • అక్కడ ఉన్న ఆప్షన్ మీకు సంబంధించినది కాకపోతే నాట్ అప్లికెబుల్ అని మెన్షన్ చేయొద్దు. ఆ బాక్సులను లేదా కాలమ్స్‌ను ఖాళీగా వదిలేయండి.

దరఖాస్తు ఫారం కోసం ఫొటోలు సమర్పించేటపుడు పరిగణించాల్సిన విషయాలు

మీరు జిల్లా పాస్‌పోర్ట్ సెల్, సిటిజన్ సర్వీస్ సెంటర్, అధీకృత స్పీడ్ పోస్ట్ సెంటర్‌లలో పాస్‌పోర్ట్ దరఖాస్తును సమర్పించినట్లయితే దరఖాస్తు ఫారమ్‌పై మీ ఫొటోను అతికించేటపుడు కింది సూచనలను పాటించండి:

  • 4.5 సెం.మీ పొడవు x 3.5 సెం.మీ వెడల్పు ఉన్న రంగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించండి.

  • ఫొటో బ్యాక్‌గ్రౌండ్ కలర్ తెల్లగా ఉండాలి. మీరు ధరించిన దుస్తుల రంగు డార్క్‌గా ఉండాలి. 

  • దరఖాస్తు ఫారమ్‌లో ఇచ్చిన బాక్స్‌లో ఫొటోగ్రాఫ్ ఫిక్స్ కావాలి.

  • ఫొటోగ్రాఫ్‌లో మీ ముఖం ఎటువంటి హావభావాలు లేకుండా క్లియర్‌గా ఉండాలి. మీ కళ్లు తెరిచి ఉండాలి. మీ తల మధ్యలో ఉండాలి. ముఖం అంచులు మరియు చెవులు కనిపించేలా చూసుకోవాలి. 

  • ఫొటోలో రంగు లేదా ముదురు రంగు అద్దాలు ధరించకూడదు.

  • కంప్యూటర్ ప్రింటెడ్ ఫొటోలు అనుమతించబడవు. మంచి క్వాలిటీ పేపర్ మీద తీసిన ఫొటోలు మాత్రమే అనుమతించబడతాయి. 

  • మీ జట్టు కళ్లను కప్పకూడదు. 

  • కళ్లద్దాల మీద మెరుగులు ఆమోదయోగ్యం కాదు.

  • డ్యామేజ్ అయిన ఫొటోలు అంగీకరించబడవు.

  • మతపరమైన కేసెస్‌లో మాత్రమే తలను కవర్ చేసుకోవడం అనుమతించబడుతుంది.

  • ఫొటోలో మీ ముఖం మీద కానీ వెనకాల కానీ నీడలు అనేవి ఉండకూడవు.

  • గ్రూప్ ఫొటోల నుంచి తీసుకున్న ఫొటోస్ అంగీకరించబడవు.

  • అంటించిన ఫొటో మీద మీరు సంతకం చేయకండి.

గమనిక: మీరు పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో దరఖాస్తును సమర్పించినట్లయితే మీరు ఫొటోలను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు.

కాబట్టి పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలో మీకు తెలుసు. దాని గురించి తెలుసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించేందుకు సహాయపడుతుంది.

పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించేందుకు సంబంధించి తరచూ అడిగే లు

ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారమ్‌లో ఉన్న పొరపాటును ఎలా సరిదిద్దాలి?

మీరు కనుక మీ ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ దరఖాస్తులో పొరపాటును గమనించినట్లయితే సరిదిద్దేందుకు పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర లేదా పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఉన్న సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించండి. తప్పును సరిదిద్దేందుకు కౌంటర్-Aకు వెళ్లండి.

మీరు పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేస్తారా?

అవును. మీరు పాస్‌ పోర్ట్ సేవ అధికారిక పోర్టల్l నుంచి మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించేందుకు మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోతే ప్రింటవుట్ తీసుకుని దాన్ని ఆఫ్‌లైన్‌లో సమర్పించండి.

నేను పాస్‌పోర్ట్ రీఇష్యూ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి?

మీరు మీ పాస్‌పోర్ట్ రీ ఇష్యూ కోసం గడువు ముగిసే దాని కంటే ఒక సంవత్సరం ముందు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకంటే ముందు కాదు.